Showing posts with label My Writings. Show all posts
Showing posts with label My Writings. Show all posts

Monday, January 19, 2015

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఏడవ భాగం)

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఏడవ భాగం)

Albert Neri తన పోలీస్ యూనిఫాం ని ధరించాడు.చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ డ్రెస్ లో తనని తాను చూసుకుని ఎక్జయిటింగ్ గా ఫీలయ్యాడు.తను సస్పెండ్ అయినపుడు గన్ ని డిపార్ట్మెంట్ కి సరెండర్ చేశాడు.కాని మిగతావి కొన్ని అలా తన దగ్గరనే ఉండిపోయాయి.పరిపాలనా పరమైన అజాగ్రత్త వల్ల అలా జరిగిపోయింది.

Clemenza ఇపుడు ఒక గన్ ని తన కోసం సమకూర్చాడు.అది తేలిగ్గ Dress  లో దాయగలిగేలా ఉండే పాయింట్ థర్టీ ఎయిట్.దాన్ని విప్పదీశాడు Albert ..లోపల భాగాలకి ఆయిల్ పెట్టాడు.హేమర్ ని చెక్ చేశాడు.మళ్ళీ వాటి భాగాల్ని చక్కగా అమర్చి ట్రిగ్గర్ ని కూడా చెక్ చేశాడు.ఆ తర్వాత వాటి సిలిండర్స్ లో బుల్లెట్ లను నింపాడు.

తన పోలీస్ కేప్ ని ఓ పేపర్ బ్యాగ్ లో చుట్టి పట్టుకున్నాడు.యూనిఫాం మీద మళ్ళీ ఓ ఓవర్ కోట్ వేసుకున్నాడు.బయటకి వచ్చి నాలుగడుగులు నడిచేసరికి తనని పికప్ చేసుకునే కారు వచ్చింది.దాంట్లోకి జంప్ చేశాడు.ఓవర్ కోట్ ని విప్పి లోపల సీట్ మీద పెట్టాడు.పోలీస్ కేప్ ని తీసి తలకి పెట్టుకున్నాడు Albert Neri.

కారు అలా దూసుకు వెళ్తూ..కాసేపాగి ఓ చోట ఆగింది.5 వ అవెన్యూ లో 55 వ స్ట్రీట్ అది. వెంటనే దిగిపోయి నడవసాగాడు.ఎన్నోసార్లు ఈ వీధుల్లో తాను పెట్రోలింగ్ చేశాడు గతంలో..ఇప్పుడు అది తలచుకుంటే గమ్మత్తుగా ఉంది.రాక్ ఫెల్లర్ సెంటర్ దగ్గరకి వచ్చి ఆగాడు.అక్కడకి పక్కగా ఉన్న సెయింట్ పేట్రిక్ కేధడ్రల్ వీధి మలుపు దగ్గరకి చేరుకున్నాడు.తాను దేనికోసమైతే చూస్తున్నాడో ఆ లిమోసిన్ కారు అక్కడనే కనిపించింది.

ఆ కారు ని మళ్ళీ పరిశీలించాడు.అవునదే ..సందేహం లేదు.అయితే ఆ కారు నో పార్కింగ్ జోన్ లో ఉంది.అక్కడనుంచి కారు తీయవలసిందిగా డ్రైవర్ కి సైగ చేశాడు Albert.దానికి ప్రతిగా అతగాడు ఖాతరు చేయను అన్నట్లు పొగరు గా చూశాడు.

" ఏం పిచ్చి పిచ్చిగా ఉందా..చెబుతుంటే నీకు కాదా..?కారు పక్కకి తియ్" అంటూ Albert జేబులోనుంచి సమన్స్ బుక్ ని బయటకి తీశాడు.

" ఈ ఏరియా కి కొత్తగా వచ్చిన పోలీస్ వా ..ఏమిటి ? నీ పై అధికారిని అడుగు..ఈ కారు ఎవరిదో చెప్తాడు" గీరగా జాబిచ్చాడు డ్రైవర్.

" మర్యాదగా తీస్తావా...లేదా బొక్కలిరగగొట్టేదా " హుంకరించాడు Albert Neri.

" సరే..సరే..! నీకంత  బాధగా ఫైన్ రాయి,కడతాను." అంటూ ఆ డ్రైవర్ ఓ పది డాలర్ల నోటుని Albert జేబులో పెట్టబోయాడు.దాన్ని తప్పించుకుంటు అవతలకి తిరిగి ..మళ్ళీ అడిగాడు Albert.

" ఏయ్ నీ లైసన్స్ కాగితాలు అవీ చూపించు "

తీసి ఇచ్చాడు డ్రైవర్.వాటిని చూస్తూనే..అల్లంత దూరాన ఉన్న ముగ్గురు మనుషుల్ని జాగ్రత్త గా చూశాడు.వాళ్ళిటే నడుచుకుంటూ వస్తున్నారు.దానిలో ఒకడు Barzini.మిగతా ఇద్దరు అతని బాడీ గార్డులు.బహుశా Michael తో జరిగే మీటింగ్ కే వెళుతున్నట్లుగా ఉంది.ఒక బాడీ గార్డ్ దగ్గరకొచ్చి ఏమిటి గొడవ అని అడిగాడు.ఆ డ్రవర్ ఏదో సర్ది జెపుతున్నాడు.ఇంతలోనే Barzini ఇంకో బాడీ గార్డ్ ని వెంటబెట్టుకొని దగ్గరకొచ్చి ఏయ్ ..ఏమిటి న్యూసెన్స్ అని బెదిరించినట్లుగా అన్నాడు.Albert Neri ఒక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా వెంటనే సమన్స్ బుక్ ని జేబులో పెడుతూనే ,గన్ ని బయటకి తీసి Barzini చాతి మీద మూడు సార్లు కాల్చాడు.మూడు బుల్లెట్లు గురి తప్పలేదు. నెత్తుటి మడుగులో కూలిపోయాడు Barzini.మిగతా ముగ్గురు బెదిరిపోయి వాళ్ళని కవర్ చేసుకోడానికి తలా ఒక దిక్కు పరిగెత్తారు.ఇదే అదనుగా గుంపులో కలిసిపోయి అంతర్ధానమైపోయాడు Albert Neri.కొన్ని సెకన్లలో Albert  ని తీసుకెళ్ళే కారు ప్రత్యక్షమయ్యింది.దానిలోకి ఎక్కేశాడు.అది చెల్సియా పార్క్ దగ్గర ఆగింది.తన యూని ఫాం ని,గన్ ని ఆ కారులోనే విడిచిపెట్టాడు.సిద్ధంగా ఉన్న మరో కారులో ఎక్కి కాసేప్టిలో మాల్ కి చేరుకున్నాడు.Albert Neri ఇపుడు Michael తో మాట్లాడుతున్నాడు.

*  *
Don ఒకప్పుడు నివసించిన ఆ ఇంటిలోనే ప్రస్తుతం Tessio కాఫీ తాగుతూన్నాడు తీరిగ్గా..!అలా తాగుతూ Michael నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు.ఎందుకంటే Barzini తో మీటింగ్ ని ఏర్పాటు చేసింది అతనే గదా..!

కాసేపటిలో Tom Hagen ప్రత్యక్షమయ్యాడు.

" ఆ..Tessio ,మీటింగ్ కి Michael తయారై ఉన్నాడు.మనం వస్తున్నట్లుగా ఆ Barzini కి ఫోన్ చెయ్ ఇపుడు" చెప్పాడు Tom

Tessio వెంటనే లేచి ఓ నెంబర్ కి డయల్ చేసి చెప్పాడు." బ్రూక్లిన్ కి ఇపుడు బయలుదేరుతున్నాము.సిద్ధంగా ఉండండి" అని.

Tom Hagen వేపు చిరునవ్వుతో చూశాడు Tessio.ఆ తర్వాత అన్నాడు."  ఈ రాత్రికి మీటింగ్ లో Michael  ఒక మంచి డీల్ కుదుర్చుతాడని ఆశిస్తున్నాను."

" అదే నేనూ ఆశిస్తున్నాను" బదులిచ్చాడు Tom.

ఇంతలో ఒక బాడీ గార్డ్ వచ్చి చెప్పాడు." బాస్ కాసేపాగి వస్తారట.ఈ లోపు ముందు ఓ కారు లో మిమ్మల్ని ఇద్దర్నీ వెళ్ళమంటున్నారు" అని.

అది విని Tessio హతాశుడయ్యాడు." ఇప్పుడు అలా చెపితే ఎలా ..నేను చేసిన ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరు కావా.." అన్నాడు ఏదో బస్ మిస్ అయినట్టుగా..!

వెంటనే కొంత మంది బాడీ గార్డ్ లు Tessio ని చుట్టుముట్టారు.ఇంకొన్ని క్షణాల్లో మరి కొంతమంది వచ్చి చేరారు అతణ్ణి బందించుతున్నట్లు.Tessio కి సీను మొత్తం క్షణం లో అర్ధమయింది.ఎక్కువగా నటించకుండా Tom ని ప్రాధేయపడ్డాడు " మనం ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి పనిచేశాం,నన్ను వదిలిపెట్టమని చెప్పలేవా" అని.

" నేను చేయగలిగింది ఏమీ లేదు..Tessio.." నిర్లిప్తంగా అన్నాడు Tom Hagen.

అంతే..!బాడీగార్డ్ లు Tessio ని ఒక కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు.అంతే అతని చరిత్ర అలా ముగిసింది.

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము)--KVVS Murthy  

Saturday, January 17, 2015

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఆరవ భాగం)

Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (డబ్భై ఆరవ భాగం)

ఆ ఆదివారం రెండు లిమోసిన్ కార్లు లాంగ్ బీచ్ లోని మాల్ ముందు ఆపి ఉన్నాయి.ఒకదానిలో Connie,ఆమె పిల్లలు,తల్లి ఎక్కారు.వాళ్ళంతా లాస్ వెగాస్ కి వెకేషన్ నిమిత్తం వెళుతున్నారు.అలాగే మరో దానిలో Kay ఇంకా ఆమె పిల్లలు ఎక్కారు.వీళ్ళు Newhampshire  కి వెళుతున్నారు.పేరెంట్స్ ని చూడటానికి.Michael మాత్రం కొన్ని రోజులు ఆ మాల్ లోనే ఉండవలసిన అవసరం ఉంది.Barzini లతో మీటింగ్ కి సమయం దగ్గరవుతున్నదిగదా..అందుకే మెల్లగా ఒక్కొక్కరిని కుటుంబసభ్యుల్ని బయటకి తరలించడం జరుగుతోంది.అయితే ఈ సంగతి Michael వీళ్ళెవరకీ చెప్పలేదు.

"Carlo..నీతో ఓ రెండు రోజులు పని ఉంది.ఆ తర్వాత వెళుదువుగాని ఉండు.." అడిగాడు Michael.

"సరే.." అన్నాడు తను.

కారు కదులుతున్నపుడు Connie అడిగింది." నువు కూడా వస్తే బాగుంటుంది గదా..ఇక్కడేమిటి చేసేది" అని.

" లేదు..Michael రెండు రోజులు ఇక్కడ ఉండమన్నాడు నన్ను.." చెప్పాడు Carlo.ఆమె ఏదో అపశకునం గా భావించింది.

" ఏం పని అట.."

" నాకూ తెలియదు.బహుశా ఆ మధ్య ఓసారి నాకు ఓ పెద్ద డీల్ ఇస్తానన్నాడు గదా ..దాని గురించి మాట్లాడటానికేమో" చెప్పాడు Carlo.

"సరే..సాధ్యమైనంత త్వరలో వచ్చేయ్..లేకపోతే మేమే వెనక్కి వచ్చేస్తాం.."

" అదేం లేదు..తొందరగా వచ్చేస్తా" అని చెప్పి టాటా చెప్పాడు అందరికి.రెండు కార్లు అలా న్యూయార్క్ నగరం దాటి వెళ్ళిపోయాయి.

" సారీ..Carlo నిన్ను ఉంచవలసి వచ్చింది.కొన్ని బిజీ పనులు ఉన్నాయి.మనం ఒక దానిమీద కూర్చోవాలి.ఇంట్లో ఫోన్ కి దగ్గరలో ఉండు.సమయం చూసుకొని నేను కాల్ చేస్తా " అన్నాడు Michael.

సరే అని వెళ్ళిపోయాడు Carlo.

ప్రస్తుతం ఇంట్లో భార్యా పిల్లలు లేరు గదా..ఆ మాల్ లో ఉన్న ఇళ్ళు అన్నీ అలా చూసుకుంటూ తిరుగుతున్నాడు Carlo.ఇంతలో Clemenza వచ్చాడు.Michael ఉన్న గది లోకి వెళ్ళి ఏదో మాట్లాడి బయటకి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత Tessio  వచ్చాడు.అయితే అతను మళ్ళీ బయటకి రావడం కనబడలేదు.ఇదంతా దూరం నుంచే పరిశీలిస్తున్నాడు Carlo.

మాల్ కి చుట్టూ కొన్ని ఎకరాల వైశాల్యం లో ఫెన్సింగ్ ,ఇంకా గోడ దిట్టంగా ఉంటాయి.దాంట్లో డాన్ కుటుంబం కి చెందిన ఇళ్ళు అన్నీ ఉంటాయి.సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు.వాళ్ళు అంతా ఇంచుమించు తనకి తెలిసినవాళ్ళే.వారితో ఏదైనా మాట్లాడదాం అనుకొని వెళ్ళి చూస్తే..అక్కడంతా కొత్త మొహాలు ఉన్నాయి..వీరంతా ఎవరబ్బా అనుకుంటూండగా మెయిన్ గేట్ దగ్గర Rocco Lampone నిల్చుని ఉన్నాడు.నిజానికి ఇలాంటి పనులు అతనికి చెప్పరు.ఏమిటి విషయం అని అతణ్ణి కదిపాడు గాని అతనూ పూర్తి సమాచారం ఇవ్వలేదు..ఏదో కప్పదాటుడు సమాధానం ఇచ్చాడు.

*   *
Michael  తన ఇంటి పైనుంచి ఓ కిటికీ గుండా Carlo నే గమనిస్తున్నాడు.ఇంతలో Tom Hagen ఒక డ్రింక్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు.Michael థాంక్స్ చెప్పి సిప్ చేయసాగాడు.

"Mike.. ఇక సమయం దగ్గర పడింది.ఒక్కొక్కటి కదపడం మంచిదేమో.." అడిగాడు Tom.

" ఇంత త్వరగా ఈ రోజు వస్తుందని అనుకోలేదు.మనతో పాటు ఈ రోజు నాన్నగారు కూడా ఉంటే బాగుండేది.."

" నాకు నమ్మకం ఉంది.నువు అన్ని విషయాలు చక్కగా సెట్ చేశావు. ఇక పని ప్రారంభించడమే తరువాయి.మీ నాన్నగారికి నువ్వు ఏ మాత్రం తీసిపోవు.." చెప్పాడు Tom.

"సరే..చూద్దాం,ఏం జరుగుతుందో..అన్నట్లు Clemenza,Tessio లు వచ్చారా.ముందు Clemenza ని నా గది లోకి పంపించు.అతనికి కొన్ని రహస్యంగా చెప్పాలి.అవి Tessio వినడం నాకిష్టం  లేదు.మరో అరగంటలో Barzini లతో మీటింగ్ ఉందిగదా ..ఈ లోపులో తయారవుతాను" చెప్పాడు Michael .

" మరయితే Tessio ని బిగించక తప్పదంటావా ..వేరే దారి లేదా" అడిగాడు Tom.

" లేదు.." ముక్తసరిగా జవాబిచ్చాడు Michael.

*  *

న్యూయార్క్ లోని బఫెలో అనే ప్రాంతం అది.అక్కడ ఉన్న ఓ పిజ్జా షాపులో ఆ దుకాణదారుడు మిగిలిపోయిన ముక్కలన్నిటిని ఓవెన్ లో వేసి వేడి చేస్తున్నాడు. జనాలు కూడా ఎవరూ లేరు..లంచ్ వేళ కూడా దాటిపోయింది.ఆ వేళప్పుడు ఒక కష్టమర్ వచ్చాడు.చూడ్డానికి కొద్దిగా రఫ్ గా ఉన్నాడు.

" ఒక పిజ్జా కావాలి..ఇస్తావా " అడిగాడా కష్టమర్ .

సరే అన్నట్టుగా అలాగే వేడి చేస్తూ ఓ పిజ్జా ని పేపర్ ప్లేట్ లో వేసి ఆ కష్టమర్ కి అందించాడు దుకాణదారుడు.దాన్ని తీసుకున్న ఆ కష్టమర్ నవ్వుతూ అడిగాడు." అవునూ..నీ చెస్ట్ మీద ఏదో టాటూ ఉన్నట్లుంది.కొద్దిగా కనబడిందిలే. షర్ట్ బటన్ విప్పి ఆ మిగతాది చూపించవా నాకు.."

" అదేం లేదు.నైట్ షిఫ్ట్ చేసే వాడికి ఉండి ఉంటుంది." అని తత్తరపడుతూ దూరం జరగబోయాడు దుకాణదారుడు.ఇంతలో ఆ కష్టమర్ కౌంటర్ మరుగు నుంచి తన చేయి లేపాడు.దానిలో తుపాకి ఉంది.రెండు బుల్లెట్లని దుకాణదారుని బాడీ లోకి దింపాడు.దెబ్బతో కూలబడ్డాడు వాడు.అయితే కొస ప్రాణం ఉంది.ఆ కష్టమర్ దగ్గరకొచ్చి దుకాణదారుని షర్ట్ బటన్స్ ని ఊడదీశాడు..! ఇద్దరు ప్రేమికులు..వాళ్ళని వెనకనుంచి పొడుస్తున్న ఒక వ్యక్తి..ఆ టాటూ వేసి ఉంది.వెంటనే ఆ కష్టమర్ చిరునవ్వుతో అన్నాడు." ఏయ్..Fabrizzio , నీకు Michael శుభాకాంక్షలు తెలుపమన్నాడు..ఇందా తీసుకో"

అలా అంటూనే ఒక బుల్లెట్ ని Fabrizzio పుర్రెలోకి దింపాడు ఆ కష్టమర్.ప్రాణం లేని మాసంపు ముద్ద లా పడిపోయాడు Fabrizzio .

*  *
గేట్ దగ్గరున్న Rocco Lampone ఫోన్ రింగవడం తో ఎత్తాడు.అవతలనుంచి ఓ కంఠం వినిపించింది." నీ పేకేజి సిద్ధంగా ఉంది" అని.వెంటనే ఆ సిగ్నల్ ని గ్రహించాడు Rocco.ఆలశ్యం చేయకుండా వేగంగా వెళ్ళి తన కారు లో కూర్చుని ముందుకు దూకించాడతను. సరిగ్గా Jones Beach causeway  దగ్గరకి రాగానే అక్కడ తన కారుని పార్క్ చేశాడు.అక్కడేగదా Sonny ని హత్య చేసింది..! ఆసరికే అక్కడ ఉన్న ఇంకో కారు లోకి జంప్ చేశాడు.దానిలో తమ మనుషులు ఇద్దరు ఉన్నారు.ఆ కారు Sunrise highway మీదుగా వెళ్ళి ఓ మోటల్ దగ్గర ఆగింది.లోపలకి వెళితే ఓ Chalet-type బంగ్లా కనబడింది.దాని డోర్ ని లాఘవంగా తీశాడు Rocco.లోపల Philip Tattaglia నగ్నంగా ..మరో అమ్మాయితో..శయ్య మీద..! అతగాడు బిత్తరపోయి లేచినుంచున్నాడు.Rocco ఒక్క సెకను కూడా వేస్ట్ చెయ్యకుండా నాలుగు బుల్లెట్ లను Phillip కడుపులోకి దింపాడు.అంతే.అతని కధ ముగిసిపోయింది.

మళ్ళీ వచ్చినంత వేగంగా Rocco తన కారు పార్క్ చేసిన చోటకి వచ్చి దానిలోకి ఎక్కి మాల్ వేపు  సాగిపోయాడు.మరో  పది నిమిషాల్లో Rocco మాట్లాడుతూ కనిపించాడు Michael తో..!

(మిగతాది వచ్చే భాగం లో చూద్దాము) __KVVS Murthy   

Wednesday, October 29, 2014

అనేకమంది లబ్ద ప్రతిష్టులైన జర్నలిష్టులతో కలసి పని చేసే అదృష్టం ఆ విధంగా కలిగింది.




తాత్కాలికంగా కొన్ని పనులు చేస్తాము.మళ్ళీ ఎందుకనో వేరే కారణాలచేత వాటిని వదిలి వేస్తాము.అవి మంచివా..చెడ్డవా అటుంచండి..మనదగ్గరకి వచ్చే ప్రతిదీ ఏదో ఒకటి మనకి నేర్పడానికేనేమో..!కొన్నాళ్ళు పోయిన తర్వాత చూసుకుంటే ఆ అనుభవాలు నేర్పే గుణపాఠాలు ఇవా..ఇందుకేనా అనిపిస్తుంది.

