భద్రాచలం వచ్చిన వారు వీలుంటే ఇంకొక అందమైన ప్రదేశం చూడవచ్చు.ఇది సుమారు భద్రాచలం నుంచి 90 కి.మి.వుంటుంది.అదేమిటంటే పల్లూరు జలపాతం..!చింతూరు మండలం లోని మోతుగూడెం ని ఆనుకుని వున్న ప్రదేశం ఇది.మోతుగూడెం లో హైడల్ పవర్ స్టేషన్ రష్యన్ల సహాయం తో చాలా కాలం క్రితం నెలకొల్పబడినది వున్నది.మోతుగూడెం దట్టమైన అడవి..ఎత్తైన కొండల మధ్య ఉవ్న్న చిన్న వూరు.ఇక్కడ ఆ ప్లాంట్ కి సంబందించిన ఆవాసాలు..కొన్ని ఇతర నిర్మాణాలు వుంటాయి.ఇతర ప్రపంచం తో సంబందం లేకుండా ఒక పచ్చని ప్రపంచంలో పొందికగా ఉన్నట్టుగా వుంటుంది వూరు.
భద్రాచలం నుండి Taxi మాట్లాడుకొని మోతుగూడెం మీదుగా పల్లూరు వెళ్ళవచ్చు.లేదా మీకు కారు వుంటే డైరక్ట్ గా జలపాతం దగ్గరకే రావచ్చు.అంటే మరీ దగ్గరకి కాదు...కొద్ది దూరం లో పార్క్ చేసుకోవచ్చు.
మోతుగూడెం లో ఎవరిని అడిగిన మీకు మార్గదర్శనం చేస్తారు.అక్కడి నుంచి ఇంచుమించు ఒక 3 కి.మి. వుంటుంది.ఒక ఆకు పచ్చని ప్రపంచం లోకి అడుగుపెట్టాలంటే ....జలపాత రవళులు...పక్షుల కిల కిల రావాలు నిరంతరం వినాలని వుంటే పల్లూరు జలపాతాన్ని చూడవచ్చును.ఇక్కడ మీ కోసం కొన్ని ఫోటోలు ఇస్తున్నాను.ఇవన్నీ నేను తీసినవే..!పల్లూరు జలపాతం పరిసారలని సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయో లేదో తెలియదు మరి..!