Showing posts with label Megalithic Dolmens. Show all posts
Showing posts with label Megalithic Dolmens. Show all posts

Tuesday, January 17, 2017

In search of signs of Prehistoric people

We have got ready a couple days back, to venture into the forests of Gannavaram colony of Charla Mandalam where the place of some ancient rocks laid down in memory of their ancestors and it was believed to be prehistoric age.Local friends ,extended their support to reach the exact location or it could have been a tremulous nightmare for sure as they were wrapped under the heaps of dried leaves and other stones.

During the walk, we have come across many scenic nature beauties and captured them for our blog readers.A Video should do justice than having clicked the rocks ,That's why a detailed video also provided at the bottom,hope you like it.

As usual Naren garu guided in this rolling into deep forests and the rumble makes by fallen leaves beneath our feet ,perhaps sending out messages for the animals and so that no trace of them .Dead calm all over except the birds fluttering sound.

We have analyzed that these were not dolmens like the ones on the hillocks of kamuni cheruvu,a few miles away from here,yet these could have been erected in memories of their departed elders,and these steep rocks both sides of the narrow path.Some rocks were scattered and some are seen as unearthed.

For complete view,please see the video given in the bottom.

(A Glimpse of the location)


(Selfie during the walk)

( A Pond nearby hills)


(Toddies in the fields)


Friday, January 22, 2016

వేల ఏళ్ళ కిందట అక్కడి జీవిత విధానం ఏమిటో...?!



అది ఒక నిర్జన అరణ్య ప్రదేశం.ఇంచుమించు మూడు వందల మీటర్లు పైగా ఎత్తున్న గుట్టలు.దట్టంగా అల్లుకున్న లతా గుల్మములు,రకరకాల మొక్కలు ,వృక్షాలు ఒకదానినొకటి పెనవేసుకొని ఆ గుట్టల్ని కాపాడుతున్నవా అన్నట్లు గా ఉన్నది ఆ దృశ్యం.మూడు వైపులా గుట్టల్ని ఆలంబనగా చేసుకొని బ్రహ్మాండమైన చెరువు ..వాని లో చిన్న చిన్న కలువలు..ఒకసారి చూస్తే జీవితమంతా వెంటాడే సుందర ప్రకృతి అది.




వీటి అన్నిటిని మించి కొన్ని వేల చరిత్ర అక్కడ మరుగున పడి ఉన్నది.ఇన్ని ఏళ్ళ బాటు ఎండకి,వానకి,వాతావరణ విలయ నృత్యాలకి తట్టుకొని ఇంకా ఆ మాత్రమైనా అవి ఉన్నాయి అంటే అంతా స్వతహ్ సిద్ధ రక్షణ వల్ల నే నేమో..!ఇంతకీ అవి ఏమిటి అంటారా ..రాతి యుగం నాటి మనుషులు నిర్మించిన నిర్మాణాలు అవి.మన వాళ్ళు రాక్షస గుళ్ళు అంటూంటారు.ఆంగ్లం లో Dolmens గా వ్యవహరిస్తారు.నాలుగు వైపులా బలమైన ఆధారాలు గా రాళ్ళను పేర్చి వాటి పై కప్పు లా ఒకే ఏకాండి రాయిని చాలా వెడల్పైనదాన్ని అమర్చారు.నేను చదివిన సమాచారం ప్రకారం ఇంచుమించు క్రీ.పూ.7000 సం.ల నుండి క్రీ.పూ. 3000 సం.ల మధ్యలో నిర్మించి ఉండవచ్చును.
ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అంటారా..?


ఖమ్మం జిల్లా లోగల వెంకటాపురం మండలం లోని సూరవీడు గ్రామానికి చేరువ లో ఉన్న అడవి లో ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని కాముని చెరువు ,ఇంకా చేరువ లోని గుట్టలు గా పిలుస్తారు.ఇక్కడి గుట్టలు ఈ చెరువు ని చూస్తున్నట్లు ఉంటాయి.అదిగో ఈ గుట్టల పైనే ఉన్నాయి ఈ పురా తత్వ విశేషాలు.అంత బరువైన ఆ రాతి పలకల్ని ఏ విధంగా పైకి చేర్చారు అంటే చెప్పడము కష్టమే.ఒకటా..రెండా..పైకి ఎక్కి చూస్తున్న కొద్దీ ఆ పొడుగూతా కొన్ని డజన్ల కొద్దీ ఉన్నాయి.మేము గుట్టకి సగ భాగం మాత్రమే ఎక్కాము..అక్కడే అన్ని ఉంటే ఇంకా పైకి ఎక్క గలిగితే ఇంకా ఎన్ని కనిపించేవో...అయితే అలసట వల్ల కిందకి దిగేశాము.