1989 లో అనుకుంటాను ..ఒక మిత్రుని కోరికపై ఉదయం దినపత్రిక లో విలేకరి గా చేరాను.నిజంగా ఆ మత్తుకి అలవాటు పడినవారు అంత తొందరగా బయటకి రాలేరు.నా అనుభవమైతే అది.ఎంత కొమ్ములు తిరిగినవాడు మన ముందు అధిక ప్రసంగం చేయడానికి భయపడతాడు.అయితే నిజాయితీ గా ఉండి దానిలో సంపాదించడం చాలా కష్టసాధ్యమైన విషయం.ఏదో ఇతర వృత్తి,వ్యాపారం ఉంటే తప్ప ఆర్ధికంగా ప్రయోజనం ఉండదు.అయితే న్యూస్ సేకరించడం,మళ్ళీ దాన్ని చక్కగా రాసుకొని డెస్క్ కి పంపడం,మళ్ళీ మనం రాసింది అచ్చు లో చూసుకోవడం భలే గమ్మత్తు గా ఉండేది.విలేకరి కి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటారు తప్ప ఫ్రెండ్స్ తక్కువ గా ఉంటారు.అదంతే.పోలీస్ అధికారులు,రాజకీయ నాయకులు,ఇతర ప్రముఖులు బాగా పరిచయమవుతారు.వాళ్ళే మనకి న్యూస్ ఎక్కువగా ఇస్తుంటారు.ఆ తర్వాత మరో రెండు ప్రముఖ దిన పత్రికల్లో విలేకరి గా చేశాను.రాష్ట్రం లోను.. ఇతర రాష్ట్రాలలోను..అనేకమంది లబ్ద ప్రతిష్టులైన జర్నలిష్టులతో కలసి పని చేసే అదృష్టం ఆ విధంగా కలిగింది.

రాసే చెయ్యి ఊరుకోదని...ఆ తర్వాత కూడా చిన్న చితకా వాటికి న్యూస్ పంపేవాడిని.ఇంగ్లీష్ వాటిల్లో కూడా ట్రై చేద్దామని కొన్ని న్యూస్ వెబ్సైట్ లలో కూడా రాశాను.పరోక్షంగా ఇవన్నీ కూడా నాకు ఈ గాడ్ ఫాదర్ అనువాదం లో సహకరించే విషయాలుగా మారాయి.ఓపిగ్గా రాయడం అనే గుణాన్ని ఇవి నాలో ప్రోది చేశాయి.అట్లా జర్నలిజం నాలోని ఒక పార్శ్వాన్ని ఎన్రిచ్ చేసింది. కొన్ని అపురూప అనుభావాలు పంచి ఇచ్చింది.రాండల్ఫ్ ఎరిక్సన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్ తో జరిగిన పరిచయం ..నేను ఇంగ్లీష్ బ్లాగింగ్ లోకి వెళ్ళడానికి దారితీసింది.ఆయన గార్డియన్ ,జేన్స్ డిఫెన్స్ వీక్లీ కి ఫ్రీలాన్స్ గా రాస్తుంటారు.బహుశా నాలుగేళ్ళ క్రితం అనుకుంటా ..మా యింటికి వచ్చారు.అవి ఎప్పుడైనా చెప్పుకుందాము. 

Tuesday, July 29, 2014

నా అనుమానాన్ని నివృత్తి చేసిన "ఆలోచనా తరంగాలు" శర్మ గారికి కృతజ్ఞతలు



నాకు ఎన్ని రోజులనుండో ఒక ప్రశ్న అడుగుదామని ఒకటే ఆతురత గా ఉండేది.అయితే అటువంటివి సాధనా మార్గం లో ఉన్నవారికి..అదీ ఎంతో గానో ఆధ్యాత్మిక లోతులను తరచి చూసిన వారికి గాని బోధపడవని నా నమ్మకం. సరైన వారు నాకు తారసక పడక అలానే నాలోనే ఉంచుకున్నాను దాన్ని.కట్టా కృష్ణారావు గారని చెప్పి ఆయన వలన నేను యోగ మార్గం లోకి ప్రవేశించబడ్డాను.నిజం చెప్పాలంటే నేను skeptic ని ఇలాంటి విషయాల్లో.ఆయన ప్రవర్తన,మాట ,ఇతర తీరులు నన్ను ఎందుకనో ఆకర్షించేవి.కేవలం ఆయన పై గల ప్రేరణా పూర్వకమైన అభిమానం వల్లనే కుండలినీ సాధన లోకి ప్రవేశించాను.కాలం గడుస్తున్న కొద్దీ ఎదురయ్యే విచిత్ర అనుభవాలు చాలా ఆశ్చర్యకరం గా అనిపించేవి.అవి చెప్పడానికి నాకు భాష సరిపోదు.కాలం సరిపోదు.అందుకనే మనదేశం లో ఇలాంటి అనుభవాలని బయటకి వెల్లడించడానికి గురువులు అనుమతించలేదేమో అనిపించింది.ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్పగలను.భారత దేశం యొక్క నిజమైన లోతులు ఏమిటో ఎవరూ ఎప్పటికి కనుక్కోలేరు.సాధన లో అంచులు దాకా వెళ్ళిన మహానుభావులుతప్ప ..! అందుకే ఓషో అన్నాడేమో.." ఒక అయిన్ స్టీన్ ఎక్కడైనా పుట్టవచ్చు..కాని ఒక ఋషి మాత్రం ఇండియా లోనే పుడతాడు" అని.

సరే..ఎక్కడకో వెళ్ళిపోతున్నా...అసలు విషయం లోకి వస్తాను...ఒకానొక రాత్రి ,ధ్యానం చేసి పడుకున్నాక,మధ్య రాత్రి వేళ ...ఉన్నటుండి తెలివి వచ్చింది ..ఎందుకో లోపల నరాల్లోంచి ఏదో తెలియని ఒక వైబ్రేషన్...ఉన్నట్లుండి నా మెదడు లోకి ..ఎవరో ప్రశాంతంగా ,నెమ్మదైన వాయిస్ తో మాట్లాడినట్లుగా అవుతున్నది.ఆ స్వరం ఇలా అన్నది" నేను యయాతిని...పురాణాల్లోని వి అన్నీ కట్టుకధలు కావు.నేను ఇంకా సజీవంగా నే ఉన్నాను." 

నాకు ఎప్పుడూ అలాంటి అనుభవం కాలేదు.అసలు యయాతి గురించి కూడా నాకు తెలియదు.వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేశాను.ఆయన కధని ..వృతాంతాన్ని తెలుసుకున్నాను.అయితే సాధానా మార్గం లో పురోగమించిన వారే ఇలాంటివి ఇంకా వివరించి చెప్పగలరు.బయటికి ఎవరికి చెప్పినా నవ్వుతారు గనక అది నాలో అలానే దాచుకున్నాను.  

గత కొంతకాలంగా ఆలోచనాతరంగాలు బ్లాగు చదువుతున్నప్పుడు దానిని నిర్వహిస్తున్న సత్యనారాయణ శర్మ గారిని ఈ ప్రశ్న అడగాలనిపించి అడిగాను.వారు వెంటనే నాకు సమాధానమిచ్చారు.వారిలో గొప్ప సాధకుని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించడం వల్లనే నేను అడిగాను. ఆ సమాధానాన్ని క్రింద ఇస్తున్నాను.నిజానికి ఇలాంటివి అన్నీ చాలా పర్సనల్ గా వర్తిస్తాయి.అయితే ఏ ఒక్కరికైనా ఏ విధంగా నైనా మంచికి ఉపయోగపడుతుందేమోని ఇక్కడ రాస్తున్నాను అంతకు మించి ఏమీ లేదు.శర్మ గారికి నా ఈ బ్లాగు ద్వారా మరోసారి కృతజ్ఞతలు.      

KVVS Murthy garu,
Yayati was a mighty king of Chandravamsa.He was the son of Nahusha.He had two wives Devayani and Sharmishta and 5 sons.He lived a very happy and luxurious life for ages but finally lost his youth due to Sukracharya's curse.Still not satisfied and craving sexual enjoyment he requested his sons to donate youth to him.Everyone refused except one son named Puru.So he regained his youth and enjoyed sex for ages again.Finally he realized that lust cannot be satisfied through enjoyment,how ever long it might be.So he gave his your back to his son,went to forest to do tapasya as Kings used to do in olden days.This is history.

Now what you felt is very true.It is the spirit of Yayati.Everyone of us has an Yayati in him.It is the insatiable thirst for sexual enjoyment.It never is satisfied permanently.So Yayati lives forever,in all of us.

He gave a profound statement through his experience.See Mahabharatha Adiparva 85.12.There you find him saying:Lust is never satisfied,desires and passions are never satisfied through enjoyment,like fire is never extinguished by pouring more ghee into it.

Discard desire. This disease kills. The wicked people cannot give it up, neither old age can lessen it. True happiness lies in controlling it.

Ages before Lord Buddha,King Yayati said the same thing through his own experience.In our tradition he has become the synonym for excessive lust and desire for perennial enjoyment.

You felt his vibration on that night.What he said is true.He is not a mere tale of Puranas,He is real.We see him all around us,everyday.





Tuesday, June 17, 2014

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదకొండవ భాగం/చివరి భాగం)

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదకొండవ భాగం/చివరి భాగం)

టి.వి.లో Janelle నటించిన సినిమా చూస్తున్నపుడు ఆ పాతజ్ఞాపకాలు అన్నీ మళ్ళీ వెనక్కి మరలివస్తున్న అనుభూతిని పొందుతాడు మెర్లిన్.

అక్కడ హాలివుడ్ లో ఆమె చాలా బిజీ గా ఉంటుంది.కొత్త సంవత్సరం సంధర్భంగా జరగబోయే పార్టీ కోసం..! ఆ పార్టీలో మిత్రులందరినీ కలుస్తుంది.అర్ధరాత్రి కావొస్తుండగా డిప్రెస్ అయిన అనుభూతి కలుగుతుంది.ఆమె మిత్రుడు Joel కొంత Cocaine ఇస్తాడు.మళ్ళీ కాసేపయినతరువాత విపరీతమైన Headache వస్తుంది జానెల్ కి..!

తనని ఇంటివద్ద దింపవలసిందిగా Joel ని కోరుతుంది.ఇంటివద్ద ఆమె కోరిక మేరకు బయటికివచ్చేస్తాడు.డాక్టర్ ని పిలవాలా అని అతడు అడగ్గా వద్దంటుంది.బెడ్ రూం ని అమీపిస్తుండగా మెడవెనుక ఎవరో తోసినట్టుగా ఒక Terrible blow ఫీలవుతుంది.వెళ్ళి ఎదుటున్న గోడకి తగులుతుంది.

గోడమీద అంటించివున్న మెడికల్ సిబ్బంది ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తుంది. అలా Brain లోపల ఆగి ఆగి blows ఇచ్చినట్లుగా అనిపిస్తూ భయంకరమైన బాధని అనుభవిస్తూంటుంది.

అంబులెన్స్ లో ఎక్కించుకొని ఆమె ని ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా దారి మధ్య లోనే మళ్ళీ ఒక blow ఆమెని కుమ్మరించి .ఈ లోకం నుంచి Janelle ని తీసుకువెళ్ళిపోతుంది.

ఆ తెల్లవారి Aliceఫోన్ చేస్తుంది మెర్లిన్ కి..!Janelle కి 'సెరెబ్రల్ హేమరేజ్'అని..చావు బ్రతుకుల్లో ఉందని..!'

"ఇప్పుడెలా ఉంది"

"ఆమె brain కి activity లేదు.Living on machines "

"అయితే ఆమె మరణానికి చేరువలో ఉందా.."అంటాడు మెర్లిన్.

"వాళ్ళ family members అంతా రేపు వస్తున్నారు....జరగవలసిన కార్యక్రమాల గూర్చి" ఇన్ డైరక్ట్ గా చనిపోయిందని చెబుతుంది.విషయాన్ని అర్ధం  చేసుకుంటాడు మెర్లిన్.ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం....!

"ఆమె మిత్రులు...శ్రేయోభిలాషులు....అంతా funeral కి వస్తున్నారు.ఆ తర్వాత memorial service కూడా ఉంటుంది.నిన్ను ఆమె ఎంతో ప్రేమించేది....నువ్వు ఈ కార్యక్రమానికి వస్తున్నావు కదూ" Alice అడుగుతుంది.

"లేదు...నేనిప్పుడు రాలేను.ఒక రెండు వారాల తర్వాత అయితే రాగలను.అప్పుడు కలుస్తాను."

కోపంగా ఆమె ఫోన్ disconnect చేస్తుంది.

మెర్లిన్ ఎందుకనో నవ్వుతాడు.ఎందుకని నేను నవ్వుతున్నాను...అని తనలో తను ప్రశ్నించుకుంటాడు.తన secret wish నిజమైనందుకా..?' I know I dream of her many times at night.But I never remember those dreams.I just wake up thinking about her as if she were still alive"  అంతరంగం లో అలా భావాలు కదులుతుంటాయతనికి.

నెవడా లోని పర్వాతాల నీడల్లో....లాస్ వెగాస్ లోని నియోన్ లైట్ల ధగ ధగల్లో...ఈ రాత్రికి Xandu లో తను గేంబ్లింగ్ ఆడబోతున్నాడు.రేపు ఉదయాన్నే న్యూయార్క్ కి ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు.రేపు రాత్రి కుటుంబం తో..అతని సొంత ఇంటిలో నిదురిస్తాడు.తన పనిలో క్షేమంగా ఉంటాడు.

Jordan,Artie,Osano,Cully,Janelle వీరందరూ జ్ఞాపకం వస్తారు.రకరకాల తలపులు వస్తవి.'Simple.Life was too much for them.But not for me..!Only fools die...!

                               ---KVVS Murthy
----------సమాప్తం --------------------------------
 


Sunday, June 15, 2014

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదవభాగం)

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదవభాగం)

"చివరిదశకి వచ్చేశాను మెర్లిన్...నేను ఎంతో కాలం బ్రతకను.అలాంటి ఈ అంకం లో చార్లీ తో కలసి శయనించి ప్రాణం వదలాలనేది నా చివరి కోరిక...ఇది కూడా పెద్ద తప్పా..?" అంటాడు ఒసానో.

"ఇది ఆసుపత్రిగదా..ఇలాంటివన్నీ ఇక్కడ ఆమోదించమని వాళ్ళు చెబుతున్నారు" మెర్లిన్ అనునయిస్తాడు.

"వెధవ ఆసుపత్రి...ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను.నన్ను బయటికి తీసుకు వెళ్ళిపో తక్షణం"  అంటూ మెర్లిన్ ని ప్రాధేయపడతాడు.సరేనని...బయటకి వచ్చేసి ఓ హోటల్ లో సూట్ తీసుకుంటారు.

"ఒసానో...మీకు చనిపోయే సమయం వచ్చిందని ఎందుకు అనుకొంటున్నారు.."

"కొన్ని అంతే మెర్లిన్...ఇంకా నేను ఎందుకు వేచి ఉండాలి అని ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ నాకు సమాధానం లేదు."

"ఇంకా ఆరునెలల దాకా ఏమీ ఫర్వాలేదని వైద్యులు చెబుతున్నారు గదా...తొందరపడవద్దు."

"మెర్లిన్...చార్లీకి కొంత ధనం ఏర్పాటుచేశాను.అలాగే నా మాజీ భార్యలకి కూడా కొంత ప్రాపర్టి రూపేణా ఏర్పాటుచేశాను.ఇక సరే...నువ్వు నా literary executor వి.నా పుస్తకాల మీద వాటిమీద నీకు సర్వహక్కులు ఉంటాయి." అంటూ అప్పగింతల్లా చెబుతాడు ఒసానో.

తిరిగి అతనే అంటాడు."Merlyn...the most terrible thing in modern life is that we all die alone in bed,In the hospital with all our family around us,nobody offers get in bed with somebody dying.If you're at home,your wife won't offer to get in bed when you're dying."

ఇలా కొంత మాట్లాడిన తర్వాత చార్లీ ని లోపలకి రమ్మని పిలిచి మెర్లిన్ ని కాసేపు గది బయట ఉండవలసిందిగా కోరతాడు.చాలాసేపు wait చేసినతరువాత చార్లీ ఏడుపు వినబడడంతో లోపలకి వెళ్ళిచూస్తాడు.విపరీతమైన మోతాదులో టాబ్లెట్లు వేసుకొని అతను suicide చేసుకున్నట్లుగా గ్రహిస్తాడు మెర్లిన్.వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు.SUICIDE NOTE  కూడా ఒసానో రాసి టేబుల్ మీద పెడతాడు. కాబట్టి మెర్లిన్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు.

ఒసానో పార్ధివదేహానికి జరగవలసిన అన్ని తుది మర్యాదలు ఘనంగా జరుగుతాయి. అన్ని ప్రముఖ పత్రికలు అంజలి ఘటిస్తూ ప్రత్యేక వార్తల్ని రాస్తాయి.అలా ఒసానో జీవితం పరిసమాప్తం అవుతుంది.

....Cully కి మళ్ళీ జపాన్ వెళ్ళవలసిన పనిపడుతుంది.ఈసారి Gronvelt కోరికమీద..!Fummiro ని కలిసి గతంలో మాదిరిగా డాలర్ల మారకం చేసుకొని రమ్మంటాడు.దీని వెనుక ఏమైనా ఉందా అని కల్లీ అనుమానిస్తాడు.

"Fummiro తో ఇదివరకు ఓసారి బిజినెస్ డీల్ చేశావుగదా..!కొత్తవాళ్ళు ఎవరున్నారని.." అంటాడు Gronvelt. (Mario puzo కొన్ని పాత్రలని చాలా indepth ఉండేలా తీర్చిదిద్దుతాడు.చాలాసార్లు సంఘటన మూలాల్ని డైరక్ట్ గా చెప్పడు. సంభాషణల్లోనూ..ఇతర చిత్రణ లోను గుదిగుచ్చుతాడు.ముఖ్యంగా మానవస్వభావం లోని నమ్మకద్రోహాన్ని హృద్యంగా రక్తికట్టిస్తాడు.నిజం చెప్పాలంటే...మూలం చదువుతుంటే ఆ రసానుభూతిలోకి కూరుకుపోతాము.Fummiro తో మొదటిసారి డీల్ చేసే పరిస్థితులని కూడా ఈ Gronvelt నే సృష్టించాడేమో అని మనకి ఓ చోట అనుమానం కలుగుతుంది.అంటే మొదటిసారి సేఫ్ గా పని అయ్యేలా Play చేసి ,రెండవసారి డీల్ లో జపాన్ కి పంపించి కల్లీ ని అక్కడే చంపించే ఏర్పాటు చేయడం అన్నమాట.ఎక్కడా వివరణలు ఉండవు...కాని నర్మగర్భమైన ఆ సంభాషణల్లో అవి తెలిసిపోతుంటాయి.అది కూడా వారి మర్యాద పూరితమైన మాటలవెనుక నున్న అంతరాన్ని అర్ధం చేసుకోగలిగితేనేసుమా...!)

కల్లీ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతాడు.ఆ రాత్రి తనకి బాగా ఇష్టమైన ఇద్దరు Casino girls ని రమ్మంటాడు.దీంట్లో ఒకామె కల్లీ దగ్గర చిప్స్ రూపంలో ధనాన్ని దాచిపెడుతుంది...తన ఇంట్లో తెలియకుండా..!ఆమె కి ఆ చిప్స్ ని తిరిగి ఇచ్చేస్తాడు.రేపు అనేది లేదన్నట్లుగా ఆ రాత్రి ఆ ముగ్గురూ క్రీడిస్తారు.తెల్లవారిన తర్వాత ఇంకో ఆమెకి కూడా కొంత ధనాన్ని ఇస్తాడు.కల్లీ జపాన్ వెళుతున్న సంధర్భంగా ఆ ఇద్దరూ వీడ్కోలు చెబుతారు.

మెర్లిన్ కి ఫోన్ చేసి తాను న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కి వస్తున్నానని ఇద్దరం కలుసుకుందామని అంటాడు.తీరా ఆ టైం కి వెళ్ళి చూస్తే అక్కడ కల్లీ ఉండడు.అసలు ఎప్పుడూ కల్లీ అతనితో ఆ విధంగా ప్రవర్తించడం ఉండదు.అంటే పఠిత ఇక్కడ అర్ధం చేసుకోవాలి.జపాన్ వెళ్ళి తాను సేఫ్ గా తిరిగిరావడానికి ఎంత చాన్స్ ఉందో...అదే విధంగా తాను హత్య గావింపబడడానికి కూడా అంతే చాన్స్ ఉంది.కాబట్టే ఆ రాత్రి వారితో రేపులేదన్నట్లుగా క్రీడించడం...వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చివేయడం చేస్తాడు.అదేవిధంగా మెర్లిన్ కి ఫోన్ చేయడం లోని ఉద్దేశ్యమేమిటంటే తాను ఒక వేళ తిరిగి రాకపోయినట్టయితే అతడు తనవద్ద దాచిన డబ్బుని Gronvelt ని అడగమని.అదేవిధంగా మెర్లిన్ ని ఈసారి జపాన్ ప్రయాణం లో తోడు రమ్మని ఎందుకు అడగడంటే ..ఈసారి తాను ఏదో ఓ చోట చంపబడటానికే ఎక్కువ అవకాశం ఉంది.కనక మెర్లిన్ ని ఆ ఆపదలోకి ఇరికించకూడదని కల్లీ దూరపు చూపు అన్నమాట.ఆ విధంగా ఓ మిత్రధర్మాన్ని పాటిస్తాడు.

చివరకి కల్లీ తన అంతర్ సీమల్లో ఊహించుకున్న మాదిరిగానే జరుగుతుంది.టోకియో లో బిజినెస్ అంతా అయిపోయి రేపు బయలుదేరుతాను అనగా ఇద్దరు ముసుగు మనుషులు కల్లీ ఉన్న గది లోకి ప్రవేశిస్తారు.ఆ గదిలోనే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుంది.

