Showing posts with label నా పర్యటనలు. Show all posts
Showing posts with label నా పర్యటనలు. Show all posts

Sunday, November 22, 2015

The meaning of serenity and beauty in the landscapes.


No where you have to go for a couple of great landscapes.Just it is beside you if you can look at it.The pics got at River Godavari at Dummugudem at Khammam district.I should say something about it concerning its history.The village residents mostly migrated from Andhra coastal area though it's now falls in Telangana.In fact village is a bit downward of this pictures,Inter state boarder people ,having many issues now like getting certificates from government offices and having done other things.

Saturday, June 14, 2014

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (తొమ్మిదవ భాగం)

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (తొమ్మిదవ భాగం)

గతంలో Gronvelt తనపేరుమీద కేటాయించిన Xanadu షేర్లు లేదా పాయింట్లను ఇప్పుడు Santadio పేరుమీదకి మార్చమని అడగటంలోని అంతరార్ధాన్ని Cully గ్రహిస్తాడు.అంటే Xanadu నుంచి తనని Delink చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.ఇప్పుడుగాని తాను దీనికి వ్యతిరేకిస్తే santadio mafia family కి వ్యతిరేకిగా పరిగణింపబడతాడు.వాళ్ళతో వైరం తన ప్రాణాలకే ముప్పు.

సరే...అని బాండ్ పేపర్లమీద సంతకాలు చేస్తాడు.అయితే తన అంగీకారాన్ని ప్రభుత్వ శాఖకి (Gaming commission) తెలియబరచి...పేర్లు మార్చి ఇంకా మిగతా తంతులు పూర్తి చేయడానికి 6నెలల గడువుని santadio  ఇస్తాడు.

...మెర్లిన్ హాలీవుడ్లో ఒసానో ని కలుస్తాడు.అతని తో పాటు Charlie కూడాఉంటుంది.తనతో కలిసి లంచ్ చేయవలసిందిగా కోరతాడు ఒసానో.

" మెర్లిన్...నిన్ను నా Literary executor గా నియమిస్తున్నాను." అంటాడు ఒసానో మాటల మధ్యలో ..! ఖంగుతింటాడు మెర్లిన్.అంటే దాని అర్ధం ఒసానో తదనంతరం అతని సాహిత్య సృజనకి... పుస్తకాలకి సంబందించిన అన్ని హక్కులు తనకి వస్తాయి.గతం లో ఒకసారి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తను నిరాకరించాడు.

"నాకు ఎందుకు....మీ మాజీ భార్యల్లో ఎవరికైనా లేదా మీ పిల్లల్లో ఎవరికైనా ఇవ్వవచ్చుగదా " అని అంటాడు మెర్లిన్.

"లేదు...ఇక నేనెవరినీ విశ్వసించను.నీ మీద మాత్రమే నాకు ఆ అభిమానం ఉన్నది" అని బలవంతంగా ఒప్పించి ఆ లీగల్ డాక్యుమెంట్ రాయిస్తాడు.

అన్నట్లు నీ సినిమ ...అది ఎంతదాకా వచ్చింది.."

"అది రిలీజవడము...ఫెయిల్ అవడమూ శరవేగంగా జరిగిపోయాయి.ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది.నా వేరే నవల మీద ఇప్పుడు నేను పనిచేసుకోవచ్చు.." నవ్వుతూ మెర్లిన్ జవాబిస్తాడు.

ముగ్గురూ కలిసి ఓ సమావేశానికి వెళతారు.ఆ  తెల్లవారి ఒసానో ఫోన్ చేస్తాడు." మెర్లిన్..నువ్వు నాకు ఓ చిన్న సాయం చేయాలి.నేను నార్త్ కరోలిన లో ఉన్న డ్యూక్ మెడికల్ సెంటర్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నా.అక్కడిదాకా నాకారుని Drive చేయాలి నువ్వు" అని..!

