Pages

Tuesday, August 6, 2013

ఈ రోజు సాయంత్రం భద్రాద్రి బాలోత్సవం కి సంబందించిన బ్రోచర్ ని అన్నపూర్ణ ఫంక్షన్ ప్యాలస్ (B.S.R.Gardens)లో విడుదల చేయడం జరిగింది




ఈ రోజు సాయంత్రం భద్రాద్రి బాలోత్సవం కి సంబందించిన బ్రోచర్ ని అన్నపూర్ణ ఫంక్షన్ ప్యాలస్ (B.S.R.Gardens)లో విడుదల చేయడం జరిగింది.తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్  సహకారంతో గత రెండేళ్ళుగా భద్రాచలం లో జిల్లా స్థాయి బాలోత్సవం ఉత్సవాలు జరుగుతున్న సంగతి విదితమే.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు శ్రి బెక్కంటి శ్రీనివాసరావు దీనికి కార్యనిర్వాహకులు.ఈ సారి తృతీయ జిల్లాస్థాయి  బాలోత్సవం కార్యక్రమాలు  సెప్టెంబర్ 14,15 తేదీల్లో జరగనున్నాయి.ఈ కమిటీ కి చైర్మన్ గా శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య,వైస్ చైర్మన్ గా శ్రీ బూసిరెడ్డి శంకర్ రెడ్డి,కన్వీనర్ గా శ్రీ బెక్కంటి శ్రీనివాసరావు వ్యవహరించనున్నారు.

ఈ బ్రోచర్ విడుదల చేసిన సంధర్భంగా  శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తోడ్పడాలని కోరుతూ బాల బాలికలు తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తాయని తెలిపారు.వక్తలంతా బాలోత్సవం జయప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీయుతులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, జపాన్ రావు,అజీం,వంశీ,వెంకటేశ్వర్లు,దశం బాబు,సిద్దులు,నాగయ్య,కె.వి.ఎస్.మూర్తి,కృష్ణవేణి,ఇంకా తదితరులు ఫాల్గొన్నారు.Click here

No comments:

Post a Comment

Thanks for your visit and comment.