మెర్లి లాస్ వెగాస్ కి వచ్చి Gronvelt ని అడుగుతాడు.కల్లీ తనకి ఫోన్ చేయడం...ఆ తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడం...ఈ విషయాలన్నీ..' .

"ఏమో నాకు కూడా తెలీదు..బహుశా బ్రెజిల్ గాని..జపాన్ గాని వెళ్ళాడేమో...సరే,ఎలాగు వచ్చావుగదా..లంచ్ చేసి వెళ్ళు " అంటాడు.

మెర్లిన్ బయలుదేర్తుండగా Gronvelt ఓ కవర్ ని అతని చేతికి అందిస్తాడు.కల్లీ గదిలో వెదికినపుడు ఇది దొరికింది.....నీకిమ్మని కూడా ఓ నోట్ పెట్టినట్లున్నది 'అంటాడు.

ఎందుకనో...కారణం ఇదీ అని చెప్పలేడుగాని కల్లీ మాయం అవడానికి వెనుక Gronvelt హస్తం ఉంది అని తోస్తుందతనికి. మిగతాది వచ్చే భాగంలో..!
       --KVVS Murthy  


         


Friday, June 13, 2014

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (ఎనిమిదవ భాగం)

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (ఎనిమిదవ భాగం)

Malomar చనిపోయినతర్వాత సినిమాకి కొత్త దర్శకునిగా Simon అనే అతడిని నియమించడం జరుగుతుంది.అతనితో కలిగే కొన్ని సమస్యలు ఉంటాయి.మెర్లిన్ కి వచ్చే సినిమా profit points ని కొన్ని తనకి అదనంగా చేర్చమని కోరుతుంటాడు.సినిమా స్క్రిప్ట్ లో తాను అవసరమైన మార్పులు చేస్తున్నందుకు అవసరమని అతని భావం.

మొత్తానికి Janelle నటించిన ఓ సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుంది.అంటే సపోర్టింగ్ నటిగా..!ఆ సభ లో తన స్నేహితురాలు Alice కి కృతజ్ఞతలు తెలుపుతుంది.ఇది టి.వి.లో మెర్లిన్ చూసినపుడు తన పేరుని చెప్పనందుకు ఒక రకంగా ఆనందపడతాడు.ఎందుకంటే ఆ టి.వి.కార్యక్రమాన్ని ఇంట్లో చూసేటపుడు భార్య Valerie ప్రక్కనే ఉంటుంది.

సరే....Jannele  ని ఓసారి Osano కి పరిచయం చేస్తాడు.దీనివెనుక మెర్లిన్ కి ఓ సూక్ష్మ పధకం ఉంటుంది.అదేమీ ప్రమాదకరమైనది కాదు. క్రమంగా తాను ఆమెకి దూరంగా జరగాలని నిశ్చయించుకుంటాడు.ఎందుకంటే ఈమె కంటే భార్యాపిల్లల వేపే మొగ్గుచూపుతుంటాడు.

" ఏయ్ మెర్లిన్....నేనిక ఏ వనిత ని పెళ్ళాడదలుచుకోలేదు.. ఇప్పటికే ఆరుగురు మాజీ భార్యలకి Alimony ఇవ్వలేక చిర్రెత్తుకొస్త్తున్నది " అని చిరు కోపం తో ఒసానో అంటాడు.

ఆ తరువాత ఒసానోకి,జానెల్ కి ఓ రాత్రి గడవటం జరిగిపోతుంది.అది ఒక అంకం అలా వెళ్ళిపోతుంది.

ప్రస్తుతం ఒసానో ఈ కొత్త అమ్మాయి Charlie  తో ఉంటున్నాడు.ఆ Xanadu లోనుంచి ఈ అమ్మాయి ఇతనితో వచ్చేస్తుంది.ఈ Charlie పారిపొయినందుకు కల్లీ కొన్ని రోజులు బాగానే బాధపడతాడు. కారణం casino లో కష్టమర్ల తో ఎలా ఉండాలి,ఏ వ్యక్తిని ఎలా రంజింప చేయాలి అనే విషయాలమీద ఈ అమ్మాయికి మంచి తర్ఫీదునిస్తాడు.ఎందుకంటే ఈ అమ్మాయి మంచి అందంగా ఉంటుంది.ఆమె లో ఓ చెప్పనలవి కాని ఓ ఆకర్షణ ఉంటుంది.

Gronvelt మీద ఈ అమ్మాయిని ప్రయోగించి అతడిని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ..తద్వారా ఈ Xanadu సామ్రాజ్యానికి తానే అధిపతిని కావాలని ప్లాన్ రూపొందించుకుంటాడు. ఓ సారి అతనికి వొంట్లో బాగోలేదని చెప్పినప్పుడు "ఏమీ దిగులు వద్దు...ఈ మధ్యనే మన సంస్థ లోకి మంచి అమ్మాయి వచ్చింది.మీకు హెల్ప్ చేయాడానికి పంపిస్తాను" అని చెప్పి ఈ చార్లీని పంపిస్తాడు.

మరుసటి దినం కలిసినపుడు Gronvelt అంటాడు." ప్చ్..మరీ అలాంటి చిన్నవయసులో ఉన్నవాళ్ళతో  నేను ఫ్రీ గా ఉండలేను.నేను డబ్బులిచ్చినా ఆమె తీసుకోలేదు.అది నాకు ఇబ్బందిగా ఉంటుంది"

"ఎందుకని...అలా అనుకుంటున్నారు..ఏదైనా ఇబ్బంది..." అంటూ సందేహంగా అడుగుతాడు కల్లీ.

"అబ్బే అదేమీ లేదు...వయసు పరంగా వచ్చే పరిణితి ఉన్నవాళ్ళతో ..అది వేరే గా ఉంటుంది.చార్లీ కేసినో లో బాగా రాణిస్తుందని" అభినందిస్తాడు Gronvelt.

ఆ సంభాషణ అలా ముగిసినా మొట్టమొదటిసారిగా Gronvelt కి అనుమానం వస్తుంది...కల్లీ లో వెన్నుపోటు పొడవడానికి బీజం పడిందని..!అందుకనే చార్లీ ని తన మీదకి ప్రయోగిస్తున్నాడని.అయితే బయటికి ఏమీ వ్యక్తం చేయడు.ఇద్దరు కలిసి కాసేపు విస్కీ తాగి వెళ్ళీపోతారు.

ఉన్నట్టుండి ఓ రోజు మెర్లిన్ కి ఫోన్ వస్తుంది.అది ఎవరో కాదు...తన సోదరుడు Arti భార్య.ఒక విషాద వార్త తెలుపుతుంది. Arti మరణించాడని.అప్పటికే ఒసారి అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది.రెండవసారికి లోకాన్నే విడిచిపోయాడు.తమ తల్లిని కనిపెట్టటానికి ఎంత తపించాడో..! చివరికి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు.తనకున్న ఏకైక రక్త సంబంధం తెగిపోయింది.అతడి దేహాన్ని బరియల్ చేయించడం...ఆ తరువాత జరిగే ప్రార్ధనలు అన్నీ ముగుస్తాయి.తిరిగి వచ్చేస్తాడు.తల్లిదండ్రులను వదిలి బ్రతకడానికి బయటికివచ్చే ప్రతి వారు orphan లాంటివారే.ప్రపంచం లోని ప్రతివారు ఏదోరకంగా ఆ భావనని అనుభవించవలసిందే...!

ఉన్నట్టుండి కల్లీని తన suite కి రమ్మని Gronvelt పిలుస్తాడు.లోపలికి వెళ్ళగానే అతనితోపాటు ఇంకో వ్యక్తి ఉంటాడు.అతని పేరు santadio ..!న్యూయార్క్ లోని ఓ శక్తిమంతమైన మాఫియా కుటుంబానికి చెందినవాడు. తన పేరు మీద నున్న Xanadu భాగస్వామ్యాన్ని ఈ వ్యక్తి పేరు మీద రాయమని,దానికి గాను బాండ్ పేపర్ మీద సంతకం చేయమని కల్లీ ని Gronvelt కోరుతాడు.చాలా తెలివిగా తనని fix చేస్తున్నాడని కల్లీ ఊహిస్తాడు.తరువాత భాగం లో మిగతాది చూద్దాము.
       --KVVS Murthy

Wednesday, June 11, 2014

ఇంగ్లీష్ నవల అనువాదం గురించి కొన్ని మాటలు



Mario Puzo నవల Fools die అనువాదం అనాలో సంక్షిప్తంగా అనాలో కాని మొత్తానికి దాన్ని తెలుగులో చెప్పాలి అనే ఓ కోరికతో ఇప్పటికి ఏడు భాగాలు రాశాను.అది ఎంతమందికి ఎలా అనిపించిందో నేను ఖచ్చితంగా ఊహించలేను.కొన్ని ఇంగ్లీష్ క్లాసిక్స్ ని కొంతమంది తెలుగు చేసి ఉండవచ్చు.కాని దానిలోని ఇప్పుడొచ్చే పాపులర్ రచనలని అనువాదం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ...ఏమో నాకు తెలీదు.

నేను ఊహించగలను...దాని లోని సెక్స్ మోతాదు పాళ్ళు ఎక్కువ అయిందని.కాని దానిలో నా ప్రమేయం లేదు.ఆ రచయిత కధనికించపరచకూడదు అనే ఉద్దేశ్యంతో అలాగే ఉంచేశాను.ఏ మాటకి ఆ మాట...మానవ ప్రపంచాన్ని,ముఖ్యంగా సెక్స్ పరమైన విషయాలని చూడటం లో వారికి మనకి మౌలికమైన ఒక తేడా ఉన్నది.

ఒక్కోసారి అది మనల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.ఈ జీవితం ఉన్నది ఒక్కసారికే...దాని లోని రసాన్ని సాధ్యమైనంత పిండుకోవడమే న్యాయం అని వారి ప్రపంచం విశ్వసిస్తుంది.కాని మన దృక్పధం వేరు. జీవితం లోని ప్రతి పార్శ్వం మనకి తెలియకుండానే Spiritual approach తో నిండివుంటుంది.లేదా ఆ ప్రభావిత జీవితం గా మనం పుట్టినప్పటినుంచి నిర్మించబడి ఉంటుంది.ఒక్కోసారి దానిలో మన ప్రమేయం కంటే సమాజం ప్రమేయమే ఎక్కువ.

కాని పాశ్చ్యాత్య ప్రపంచం యొక్క విలువలు కనిపించే భౌతిక ప్రపంచం మీదనే ఆధారపడి ఉంటాయి.ఇది Pragmatic approach  అని చెప్పుకోవచ్చు.ఎవరి దాన్ని బట్టి వారికి అది విలువైనదిగా అనిపిస్తుంది. మనం ఒకటి మరవరాదు....ఎప్పుడు భోగ లాలసత ...మద్యపానం..ఇలాంటి అంశాలే వారిని చూసినప్పుడల్లా మనకి గుర్తుకు వస్తాయి. అదే వారి జీవిత సరస్వమైతే కంటికి కనిపించే అన్ని జ్ఞాన ప్రపంచాలలోకి వెళ్ళి  ఇన్ని రకాలైనా ఆవిష్కరణలు ఎలా చేయగలిగారు.

ఈనాడు మన సమకాలీన జీవితం లోని ప్రతి సుఖమయ వస్తువుని ఎందుకని వారు మాత్రమే ఆవిష్కరించగలిగారు.మనం వినిమయదారులుగానే ఎందుకు మిగిలిపోయాం. మనం వారి అంత ప్రగతి సాధించాలనుకుంటాం.కాని వారి చోదక శక్తులు ఏమిటో గమనించమందుకనే ఒక సంగర్షన నెలకొంటుంది.ఇక్కడ ఏ బూతద్దాలు వద్దు.ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి.దానికి చాలా ధైర్యం కావాలి.ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు.మానవ జీవిత చక్రం లోని ఒక అనివార్యత అది.

నాకు అవగతమైనంతలో....ఆనందం పొందటం లో ...దాన్ని ఆస్వాదించటం లో ఆడ,మగ కి గల తేడాలని పాశ్చ్యాత్య ప్రపంచం ఎప్పుడో అధిగమించింది.దాన్ని ఇరువురు అంగీకరించే దశకి వారు చేరుకున్నారు.ఏదైనా...మూలం ధనము మాత్రమే...ఎవరి జీవితానికి వారికి భరోసా ఉన్నప్పుడు వ్యక్తి మాత్రమే నిజం..అది వాస్తావం...కాని మనం అంగీకరించం...లోపల తెలుస్తూనే ఉంటుంది.కాని అంగీకరించం...దానికి బాహ్య కారణాలే ఎక్కువ.

ఆ ప్రపంచం నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు.చాలా కాలమైంది.అయితే అక్కడ విలువలు లేవా...బాంధవ్యాలు లేవా...ఉన్నాయి...మనకంటే ఎక్కువగా..! అయితే అక్కడ దేబిరింపు లేదు.అంతే.

I fucked her అని మన దగ్గర పురుషుడు ఎలా అంటాడో I fucked him అని స్త్రీ కూడా అంటుంది.ఏమిటిదీ అని నామీద కోపం రావచ్చు...కాని కొన్ని మానసిక ప్రపంచపు తెరలు దాటి పోవలిసిందే....ఇష్టం ఉన్నా...లేకపోయినా...అది కాల మహిమ.బ్రిటిష్ వాళ్ళు మన దేశం రాకపోయివుంటే ...ఇప్పటికి మనదేశ ప్రగతి ఆఫ్రికా లోని ....ఏ కాంగో లాంటి దేశ కన్నా కన్నా గొప్పగా ఉండేదా అని.దోపిడి చేస్తే చేశారు గాని...దానికి తగిన కొన్ని విశాలమైన కిటికీలని తెరిచివెళ్ళారు...నేను దేశాభిమాని కానా అనిపిస్తున్నదా...అనిపించినా నేనేమీ చేయలేను.ఇంకా చాలా ఉన్నాయి...ముందు రోజుల్లో మాట్లాడుకుందాము.

Monday, June 9, 2014

Mario Puzoనవల Fools die సంక్షిప్తంగా..(ఏడవ భాగం)

Mario Puzoనవల Fools die సంక్షిప్తంగా..(ఏడవ భాగం)

Xanadu హోటల్ కం కేసినో అధినేత Gronevelt యొక్క ఆదరాభిమానాలు కల్లీ చూరగొంటూ ఆ సంస్థ కి వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడతాడు.అనేక రకాలైన ప్రణాళికలతో సంస్థ ఆదాయం బాగా పెంచుతాడు Cully.అయితే Gronevelt గూర్చి ఒక ముఖ్య విషయం చెప్పాలి.Percentage అనే భావనలో అతనికి పూర్తి నమ్మకం ఉంటుంది.ఏ మనిషినైనా ,ఏ పనికైనా వచ్చేదానిలో పర్సెంటేజ్ కరెక్ట్ గా కేటాయిస్తే చాలు ఏ పని అయినా అవుతుందనేది అతని విశ్వాసం.అవి తేడాలు వచ్చినపుడే మనుషులు కొట్టుకోవడం చంపుకోవడం లాంటివి  జరిగేది.అలాంటి పనులు Fools మాత్రమే చేస్తారు. Fools will die.

జపాన్ భాగ్యవంతుడు Xanadu లో గేంబ్లింగ్ ఆడటానికి వచ్చే Fummiro ఒక ప్రతిపాదనని Cully కి చేస్తాడు.జపనీస్ కరెన్సీని అమెరికన్ డాలర్ ల లోకి పెద్దమొత్తంలో మార్చి పెట్టి సహకరించవలసిందిగా కోరుతాడు.దానికి గాను కొంత సొమ్ము ముట్టజెపుతానంటాడు.అది అంత సులభమైన పనికాదు..ఎటుపోయి ఎటు వచ్చినా... ఆ పెద్దాయన Gronevelt కి చెప్పి అతని సలహా మేరకు చేస్తానంటాడు కల్లీ.

ఈ కల్లీ ని Groanvelt కుమారుని వంటి వాత్సల్యం తో చూస్తుంటాడు.అయితే కల్లీ చాకచక్యం,సమర్ధత అతనికి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడూ ఒక కన్ను వేసేఉంచుతాడు.Who knows...people will change అనేది అతడు అనుభవంలో గ్రహించిన సత్యం.

Fummiro ప్రతిపాదన గూర్చి Gronevelt కి వివరిస్తాడు.జపాన్ కరెన్సీ ని అంత పెద్ద మొత్తంలో ఇక్కడికి తేవడం కష్టం.నువ్వు వచ్చేటప్పుడు హాంగ్ కాంగ్ లో దిగి ఒక బ్యాంక్ లో వాటిని డిపాజిట్ చెయ్యి. అక్కడినుంచి డాలర్లలోకి మార్చి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు...హాంగ్ కాంగ్ చట్టాలు సరళతరంగా ఉంటాయి గనక సమస్య ఉండదు.జపాన్ ప్రజలని తక్కువ అంచనా వేయకు.. That little bastards are very clever అని సలహా ఇస్తాడు Gronevelt.

అయితే జపాన్ కి తను ఒక్కడే ఎందుకు వెళ్ళడం ...మెర్లి ని కూడా తీసుకువెళదాం అనుకొని కల్లీ అతనికి ఫోన్ చేస్తాడు."నేను టోకియో వెళుతున్నా.. సరదాగా నువ్వు కూడా రారాదు..అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా "అంటాడు."ఏమిటి విషయం" అడుగుతాడు మెర్లిన్.

"అది ఫోన్ లో చెప్పేది కాదు...బయలుదేరి వచ్చేయ్"

"సరే" అంటాడు మెర్లిన్.మెర్లిన్ కూడా కల్లీ అడగ్గానే ప్రయాణానికి ఒప్పుకోవడం లో ఒక అంతరార్ధం ఉంది.తాను ఓమారు లంచం కేసులో పట్టుబడి జైలుకి వెళ్ళే పరిస్థితి లో ఉన్నప్పుడు కల్లీ తనకి హెల్ప్ చేసిన సంగతి అతను మర్చిపోలేదు.కాబట్టి I owe him a favour అని తలపోస్తాడు.

లాస్ వెగాస్ లో రాగానే తాము ఏ పనిమీద వెళ్ళేదీ చెప్తాడు కల్లీ.'ఇది ప్రమాదకరమైన విషయం కదా..' అని సందేహం వ్యక్తం చేస్తాడు మెర్లిన్.

'తప్పదు మరి....ఏదో ఒకటి చేయకపోతే పెద్ద మొత్తం లో ఎలా సంపాదించగలం...You have to get rich in the dark'  నవ్వుతూ అంటాడు కల్లీ.

ఇంకో సంగతి కూడా ఉంది.FBI వాళ్ళు ఎయిర్ పోర్ట్స్ లో సర్వేలెన్స్ కెమేరా లు అమర్చి దేశంలోకి వచ్చీ పోయే వాళ్ళమీద నిఘా ఉంచుతారు.నేను జపాన్ వెళ్ళే విష్యం తెలిస్తే ఎందుకు వెళుతున్నాడా అని ఆరా వస్తుంది.మనం తీసుకెళ్ళే డాలర్లు గంగపాలు అవుతాయి.  ఒకవేళ నాకు ఏమైనా అయినా..ఎలా ఆపరేట్ చేయాలనేది నీకు చెబుతాను.సరే...ఏమీ జరగదులే...అన్ని జాగ్రత్తలు తీసుకునే బయలు దేరుతున్నాం" భరోసా ఇస్తాడు కల్లీ.

టోకియో లో దిగగానే Fummiro  ఎయిర్ పోర్ట్ కి వచ్చి ఇద్దరినీ రిసీవ్ చేసుకుంటాడు. ఒక చక్కని హోటల్ లో బస కల్పిస్తాడు.ఆ తెల్లారి గీషా ల ఇళ్ళకి కూడా తీసుకువెళ్ళి ఆ ఇద్దరికి జపానీస్ మర్యాదల్ని కూడా రుచి చూపిస్తాడు.'ఎందుకని...వీధుల్లో ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు అని అడిగితే పొల్యూషన్ రాకుండా ఆ ఏర్పాటు అని వివరిస్తాడు Fummiro.

ఇంట్లో చిన్న స్థలమైనా నీట్ గా ఉండటం,ప్రతి దానికి టేబుళ్ళు ..కుర్చీలు లాంటి ఫర్నీచర్ వాడకుండా చక్కగా చాపలు పరుచుకొని పనులు కానిచ్చుకోవడం లాంటి జపాన్ సాంప్రదాయాలు కల్లీ ని ఆకర్షిస్తాయి.

ఆ సాయంత్రానికి బిజినెస్ పూర్తి కానిస్తారు...వీరి దగ్గర ఉన్న డాలర్ల సూట్ కేసుల్ని వాళ్ళకిచ్చి,వారిచ్చిన జపాన్ కరెన్సీ ని కొన్ని బ్యాగుల్లో సర్దుకొని హాంగ్ కాంగ్ లో కొచ్చేస్తారు.అక్కడ Gronevelt చెప్పిన ఓ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. ఆ విధగా పని ముగుస్తుంది.