దురదృష్టం ఏమిటంటే కొన్ని నిర్మాణాల్ని పెళ్ళగించినట్లు అగుపించాయి.వాళ్ళ పిచ్చి కాకపోతే రాతి యుగం నాటి ఆ మానవులు అక్కడ ఏ బంగారం ఏ నిధులు లోపల పెట్టి ఉంటారని ఈ తవ్విన వాళ్ళ ఆలోచన.చరిత్ర తెలియక పోతే వచ్చే చావు ఇదే.అపురూప మైన ఈ నిర్మాణాల్ని  స్థాన భ్ర్మంశం చేశారు..కొన్ని చోట్ల.దేశం లోను,రాష్ట్రం లోనూ ఇంకా నెదర్లాండ్ ,ఫ్రాన్స్,పోర్చుగల్,బ్రిటన్ లాంటి ఎన్నో దేశాల్లో ఇలాంటి ప్రాచీన అవశేషాల్ని రక్షిస్తున్నారు.పర్యాటకులూ వస్తుంటారు.

మిత్రులు నరేంద్ర గారు వారం రోజులు ముందు ఒక రాత్రి ఫోన్ చేసి చెప్పారు.విహార యాత్ర కని..అది కాస్త ట్రెక్కింగ్ గా పరిణమించింది.బాబ్జి అన్న,మురళి గారు,రవి గారు,సతీష్ గారు ఇంకా మిగతా పరివారం బయలుదేరాము.నలుగురం మాత్రం పైకి ఎక్కగలిగి కొన్ని ఫోటోలు తీయగలిగాము.చిన్న పిల్లలు కూడా ఈ ట్రెక్కింగ్ లో ఉత్సాహంగా ఫాల్గొనడం ఉత్తేజకరం గా అనిపించింది.

నరేంద్ర గారు వీటిని చూసి ..ఇవి సమాధులు కావు కాని ప్రాచీన మానవుడు తాను తల దాచుకోవడానికి కట్టుకొని ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన పరిశోధనల మీద మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి.నాకూ అది కరక్టే అనిపించింది.కొన్ని వేల కిందట అవి కొంత ఎత్తు గానే ఉండి కాల క్రమం లో కుంగి పోయి ఉండవచ్చునని అన్నారు.అయితే ప్రొ.శుభాసిస్ దాస్ వంటి వారు మాత్రం ఇవి బహుశా Memorials వంటివి అయి ఉండవచ్చునని ..అయితే ఏదీ పూర్తి గా నిర్ధారించలేమని చెబుతున్నారు.సరే..ఎవరూ మాత్రం కాలం లో వెనక్కి అంత దూరం వెళ్ళి చూసి రాగలరు.అయితే ఇవి మాత్రం Tombs మాత్రం కావు అని చెప్పవచ్చు.ఎందుకంటే అలాంటి వాటిని చర్ల మండలం కలివేరు గుట్టల మీద నరేంద్ర గారు నేను చూశాము.అవి మనిషి సైజులో కాఫిన్ ల వలె అంటే రాతి కాఫిన్ ల వలే ఉన్నాయి.ఇవి మాత్రం చాలా పెద్ద గా ఉన్నాయి వాటి తో పోలిస్తే..లోపల మనిషి కూర్చోడానికి,పడుకొని ఇటూ అటూ దొర్లే సైజు లో ఉన్నాయి. కొన్ని నిర్మాణాల రాళ్ళు పక్కకి ఒరిగి పోయి ఉన్నాయి.మరి ఎంత కాలం ..ఎన్ని రుతువుల,ఎన్ని వాతావరణ వైరుధ్యాల్ని చూస్తూ అక్కడ కాలం గడుపుతున్నాయి అవి మరి.

( Technical details of place : Latitude: 18.094297,Longitude : 80.785013)   

Saturday, October 5, 2013

క్రీ.పూ.2500 -500 మధ్య కాలంలో వీటిని నిర్మించి ఉండవచ్చు.

మితృలు నరేంద్ర గారితో కలిసి సత్యనారాయణపురం కి దగ్గరలో నున్న కలివేరు గుట్ట మీద గల రాక్షస గూళ్ళు చూడటానికి ఇటీవల వెళ్ళాను.గతం లో కూడా వీటిని సందర్శించాను గాని ఎక్కువ చూడటం కుదరలేదు.వీటిని Megalithic age లో అప్పటి మనిషి నిర్మించిన సమాధులుగా చెప్పవచ్చును.శాస్త్రవేత్తలు చెప్పేదాన్ని బట్టి క్రీ.పూ.2500 -500 మధ్య కాలంలో వీటిని నిర్మించి ఉండవచ్చు.నాలుగు వైపులా పెద్ద రాళ్ళని నిలబెట్టి లోపల శవాన్ని ఉంచి పైన పెద్ద బండ రాయిని ఉంచేవారు.ఏ యంత్ర పరికరాలు లేని ఆ రోజుల్లో ఇంత పెద్ద బండలని ఎలా కదిలించి వీటిని నిర్మించారో ఊహించడం కష్టమే.

