Showing posts with label గోదావరి. Show all posts
Showing posts with label గోదావరి. Show all posts

Tuesday, July 23, 2013

ఇప్పుడేముంది గాని 1986 లో వచ్చిన గోదారి లోనైతే గేదెలు,గొర్రెలు,ఇళ్ళు,మంచాలు,శవాలు ఇలా సమస్త రకాలు కొట్టుకొచ్చాయి.

ఈ ఏడాది గోదావరి వుగ్ర స్వరూపం దాల్చింది.భద్రాచలం లోని చాలా ఏరియాలు లోతట్టుగా వున్నవి మునిగి బాగానే దెబ్బ తిన్నాయి.గుడి ముందు వున్న ఇళ్ళు,షాపులు వరద తాకిడి కి గురయ్యాయి.ఇంకా కొన్ని కాలనీలు వరదలో మునిగాయి.చుట్టు ప్రక్కల మండలాల సంగతి చెప్పనే అవసరం లేదు.కూనవరం,చింతూరు,వి,ఆర్.పురం,దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం,వాజేడు మండలాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి.పై నుంచి కూడా బాగా వర్షాలు కదా.ఆ నీరంతా ఏమవుతుంది మరి.

ఈ కింద రెండు ఫోటోలు ఇచ్చాను. గోదారి ఒడ్డునున్నశ్మశాన వాటిక లోకి  కూడా వరద వచ్చి సమాధులు ..ఆ పైన తులసి కోటలు కూడా మునిగి వున్నయి.అయితే ఈ రోజు నుంచి కొద్దిగా వరద తగ్గు ముఖం పట్టింది.తగ్గడం అంటూ ప్రారంభిస్తే తీయడం ఎంత సేపు..!

పనిలో పనిగా కొంత మంది గోదారి వరదలో కొట్టుకొచ్చే దుంగలని..పుల్లల్ని తీసి వొడ్డున పెట్టుకొంటారు.వంట చెరుకుగా పనికొస్తుంది.పెద్దవైతే దేనికైనా పనికొస్తాయి..!ఇప్పుడేముంది గాని 1986 లో వచ్చిన గోదారి లోనైతే గేదెలు,గొర్రెలు,ఇళ్ళు,మంచాలు,శవాలు ఇలా సమస్త రకాలు కొట్టుకొచ్చాయి.  Click here




Saturday, July 20, 2013

ఇది దక్షిణ భారత దేశంలోనే ఒక రికార్డ్ అట..!

ఈ రోజు ఉగ్ర గోదావరి ఫోటోలు కొన్ని తీసి ఇక్కడ పెట్టాను.మామూలు సమయాల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో వరదలు పరిధులు దాటినప్పుడు గోదావరి అంత భయానకంగా వుంటుంది.ఇక్కడ నేను పెట్టినవి ఈ మధ్యాహ్నం 3 గంటల సమయం లో తీసినవి.స్నానాల రేవు దగ్గర తీసినవి.రమారమి 54 అడుగుల దగ్గర నిలిచివున్నది.భద్రాచలం డివిజన్ లోని చాలా ఇతర మండలాలు ఈ వరదల వల్ల దెబ్బతిన్నాయి.రహదారులు కూడా మూసుకు పోయాయి.లోతట్టు ప్రాంతాలు ఈ సారి బాగానే దెబ్బతిన్నాయి.నాకు తెలిసీ ఈ పదిహేనేళ్ళలో ఇంత పెద్ద స్థాయిలో వరదలు రాలేదు.

డివిజన్ లోని పేరూరు దగ్గర నిన్న ఒక్కరోజే 58 సె.మీ. వాన కురిసిందని చెప్పారు టి.వి.ల్లో..! ఇది దక్షిణ భారత దేశంలోనే ఒక రికార్డ్ అట..! 

వరద దృశ్యాలు చూడడానికి కరకట్ట మీదకి చాలా మంది జనాలు వస్తున్నారు.దూరం నుంచి యాత్రికులు అనుకుంటాం గాని ...కాదు..వరదని వీక్షించడానికి వచ్చినవాళ్ళే..!  





Saturday, July 6, 2013

ఆ మధ్య స్నానాల రేవు వేపు వెళ్ళినప్పుడు ఈ ఫోటోని తీశాను

ఆ మధ్య స్నానాల రేవు వేపు వెళ్ళినప్పుడు ఈ ఫోటోని తీశాను.భద్రాద్రి వచ్చిన భక్తులు ఈ గోదావరి రేవు లోనే స్నానాలు చేసి దర్శనం చేసుకుంటారు.ఎండాకాలం లో ఇక్కడ నీళ్ళు అంత ఎక్కువగా వున్నట్టు కనిపించవు.కాని అక్కడక్కడ లోతులు వుంటాయి.దూర ప్రాంతాలనుంచి వచ్చినవారు ఇక్కడున్న బోర్డుల్ని కూడా ఖాతరు చేయకుండా లోపలికి వెళ్ళి మునిగి చనిపోయిన వుదంతాలు కూడా వున్నాయి.అంతదాకా ఎందుకు ప్రతి ఏడు ఒకరో ఇద్దరో దుర్మరణాలపాలవుతూనేవుంటారు.



ముఖ్యంగా నిర్లక్ష్యంగా ఆటలు ఆడుతూ నీళ్ళలో జలకాలాదుతూ క్రీడించేవారే సాధారణంగా బలవుతుంటారు.కనుక గోదావరిలో స్నానాలు చేసేటప్పుడు ఒడ్డుకి దగ్గరలో వుండి స్నానాలు చేయడమే మంచిది.వర్షాకాలంలో గోదావరి ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది.

ఇంకొకటి చాలామంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేసే ప్రదేశం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.చాలా క్షేత్రాల్లో లానే నది ఒడ్డున మల విసర్జన లాంటి కార్యక్రమాల్ని భక్తులు స్వచ్చందంగా చేయకుండా నియంత్రించుకోవాలి.సులబ్ కాంప్లెక్స్ లు దీనికి దగ్గరలోనే వున్నాయి కాబట్టి వాటిని వుపయోగించుకోవాలి.