*        *        *

Jannele ఇంకా మెర్లిన్ యొక్క affair ఆ హాలీవుడ్ లో అలా కొనసాగుతూ ఉంటుంది.ఆమె సినిమాల్లో ని పాత్రలతో పాటు థీయేటర్ లో డ్రామాల్లో కూడా ఫాల్గొంటూ ఉంటుంది.కొంతమంది ఇతర ప్రొడ్యూసెర్ల తోనూ..దర్షకులతోనూ...ఆమెకి గల సంబంధాలు మెర్లిన్ కి తెలుసు.ఒకసారి మాటవరసగా మెర్లిన్ ప్రస్తావించగా...మీ పురుషులు ఇంట్లో భార్యా పిల్లల్ని పెట్టుకొని బయట వ్యవహారాలు నడిపితే తప్పుగాదుకాని అదే ఒక స్త్రీ అలా చేస్తే మటుకు మీకు తప్పుగా ఉంటుంది కదూ...అంటూ విమెన్స్ లిబ్ కార్యకర్త మాదిరిగా క్లాస్ తీసుకొంటుంది.ఇక అప్పటినుంచి వాటిని ప్రస్తావించడు.అయినా...రేపో మాపో ఈ హాలీవుడ్ లో తన పని పూర్తి అయిన వెంటనే Safe den లాంటి తన కుటుంబం తో కలిసి ఉండ టానికిచెక్కేస్తాడు. అలాంటప్పుడు ఇవన్నీ తనకసరమా అనుకుంటాడు.

Jannelle తో పాటు ఆమె ఫ్లాట్ లోనే Alice అనే ఓ కాస్ట్యూం డిజైనర్ ఉంటుంది.ఆ ఇద్దరు ముందు ఎవరికి వారు INDIVIDUAL గానే ఉన్నప్పటికి ఆ తరువాత వీరికి సాన్నిహిత్యం బాగా పెరిగి లెస్బియన్స్ గా మారతారు.అలా అనడం కంటే బై సెక్సువల్ అంటే బాగుంటుందేమో.Jannele కి ఉన్న ఉన్న కొడుకుని కూడా ఈమె వాత్సల్యం తో చూస్తూ ఉంటుంది.వీరిరువురి మధ్య బంధం బలపడటానికి అది కూడా ఓ కారణం.ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటూ బయట కూడా వేరే పురుషులతో సంబంధాలు కలిగిఉంటారు.వాళ్ళ మధ్య ఈ విషయం లో ఎలాంటి అసూయ ఉన్నట్లు కనపడదు.మెర్లిన్ కి కూడా ఈ సంగతి తెలుసు.వారు ఇరువురు మధ్యగల Understanding కి ఆశ్చర్యపోతాడు.మెర్లిన్ వచ్చినప్పుడు ఈమె చక్కగా రిసీవ్ చేసుకుంటుంది.

Jannelle వీరిద్దరిలో male partner పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తుంది మెర్లిన్ కి..!కిచెన్ లో Alice ఉన్నప్పుడు వెనకనుంచి వెళ్ళి చరవడము,పట్టుకోవడమూ లాంటివి చేస్తూ ఉంటుంది.సినిమా వర్క్ కూడా పూర్తి కావొస్తుంది.రేపు తాను న్యూయార్క్ వెళ్ళిపోతున్నానని చెపుతాడు.షాంపేన్ తో ముగ్గురు పార్టీ చేసుకుంటారు ఆ సాయంత్రం.ఎన్నో చర్చలు...వాగ్వివాదాలు...ప్రణయ సల్లాపాలు ఈ ఉన్నన్ని రోజుల్లో మెర్లిన్ కి జానెల్ కి మధ్య నడుస్తవి.దానివల్ల వారిరువురి మధ్య బంధం వృద్ది చెందుతుంది.అది ఏదో ఒకరోజు విడిపోయేదే తప్ప...శాశ్వతమైనది కాదని ఇద్దరికీ తెలుసు.

ఎప్పుడైనా పొరబాటునా I love you అని మెర్లిన్ చెప్పినా జానెల్ దానికి వ్యతిరేకిస్తుంది...వివాహం అయినా పురుషుడు తన భార్యని వదిలివేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట చెప్పాలని ఖండిస్తుంది.ఎక్కువ వాదించడు అలాంటి సమయాల్లో....ఎందుకంటే తనకి తెలుసు తాను ఒక Safe and Soft hustler నని,గేంబ్లింగ్ భాషలో చెప్పాలంటే...!

సరే మిగాతాది వచ్చే భాగం లో చూద్దాం...!

                       ----KVVS MURTHY


Tuesday, June 3, 2014

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (ఆరవ భాగం)

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (ఆరవ భాగం)

Eddie పనిచేసేపత్రికలో Reviewer గా ఉన్న మెర్లిన్ ఆ ఉద్యోగాన్ని కోల్పోతాడు.ఇతని చేసినదేమీ ఉండదు గాని ఎడ్డీకి యాజమాన్యానికి అయిన ఓ స్వల్ప వివాదంలో వాళ్ళు ఈ ఇద్దర్ని పనిలోనుంచి ఫైర్ చేసిపారేస్తారు.Time లోను, Newyork Times లోను రివ్యూలు రాసే విషయమై ఆఫర్ వస్తుంది.అలాంటి పని తో విసిగి ఉన్న మెర్లిన్ తన స్వంత నవల రాసే పనిలో నిమగ్నమవుతాడు. రోజుకి 12 నుంచి 15 గంటలపాటు దానిమీదనే కూర్చుంటాడు.

ఒకసారి రెస్టారెంట్ లో ఎడ్డీ తో కలిసి డిన్నర్ చేస్తున్నపుడు మెర్లిన్ కి చెబుతాడు.తాను హాలివుడ్  లో మూడు సినిమాలకి స్క్రిప్ట్ రాస్తున్నానని...ఏ మాత్రం ఆసక్తి ఉన్నా హాలీవుడ్ లో ప్రయత్నించు అని!అప్పుడప్పుడు అలా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఆ ప్రదేశంలో కలుసుకుంటూ ఉంటారు.

సరే...ఒసానో మూడవ మాజీ భార్య మీద దాడి చేసిన కేసులో ఇరుక్కున్నాక మెర్లిన్ సలహా మీద కొన్నాళ్ళు Las Vegas లోని Xanadu కేసినో లో తలదాచుకోవడానికి వస్తాడు.అక్కడ కూడా తిన్నగా ఉండడు.ఓ కేబెరట్ గర్ల్ తో కలిసి వెళ్ళిపోతాడు.

మెర్లిన్ కష్టం మొత్తానికి ఫలిస్తుంది.అతడు రాసిన నవల బాగా సక్సెస్ అయి కొన్ని మిలియన్ ల కాపీలు అమ్ముడయి ధన వర్షం కురిపిస్తుంది.తన కుటుంబం మొత్తం తో కలిసి Puerto Rico టూర్ వేస్తాడు.ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని స్థితి.. ఇప్పుడైనా భార్య పిల్లలతో  కలిసి అలా ఆనందం గా ఉండాలని అతని యోచన.స్విమ్మింగ్ ఫూల్స్,బీచ్ లు ,కేసినోలు అలా తిప్పుతాడు భార్య Valerieని.పిల్లలకి కూడా వాళ్ళకి నచ్చిన ఆటలు...డ్రెస్ లు...!

వేకేషన్ నుంచి రాగానే అతనికి ఓ ఆశ్చర్యకరమైన వార్త ఎదురొస్తుంది.Malomar Films వాళ్ళు తన నవలని సినిమాగా తీయడానికి తయారుగా ఉన్నామని చెబుతూ 100,000 డాలర్లని అడ్వాన్స్ ఇస్తారు.హాలీవుడ్ రావడానికి వెళ్ళడానికి తామే ఖర్చులు భరిస్తామని అంటారు.

భార్యని అభిప్రాయమడుగుతాడు.నిజానికి అతనికి స్క్రీన్ ప్లే లు వంటివి రాయడం ఇష్టముండదు.Valerie మాత్రం వచ్చిన అవకాశం ని సద్వినియోగం చేసుకోమని చెబుతుంది.అయితే ఆ కాలిఫోర్నియా లో నా పిల్లలు పెరగడం నాకు ఇష్టం లేదు.మేము ఇక్కడనే ఉంటాం..నువ్వే వెళ్ళివస్తూ ఉండు అంటుందామె.Contract మొత్తం ఆరు నెలలకి ఉంది.ఒక నెలలో అసలు పని కానిచ్చి...ఏవైనా చిన్న పనులు ఉంటే వస్తూ వెళ్తూ ఉంటాలే అంటాడు.

"నాకు ఏమి సమస్య లేదు.మనం కూడా ఒకరినుంచి ఒకరం విశ్రాంతి పొందినట్లు ఉంటుంది ." అంటుంది వలేరి.

ఇలా మంతనాలు అయిన తరువాత హాలీవుడ్ కి బయలుదేరుతాడు మెర్లిన్.Malomar Films అనేది ఈ Malomar అనే ఆయనదే.ఇతను ఇప్పటిదాకా సినిమా ల్లో ఎడిటింగ్ శాఖ లో పనిచేశాడు. ఈ నవలతో తీసే సినిమా తోనే దర్శకుడు అవుతున్నాడు.సినిమా నిర్మాణం లో వాటా కూడా ఉంది. ఆ సినిమా హీరో Kellino.హీరోయిన్ గ అఓ ప్రముఖ నటి నే బుక్ చేస్తారు.అయితే ఆమెని తీసివేసే విధంగా హీరో ప్రయత్నిస్తుంటాడు. ఆమె సరైన టైం కి రాదు షూటింగ్కి.ఇంకా ఫోన్ చేసినా ఎత్తదు..ఇలా చాలా కారణాలుంటాయి.

నిజానికి ఈ Malomar films అనే సంస్థ Tri-culture studios ఆనే పెద్ద సినిమా సంస్థ లో ఓ చిన్న శాఖ లాంటిది.దానికి ఫైనాన్స్ గాని,ఇతర సహాయాలు గాని అన్నీ Tri-culture studio నుంచే అందుతుంటాయి.దాని యజమానులు ముగ్గురు Moses Wartberg,అతని భార్య Bella,ఇంకా Jeff Wagon.హాలీవుడ్ సినీ నిర్మాణం లో ఈ స్టూడియో  దిగ్గజం అని చెప్పాలి.

Hollywood పరిశ్రమ గమ్మత్తుగా అనిపిస్తుంది మెర్లిన్ కి!ఇక్కడ ఎవరు ఏదైనా అవవచ్చు.సినిమా ఎడిటర్ గా ఉన్న Malomar ప్రస్తుతం దర్శకుడు అవుతున్నాడు.ఇక్కడ ఎవరి మీద ఎవరికి కోపం ఉన్నా చక్కగా దువ్వి పనిచేయించుకోవడానికే ప్రాధాన్యతనిస్తారుతప్ప ఒకరినొకరు కాల్చుకొని చనిపోయెంత పగలు ఉండవు.వాళ మధ్య ఉండే వివిధ అవసరాలు అలా ఉంటాయి.స్క్రీన్ ప్లే మార్చే విషయం లో కూడా మెర్లిన్ విభేదించినపుడు ..'నీకు ఒక శాతం లాభాలు ఇవ్వాలనుకుంటున్నాం...సినిమా హిట్ అయితే అందరికీ లాభమేగా అంటూ ఊరించడానికి దర్శకుడు ప్రయత్నించేవాడు.ఓ  రోజు పార్టిలో సినీ దిగ్గజం,మూవీ మొగల్ Moses Wartberg ని కలుస్తాడు. మెర్లిన్...నీ నవల చదివాను...చాలా బాగుంది...అని అంటూ ఇంకా ఏమి రాస్తున్నావు అని అడుగుతాడు.

ఈ Moses Wartberg చాలా తెలివైన ముందుచూపుగల నిర్మాత.ఇలాంటి డిన్నర్ లలో రచయితలతో అవీ ఇవీ మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్ concept లని తెలుసుకొని ...వాటిని తన మషాళా ల తో  మిక్స్ చేసి సినిమా తీసి వదులుతుంటాడు.అది చూసి అసలు వాళ్ళు ఖంగు తింటూ ఉంటారు.కావలసింత ధనం,పలుకుబడి ఉన్నవాడు కావడం చేత ఏమీ చేయాలో అర్ధం గాక ఊరుకొంటారు.

మిగతా రంగాలలో ఎంతకష్టపడినా రాని గుర్తింపు,డబ్బు ఈ సినీ రంగం లో కొద్దిపాటి శ్రమతో వస్తాయి.అందుకే ఈ రంగం లో పనిచేసే వాళ్ళు అంతా చాలా passion తో పనిచేస్తుంటారు.దానికొసం ఎంత రిస్క్ చేయడానికి వెనుకాడరు.

అలా అలా...హాలీవుడ్ జీవన శైలి కి అలవాటు పడుతుంటాడు మెర్లిన్..!సినిమా కి సంబందించిన ఓ ప్రెస్ మీట్  అనంతరం  డిన్నర్ జరుగుతుంది.అక్కడ Janelle  అనే ఓ వర్ధమాన నటి పరిచయం అవుతుంది. Tennesse రాష్ట్రం లోని జాన్సన్ టవున్ అనే వూరికి చెందినదీమె.హాలీవుడ్ కి రాకముందు రేడియో జాకీ గా పనిచేసేది.అదే రేడియో లో టీం లీడర్  Doran Rudd తో ప్రేమలో పడుతుంది.ఇద్దరికీ హాలీవుడ్ లో ఒక వెలుగు వెలగాలని కోరిక.అలా ఇద్దరు కలిసి హాలీవుడ్ వచ్చేస్తారు.

అప్పటికే ఉన్న ఓ కొడుకు ని Parents దగ్గర వదిలి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ Doran,Janelle విడివిడిగానే ఉంటూ ఉంటారు.చిన్న స్పర్ధలు కలిగి..! అయితే ప్రయోజనాల విషయం లో మాత్రం కలిసే వర్కవుట్ చేస్తుంటారు.తనకి Favour జరిగే Financiars దగ్గరకి One night stand గా వెళ్ళమని ఆమెని రిక్వెస్ట్ చేస్తుంటాడు.ఒక్కోసారి Janelle తోసిపుచ్చుతుంది.దానివల్ల Doran కి కొంత మంట గానే ఉన్నా ఇక పాతప్రేమికురాలు కావడం మూలాన ఏం అనలేని పరిస్థితి. Janelle తనకి నచ్చితే నే ఎవరితోనైనా వెళుతుంది తప్ప ఎంతవారైనా తృణీకరిస్తుంది. అది Doran కి బాగా తెలుసు.కనుక ప్రెస్ చేయడు.

అయితే ఇంతలో ఒకటి....మూవి మొగల్ Moses Warberg కి దర్శకుడు Malomar కి సినిమా కి సంబందించిన విషయంగా వాగ్వీవాదం  జరిగి ఆ తరవాత ఇంటికెళ్ళి Malomar గుండెనొప్పి తో మరణిస్తాడు.కొత్త Director ని పెట్టుకుంటారు.Janelle మాజీ ప్రేమికుడు Doran తో సాన్నిహిత్యం పెరుగుతుంది మెర్లిన్ కి..!ఇతని గురించి మెర్లిన్ సినీమా ఏజంట్ ముందే చెప్పి ఉంటాడు.

Jannelle కి Merlyn కి మధ్య స్నేహం బలపడుతుంది.ఎక్కువ ఈ Jannelle దగ్గరనే కాలక్షేపం చేస్తూంటాడు.తన సినిమా ప్రయత్నాలు,గత అనుభవాలు మిక్స్ చేసి రకరకాల విషయాలు ఈమె కధలు కధలుగా చెబుతూ ఉంటుంది.అవి వినడం అతనికి వినోదం గా మారుతుంది.కొన్ని శృంగార ప్రయోగాలు కూడా చేస్తారు.

Moses Wartberg ఇంటికి వెళ్ళినప్పటి ఓ అనుభవాన్ని మెర్లిన్ కి చెబుతుంది.తాను హాలీవుడ్ కి వచ్చిన మొదటి రోజుల్లో ఓ రోజు అతని ఆహ్వానం పై అతని ఇంటికి వెళుతుంది.సాదరం గా రిసీవ్ చేసుకుంటాడు.కాసేపు మాట్లాడిన తరువాత పైకి తన భార్య Bella ఉన్న గది లోకి తీసుకెళతాడు.ఆమె ఈమె తో మాట్లాడుతుండగానే అతను బయటికి వెళ్ళిపోతాడు.Bella నడికారు వయసుకి కొంచెం అవతలికే ఉంటుంది గాని  సౌందర్య పోషణవల్ల చక్కగా కనబడుతుంది.

Bella శాండ్ విచ్ ని ఇంకా టీని Jannelle కి ఇచ్చి తీసుకోమంటుంది.ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత తనకి దగ్గరగా రమ్మంటుంది.దగ్గరకి రాగానే "Do you like these,my dear ..would you like to suck on these"  అని పై భాగం లోని అచ్చాదనని తొలగిస్తుంది. Jannelle కి విషయం అర్ధం అవుతుంది.అంతవరకు మెర్లిన్ కి చెప్పి ఆపుజేస్తుంది.'సరే...తరువాత ఏం జరిగింది చెప్పు... 'ఆసక్తిగా అడుగుతాడు మెర్లిన్....! తరువాత భాగం మళ్ళీ వచ్చే భాగం లో చూద్దాము...!

Sunday, June 1, 2014

పగవాడికి సైతం రాకూడదు ఈ గతి

రెండు రాష్ట్రాలు-మూడు ప్రాంతాలు| KVVS MURTHY
-----------------------------------------------------

ఒక చారిత్రక సన్నివేశం ఆవిష్కరింపబడుతున్నవేళ

నా మాట నేను చెప్పకపోతే మరెవరు చెబుతారు..?

తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి చివరికి

అయితే మూడు ప్రాంతాలు గా తేలాయి ఇపుడు...

ఆ మూడవది ఏమిటా...?

అదే భద్రాచలం ప్రాంతం..!

అవును నిజం...

మా భాషలో యాస లేదని ఆంధ్రా వాళ్ళమంటారు ఇటువాళ్ళు

మా ప్రాంతం ఇవతల ఉన్నది కాబట్టి తెలంగాణా వాళ్ళమంటారు

అటువాళ్ళు...!

మేమెవరిమో మాకే తెలియని పరిస్థితి

రాముడి గుడినుంచి రెండు అడుగులేస్తే సీమాంధ్ర

రాముడు మాత్రం తెలంగాణా...

ఎవరినీ ద్వేషించలేని స్థితి

పగవాడికి సైతం రాకూడదు ఈ గతి

ఎలాగు పల్లె లోనూ ,నగరం లోనూ

బ్రతికేయగల దేశద్రిమ్మరినే గదా..

ఏ చెన్నయ్ నో... భువనేశ్వర్ నో

చెక్కేస్తే బాగుండుననిపిస్తుంది నాకైతే...
---------------------------------------------------
01-6-2014    




Thursday, May 29, 2014

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (అయిదవ భాగం)

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (అయిదవ భాగం)

పాత కాలం నాటి ప్రముఖ రచయితల్ని తిట్టడం చేస్తుంటాడు గదా Osano.కొంతమందిని అలా తిట్టిన తరవాత మీరు "షేక్స్పియర్" ని మర్చిపోయినట్లున్నారు అని గుర్తు చేస్తాడు మెర్లిన్.

"షేక్స్పియర్ నాకెందుకో నచ్చుతాడు.తను రాయదలుచుకున్న దాన్ని రాసిపారేశాడు.అది నిజమా,కాదా ఇతరులకి నచ్చుతుందా లేదా అనేది ఆలోచించకుండా ఒక ఫ్లో లో రాసుకువెళ్ళాడు అందుకనే అతని మాటల్లో ఒక బ్యూటి ఉంటుంది.Love is not love which alters when it alternation finds...ఆహా ఎంతబాగా చెప్పాడో చూశావా.." షేక్స్పియర్ ని మాత్రం తిట్టకుండా వదిలేస్తాడు ఒసానో.

అలా ఒసానో తో మెర్లిన్ స్నేహం బలపడసాగింది.ఎప్పుడైనా గాని డ్రింక్ ని,డిన్నర్ ని ఆఫర్ చేసేవాడు.అమ్మాయిల విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రం ఒసానో వైపు ఒక సీరియస్ లుక్ నిచ్చేవాడు మెర్లిన్.

"ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితం లో నీ భార్య పట్ల ఇంకా నీకు విముఖత కలగలేదా..నువ్వు నిజంగా tenth wonder వే " అనీ నవ్వేవాడు ఒసానో.ఆ విష్యం తనకి పట్టనట్లుగా ఉండి పోవడం తో ఒసానో ఆ ప్రసక్తిని అక్కడితో వదిలిపెట్టేవాడు.

ఆ విధంగా ఒసానో సాన్నిహిత్యం లో పత్రికా ప్రపంచం లోని లోతుపాతులు,జీవితం లోని కొన్ని ఇతర కోణాలు పరిచయమవసాగాయి.ఎన్నో పాత్రలని గొప్పగా చిత్రించే ప్రఖ్యాత రచయితలు నిజ జీవితం లో మాములు మనుషుల్లాగే ఇతర విషయాల్లో ఉంటారని మెర్లిన్ కి అవగతమైంది.