చాలా మటుకు విధ్వంసానికి గురయ్యాయి.కొంతమంది ఈ రాళ్ళని పగలగొట్టి ఇంటి నిర్మాణం లో కూడా ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది.బహుశా ఇవి ఏమిటో వారికి తెలిసి ఉండక పోవచ్చు.గ్ర్రీకు భాషలో మెగా అంటే చాలా పెద్దది అని,లిథోస్ అంటే రాయి అని అర్ధం.ఆ విధంగా వీటికి మెగా లిథిక్స్ అని నామకరణం చేశారు.

మనిషి ఇవి నిర్మించే సమయానికి లోహాలు కనిపెట్టలేదు లేదా వీరికి తెలియదు.కొంతమంది కలిసిన వృద్దులని కలిసి అడిగినపుడు వారి చిన్నతనం లో ఇక్కడ ఆడుకునే సమయం లో వీటిల్లో కుండ పెంకులు,పూసలు,బూడిద,చిన్న ఎముకల ముక్కలు దొరికేవని తెలిపారు.







                                                                                     Click here

Thursday, June 27, 2013

అట్లా మన విలువైన చరిత్రకి సంబందించిన కట్టడాలు ఎన్నో నాశనమయ్యాయి.



మనం చరిత్ర లో రాక్షస గుళ్ళు లేదా megalithic burials గురించి ఎంతో చదువుకొని వుంటాము.ఇవి ఇంచు మించు కొన్ని వేల ఏళ్ళ క్రితం అప్పటి మనిషి కట్టుకున్న నిర్మాణాలుగా చెప్పవచ్చు.అంటే ఆ కాలంలో  మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళకి సంబందించిన వస్తువులు..ఇంకా కొన్ని పనిముట్లు..సమాధుల్లో పెట్టి చుట్టూరా పెద్ద బరువైన రాళ్ళని పేర్చి..దాని పైన కప్పు లాగా ఒక పెద్ద రాతిని వుంచేవారు.ఇవి రాతివి కనక ఎన్నో సంవత్సరాలు అలా మన గలిగాయి.మనవాళ్ళకి చారిత్రక స్పృహ తక్కువ గనుక దాంట్లో ఏవో వుంటాయని వాటన్నిటిని తవ్వి అలా వదిలి పారేశారు.




అట్లా మన విలువైన చరిత్రకి సంబందించిన కట్టడాలు ఎన్నో నాశనమయ్యాయి.

మన భద్రాచలం డివిజన్ లో గల వెంకటాపురం మండలం లోని సూరవీడు సమీపం లో గల కాముని చెరువు గుట్టల పైన ఎన్నో రాక్షస గుళ్ళు వున్నాయి.చర్లకి చెందిన మా మితృడు  నరేంద్ర బాబు ఈ విషయం నాతో చెప్పగా ఒకసారి వెళ్ళాము.సుబ్రహ్మణ్యం,నరేంద్ర వాళ్ళ బాబు..మోహన్ కూడా వచ్చారు.



కాముని చెరువుకు చాలా మంది పిక్నిక్ కి వస్తుంటారు.ఎందుకంటే ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ..చెరువు..ఎత్తైన గుట్టలు ..చాలా మనోహరంగా వుంటాయి.అయితే రాక్షస గూళ్ళు గుట్టల పైకి వున్నాయి.బహుశా ఒక 400 మీటర్లు ఎత్తు వుండవచ్చును.



 నేను ఎక్కడానికి కొద్దిగా ప్రయాస పడ్డాననే చెప్పాలి.పైకి ఎక్కిన తరవాత మతి పోయింది.ఒకటో రెండో వుంటాయి అనుకున్నాము గాని దాదాపుగా ఒక వంద పైనే రాక్షస గూళ్ళు వున్నాయి.జానపదులు వీటిని పాండవులు వున్న ఇళ్ళు అని భావిస్తారు.



ఎంత చరిత్ర వున్నది ఇక్కడ అనిపించింది.ఆ నిర్మాణాలు కొన్ని చాలా పెద్దగా వున్నాయి.గూళ్ళ పైన ఒకటే రాయి చాలా విశాలమైనది పరిచారు..కొన్ని వేల యేళ్ళ  కిందట....అంత బరువైన ఈ రాళ్ళని  గుట్ట మీదకి చేర్చడం ఒక ఎత్తైతే..వాటిని చక్కగా పైకి అమర్చడం ఒక ఎత్తు. మరి ఎలా చేశారో అని ఆశ్చర్యం కలిగింది.

వీటిని పురావస్తు శాఖ పరిరక్షించి ప్రాచుర్యం కల్పించినట్లయితే ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ చారిత్రక విశేషాలని పరికిస్తారు.