Showing posts with label Writers. Show all posts
Showing posts with label Writers. Show all posts

Saturday, August 13, 2016

Somasundar and Reminiscences

Avantsa Somasundar (91),the lighthouse of the Telugu literary world passed away yesterday and his association with the temple town is one to remember on the occasion.He came to Bhadrachalam thrice to participate in the literary gatherings arranged by local organizations like Sahiti Goutami and so on.All it took place in 90's as far as my knowledge is concerned.On one occasion,I happened to have received him and escorted up to the temple premises.Undoubtedly he created his own aura in the Telugu literature by penning a number of writings, be it poetry,story,novel,essay,criticism or translation ,he emerged in his own way.He authored almost 77 books and the magnum opus is Vajrayudham with which his name is synonymous.

One more thing is to be said that Somasundar was perhaps only one of the few who had chosen the writing as the main profession and his magazine Kalakeli was a historical milestone by contributing a lot for Telugu literature.He received many awards along with a doctorate from andhra university.His presence is forever etched in our memories.Rest in peace grand old man.

Friday, April 8, 2016

Albert Camus and his Book



Albert Camus , the French writer's name reminds one the term Absurdism.His works translated to almost every major language including English.He was born in Algeria and had university education there,though originally a French,he had lived most of his life there as Algeria was then an integral part of France administration.What Absurdism meant by..? roughly wildly unreasonable in simple words.The complete oeure of him perfect example for that and the word first coined in one of his essays.

Let me tell you about the novella "The Stranger".Happened to have gone through it in the recent past.The principal character was Meursault and he was working in Algeirs.A telegram brought a sad news one day that his mother had died in the old age home of Paris.He started his journey in a bus for funerals.He was no sort of  severe melancholic about the happening.Everybody is bound to be died and so his mother.His behavior stunned the  inmates of the home and the warden.He remained calm there waiting for the last rites.Refused the request made by the coffin attendant whether he was to see the body for the last time.Lingered awhile in smoking .

The following day,Meursault returned  to his working place and assumed the daily life as usual.His employer asked what the reasons prompted him to come back immediately. Meursault said simply, the office work.He keeps watching the life of human beings and their movements while he was standing on the higher apartment.There were characters like Marie,Raymond and others to move up the story.At last,the protagonist  got jailed on the charges of a murder in order to help his friend.The judge trailed him got known his callousness at the coffin of his mother and decided death punishment for Meursault .In prison,one chaplain asked him to embrace the God at the moment,but he severely opposed the thought and warned him to never come again.

The theme outwardly seem proposing material outlook but with the help of several allegorical descriptions ,the author consolidated the free will and meaningless human life on the earth.There are two parts and each part of  the book  indicated the essence in full what Albert Camus thought of.

Sunday, September 22, 2013

అభినవ మొల్ల చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారు..!



మేము హైస్కూల్ లో చదివే సమయం లో మాకు  తెలుగు బోధించిన చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారు సాహితీ ప్రపంచం లో  అభివనమొల్ల గా అందరికీ సుపరిచితులే...వారి గురించి సాక్షి డైలీ లో వచ్చిన ఈ వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాను.     


                                                            Click here

Sunday, June 30, 2013

తాను డిగ్రీ చదివే సమయంలో లెక్చరర్ గా వున్న డా.మధుబాబు గారి ఇన్స్పిరేషన్ తో తాను P.hd చేయాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు



హిందీ పండితులు వుద్యోగరీత్యా ఎందరో వుండవచ్చు..కాని హిందీ భాషాసాహిత్యాలని నిండుగా ప్రేమించి దానిలో కృషి చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే వుంటారు.ఆ కోవకి చెందినవారే శ్రీ నాంపల్లి మధుసూదన రావు.ప్రస్తుతం ఆయన భద్రాచలం మండలం లోని నందిగామపాడు హైస్కూల్ లో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.హిందీ పండిట్ శిక్షణ పొందిన తరువాత..దానిలోనే పి.జి. చేశారు.ఆ తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం నుండి హింది సాహిత్యం లోనే కృషి చేసి M.Phil  పట్టా పొందారు.వారి గైడ్ అయిన డా.సంజీవ్ గారిని ఈయన ఆదర్శంగా చెబుతుంటారు.



హిందీ సాహిత్యాన్ని విరివిగా ప్రచారం చేయాలనే వుద్దేశంతో 'హిందీ దివశ్ నాడు ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు.ఆయన ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా.రేఖా శర్మ పర్యవేక్షణలో హిందీ కధా  సాహిత్యంలో  P.hd చేస్తున్నారు.

మధుసూదన రావు భద్రాచలం ప్రక్కనున్న దుమ్మగూడెం మండలంలో నాంపల్లి రాఘవాచారి,సుగుణావతి దంపతులకి జన్మించారు.పదవతరగతి దాకా స్థానిక పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.ఆ తరువాత కొత్తగూడెం ,వరంగల్ లో వున్నత  విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

డిగ్రీ స్థాయిలో సైన్స్ (B.Sc) చదివారు.ఆ తరువాత LL.B చేశారు. పదవతరగతి లో స్కూల్ టాపర్ గా నిలిచి స్కాలర్ షిప్ ని పొందారు.సాంస్కృతిక రంగం లో కూడా బాగా కృషి చేశారు.హిందీ భాష లో అనేక కవితలు,వ్యాసాలు రాశారు.తన వద్ద చదివే విధ్యార్ధులతో కూడా హిందీ లో కవితలు రాయిస్తుంటారు.వారిని భాష పట్ల అనురక్తులుగా తయారుగావిస్తుంటారు.