అప్పుడప్పుడు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు...రివ్యూ లలో రాసి జనాల్ని రెచ్చగొట్టడం కూడా ఒసానో కి చాలా ఇష్టం.అతని పేరు ఆ విధంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు.అయితే మళ్ళీ దాన్ని ఎలా ఆర్పాలో అలా ఆర్పేవాడు.ఒకసారి death penalty మీద ఓ వివాదస్పద వ్యాసం రాశాడు.ఒకరిని చంపిన వానిమీద మానవత కారణలతో death punishment విధించకుండా ఉండటం  అర్ధం లేని విషయమని,ఆ విషయం లో గాని రెఫరెండం పెడితే జనాలు నిందితుడికి death punishment సరైనదని తీర్పునిస్తారని రాశాడు.క్రింది,మధ్యతరగతి వర్గాలు ఆ విధంగా కొట్టుకు చస్తుంటే పై వర్గాలకి ఆనందం...ఎలాగు వాళ్ళంతా సేఫ్ జోన్ లోనే ఉంటారుగదా.ఏమైనా ప్రపంచం లో Law abiding people అంటే మాత్రం బ్రిటిష్ వాళ్ళే 'అంటూ తన వ్యాసం లో ఉటంకించాడు.అది ఆ తరువాత పెద్ద చర్చకి దారి తీసింది.అతనికి వ్యతిరేకంగా వివిధ సంఘాల వాళ్ళు ఉత్తరాలు రాయగా మళ్ళీ వాటినన్నిటిని అదే పత్రికలో ప్రచురించుకొని అయాచితంగా పబ్లిసిటీ పొందేవాడు.

Wendy అనే ఆమె ఈ ఒసానో పనిచేసే పబ్లిషింగ్ సంస్థ లోనే సహాయకురాలిగా పనిచేస్తూ ఉంటుంది.ఒసానోకి ఈమె మూడవ భార్య.అయితే ఇద్దరికీ పడక డైవర్స్ కూడా  అయిపోతుంది.ఆమె ప్రస్తుతం వేరే వ్యక్తితో ఉంటున్నది.విచిత్రమేమంటే ఈ Wendy కి అక్కడ జాబ్ వచ్చేలా చేసింది ఈ ఒసానో నే.అతడి మన్స్థత్వం ఒక పట్టాన అర్ధం కాదు.Wendy మంచి సెక్సీ గా ఉంటుంది.క్రమం తప్పకుండా alimony ఇస్తున్నంత కాలం ఏమీ అనదు.కాని ఎప్పుడైనా తప్పినా ...ఆలశ్యమైనా పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది.ఈ ఒసానో కూడా అంతకి తగిన బొంత.

వీళ్ళద్దరూ వివాహ బంధం లో ఉన్నప్పుడు కూడా చిన్న గొడవలకి కూడా పోలీస్ లకి కంప్లైంట్ లిచ్చేది.తీరా వాళ్ళు వచ్చి ఆశ్చర్యపడేవాళ్ళు.ఒసానో ఆమె గూర్చిన కొన్ని ఉదంతాలు మెర్లిన్ కి  చెప్పాడొకసారి.

ఆమె కి తన కి ఓసారి గొడవైంది.అంతే..ఇంట్లో ఉన్న అతగాడి షర్టులు,పేంటులు,టై లు అన్ని ముక్కలు ముక్కలుగా కత్తెర తో కట్ చేసి వాటి మీద కూర్చొని Vibrater తో Masturbate చేసుకొని ఆ విధంగా ఆనందించేది. మరోసారి.....తనకి ఏదో సమస్య ఉందని ఓ సైకియట్రిస్ట్ దగ్గరకి వెళ్ళి అతనితో సంబందం పెట్టుకొంటుంది.మళ్ళీ పైగా వాడికి ఫీజు చెల్లించాలట ఒసానో...అలాంటివి ఎన్నో అయినాక విడాకులు తీసుకుంటారు.

సరే..ఒసానో రాసిన ఓ నవలని హాలివుడ్ నిర్మాతలు సినిమా గా తీయడానికి కొంటారు.ఆ విధంగా హాలీవుడ్ లో అడుగుపెడతాడు.అయితే సినిమా మనుషుల ప్రవర్తన ఒసానో కి అసలు నచ్చదు.ప్రపంచం లో ఇన్ని మిలియన్ కాపీలు అమ్ముడైన పాపులర్ రచయితను...బయట అంతా హీరో లా చూస్తారు తనను...ఇక్కడ కో డైరెక్టర్ కి ఇచ్చిన విలువని కూడా ఇవ్వరే వీళ్ళు అని తిట్టుకుంటాడు.ఎవరితో ఎక్కువ అవసరం ఉంటుందో వాళ్ళకే ఇక్కడ విలువ.ఆ రాత్రికి మాటిచ్చిన Katherin అనే అమ్మాయి కూడా ఎవడో కెమెరా మేన్ కలిస్తే వెళ్ళిపోతుంది.

మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు.విమానం లో కూడా ఒకామె తో చిన్న ఘర్షణ జరుగుతుంది.ఈ ఒసానో కాల్చే సిగార్ వాసన తన కుక్క కి పడ్టం లేదని ...ఆపమని చెప్పగా ఇద్దరకీ వివాదం ముదిరి కొట్టుకుంటారు.సిబ్బంది వచ్చి విడదీస్తారు.భవిష్యత్ లో నోబెల్ బహుమతి అందుకోనున్నానని చెప్పుకొనే ఈ వ్యక్తి నిజ జీవితం లో ఇలా ఉంటాడా అనిపిస్తుంది.

ఇదిలా ఉండగా Artie భార్య Pam ఒకరోజు మెర్లిన్ కి ఫోన్ చేస్తుంది.ఒక సమస్య లో ఉన్నానని చెబుతుంది.అదేమిటో ఫోన్ లో చెప్పమని అడగ్గా ..ఇంటికి రావాలసిందిగా కోరుతుంది.తనకి తెలిసినంతలో తన సోదరుడు Artie...అతని భార్య సంతోషకరమైన జీవితమే గడుపుతున్నారు.ఏమి అవాంతరం వచ్చిందబ్బా ...అని ఇంటికి వెళతాడు.Artie,Merlin   లు ఇద్దరూ అన్నదమ్ములు.అనాధలుగా Orphanage లో పెరిగారు.ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం లో ఎప్పుడూ వెనుదీయరు.

విషయాన్ని వివరిస్తుంది Artie భార్య.గతకొన్ని  రోజులుగా తన భర్త వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం వస్తుందని...ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని ..అతని షర్ట్ పై లిప్ స్టిక్ మరక కూడా కనిపించిందని అంటుంది.మెర్లిన్ కి Artie గూర్చి బాగా తెలుసు.ఎటువంటి సమస్య తనవద్ద దాయడు.నేను అంతా విచారించి నీకు తెలియజేస్తాను...నీ భర్త పట్ల నువ్వు విశ్వాసం కోల్పోవద్దు అని సర్ది చెబుతాడు మెర్లిన్.

ఆ తరవాత రైల్వే స్టేషన్ వద్ద Artie కలుస్తాడు.ఇంట్లో అతని భార్య పడే ఆందోళన ని తెలిపి అసలు విషయం ఏమిటో చెప్పు అంటాడు మెర్లిన్.తన సోదరుడు తెలిపిన వివరాలు విని హతాశుడవుతాడు.

"గత కొన్ని సంవత్సరాలుగా నేను మన తల్లి కోసం అన్వేషణ చేస్తూనేఉన్నాను.అనుకోకుండా ఆమె ఉనికి తెలిసింది.వెళ్ళాను.ప్రస్తుతం ప్రపంచం లో ఒంటరి ఆమె.బాగా త్రాగుడి కి బానిస అయింది.చూడటానికి అందంగా...లిప్ స్టిక్ తో ఉన్నది.నిన్ను చూడాలని అన్నది" అని చెప్తాడు Artie.

మెర్లిన్ కి కన్నీళ్ళు వస్తాయి.కాని తమాయించుకొని అంటాడు." లేదు...ఇన్నాళ్ళపాటు ఒంటరిగానే ప్రపంచం లో జీవించాం.మనమెవరో మనకి తెలియదు.అలాగే ఉండనీ..నాలో ఉన్నదో ఎవరి రక్తమో నాకు తెలియదు...ఒక నల్ల మనిషి రక్తమో,జ్యూయిష్ రక్తమో,ప్రొటెస్టెంట్ రక్తమో ఇప్పుడు తెలుసుకొనే ఆసక్తి కూడా నాకు లేదు.ఏదో నాకున్న ఊహలోనే నన్ను జీవించనీ" అని..!

ఆ తర్వాత ఇదే విషయాన్ని Artie భార్య కూడ తెలుసుకొని బాధ పడుతుంది తన అనుమాన ప్రవర్తన గురించి.మెర్లిన్ కూడా తన భార్య Valerie కి తన తల్లి విషయం చెబుతాడు."ఎంతైనా తల్లి గదా...ఆమె తో కనీసం ఒక మాట మాట్లాడి రాలేకపోయావా.."అంటుందామె.

అప్పుడు మెర్లిన్ లోని ఆవేదన బ్రద్దలవుతుంది."Do you know ...what the word "orphan" means..?Have you looked it up in the dictionary..?It means a child who has lost both parents through death.Or a young animal that has been deserted or has lost its mother.Which one do you want..?"

అతని యొక్క ఆవేదనకి ఆమె విభ్రాంతి చెందుతుంది.

సరే...Eddie Lancer ని యాజమాన్యం తో కలిగిన స్పర్దల వల్ల ఎడిటర్ పోస్ట్ నుంచి తొలగిస్తారు. అతనితో బాటే మెర్లిన్ ని కూడా తొలగిస్తారు.ఒసానో తో పనిచేయడం వల్ల అలా వెళ్ళిపోతున్నది కాలం.Hollywood లో డీల్ కుదిరి ఒసానో కి డబ్బులు బాగానే ముడతాయి.ఆ సంధర్భంగా పార్టీ ఇస్తున్నా రమ్మని మెర్లిన్ ని పిలుస్తాడు.

పిలవని అథితి లా ఆ పార్టీకి WENDY  కూడా వస్తుంది.మంచి సమయం చూసి ఆ పార్టీని అభాసు చేయాలని ప్రయత్నిస్తుంది. ఆ పెనుగులాటలో wendy ని కిటికీ లోనుంచి బయటికి విసిరేస్తాడు ఒసానో.ఆమె కి ఎముక ఫ్రాక్చర్ అవుతుంది.ఆసుపత్రి లో చేర్చుతారు.

"Merlin..she is a witch, చూశావా ఈ పార్టీ ని రసాభాస చేసి నాకు నోబెల్ ప్రైజ్ రాకుండా చేయాలని దీని ప్లాన్ " అంటూ ఆవేశం లో కంపించుతుంటాడు ఒసానో.

ఒసానో లాయర్ ని అడిగితే ఒక రెండు వారాల పాటు కనిపించకుండా వెళ్ళి పొమ్మని చెబుతాడు.ఈ లోపులో ఇక్కడ ఫార్మాలిటీస్ ని పూర్తిచేస్తానని చెబుతాడు.మెర్లిన్ Cully కి ఫోన్ చేసి ఒసానో ని పంపుతున్నట్లు సమాచారమిస్తాడు. మిగతాది వచ్చే భాగం లో చెప్పుకుందాం.
          --KVVS MURTHY 

Sunday, May 25, 2014

Mario Puzo నవల Fools Die గూర్చి సంక్షిప్తంగా (నాల్గవ భాగం)

Mario Puzo నవల Fools Die గూర్చి సంక్షిప్తంగా (నాల్గవ భాగం)

మెర్లిన్ కి సాయం చేయడానికి కల్లీ అంగీకరిస్తాడు.అక్కడ లాస్ వేగాస్ లో తన యజమాని Gronevelt కి కుడిభుజంగా మారతాడితను.అతని వ్యాపార లావాదేవీల విషయం లో చురుకుగా సహకరిస్తుంటాడు.Pencil power కూడా పొందుతాడు.అంటే Xanadu కేసినో లో గల అతి సౌకర్యవంతమైన హోటల్ లోని  రూంలను ఏ విజిటర్ కైనా తన ఇష్టానుసారం ఇవ్వగలిగే పవర్ అన్నమాట.ఇది దాని అధిపతి Gronevelt తర్వాత ఇతనికే ఉంటుంది.ఈ Gronevelt 70 ఏళ్ళవాడు.అయితే మంచి ఆరోగ్యంగా ఉంటాడు.Roulette,Black jack,Baccarat,Crapes ఇలాంటి గేంస్ లోని ప్రతి అంశం బాగా ఎరిగినవాడు.ఎవరు ఎక్కడ మోసం చేయాలనుకున్న ఇట్టే కనిపెడతాడు.ఆ ఉద్యోగులని fire చేసి పారేస్తాడు పనిలోనుంచి..!

Las Vegas లోని బిలియనీర్లలో ఒకడైన Gronevelt కి పుస్తక పఠనం కూడా ఓ హాబీగా ఉంటుంది.చికాగో లో జరిగే Rare books auction కి క్రమం తప్పక వెళుతుంటాడు.ఒకసారి Gronevelt తో మాట్లాడుతున్నప్పుడు అతని వెనుక ఉన్న పుస్తకాల అరల్ని చూసి Cully అనుకుంటాడు."ఈ పెద్దమనిషి ఇన్ని పుస్తకాలు సేకరించాడు గాని...అసలు చదివి ఉంటాడా దీంట్లో ఏవైనా .." అని!

అతని మనసు అర్ధం చేసుకున్నాడా అన్నట్లుగా Gronovelt లేచి ఒక పుస్తకాన్ని తీసి Cully కి ఇచ్చి "ఈ పుస్తకాన్ని చదివి నాకు దాని సారాంశం చెప్పు " అంటాడు.అది గేంబ్లింగ్ కి సంబందించినది.ఎందుకైనా మంచిదని కల్లీ మొత్తం చదివేసి ఆ తర్వాత Gronovelt కి దాని గురించి చెబుతాడు.ఎక్కడెక్కడ నచ్చలేదో కూడా సోదాహరణంగా వివరిస్తాడు.దానితో Gronevelt సంతోషిస్తాడు.చాలా బాగా చెప్పావు అని మెచ్చుకుంటాడు.ఎందుకంటే Gronevelt కూడా మంచి పాఠకుడే..! ఆ తరవాత నుంచి కల్లీ కి చాలా వ్యాపార రహస్యాలు చెబుతుంటాడు.ఏ ఏ దేశాల వాళ్ళు ఏ విధంగా గేంబ్లింగ్ చేస్తారు..వారి పోకడలు అన్నీ వివరిస్తుంటాడు.

కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాడు.కల్లీ కి ఉన్న బలహీనత స్త్రీ లోలత్వం.దాని గూర్చి కూడా కొంత బోధ చేస్తాడు.Gronevelt లో ఒక ఏకాంతం ఉంది.అది తన మిత్రత్వం తో పూరించుకుంటున్నట్లుగా కల్లీ కి అర్ధం అవుతుంది.

Daisy అనే డేన్సర్ ద్వారా Cully ఓ విషయం తెలుసుకుంటాడు.అదేమిటంటే Fummiro అనే ఒక జపాన్ దేశపు బిలియనీర్ అమెరికా కి వస్తున్నట్లుగా గ్రహిస్తాడు.ఈ డైసీ కూడా జపాన్ దేశానికి చెందినదే.అయితే పేరు అలా మార్చుకుంటుంది.Fummiro గూర్చి కొన్ని విషయాలు  అప్పటికే కల్లీ వినివున్నాడు.డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తాడని.జపాన్ లోని ఒక పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడని.ఇలా..!

ఎలాగైనా సరే Fummiro ని తమ Xanadu కేసినో కి రప్పించి తీరాలని నిర్ణయించుకుంటాడు కల్లీ.ఆ జపాన్ ధనికుని అభిరుచులు ,అలవాట్లు,జీవిధ విధానం గూర్చి తెలుసుకుంటాడు.Daisy సాయం తీసుకొని ఒక లెటర్ రాసి జపాన్ కి పంపుతాడు.తాము మీ సేవ కోసం వేచి చూస్తున్నామని,మీరు అమెరికా లో దిగేముందు ఒక్క ఫోన్ చేసినట్లయితే మేమే వచ్చి మా బ్రహ్మాండమైన Xanadu casino కి తీసుకువెళతామని మీకు మాదగ్గర దొరకని సౌకర్యం అంటూ ఏది ఉండదని దానిలో వివరిస్తాడు.

Fummiro రాక గూర్చి Gronevelt కి చెబుతాడు కల్లీ.బాగా హేపీ గా ఫీలయి  నా Rolls Royce కార్లని తీసుకొని వెళ్ళు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి...గ్రాండ్ గా ఉంటుంది " అంటాడు.Fummiro తో పాటుగా మరో తొమ్మిది మంది బృందం వస్తుంది.వారందరికి చక్కని బస ఏర్పాటు చేస్తాడు కల్లీ.అందరికంటే Fummiro కి ఇవ్వబడిన suit స్పెషల్ గా ఉంటుంది. దానిలో ఒక పియానో..జపాన్ తరహా దుస్తులు ..ఇలా చాలా ఉంటాయి.తను సూట్ కేసు లో తెచ్చిన డాలర్ల దొంతర్లని ఆ హోటల్ లోనే డిపాజిట్ చేసి అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుంటూ గేంబ్లింగ్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటాడు అతను.మొదటి రోజునుంచే కేసినో లో బాగా డబ్బు పోగొట్టుకుంటుంటాడు ఆటలో .. కల్లీ వారిని బంగారు బాతుల్లా జాగ్రత్తగా మర్యాదగా చూసుకుంటూ ఉంటాడు.ఒక్కసారి తమ కేసినో కి వచ్చినవాడు శాశ్వత కష్టమర్ గా మారిపోవాలనేది అతని పాలసి.Fummiro కి బంగారు వర్ణం శిరోజాలు ఉండి,Long legs ఉండే తెల్ల అమ్మాయిలంటే ఇష్టమని కల్లీ తెలుసుకొని...ఆ ఏర్పాటు ఏమైనా చేయాలా అని అడుగుదామని టెంప్ట్ అవుతాడు. ఇది సమయం కాదులే అని మళ్ళీ  ఊరుకుంటాడు.

Fummiro ఓసారి టీవి చూస్తూ ఫలానా అమ్మాయి బాగుంది కదా అంటాడు ..కల్లీ రెచ్చిపోతాడిక...." మీకెందుకు ఆ అమ్మాయిని మీ కోసం నేను ఇక్కడకి రప్పిస్తాను..ఆ నటి ని Linda parsons అంటారు.మాట్లాడమంటారా అంటాడు.మళ్ళీసారి మీరు ఇక్కడికి రాగానే ఆ అమ్మాయితో మీరు ఉంటారు..సరేనా..!"

సంతోషంగా ఓ.కె అంటాడు ఆ జపాన్ ధనవంతుడు.Linda Parsons ఇదివరకు ఓ కేసినో లో పనిచేసేది.ఇప్పుడు చిన్నా చితకా సీరియళ్ళలో నటిస్తున్నది.ఆ మధ్యన ఎవరినో పెళ్ళాడినట్లు విన్నాడు.డబ్బుల వ్యవహారం సరిగ్గా కుదరాలే గాని Linda parsons దేనికీ కాదనదు.ఆమె తో మాట్లాడి Deal కుదుర్చుకుంటాడు కల్లీ.రెండవసారి  Fummiro వచ్చేసరికల్లా Linda ని అతనిముందు దింపుతాడు కల్లీ.ఆనందం తో తలమునకలవుతాడు Fummiro. మొత్తానికి వారిరువురు కొన్నిరోజులు శ్సృంగార లహరిలో తేలియాడుతారు.
Fummiro తో అనుభవం ఎలా ఉన్నది అని Linda ని అడుగుతాడు కల్లీ.

" I have been with rich guys before..And I made good money...God...I could live for ten years on what he loses in one day...he's such an interesting guy...I  loved that soup for break fast and piano playing...And he was great in bed,no wonder the Japanese women do everything for their men"  అంటుంది Linda!

'అలాగా..అయితే మీ ఇద్దరిని ఇక మీదట కలవకుండా ప్లాన్ వెయ్యవలసిందే'అనుకుంటాడు కల్లీ మనసులో..!

సరే...ఇదిలా ఉండగా ఆ తర్వాత మెర్లిన్ ని ఆదుకోవడం కోసం న్యూయార్క్ వస్తాడు కల్లీ. Hemsi కుటుంబాన్ని కలిసి నానా బుజ్జగింపులు ఆ తర్వాత mild బెదిరింపులు  చేసి మెర్లిన్ కి వ్యతిరేకంగా ఉన్న కేసు నుండి బయట పడవేస్తాడు.Eli Hemsi తమ్ముడు Xanadu కేసినోలో ఉన్న అప్పుని ప్రస్తావించి దాన్ని లేకుండా చేస్తానని ప్రతిపాదిస్తాడు.అయినా వినడు.ఇక చివరికి అంటాడు" మీ అబ్బాయికి ప్రస్తుతం ఉన్న 6 నెలల ఆర్మీ శిక్షణని 2 సంవత్సరాలు ఉండేలా చేస్తాను.ఆ తర్వాత మీ ఇష్టం,మీరు ఇచ్చిన లంచాల వ్యవహారం కూడా బయటికి వచ్చి ...ఆ పిమ్మట పేపర్ల లో వచ్చి రచ్చ అవుతుంది.మెర్లిన్ కి శిక్ష మాత్రమే కాదు మీరు కొంత నష్టపోతారు..అసలే మీ భార్య అనారోగ్యం తో ఉంది కదా...నేను Gronevelt మనిషిని.అతను ఎలాంటివాడో..అతనికి గల పలుకుబడి ఏమిటో మీ సర్కిల్ లో అడిగి తెలుసుకొండి అంటాడు.చివరికి అంగీకరించి "సరేలే..ఆ సాక్ష్యం ని వెనక్కి తీసుకోమని మా అబ్బాయికి చెబుతాను" అంటాడు Hemsi!

