Showing posts with label భద్రాద్రిని దర్శించుకున్న ప్రముఖులు. Show all posts
Showing posts with label భద్రాద్రిని దర్శించుకున్న ప్రముఖులు. Show all posts

Thursday, November 7, 2013

భద్రాద్రి కి విచ్చేసిన కోదండరాముడు


భద్రాచలం తెలంగాణ లో అంతర్భాగమని అలా ఉండటం లోనే ఈ ప్రాంత జనులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఈ ప్రాంతాన్ని విడదీసే యోచనను సమ్మతించే సమస్యే లేదని తెలంగాణా రాష్ట్ర జె ఏ సి కన్వీనర్ ప్రొ.కోదండరాం అన్నారు.నిన్న ఆయన భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం  ఇక్కడ స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో జరుగుతున్న వృత్యంతర శిక్షణలో ఫాల్గొన్న వివిధ మండలాల కి చెందిన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.తాను చిన్నతనం లో ఇక్కడనే పుట్టువెంట్రుకలు తీయుంచుకున్న సంగతిని ఈ సంధర్భంగా గుర్తు చేశారు.

ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల జె ఏ సి కన్వీనర్ కూరపాటి రంగరాజు,రెవెన్యూ శాఖ కి చెందిన జిల్లా నాయకులు నడింపల్లి వెంకటపతి రాజు,స్థానిక ఉద్యోగ సంఘ నేతలు చల్లగుళ్ళ నాగేశ్వర రావు,ధనికొండ శ్రీనివాసరావు,రేగలగడ్డ ముత్తయ్య ఇంకా తదితరులు మాట్లాడారు.Click here


Wednesday, September 25, 2013

Sunday, July 28, 2013

భద్రాచలం లోని సీతారామస్వామి దేవాలయాన్ని హై కోర్టు పోర్టుఫోలియో జడ్జి శ్రీ కె.జి.శంకర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు.

భద్రాచలం లోని సీతారామస్వామి దేవాలయాన్ని హై కోర్టు పోర్టుఫోలియో జడ్జి శ్రీ కె.జి.శంకర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధానార్చకులు జగన్నాధాచార్యులు,ఏ.ఇ.వొ.ప్రభాకర్ స్వాగతం పలికారు. కోవెల చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు.లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించి ఆశిర్వచనాలు పొందారు.ఆ తరువాత శ్రీ రామదాసు చేయించిన నగలని మ్యూజియం లో వారు చూశారు.ఆ పిమ్మట ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.వీరి వెంట జిల్లా జడ్జి శ్రీ సిద్ధార్ధి ,అడిషనల్ జడ్జి శ్రీ చిరంజీవ రావు,భద్రాచలం జ్యూడిషియల్ ఫష్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ జె.శ్రీనివాసరావు వున్నారు.  Click here for more