తాను డిగ్రీ చదివే సమయంలో లెక్చరర్ గా వున్న డా.మధుబాబు గారి ఇన్స్పిరేషన్ తో  తాను P.hd చేయాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు.2007 లో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ లో ఫాల్గొనడం తనకు లభించిన గొప్ప అవకాశాల్లో ఒకటిగా చెప్పారు.

రేగొండ (వరంగల్ జిల్లా)  లోని భారతి ఆశ్రమ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.ఆ తరువాత 1996 లో జరిగిన D.Sc లో ఓపెన్ కాంప్టిషన్ లో గ్రేడ్ -2  హిందీ పండిట్ గా ఎంపిక అయ్యారు.ఆ తరువాత పదోన్నతిపై హిందీ స్కూల్ అసిస్టెంట్ గా నందిగామ పాడు జిల్లా పరిషత్  వున్నత పాఠశాలకి  వచ్చారు.

ఆయన సబ్జెక్ట్ లో విధ్యార్థులు నూటికి నూరు శాతం వుత్తీర్ణత సాధిస్తుంటారు.జాతీయ సమైక్యతని సాధించడం లో హిందీ భాష కీలక పాత్ర వహిస్తుందని కనుక ప్రతి భారతీయుడు హిందీ భాషని నేర్చుకోవాలని వుద్బోదిస్తుంటారు.

Mobile No. of  Madhsudan Rao: 9949939859             

Saturday, June 29, 2013

ఇంకా విశ్రాంతి ఎరుగని యోధునిగా కృషి చేస్తున్న మాల్యశ్రీ కి అభినందనలు..!

పద్య కవిత,వచన కవిత,కధ,నవల,నాటకం ఇలా బహు ముఖీన ప్రజ్ఞాశీలిగా పేరెన్నికగన్న మాల్యశ్రీ భద్రాచలం ప్రాంతంలో నుంచి వచ్చిన ఆణిముత్యంగా చెప్పవచ్చును.బాల సాహిత్యం లో కూడా ఆయన విశేషమైన కృషి చేశారు.జూన్ 22,1938 నాడు భద్రాచలానికి సుమారు 50 కి.మి. దూరం లోనున్న చర్ల మండలం లోని మొగళ్ళపల్లి లో జన్మించారు.



సామాన్య రైతుకుటుంబం నుండి వచ్చిన ఆయన ఈ ప్రాంత సాహిత్య వాతావరణాన్ని ఎంతో ప్రభావితం చేశారు.ఎంతోమంది కి ప్రేరణగా నిలిచారు.చిన్నతనంలో శ్రీమాన్ జి.వి.రాజగోపాలాచార్యుల మార్గదర్శనంలో పాఠశాల ప్రాయంలోనే విరివిగా రచనలు చేయడం ప్రారంభించారు.ఆయన విద్యాభ్యాసం మొగళ్ళపల్లి,చర్ల,వెంకటాపురం, సామర్లకోటలో సాగింది.

ఆవంత్స సోమసుందర్,రాం షా,మిరియాల రామకృష్ణ గార్ల సాహిత్య గురువులుగా సంభావిస్తారు.ఆ ముగ్గురు తనకు ఎన్నో అమూల్యమైన  విషయాలని బోధించి సాహిత్యపరంగా తీర్చిదిద్దినవారిగా భావిస్తారు.ఊపిరిసలపని గ్రామీణాభివృద్ది అధికారిగా ఓ వైపు వృత్తి ని నిర్వహిస్తూనే మరోవైపు..తన కలానికి ఎప్పుడూ విశ్రాంతినివ్వకుండా రచనలు సాగిస్తూనేవచ్చారు.ఇప్పటికి ఆయన పదవీ విరమణ చేసి ఓ దశాబ్దం అవుతున్నా సమధికోత్సాహంతో సాహిత్య కృషి చేస్తూనే వున్నారు.

ఆయన జనరంజని అనే పద్యసంపుటిపై ఇటీవల పి.శోభాదేవి అనే ఆమె పరిశోధన చేసి M.Phil  డిగ్రీ పొందటం జరిగింది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2012  లో ఇది జరిగింది.మాల్యశ్రీ రచనల్ని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి.వివిధ పత్రికల్లో వచ్చిన బాలగేయాలన్ని కలిపి రత్నమంజూష అనే పుస్తకంగా తేవడం జరిగింది.రామదాసు అనే పద్య కావ్యాన్ని వెలయించారు.ఆయన కధల్లో కొన్నిటిని వెన్నెల మలుపులు-చీకటి వెలుగులు అనే పేరుతో ఓ సంకలనంగా ప్రచురించారు.

ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి సంస్థ లో కీలక పాత్ర పోషించారు.సాహిత్య కార్యక్రమాలని నిర్వహించడంలో మార్గదర్షకంగా నిలిచారు.అనేక జిల్లాల్లో జరిగే నాటక పోటీలకు న్యాయా నిర్ణేతగా వ్యవహరించారు.ఇంకా విశ్రాంతి ఎరుగని యోధునిగా కృషి చేస్తున్న మాల్యశ్రీ కి అభినందనలు..!

                                     Malyasri Mobile No: 9290070043