ఆ విధంగా మెర్లిన్ రక్షింపబడి మళ్ళీ ఉద్యోగం లో చేరతాడు.అక్కడ పనిచేసే ఒక మేజర్ మీరు ఉద్యోగం మానివేసి వేరే వృత్తి లోకి వెళ్ళడం మంచిది అని సలహా ఇస్తాడు మెర్లిన్ కి.ఇప్పటికీ FBI మీమీద నిఘా పెట్టివుంది.ఏ మాత్రం ఈ సారి లంచం తీసుకుంటూ దొరికినా జైలుకి వెళ్ళడం ఖాయం...మీరు ఇప్పటికీ మంచి వయసు లో ఉన్నారు..మీ టాలెంట్ కి ఏ రంగం లోకి వెళ్ళినా రాణిస్తారు అంటాడతను.ఒక రాత్రంతా ఆలోచిస్తాడు మెర్లిన్.ఆ డెసిషన్ మంచిదే అనిపిస్తుంది.ఉన్న సెలవులన్నీ వాడేసుకొని ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు.

అలా రిజైన్ చేసిన తర్వాత Eddie Lancer అనే ఎడిటర్ ని కలుస్తాడు.అతను పాత  మిత్రుడు.Reviews,Interviews చిన్న చిన్న human interesting stories రాయమని ప్రోత్సహిస్తాడు.పారితోషికం కూడా బాగానే ఇస్తుంటాడు.ఆ విధంగా జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది.

క్రమేణా పాత ఇంటికి టాటా చెప్పి మంచి ఏరియాలో comfortable గా కట్టుకున్న కొత్త ఇంట్లోకి వచ్చేస్తాడు.ఇక్కడ పిల్లలకి,తమకి తలా ఒక గది ఉంది.తను రాసుకోవడానికి ప్రత్యేకంగా ఒక Den ఉంది.మంచి పరిసరాలు...హాయిగా సాగిపోతుంటుంది జీవితం.మనిషి నిరంతరం సుఖంగా ఉన్నా  దాన్ని భరించలేడు... ఇప్పటి మెర్లిన్ స్థితి అదే. ఏదో ఒక అవాంతరాన్ని ఎదుర్కోవాలి..దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి ...ఏమిటి ఈ నిమ్మకు నీరెత్తినట్లు ఈ జీవితం ..చాలా బోర్ గా ఉంది అనిపిస్తుంది మెర్లిన్ కి.

ఉన్నట్లుండి Eddie Lancer ఓ సారి Chinese restaurent లో డిన్నర్ ఉంది రాకూడదూ అంటాడు.ఎంతసేపు Valerie ఇంట్లో వండిపెట్టిన దానితోనే సంతృప్తి పడుతుంటాడు తప్ప మెర్లిన్ సాధారణంగా ఎక్కడ బయట తిండి తినడు.అదే అంటాడు Eddie తో..!

" మనిషి జీవితం లో పైకి రావాలంటే బయటి లోకం లో కూడా కొన్ని పరిచయాలు ఉండాలి...There will be some good booze...good talk...and some nice looking broads too!And your stuff may read better to some publisher if he's met you at a party and he thinks you're a nice guy"  అని అంటాడు ఎడ్డీ.

ఆ డిన్నర్ తర్వాత జరిగిన పార్టీ లో Osano అనే ఒక పాపులర్ రచయిత పరిచయం అవుతాడు.అప్పటికే అతని అనేక నవలలు ప్రపంచం మొత్తం మీద కొన్ని మిలియన్ లు అమ్ముడయి అతగాడికి పేరుని,డబ్బుని బాగా తెచ్చిపెట్టాయి.నిజానికి చాలా ఏళ్ళ కిందట ఒసానో ని మెర్లిన్ ఇంటర్వ్యూ చేస్తాడు.అయితే ఇద్దరూ ఆ విషయాన్ని  మరిచిపోయినట్లే ప్రవర్తిస్తారు.

ఈ Osano మంచి జల్సా పురుషుడు కూడా..!అప్పటికే 5 గురు భార్యలకి విడకులిచ్చి ఉంటాడు.బయట వ్యవహారాలు సరేసరి.అయితే ఎలాంటి వారినైన బుట్టలో వేసుకొనే తెలివితేటలు,మాటకారితనం అతని సొంతం.సరిగ్గ ఇలాంటి లక్షణాల వల్లనే అతనికి రాకూడనంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయేమో ననిపిస్తుంది మెర్లిన్ కి.తాను ఒక గొప్ప క్లాసిక్ రాయబోతున్నాని,ఎత్తి రాయడానికి, పైకి చదవడానికి ఇలాంటి వాటికి ఒక అసిస్టెంట్ కావాలని ఆ విషయం లో తనకి సహకరించవలసిందిగా మెర్లిన్ ని కోరతాడు.దానికి గాను కొంత పేమెంట్ కూడా చేస్తానంటాడు.

సరేనని సాయంత్రం వేళల్లో Osano ఇంటికి వెళుతుంటాడు.విస్కీ సేవిస్తూ Osano చాలా విశేషాలు చెబుతుంటాడు.ఇష్టం లేని రచయితలని బండ బూతులు తిడుతుంటాడు.తాను ప్రస్తుతం Nobel prize వేటలో ఉన్నానని తనకున్న కనెక్షన్స్ తో ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడొకసారి.

ఇక ఒకరోజు సాయంత్రం గత కాలపు రచయితల్ని తిట్టే ఓ కార్యక్రమం పెడతాడు."Hardy కావచ్చు,Tolstoy కావచ్చు,Galsworthy కావచ్చు.. అసలు ఏమిటి వాళ్ళు రాసినదంత చెత్త..అప్పట్లో ఏ వినోద సాధనాలు లేక వాళ్ళు రాసిన వందల పేజీల చెత్తని జనాలు చదివారు.కీర్తించారు.ఏది ఇప్పుడు రాసి మెప్పించమను చూద్దాం..ఏ పబ్లిషరూ వేసుకోడు...ఒక వేళ వేసినా ఇప్పటి విమర్శకుల ధాటికి తట్టుకోలేరు."

చేసేది ఏమి లేక అలా వింటూ ఉంటాడు మెర్లిన్.

"Anna Kerenina ని ఓ...పెద్ద మాస్టర్ పీస్ అని తెగ పొగుడుతుంటారు.it's a full-of-shit book ..Russia లో ఒక farm నిర్వహించే పద్దతి గురించి 300 పేజీలు రాసి పారేస్తాడా దాంట్లో .. ఇక ఇంగ్లీష్ వాళ్ళు తక్కువ తిన్నారా..Dickens,Trollope అయిదు వందల పేజీలంటే వాళ్ళకొక లెక్క కాదు..చిన్న దానిమీద అలా ఊదిపారేస్తారంతే.They wrote when they had time off from tending their garden.The French kept it short at least...but how about that fucking Balzac..? ఇలా చెలరేగిపోతుంటాడు ఒసానో.

"My boy... మన కాలం లో నివసిస్తున్నవాళ్ళు ఇంకా ముందుకు పోయి ఆలోచించాలి.నువ్వు ఏ చెత్త రాసినా పబ్లిషర్ దాన్ని ప్రచురించే స్థాయికి ఎదగాలి.టి.వి.లకి రాయి..సినిమాలకి రాయి..ఇతర రచనలు చేయి..దుమ్ము రేపాలి..ఈ పాత తరం రచయితలందరిమీద మనం కక్ష తీర్చుకోవాలంటే వాళ్ళ Idea లని తెలివిగా కాపీ చేయాలి.వాటికి సమకాలీన అంశాలని అద్ది మిక్స్ చేసిపారెయ్యాలి.అప్పుడు నూతనత్వం చచ్చినట్లు అదే వస్తుంది"

ఆ విధంగా అంటూ కొంతమంది మీద కక్ష తీర్చుకునే క్రమం లో ఒక లిస్ట్ ని ఇద్దరూ కలిసి తయారించుతారు.Silas Marner,Anna Kerenina,Young werther,Domby and son,the scarlet letter ఇట్లాంటి వాటిని ఎన్నుకుంటారు.

"నీకు అసలు నచ్చని ఓ క్లాసిక్ చెప్పు" అంటాడు ఒసానో.

" Silas marner" చెబ్తాడు మెర్లిన్.

"Old dykey George Eliot .. !Tolstoy is better than Eliot.But the school teachers love her,the profs will come out screaming when I hit Tolstoy" అంటూ సణుగుతాడు ఒసానో.వచ్చేది మళ్ళ ఇంకో భాగం లో చెప్పుకుందాం.

 --KVVS MURTHY  

Saturday, May 24, 2014

Mario Puzo నవల Fools Die గురించి (మూడవ భాగం)

Mario Puzo నవల Fools Die గురించి (మూడవ భాగం)

Merlyn నివాసం ఉండే పరిసరాల గూర్చి గతం లో చెప్పుకున్నాం  గదా..న్యూయార్క్ మహానగరం లో పేదవర్గానికి చెందినవాళ్ళు ఎక్కువగా ఉండే ఒక ghetto లోని అపార్ట్ మెంట్ లో అతను తన కుటుంబం తో నివసిస్తుంటాడు.Junkies,Alcoholics, pimps,Small time thieves ఇలాంటివాళ్ళంతా కలగా పులగంగా ఉండే లొకేషన్ అది.ఎక్కువగా నివాసితులంతా Black people అని చెప్పాలి.Whites  ఉన్నప్పటికి చాలా తక్కువ ఆ ప్రాంతం లో..!

మెర్లిన్ భార్య Valerie కి కూడా అక్కడ ఉండడం ఇష్టం ఉండదు.తన తండ్రి వద్ద నుంచి కొంత డబ్బు తీసుకొని వేరే చోట ఇల్లు కొందామని అంటుంది.కాని స్వాభిమానం గల మెర్లిన్ దానికి అంగీకరించడు.ఒక సంవత్సరం ఓపిక పడితే చాలు...నేనే ఆ పని చేయగలను అంటాడు.సరే...ఆర్మీ రిజర్వ్ యూనిట్ లో చాకచక్యంగా లంచాలు రాబట్టి బాగానే సంపాదిస్తాడు.ఆ తర్వాత ఇంటి పని కూడా మొదలు పెడతాడు వాళ్ళకి నచ్చిన లొకేషన్ లో.

ఇక్కడ Valerie గూర్చి ఒకటి చెప్పాలి.ఆమెకి తను ప్రస్తుతం ఉంటున్న ఏరియా నచ్చకపోయినా ఆమెకి గల చదువు సంస్కారం వల్లనో...ఇంకేదానివల్లనో నోటితో మటుకు దాన్ని వ్యక్తం చేయదు.కాని ఆమె భావాన్ని మెర్లిన్ అర్ధం చేసుకుంటాడు.

వీళ్ళు ఉంటున్న అపార్ట్ మెంట్ ముందు మరో కుటుంబం ఉంటుంది.ఆమె 40 ఏళ్ళ నల్ల వనిత.ఆమెకి ముగ్గురు పిల్లలు.భర్త నుంచి విడిపోయి ఉంటుంది.సాయంత్రం కాగానే చక్కగా తయారై ఎవరో ఒకరితో డేటింగ్ నిమిత్తం వెళ్ళిపోతుంది.ఇంట్లో ఆ ముగ్గురు పిల్లలే ఉంటారు.దాంట్లో పెద్ద పిల్లకి 10 ఏళ్ళు ఉంటాయి.

ఒకరోజు సాయంత్రం తల్లి బయటికి పోగానే అగ్ని ప్రమాదం జరుగుతుంది.అప్పుడు ఈ Valerie వెళ్ళి ఆ ముగ్గురు పిల్లల్ని సేవ్ చేస్తుంది.అయితే దాంట్లో ఓ అమ్మాయి బాగా గాయపడుతుంది.

అంబులెన్స్ లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆసుపత్రి లో జాయిన్ చేస్తారు.సరే...తెల్లారి Valerie తన తల్లి గారి ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళుతుంది.అప్పుడప్పుడు అలా అరగంట Drive దూరం లో గల వారి ఇంటికి వెళ్ళి ఓరోజు గడిపి రావడం ఈమెకి ఓ అలవాటు.మెర్లిన్ ఇంట్లో ఒక్కడే ఉంటాడు.కాసేపు ప్రశాంత సమయం దొరికింది గదాని ఏదో రాయడానికి ఉద్యుక్తుడవుతుంటాడు .అంతలోనే తలుపు కొట్టినశబ్దం అయితే వెళ్ళి తీస్తాడు.ఆ నల్ల వ్యక్తి కన్నీటి పర్యంతమవుతూ చెబుతాడు తాను ఆసుపత్రిలో చేర్పించబడిన ఆ పాప తండ్రి నని. లోపలికి పిలిచి కూర్చోబెడతాడు మెర్లిన్.ఆ పిల్లల్ని కాపాడినందుకు Valerie కి కృతజ్ఞతలు చెబుతాడు.

అతని కంటి నుంచి ధారాపాతంగా వర్షిస్తూనే అంటాడు."Oh man,my little girl died this morning....she died in that hospital... ఆసుపత్రికి ఆ పాపని చూద్దామని వెళ్ళానా...ఆ పిల్లకి తండ్రినని నన్ను విలన్ లా చేసి మాట్లాడుతున్నారు జనాలు. నా భార్య,పిల్లల్ని విడిచి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా..కాని నేనేం చేయను...She wants fun..She wants good time...She is too strong and I had to leave.I tried to see my kids more...but she won't let me..! If I give extra money,she spends it on herself and not on the kids." .. అలా అలా మా మధ్య ఎడం పెరిగి ఉండలేని పరిస్థితుల్లో వేరు కావలసివచ్చింది.ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను బ్లేం చేసి మాట్లాడుతున్నారు..నేనిచ్చే డబ్బులతో పిల్లల కొరకు ఒక గవర్నెస్ ని పెట్టుకున్న ఈ దారుణం జరిగి ఉండేది కాదు గదా.." అంటూ నిట్టూర్చుతాడు.

మెర్లిన్ కూడా బాధపడతాడు.ఇంట్లో ఓ జార్ లో ఉన్న rye  మద్యాన్ని ఓ గ్లాస్ లో ఒంపి ముందు ఇది తీసుకొని కొద్దిగా స్తిమితపడండి అంటూ ఇస్తాడు.Valerie తన కోసం దాన్ని తయారు చేసి అలా ఓ మూలకి పెడుతుంది...తను తీసుకునేది తక్కువ ...ఆమె తండ్రి వచ్చినపుడే దాన్ని ఎక్కువగా ఖాళీ చేస్తుంటాడు. సరే... ఆరోజు అలా గడిచిపోతుంది.ఆ తర్వాత ఇలాంటిదే కాదు గాని మరో ఉద్రిక్తత ఏర్పడుతుంది.సాధ్యమైనంత త్వరలో ఈ లోకేషన్ ని విడిచివెళ్ళడం మంచిదని మెర్లిన్ కి కూడా తోస్తుంది.

మరి ఎలాతెలుస్తుందో ఏమో గాని FBI వాళ్ళకి మెర్లిన్ యొక్క లంచాలు తీసుకొనే యవ్వారం తెలుస్తుంది.మొదటిగా అతని సహోద్యోగి ఫ్రాంక్ ని పట్టుకుంటారు.ఆ తరవాత హఠాత్తుగా మెర్లిన్ ఆఫీస్ లోకి వస్తారు.ID కార్డులు చూపించిన పిమ్మట ఒక FBI అధికారి అంటాడు." Do you have any idea...why we're here" అని."నో" అంటాడు మెర్లిన్.అయితే అతనికి సూచాయగా తెలుసు ఓ మిత్ర్ని వల్ల...కాని చెప్పడు.మర్యాదగానే చాలా ప్రశ్నలు వేస్తారు.అన్నిటికి నో అనే ఆన్సర్ నే  చెబుతాడు.

Grand Jury ముందు హాజరు కావడానికి సిద్దంగా ఉండమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు.ఆ తరువాత లీగల్ నోటిస్ లు రావడం ...జ్యూరీ ముందు హాజరై సమాధానాలు చెప్పడం చేస్తాడు.జ్యూరీ తననే కాకుండా తను రిక్రూట్ చేసిన కుర్రాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది.Paul Hemsi అనే ఒక కుర్రాడు మాత్రం నిజాన్ని చెప్పేస్తాడు.అసలే ఓ వైపు కొత్త ఇల్లు Long Island లో పూర్తి కావడానికి దగ్గరలో ఉంది...ఈ టైం లో ఈ తంటాలేంట్రా బాబూ అని మెర్లిన్ బాధపడతాడు.ఏం చేయాలా అని ఆలోచించి Las Vegas లో ఉన్న Cully కి ఫోన్ చేస్తాడు.

ఈ Paul Hemsi తండ్రి బాగా ధనవంతుడు.గార్మెంట్ వ్యాపారంలో బాగా సంపాదించినవాడు.ఎవరి మాట అంత త్వరగా వినడు.కాబట్టి Cully సాయం కోరతాడు.పాల్ ని తన సాక్ష్యం ని మార్చుకొనేలా చేయడానికి..! సరే తరువాత దాన్ని నాల్గవ భాగం లో చెప్పుకుందాం.
                    ---KVVS MURTHY

Wednesday, May 21, 2014

Mario Puzo నవల Fools Die గూర్చి (రెండవ భాగం)

Mario Puzo నవల Fools Die గూర్చి (రెండవ భాగం)

గతం లో ఎక్కడ ఆగాము...Jordan తుపాకితో పేల్చుకొని ఆ Xanadu హోటల్ గదిలో చనిపోతాడుగదా...!దానికి కారణాలు చెప్పాలంటే అంత బలమైనవి కావు.ఆ రాత్రంతా కేసినో లో ఆడి 400 grand సంపాదిస్తాడు.అది చాలా పెద్ద మొత్తమే.మళ్ళీ తన జీవితాన్ని చక్కగా start చేయవచ్చు.20 ఏళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కని అతని భార్య ఇంకొక వ్యక్తిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది.ఆమె ప్రస్తావన మెర్లిన్ తెచ్చినపుడు కూడా ఆమెని తిట్టడు సరికదా ...ఈ ప్రపంచం లో ఎవరికైనా ఆనందంగా ఉండే హక్కు ఉంది.నేనెందుకు అడ్డుచెప్పాలి అంటాడు.

అయితే జోర్డాన్ పాత్ర మరణించడానికి కారణం అంతర్లీనంగా అతని సన్నిహితులు డయాన్,మెర్లిన్,కల్లీ చూపే సానుభూతి అనిపిస్తుంది.తన మీద సానుభూతి చూపించడం అతనికి గిట్టదు.అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత భార్య వచ్చి రావలసిన డబ్బుని కేసినో వాళ్ళ దగ్గరనుంచి తిసుకొని వళ్ళిపోతుంది.

లాస్ వేగాస్ gambling circle లో చెడు పేరు వస్తుందనే ఉద్దేశ్యం తో జోర్డాన్ మృతిని పెద్దగా పైకి పొక్కకుండా యజమాని Gronevelt చర్యలు తీసుకుంటాడు.లోకల్ గా ఉండే Police deputy  chief సహకారం తో ఈ పని జరిగిపోతుంది.

సరే...నవల లోని మరో ప్రధాన పాత్ర Merlyn .జోర్డన్ మృతి తరవాత మెర్లిన్ తన సొంతనగరం న్యూయార్క్ కి వచ్చేస్తాడు.అతను Bronx లోని ఒక సాధారణమైన అపార్ట్మెంట్ లో ఉంటూ  ఉంటాడు.Merlyn అతని సోదరుడు Artie ...ఇద్దరు ఓ అనాధ అశ్రమం లో పెరుగుతారు.వారి తల్లిదండ్రులెవరో వారికి తెలియదు.ఒక Writers' work shop లో చేరతాడు మెర్లిన్.అక్కడ అదే వర్క్ షాప్ లో చేరుతుంది Valerie అనే అమ్మాయి.మొత్తానికి వీళ్ళ అభిరుచులు కలిసి ప్రేమించుకుంటారు.పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటారు.ఆ పిల్ల మేన మామలు ...ఆస్తిపాస్తులు లేని అనాధని పెళ్ళి చేసుకోవడం ఎందుకు అని వ్యతిరేకిస్తారు.అయినా లక్ష్య పెట్టకుండ హాయిగా పెళ్ళాడి పిల్లల్ని కూడా కని ఆ విధంగా బతుకు బండి లాగిస్తుంటారు.

మెర్లిన్ కి భార్య,పిల్లల పట్ల మంచి అనురక్తి. విపరీతంగా సంపాదించి తన కుటుంబాన్ని సంతోషపెట్టాలని అతని ఆశ.ఎప్పటికైనా నవలా రచయిత గా సక్సెస్ అయి మిలియన్ ల మీద మిలియన్లు సంపాదించాలని....పాపం రాత్రుళ్ళు కూడా మేలుకొని రచన చేస్తూ ఉంటాడు.తీరా పబ్లిషర్లకి చూపితే ఒక్కరూ ముందుకు రారు సరికదా నిరాశపరుస్తారు.ఇంగ్లీష్ పాపులర్ రచయితలకి ముఖ్యంగా అమెరికన్,బ్రిటీష్ లాంటి జాతీయులకు ఉన్న advantage ఏమిటంటే ఒక్క నవల సక్సెస్ అయి ప్రపంచమంతా అమ్ముడైతే జీవితాంతం కూర్చొని హాయిగా తినగలిగే సంపద సమకూరుతుంది.Irving Wallace లాంటి వాళ్ళు సొంతగా ఓడలు,చోపర్లు కలిగిఉండేవారంటే అతిశయోక్తి ఏముంది.

సరే...మెర్లిన్ దగ్గరకొద్దాము. అలా కష్టపడుతూ 5 సంవత్సరాలు ఈ రాతల్లోనే మునిగితేలుతుంటాడు.చివరికి అతని మామ గారు Valerie  తండ్రి అన్న మాట చెబుతాడు." well..It didn't make any money.Five years.Now you concentrate on supporting your family" అని.అప్పుడు జ్ఞానోదయం కలిగి సైన్యం లో చేరతాడు. ఆ తరవాత ఆ మిలిటరీ శాఖలోనే క్లర్క్ గా చేరతాడు.ఉన్నవాళ్ళు గాని,లేని వాళ్ళు గాని యుక్తప్రాయం లో నుండి కాలేజి కంప్లీట్ చేసిన వాళ్ళంత సైన్యం లో చేరి రెండేళ్ళు శిక్షణ పొందాలనే రూల్ ఒకటి ప్రభుత్వం పెడుతుంది.అక్కడ ఫ్రాంక్ అనే మరో ఉద్యోగి మెర్లిన్ కి పరిచయం అవుతాడు.నీ జీతం తో నువ్వు ఎప్పటికి సంపాదిస్తావు...చాలామంది ధనవంతులు తమ పిల్లల్ని ఈ విధులనుంచి తప్పించాలని చూస్తుంటారు.వాళ్ళని గనక పట్టుకుంటే నీకు కావలసినంత సమకూరుతుంది అని బోధ చేస్తాడు.

తను రచయిత గా ఎలాగు ఫెయిల్ అయ్యాడు..దీనిలోనైనా సక్సెస్ గావాలని రాత్రింబవళ్ళు లూప్ హోల్స్ వెదకడానికి ఆ మాన్యువల్స్ అన్ని బాగా స్టడీ చేస్తాడు.మొత్తానికి లంచాలు తీసుకోవడం లో కొత్త పుంతలు తొక్కి బాగా డబ్బు సంపాదిస్తాడు.అయితే ఈ కాడిలాక్ కారు,మంచి ఇల్లు ..వీటికన్నిటికి ఎలా ధనం వస్తోందని అతని భార్య అడుతుంది.కాని నిజం చెప్పడు.ఏవో చెప్పి మభ్యపెడతాడు. సరే ఈ నల్ల డబ్బుని ,తెలుపు చేయాలి ఎలా అని ఆలోచిస్తుండగా అతనికి లాస్ వేగాస్ లోని Cully గుర్తుకొస్తాడు.విష్యాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగానే  that's what friends are for వచ్చేయ్ అంటాడు.

అక్కడ కల్లీ కి కూడా హోదా పెరుగుతుంది ఆ కేసినోలో. ఆ రోజు జోర్డాన్ కి ఎందుకు బాగా ధనం వెళ్ళేలా చేశావ్,అని Gronevelt ఈ కల్లీ ని తన గదిలోకి పిలిచి అడుగుతాడు.

"You have been doing good work,but you  helped that guy Jordan at the baccarat table.You went against me.You take my money and you go up against me"

కల్లీ దానికి అంటాడు." He was a friend of mine.It wasn't a big deal.And I knew he was the kind of guy that would take care of me good if was winners'"

అప్పుడు వర్ణన చాల బాగుంటుంది.ఒక నిమిషం అలానే Gronovelt తదేకంగా భావగర్బితంగా Cully వేపు చూస్తాడు."Everybody makes mistakes.It's not important unless the mistake is fatal"  అని ఇంకా అంటాడు నీకొక నూతన అవకాశం ఇస్తాను.దాన్ని  గనక నెరవేర్చితే ఈ Xanadu కి నాతరవాత నువ్వే బాస్ వి అంటాడు. సరే....అది తర్వాత దానిలో చూద్దాం...!
                          --KVVS MURTHY

   

Friday, May 16, 2014

Mario Puzo మరో నవల Fools Die గూర్చి చెప్పుకుందాం



రమారమి 473 పేజీల ఈ నవల గురించి ఏదోకొద్దిలో రాసెయ్యడం సమంజసం కాదేమో అనిపించింది.సరే..సాధ్యమైనంత వరకు ముఖ్య సన్నివేశాలని చెప్తూ బ్రీఫ్ గా మననం చేసుకుందాం.70 వ దశకంలో రాయబడినది ఇది.మొదలు పెట్టడమే పుస్తకాన్ని తను మాట్లాడుతున్నట్లుగా మొదలు పెడతాడు.ఒక మనిషి గురించి మీకిపుడు చెబుతాను..అతని కి స్త్రీలపై గల ప్రేమ గురించి చెబుతాను. అలా ఒక ఉరవడిలో...కొన్ని కఠిన వాస్తవాలను చెబుతాను..అంటూ రచయితే ముందు పేజీల్లో మాట్లాడుతాడు. I will make  you feel the painful beauty of a child,the animal horniness of the adolescent male,the yearning suicidal moodiness of the young female.

దీంట్లో ప్రేమ గురించి ఉంటుంది. అయితే ప్రేమ గురించి మాత్రమే  దీనిలో చెప్పలేదు.ఇది ఒక యుద్దానికి సంబందించినది కూడా..!Let me get to work.Let me begin and let me end. అంటూ రచయిత 1 వ భాగాన్ని ముగిస్తాడు.

రెండవ భాగం లో సీను డిఫరెంట్ గా మొదలవుతుంది.లాస్ వెగాస్ లోని కేసినో ల గురించి బాగా అద్యయనం చేసి రాసినట్లు అనిపిస్తుంది.మొత్తం జూద గృహాల మద్య జరుగుతుంది ..ఈ లాస్ వెగాస్ లోని ఓ ఖరీదైన హోటల్ కం కేసినో Xanaddu.దీన్ని Gronevelt నిర్వహిస్తుంటాడు.గాడ్ ఫాదర్ ముందు చూపువల్ల లాస్ వేగాస్ లో  జూద గృహాలు చట్టబద్దమయ్యి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తుంటాయి.దేశం లోని నలుమూలనుంచి,ఇతరదేశాలనుంచి బాగాడబ్బులున్నవాళ్ళు ఇక్కడికొచ్చి కేసినో ల్లో బ్లాక్ జాక్ లాంటి రకరకాల గేంబ్లింగ్స్ లో కాలక్షేపం చేస్తుంటారు.

ఇక్కడే మన ప్రధాన పాత్రలు కొన్ని తారసపడతాయి. వాళ్ళెవరంటే Merlyn,Jordan,Cully  ఇంకా Diane. ఈ మెర్లిన్ ఒక రచయిత.హాలివుడ్ సినిమాలకి పనిచేసి బాగాడబ్బులు ,పేరు సంపాదించాలనేది ఇతని కోరిక.జోర్డాన్ లాస్ ఏంజల్స్ నివాసి.ఇక కల్లీ Xanadu లో ఉంటూంటాడు.అలాగే Diane అనే ఈ అమ్మాయి ఆ కేసినో shill  గా పనిచెస్తుంటుంది.Provocative గా డ్రెస్ వేసుకొని ఆ ఆటగాళ్ళకి పక్కన ఉంటుంది.ఒక మాటలో చెప్పాలంటే ఒక సారి వచ్చినవాణ్ణి నాలుగుసార్లు వచ్చేలా చేయడం వీళ్ళ డ్యూటి.చిప్స్ అందివ్వటం ఇంకా కొంత జాబ్ చార్ట్ ఉంటుంది లెండి.

వీళ్ళంతా ఆ హోటల్ లో Baccarat టేబుల్ దగ్గర కలుస్తూ ఫ్రెండ్స్ అవుతారు.కేసినోల్లో ఆడేవారికి ప్రత్యేకంగా గదులు కూడా ఉంటాయి. హాయిగా ఆడినన్నాళ్ళు ఆడి వెళ్ళవచ్చు.

వీళ్ళలో జోర్డాన్ చాలా బాగా ఆడి డబ్బులు బాగానే సంపాదిస్తుంటాడు.అయితే ఇతని భార్య కాపురం చేసిన తర్వాత 20 ఏళ్ళతరవాత ఇంకొకరిని చేసుకొని వెళ్ళిపోతుంది.వీరి ముగ్గురు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నప్పుడు కూడా ఆమె గురించి కోపం వ్యక్తం చేయడు.ఇతనికి మళ్ళీ ముగ్గురు సంతానం కూడా..!

బంధాలని గౌరవించరని అనలేను గాని అసహాయంగా బంధాలమధ్య నిలబడి అర్ధించడం వారిలో ఉండదనిపించింది.నిజం చెప్పాలంటే ఎంత గొప్ప ప్రేమ అయినా ఒక ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది దానికి....గొప్ప వేదాంతి అయినా అయి ఉండాలి లేదా అల్టిమేట్ ప్రాక్టికాలిటీ అయినా ఉండాలి.రెండు ఒక చోట అవి షేక్ హేండ్ ఇచ్చుకుంటాయి.

ఆ..సరే...ఈ జోర్డన్ కేసినో లో గేంబ్లింగ్ రాత్రి పగలు ఆడి విపరీతంగా ఆడి బాగా సంపాదిస్తుంటాడు.అప్పుడు ఆ యజమాని Gronevelt కి అనుమానం వస్తుంది.వెంటనే Cully ని పిలుస్తాడు.ఏమిటి ఆ జోర్డాన్ బాగా లాభాలు తీస్తున్నాడు.అతణ్ణి ఏదో కరణం చెప్పి బయటికి పంపించే ఏర్పాటు చెయ్యి అంటాడి.ఇంతకు విష్యమేమిటంటే ఈ Cully అనేవాడు జూదగాళ్ళతో కలిసి తాను ఆడుతూనే యాజమన్యానికి Spy లా పనిచేస్తుంటాడు.అంటే బాకరెట్ టేబుళ్ళదగ్గరున్న వర్కర్స్ గాని ఇంకొకళ్ళుగాని ఏమైనా సీక్రెట్ డీలింగ్స్ చేసుకొని యాజమన్యాన్ని బురిడీ కొట్టిస్తున్నారా అని చూస్తుంటాడన్నమాట.

అయితే ఉన్నట్టుండి జోర్డన్ ఆత్మహత్య చేసుకుంటాడు. తెల్లారిన తర్వాత ఈ వార్త కల్లీ ,మెర్లిన్ కి బాధగా చెబుతాడు. 'He blew his head off.He beat the house for over four hundred grand and he blew his fucking brains out.'

ఆ తర్వాత కధ వచ్చేసారికి చూద్దాం.

Tuesday, May 13, 2014

Mario Puzo గాడ్ ఫాదర్ నవల లోని ఇంకా కొన్ని సన్నివేశాలు..!



ఇదివరకు ఓ పోస్టులో Sicilian నవల గూర్చి చెప్పుకున్నాం కదా.తరవాత దానిలో ఇంకో నవల గూర్చి చెప్పుకుందాం. అయితే ఫుజొ కొన్ని ఇటాలియన్ మూలం లోనుంచి వచ్చిన పదాలనే ఇంగ్లీష్ రచన లోను వాడతాడు.ఎందుకంటే ఈ ఆర్గనైజెడ్ నేరవ్యవస్థ  ని అమెరికాకి పరిచయం చేసింది సిసిలియన్ లే గదా..!అసలు God Father రాయాలనే ఆలోచన రావడం చాలా విన్నూత్నమైనది అప్పటికి.ఎందుకంటే ఆ కధ అంతా అమెరికా లో నే జరుగుతున్నా లీడ్ పాత్రల మూలాలన్నీ ఇటలీ పరిసరాలవే..!

1901 నాటికి డాన్ తండ్రి  Antonia Andolini ని  సిసిలీ లో   చంపివేయడం తో తన సొంత ఊరునుంచి ఓ ఓడలో పారిపోయి అమెరికా చేరతాడు.అప్పటికతను ఇంచు మించు యవ్వనదశలో ఉంటాడు.అక్కడ మురికి వాడలో ఉన్న సిసిలియన్ లు  కొందరు పరిచయం అవుతారు. వాళ్ళే CLEMENZO,SAL FESSIO వీళ్ళతో కలిసి బతుకు తెరువు కోసం చిన్న స్మగ్లింగ్ పనులు చేస్తుంటాడు.అయితే ఒక మనిషి ప్రయాణం విధి ఎలా నిర్ణయిస్తుందో చూడండి.

అక్కడ ఆ మురికి వాడలో ఓ వీధి రౌడి ఉంటాడు..ప్రతి ఒక్కరు వాడికి విధిగా తాము సంపాదించినదానిలో కొంత ఇవ్వాలిసిందే.వీళ ముగ్గురుని బెదిరించి 700 డాలర్లని డిమాండ్ చేస్తాడు.అతగాడిని నేను ఒప్పిస్తానులే అని చెప్పి డాన్ ఆ రౌడి ని కలిసి కొంత డబ్బు ఇస్తాడు.

ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అతడిని మర్డర్ చేస్తాడు.దానితో ఆ లొకాలిటీ లోని వ్యాపారస్తులు ,మిగతా జనాలు అతనికి గౌరవం ఇవ్వడం మొదలెడతారు.మనిషి పోకడ గురించి మంచి మాటలుంటాయిక్కడ.ఎవరైతే తమను భయపెట్టగలరో ప్రజలు వారినే గౌరవిస్తారు అనేది అర్ధం అవుతుందతనికి. ఇక మామూళ్ళు ఇతనికి ఇవ్వడం మొదలెడతారు.

 ఇక్కడ అతని ముందు చూపు శ్లాఘించవలసినదే.ఈ విధంగా ఎంతో కాలం సాగదు.కనుక చట్టబద్దమైన వ్యాపారాలలో ఉంటూనే ...మనం ఇతరుల వ్యాపారాలని కాపాడినందుకు,వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసినందుకు ధనాన్ని వసూలుచేయాలి.ఆ రకంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకొంటూనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని నిర్ణయించుకుని దాన్ని అమలుచేస్తాడు.ముందు ఆలివ్ ఆయిల్ బిజ్ఞెస్ లో సంపాదించిన తరవాత Gambling,Bootlegging లాంటి వ్యాపారాల వేపు దృష్టి సారిస్తాడు. అప్పటికి అవి చట్టబద్దమైన వ్యాపారాలు కావు...కాని కాలక్రమం లో అవుతాయని ,ఆ విధంగా ప్రభుత్వాన్ని మలచవచ్చని చెబుతాడు.పెళ్ళి చేస్కుని పిల్లల్ని కనడం,ఇతర పోటీదారులతో పోరాటాలు ,క్రమేపి వ్యాపార సామ్రాజ్యాన్ని తన స్నేహితులతో బంధువులతో విస్తరించడం ఇవన్నీ రకరకాల కధనాలతో ఇతర నవల ల్లో కూడా సాగుతాయి.

తన పేరుని డాన్ విటో కార్లియాన్ గా మార్చుకుంటాడు.నిజానికి అతని సర్ నేం Andolini కాని తాను జన్మించిన కార్లియాన్ గ్రామం తనకి ఎప్పటికి గుర్తుండాలని తన ఇంటి పేరుని అలా మార్చుకుంటాడు.

అప్పట్లోనే డాన్ పాత్ర అంటుంది మిగతా వాళ్ళతో..ఇలా విడిపోయి బిజినెస్ చేసినందువల్ల ఏం లాభం ఉంటుంది..మొనోపలి తీసుకురావాలి ఏ రంగం లోనైన అని.దాన్ని అమెరికన్ ధనవంతులు కాలక్రమం లో ఆచరణలో పెట్టారు కూడా..!

గాడ్ ఫాదర్ బాగా ధనవంతుడైన తరువాత అనాధ పిల్లల్ని చేరదీసి చదివించడం..వారికి న్యాయశాఖ లో,పోలీస్ శాఖలో ..ఇలా అనేక శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాడు.దీని వెనుక కూడా దీర్ఘ ప్రణాళిక ఉంటుంది అతనికి....ఆ పిల్లలు జీవితాంతం అతనికి..అతని పిల్లలకి ...వ్యాపారాలకి కృతజ్ఞతతో ఉండాలనేది అతని ప్రణాళిక.ఆ విధంగా చారిటీ ని కూడా అతను దూరదృష్టితో చేస్తుంటాడు.

నవల మొదట్లో Mario Puzo ఒక మాటని ఉటంకిస్తాడు."Behind every great fortune, there is a crime అని..!

Qualified Man అనే పదం నవల లో  వస్తుంది ...దానికి అర్ధం ఏమంటే ఒక మనిషిని చంపడం లో ప్రవీణుడు అని.ఇది సిసిలియన్ ప్రయోగమే.Consigliere అనే పదం కూడా ప్రత్యేకమైనది.బాస్ కి కుడి భుజం లాంటి వాడు అని.జడ్జ్ లతోను,మినిస్టర్ల తోను,అలాగే ఇతర ముఖ్య విషయాల్లో డాన్ తరపున సంప్రదింపులు చేస్తుంటాడు.ఒక ప్రణాళిక రూపొందించి డాన్ చెప్పడం తో ఇతను తగు వ్యవహారాలతో రంగం లోకి దిగిపోతాడు.Tom Hagen డాన్ కి ఈ విధంగా ఉంటాడు దీనిలో.

Lupera అంటే ఆయుధం.Omerta అంటే రహస్యంగా వ్యవహరించే ఓ విధానం.ఇలా ఇవన్నీ సిసిలీ మూలాల లోవే.ఇవన్నీ తరచూ నవల్లో తగులుతుంటాయి.యవ్వనవంతునిగా ఒంటరిగా అమెరికా లో దిగి అక్కడే వివాహమాడి ,పిల్లల్ని ఇంకా మనవళ్ళని పొంది...వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రకరకాల దశలుగా సాగే డాన్ జీవితాన్ని Eloborate గా వివరిస్తాయి. .సరే..అదెప్పుడైనా చెప్పుకుందాం...!      ..----KVVS MURTHY

Sunday, May 11, 2014

Mario Puzo మరొక నవల Sicilian పై నా అభిప్రాయం



God Father తో ఒక ప్రత్యేకతని సంతరించుకున్న రచయిత Mario Puzo రాసిన మరి ఒక నవల Sicilian గూర్చి ఇప్పుడు ప్రస్తావిస్తాను.1950 దశకం నుంచి ఈ కధ మొదలవుతుంది.రెండవ ప్రపంచ యుద్ధ చ్చాయలు అక్కడడక్కడ తొంగిచూస్తుంటాయి.అయితే దాని గురించినదే కాదిది.సిసిలీ లో ని మాఫియా కుటుంబాల ప్రాభవం ముస్సోలిని అణచివేతవల్ల కొంత తగ్గినట్లుగా చెబుతాడు రచయిత.అయితే అమెరికన్ సేనలు ఫాసిష్టులను పారద్రోలి వారి అనుయాయులను అక్కడ ఉంచినట్లుగా అర్ధమఔతుంది.రోం నుంచి వాళ్ళు నిరంకుశంగా పాలన సాగిస్తుంటారు.Palermo అనే ఊరిలో ఇంకా Montelepro అనే ఊరిలో ఈ కధ అంతా నడుస్తుంది.

మీరు గనక గాడ్ ఫాదర్ చదవక పోతే మొదట వచ్చే Michael Corleone పాత్ర గూర్చి ఏమి అర్ధం కాదు.అగమ్య గోచరంగా ఉంటుంది,అంటే దానిలో నుంచి దీని లోకి ముడి వేస్తాడు రచయిత,అయితే దానికీ అర్ధం ఉంది. ఓ పోలీస్ ఆఫిసర్ ని పకడ్బంది ప్లాన్ తో  Michael ఓ హోటల్ లో మట్టుపెడతాడు.ఆ సన్నివేశం ఊహించనలవి కాదు మొదట్లో.

ఓ హోటల్ లో సంధి కోసం కోసం  హాజరవుతారు.వచ్చినపుడు Michael ని బాగా చెక్ చేస్తారు.ఎక్కడ ఎలాంటి ఆయుధం ఉండదు.విచిత్రంగా ఆ సన్నివేశం చివరిలో పోలిస్ అధికారిని టపా మని కాల్చి పారేస్తాడు.అసలు విషయం ఏమిటంటే ఆ హోటల్ లోకి రాకముందే అక్కడున్న సర్వర్ కి డబ్బులిచ్చి ఓ పిష్టల్ ని బాత్ రూం లో పెట్టిస్తాడు...తను పాస్ కి వెళ్ళినప్పుడు అది లోపల పెట్టుకొని టేబుల్ ముందు కూర్చుని మాటాడుతున్నప్పుడు ఠపీ మని కాల్చి పారేస్తాడు.50 వ దశకం లో నే వాళ్ళ మెదళ్ళు అలా ఉన్నాయి.

సరే... ఇక్కడుంటే ప్రమాదమని  తన స్వస్థలమైన సిసిలీ లోని మరో డాన్ డాన్ క్రాస్ దగ్గరకి పంపిస్తాడు. రెండు సంవత్సరాలు అక్కడున్నతరవాత అక్కడినుంచి ఆఫ్రికా కి సముద్రం మీదుగా వచ్చి అక్కడినుంచి విమానం లో న్యూయార్క్ రావాలనేది గాడ్ ఫాదర్ ప్లాన్ .

ఇలా జరుగుతుండగా Salvatore Guiliano  అనే విప్లవకారుణ్ణి మైఖేల్ తను వచ్చేటప్పుడు తీసుకురావాలనేది అతని తండ్రి షరతు.దానికీ ఓ కారణం ఉంది.నిజం చెప్పాలంటే ఈ Sicilian నవల లో హీరో ఈ Guiliano నే.సిసిలో ప్రజలని రోం పాలకుల సహాయం తో వేధిస్తున్న Mafia families కి సిమ్హ స్వప్న స్వప్న మౌతాడు.సుకుమారమైన,అందమైన రొమాంటిక్ జీవితాన్ని గడిపే అతని జీవితం కొన్ని సన్నివేశాల ఫలితంగా విప్లవకరం గా మారుతుంది.భయంకరమైన మోసపూరితమైన రాజకీయ అండదండలున్న వ్యక్తులను  తన ధైర్య స్థైర్యాలతో,ప్రజల సహకారం తో ఎత్తుగడలతో ఎలా తన ఊరుచుట్టూ యున్న కొండలను  వేదికగా చేసుకొని పోరాడాడో చదివితే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది.

మనిషి లోని నమ్మించి మోసం చేసే తత్వం ఎంత లోతుగా ఉంటుందో ప్రతి పేజీలోను అర్ధం అవుతుంది.గులియానో తల్లి మారియా పాత్ర సగటి భారతీయ స్త్రీ లానే ఉంటుంది.Adonis పాత్ర దీనిలో గుర్తుండిపోయే పాత్ర. అతను యూనివర్శిటి ప్రొఫెసర్ గా  పనిచేస్తూ తన ఒకప్పటి స్టూడెంట్ గులియానో కి సహాయపడుతుంటాడు.కొండల్లోని గులియానో కి అనేక చరిత్ర పుస్తకాలని అందించటం.... వారి చదివే గుణానికి ప్రతీక.

చివరివరకు ఏమౌతుందోనని చాలా టెన్షన్ గా ఉంటుంది.ఎవరు మంచి వారో..ఎవరు చెడ్డవారో..అసలు చాలా వరకు అర్ధం కాదు.మంచిగా ఉన్నవాళ్ళే శతృవుకి సహకరించడం...హీరోకి అత్యంత దగ్గరగా ఉండి అనేక దాడుల్లో అతనికి సహకరించిన అతని బంధువు(Aspanu) ఒక చిన్న కారణం చేత గులియానో చావుకి కారణమవుతాడు.

అది ఊహించలేము.అంటే మానవ పరమైన Loyalties ఎంత బలహీనంగా ఉంటాయో అవగతమౌతుంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు.బయటకి చక్కగా మాటాడుతూనే ఒకరిని ఒకరు manipulate చేసుకోవడం చెప్పదగినది.

ఎన్నైనా చెప్పండి......తెలుగులో ఎన్ని అనువాదాలు చదివినా యూరోపియన్ల యొక్క Treacherous నేచర్ అర్ధం కాదు.వారి పలుకుబడులు,ఉద్వేగాలు,మానవ సంబందాలు ఇది చదివితే బాగా అర్ధం అవుతుంది అనిపించింది.ఇంగ్లీష్ రచయితల్లో నాకు ,ముఖ్యంగా ఫిక్షన్ రైటర్స్ లో, నచ్చిందేమంటే కొన్ని విషయాలు ఎవరేమనుకుంటారో అని వదిలి వేయరు.






Thursday, May 8, 2014

స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం)

స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం)

గతం లో ఎక్కడాపాను...ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు,,ఓ వైపు తిట్టుకుంటూనే అనికదూ.!భారతదేశం లో మన ఒక్క రాష్ట్రమనే కాదు.....ఇంచుమించు  అన్ని ప్రాంతాల్లో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారని అనిపిస్తుంది ఆంగ్లం విషయంలో...!నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది.దాన్ని తీసివేయడం అంత సులువు కాదు.ఇంగ్లీష్ వచ్చినవారికి అన్ని విషయాల్లో ఎక్క్వ జ్ఞానం ఉంటుదని,వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారని ఇలా కొన్ని ఆధునిక మూఢభావాలు లోలోపల పేరుకుపోయాయి.అయితే దానికి కారణాలు లేకపోలేదు.

బ్రిటిష్ వారు మనల్ని పాలించడం వల్ల అది పాలకుల భాషగా మనదేశంలో గౌరవం పొందింది.కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగినపుడు కూడా గమనించాను.ఎంతవాళ్ళకి "హిందీ" లో రాజ్య వ్యవహారాలు నడిచినా ..ఇంగ్లీష్ విషయం లో వాళ్ళకి తెలియకుండానే ఒక గౌరవాన్ని ఇస్తారు.దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.

ఓసారి ఉత్తరాఖండ్ లో ఋషికేష్ పక్కన ఒక ఊరికెళ్ళాను.చాలామంది టూరిస్టులు భోజనాలు కానిస్తున్నారు.నా కప్పట్లో వచ్చిన స్పోకెన్ హింది స్వల్పం. సరే...పనులు నడుస్తాయి అది వేరే విషయం.నాకొచ్చిన బ్రోకెన్ హిందీ లోనే ఆర్డర్ ఇచ్చాను.ఎందుకనో దక్షిణాది వాళ్ళంటే ఉత్తరాది వాళ్ళకి కొంత చిన్న చూపే.వాళ్ళ రంగుని చూసో,వేషధారణ చూసో,మనవాళ్ళు కూడ ఇక్కడ దబాయించి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడరు.తెలివిలో గాని,బురిడీ కొట్టించడం లో గాని మన ముందు వాళ్ళు ఎందుకూ పనికిరారు.కొద్ది అనుభవం లో అది తెలిసిపోతుంది.ఇక తమిళ,మళయాళీల గారడీల ముందు చెప్పాలంటే దిగదుడుపే.అయితే ఒకటి వాళ్ళ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఉద్రేకస్వభావులు.

ఆ..వచ్చేద్దాం వెనక్కి...హోటల్ లోకి వెళ్ళి  సౌత్ ఇండియన్ తాలీ కి ఆర్డర్ ఇచ్చానుగదా.ఎంతకీ రాదు...ఓసారి ఓనర్ కి కూడా చెప్పిచూశా..!లాభం లేదు.అక్కడ మన తెలుగు నడవదు.మన హిందీ అంతంత మాత్రం.ఏదో బ్రోకెన్ హిందీ లో ఓ పరాయి రాష్ట్రం వ్యక్తి చెప్పాడుకదా అని అతని భావమేమో.నాకు కాలింది.ఇక లాభం లేదనుకొని అనుకున్నది అనుకున్నట్లుగా నా భావావేశాన్ని మొత్తం పది నిమిషాలు పాటు ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచికొట్టాను.మీరు నమ్మరు...ఒక్కసారిగా అతను నిర్ఘాంతపోయినంత స్థాయిలో ఇదైపోయి నా దగ్గరకి వచ్చి మరీ సర్వర్ చేత వడ్డింపజేసి ..మళ్ళి నేను వస్తున్నప్పుడు కూడా "టాటా" చెప్పి మరీ వీడ్కోలు చెప్పాడు. భారతదేశమా... నువ్వు ఇంతే మారవు..ఎక్కడైనా ఒక్కటే " అనిపించింది.

ఈ వెయిటేజీ ఇంగ్లీష్ కి అడుగడుగునా మనకి దేశంలో కనిపిస్తుంది.అలా జీర్ణించుకుపోయిందంతే..!అందుకే ఇంగ్లీష్ గడ గడా మాట్లాడాలని చాలామందికి తాపత్రయం.ఓ రకంగా మంచి వ్యసనమే ఇది.వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఆ రేంజ్ లో passion ఉన్నవారు ఆ భాషని నోటితో ఇట్టే అందిపుచ్చుకుంటారు.

-- తప్పో,ఒప్పో మాట్లాడుతూనే ఉండాలి.దాంతో పాటుగా చదవటం,వినడం శ్రద్దగా చేస్తుండాలి.ఒక నెల ప్రయత్నిస్తే వస్తుందా ..రెండు నెలలు ప్రయత్నిస్తే వస్తుందా అనుకొని caliculation వేసుకునేవాళ్ళకి ఎప్పటికి రాదు.దాని పై ఒక ప్రేమ తో సాధన చేస్తే దానిలోని తీపిదనం తెలుస్తుంది తప్ప లెక్కల మాదిరిగా చేస్తే పని కాదు.

--ఒక్కొక్క word ని కాకుండా word-cluster ల లో మాట్లాడటాడానికి నోటికి శిక్షణ నివ్వాలి అని చెప్పుకున్నాం గదా గతంలో..! ఉదా: నిన్న temple ని visit చేశారా..? అని కాకుండా Have you visited temple yesterday  అని ఒకే stroke లో వచ్చేలా ప్రాక్టీస్ చేయండి.ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి మీరు ఎన్నైనా సేకరించుకొని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుండాలి.ఇలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి మాకు అని మీరు అడగవచ్చు.ఆ..అక్కడికే వస్తున్నా..ఇది అర్ధం అర్ధం చేస్కుంటే మీకు చాలా అవగతమైనట్లే..!

మీరు మొదట్లో క్లిష్టమైన classics ని చదవటానికి ప్రయత్నించవద్దు.అంటే షేక్స్ పియర్ లాంటి ఉద్ధండుల  రచనల్ని చదవవద్దు.

-- సంభాషణలు ఉండే ఇంగ్లీష్ ఫిక్షన్ ని చదివితే చాలా మంచిది.News paper ని చదవవద్దని చెప్పను గాని దాని లక్ష్యం వేరు.మీరు composition రాయడానికో ఇంకా ఏదైనా written work చేయడానికో అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇంగ్లీష్ దైనందిన చర్య లో భాగంగా ఎలా మాట్లాడాలో నేర్పదు.ఎంత natural గా effort less గా మాట్లాడితే అంత fluency పెరుగుతున్నట్లు లెక్క.

--నా మటుకు నన్ను చెప్పమంటే Sidney sheldon రాసిన ఫిక్షన్ చదవమని చెప్తాను.దాని వల్ల కధా విషయం తెలియడం ఓ ఎత్తైతే మరో వైపు ఆ నవల ల్లోని పాత్రలు మాట్లాడే సంభాషణలు ..వర్ణనలు మీ మెదడు లో అప్రయత్నంగా రిజిస్టెర్ అవుతాయి.ఉదాహరణకి Sidney sheldon రాసిన MORNING,NOON& NIGHT  అనే నవల్లో 293 వ పేజిలో గల కొన్ని సంభాషణలు మీ కోసం ఇక్కడ ఇస్తాను.ఓ స్త్రీ,ఓ పురుషుని మధ్య జరిగే సన్నివేశమిది.

"Wait a minute...!We really have to talk.."

"My bus is leaving"

" There will be anoher bus "

" My suitcase is on it"

 Steve turned to a porter."This woman is about to have a baby.Get her suitcase out of there ..!quick..!"

Julia puzzled.

"Do you know what you're doing"

"No" Steve said.

ఎంత సింపుల్ గా,హాయిగా,భావయుక్తంగా,ఉన్నయో చూడండి ఈ సంభాషణలు.దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది..మీకు already ఇంగ్లీష్ వచ్చు.కాని fluency కోసమే గదా మీప్రయత్నం.బాగా గమనించండి...ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు మాట్లాడే భాషని మీరు బాగా గమనించండి...చాలా కృతకంగా...dry గా ఉంటుంది వారి శైలి.అది రాయడానికి బావుంటుంది..మాట్లాడం లో ఏదో ఆత్మ మిస్ అయినట్లుగ ఉంటుంది.

నేను నా అనుభవం లోనుంచి చెప్పే ఏకైక తిరుగులేని పట్టు ఏమిటంటే ఇంగ్లీష్ ఫిక్షన్ మాత్రమే దీనికి సహకరిస్తుంది.మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు...ప్రయిత్నించండి..మీకు నేను చెప్పని చాలా ఇతర విషయాలు కూడా పట్టుబడతాయి.ఇప్పుడు ఎందుకు చెప్పానో అప్పుడుగాని అర్ధం అవదు.

ఎవరైనా మీతో జోక్ చేస్తేనో ..ఇంకోటి చేస్తేనో ఇప్పుడైతే మీరేమంటారు. Don't be jovial అనో ఇంకోకటో ఒక stock లో ఉన్నవి మాత్రమే అంటున్నారా..Hey..stop fooling around here  అనో stop kidding  అనో ఇట్లా దైనందిన చర్యల్లో వాడుకలో ఉండే పదగుచ్చాలు అలవోకగా వచ్చేస్తాయి.ఏదైనా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది..?మీరు ఇప్పటిదాకా ఎన్నో విధాలా ప్రయిత్నించిఉండవచ్చు... చివరిగా నా ఈ విధానాన్ని చూసి,పనికిరాకపోతే చెప్పండి.

               ---K V V S Murthy  








Wednesday, April 30, 2014

చాలామంది ఇంగ్లీష్ లో గడగడా మాట్లాడాలని అనుకునేవాళ్ళు విచిత్రంగా ఆ భాషలో మంచి జ్ఞానం ఉన్నవాళ్ళేనని నా సర్వే లో అనిపించింది

స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించిన కొన్ని భావనలు

వేసవి కాలం వచ్చిందంటే కొన్ని కరపత్రాలు చూస్తుంటాం...స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబందించినవి.ఓ క్రాష్ కోర్స్ లాంటిది ఆఫర్ చేస్తున్నట్లుగా చూస్తుంటాం.వీటి వల్ల ఉపయోగం ఉంటుందా..మనసుండి నేర్చుకుంటే ఎంతో కొంత ఉంటుంది.లేకుండా ఎలా పోతుంది. అయితే fluent గా మాట్లాడలేకపోతున్నామని కొందరంటుంటారు.అదీ నిజమే.నూటికి నూరు పాళ్ళు నిజం.మరయితే ఈ fluency ని ఎలా సాధించాలి.ఇక్కడ కొద్దిగా మనం లోతుగా వెళదాం.

చాలామంది ఇంగ్లీష్ లో గడగడా మాట్లాడాలని అనుకునేవాళ్ళు విచిత్రంగా ఆ భాషలో మంచి జ్ఞానం ఉన్నవాళ్ళేనని నా సర్వే లో అనిపించింది.వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ బాగానే వచ్చు.చాలా పదాలకి అర్ధాలు కూడా తెలుసు.నా దృష్టిలో రమారమి 2000-2500 ఇంగ్లీష్ పదాలు వస్తే  They can speak it reasonably well. వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ పదసంపద(vocabulory) కూడా ఉంటుంది.మరయితే ఏమిటి పట్టి ఆపేది.అక్కడే ఉంది కీలకం.

ఆ గ్రామరే వీరిపాలిట గుదిబండై కూర్చుటుంది.తాము మాట్లాడే లేదా ఇతరులు మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు గ్రామర్ పరంగా కరెక్టేనా..ఏమైనా లొసుగులున్నాయా..వెంటనే తమ ప్రమేయం లేకుండా వారి మనసు దానిపై concentrate చేస్తుంది.భాషలో నుంచి తరవాత గ్రామర్ పుట్టింది తప్ప గ్రామర్ లోనుంచి భాష పుట్టలేదు.గ్రామర్ నియమాల్లో సైతం మార్పులొస్తున్నాయి.మీరు రోజు ఇంగ్లీష్ పేపర్లు,వార్తలు గమనిస్తుంటే ఇది మీకే తెలుస్తుంది.అలాగని గ్రామర్ అనవసరమని నేనడం లేదు.ముందు మాట్లాడడం మొదలెట్టండి.చచ్చినట్టు గ్రామర్ అదే వస్తుంది.నిజం చెప్పాలంటే ఇంకా బాగా అర్ధమవుతూ గ్రామర్ సునాయాసంగా నేర్చుకోగలరు.

హైస్కూల్ లోనూ,కాలేజీ లోనూ కావలసినన్ని గ్రామర్ పాయింట్లు నేర్చుకున్నారు.పాఠాలు చదివారు. ఒప్పజెప్పారు ఇంకా మంచి మార్కులు కూడా తెచ్చుకుని ఉంటారు.మరి ఇవన్నీ కలిసి ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడాలి అనేసరికల్లా పనికి రాకుండా పోతాయి. word ని word ని కూడబలుక్కుని మాట్లాడాలని ప్రయత్నించడం కంటే phrases ని గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు మాట్లాడటానికి ప్రయత్నించండి.చిన్నవైనా..పెద్దవైనా ఫరవాలేదు.దానివల్ల మన మూతి లేదా నోరు అందాం ..దానికి అనుగుణంగా తిరగడానికి అలవాటుపడుతుంది.అది చాలా ముఖ్యం.

ఇంగ్లీష్ ఏ తప్పులు లేకుండా అద్భుతంగా రాయగలిగిన వాళ్ళు చాలామంది మాట్లాడడం దగ్గరకి వచ్చేసరికి నోరు పెగలక ఇబ్బంది పడుతూ ఉంటారు.లోపల సరుకు ఉంటుంది.కాని బయటికి రావడం లో ఇబ్బంది మామూలుగా ఉండదు. దానితో చిరాకు లేచి ఇంగ్లీష్ శతృవులుగా మారినవాళ్ళు నాకు తెలుసు.

మాట్లాడేదానికి,రాసేదానికి ఎప్పుడూ భేదం ఉంటుంది.అది గమనించాలి.మాతృభాషలో కూడా అలానే ఉంటుంది.కాకపోతే మనం పట్టించుకోం."ఏ దారా" (Hey,come here)అంటాం మాట్లాడేటప్పుడు.మళ్ళీ రాసేటప్పుడు "ఏయ్ రారా" అనే రాస్తాం.అదే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం నూటికి నూరు పాళ్ళు వంకలు పెడతాం ఏ మాత్రం తప్పు దొర్లినా..! ఈ సూటి పోటి బనాయింపులు భరించలేక చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలనే కోరికనే చంపేసుకుంటారు. ఇలాంటి వారిలో ధనం తోనూ,చేసే ఉద్యోగం యొక్క హోదా తోనూ సంబంధం లేకుండా అన్ని రకాల ప్రజలున్నారు.

ఇంగ్లీష్ మీడియం లో చదివిన పిల్లలని చూడండి.. బాగా మాట్లాడతారు...కాని మీకు వచ్చిన గ్రామర్ లో వాళ్ళకి 20 శాతం కూడా రాదు.చాలా మంది పెద్దవాళ్ళలో బాగా మాటాడేవారిలో కూడా   చాలామందికి చాలా గ్రామర్ విషయాలు తెలియవు.నా మాట అసత్యమైతే మీరు పరిశీలించి చూడండి.

ఇంగ్లీష్ గ్రామర్ పూర్తిగా నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ లో తప్పులు లేకుండా రాయగలరేమో.కాని ఆ బలం తో కాన్వెంట్ పిల్లవానితో కూడా మాట్లాడలేరు.నోరు పెగలక ఆ ఇబ్బంది పడినవాడికే తెలుస్తుంది ఆ చిత్రహింస.కనక మాట్లాడేటప్పుడు గ్రామర్ ని మర్చిపోయి...భావావేశం లోనే మాట్లాడండి.తప్పులుంటే ఉండనివ్వండి.నిన్ను మించిన తోపులు ఎవరూ లేరిక్కడ అని మహేష్ బాబు ఎక్కడో అన్నట్టు ఆ లైన్ లో వెళ్ళండి ..!

Never mind,my good heavens,my pleasure,where have you been all these years,mind your words,please be seated,How are you buddy,Hell with your bloody argument,My sweet heart ఇట్లా word-cluster ని లేదా phrases లో మీ నోరు మాట్లాడటానికి శిక్షణ నివ్వాలి.దానివల్ల ఒక బెనిఫిట్ ఏమిటంటే tight lippedness అనే గుణాన్ని మీరు కోల్పోవడం గమనిస్తారు.ఈ పదగుచ్చాలని ఒక ఉదాహరణ గా మాత్రమే ఇచ్చాను.మీరు గమనించిన ఇతర వాటిల్ని కూడా రాసుకొని సాధన చేయండి. ఆ తరవాత ఆటోమేటిగ్గా వద్దంటే నోటికి అలవాటు అయిపోతాయి.మీకు జోక్ గా అనిపించవచ్చు గాని ఇంగ్లీష్ చందమామ లాంటి పుస్తకాలు,కధల పుస్తకాలు గట్టిగా అంటే బయటికి చదవటానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సాధ్యమైనంత దాకా ఒకే పదం ని ఉపయోగించకుండా phrases ని ఉపయోగించండి.వినడం వల్ల,చదవడం వల్ల భాష వచ్చేది నిజమే..కాని పదిమందిలో అలవోకగా మాట్లాడాలంటే ముందు నోటికి ఇంగ్లీష్ ని అలవాటు చేయాలి.కేవలం పదాల ద్వారా  కాదు అని గుర్తుపెట్టుకోవాలి.

అన్నట్టు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎందుకని ఆసక్తి చూపిస్తారందరు..మళ్ళీ ఓ వైపు తిట్టుకుంటూనే....?!ఈ నా వ్యాసం ఎంతవరకు ఆసక్తిగా ఉందో నాకు తెలీదు..ఒక ఫ్లో లో రాసుకుంటూ పోయాను,బాగుందని ఎవరికైనా అనిపిస్తే మరిన్ని నా అనుభవాల లోనివి కొన్ని రాయడానికి ప్రయత్నిస్తాను.