అంగీకరించిన మీదట బయలుదేరుతారు ...!మెర్లిన్ ఆ కారు ని తోలుతున్నంతసేపు ఒసానో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉన్నాడు." I love this part of the country.I love the way they run the Jesus Christ business down here.It's almost like every small town has it's Jesus Christ stores and they make a good living and a lot of friends.One of the greatest rackets in the world.When I think about my life,I think only it I had been a religious leader instead of a writer.What a better time I would have had" ఇలా సాగిపోతూంది ఒసానో వాగ్ధార ఆ దక్షిణాది రాష్ట్రం లోని ఊళ్ళను పరికిస్తూ..!

ఆ ఆసుపత్రి లో పరీక్షలన్నీ చేయించుకున్నతరువాత కొన్ని రోజులపాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోమని వైద్యులు చెబుతారు.ఒక స్పెషల్ సూట్ ని వీరికి కేటాయిస్తారు.అసలు విషయమేమిటంటే ఒసానో ఆరోగ్యం అవసానదశకి చేరుకుంటుంది.పైగా కొన్ని సమయాల్లో పెన్సిలిన్ ని బాగావాడి సొంత ట్రీట్ మెంట్ లు చేసుకుంటాడు.పైగా కొన్ని సుఖవ్యాధులు కూడా..!  ఇవన్నీ చివరికిక్కడికి వచ్చేలా చేస్తాయి.

ఓ రోజున ఉన్నట్లుండి చార్లీ ఫోన్ చేస్తుంది.ఒసానో పరిస్థితి బాగా లేదని... వెంటనే రమ్మని..! బయలుదేరి వెళతాడు.ఆసుపత్రి వర్గాలు ఒసానో మీద కారాలు,మిరియాలు నూరుతుంటారు.ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో అని  గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళని శాంతపరచి మెర్లిన్ 'అసలు విషయం ఏమిటీ అని ఒసానో ని అడుగుతాడు.మంచం నుంచి కదలలేని స్థితి కాకపోయినా లేచి అడుగులు చాలా ప్రయత్నం తో వేయవలసిన స్థితి లో ఒసానో శరీరం ఉంటుంది.

మిగతాది వచ్చే భాగం లో చూద్దాం..!
              -----KVVS Murthy  




Saturday, March 15, 2014

జంతర్ మంతర్ దగ్గర



న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ కి ఇటీవల వెళ్ళడం జరిగింది.ఒకప్పుడు జైపూర్ పాలకుడు జైసింగ్ నిర్మించిన ఖగోళ శాస్త్రానికి చెందిన కట్టడాలకి ఆ పేరు ఉండగా,వాటి గోడని ఆనుకొని ఉన్న వీధిలో ఇప్పటి జంతర్ మంతర్ కార్యక్రమాలు అంటే రకరకాల ధర్నాలు,నిరసనలు జరుగుతుంటాయి.రాజకీయ పార్టీలు అయితేనేమి ,ఇతర ప్రజా సంఘాల వారయితేనేమి తమ డిమాండ్లని దేశవ్యాప్తంగా వినిపించడానికి దేశ అధికారకేంద్రమైన ఢిల్లీలో వినిపించడానికి ఈ ప్రదేశాన్ని వేదికగా చేసుకొని తమ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు.ఈ జంతర్ మంతర్ వీధిలో అటు ఇటు టెంట్లు వేసి తమ ఉపన్యాసాలను,స్లోగన్లను వినిపిస్తుంటారు.ఫిబ్రవరి 25 న ఈ ప్రదేశానికి వెళ్ళినపుడు ఒక పెద్ద సంత మాదిరిగా తోచింది.

ఆ చివరినుంచి ఈ చివరిదాకా పెద్ద చెట్లు ఉండటం మూలాన వాతావరణం చల్లగా ఉన్నది.ఎలాగు హిమాలయలకి మనకంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ మనంత వేడిగా ఉండదు.రోడ్డుకి రెండు వేపులా ఎవరి ఉపన్యాస దుఖాణం ఎవరి మైకులు వారివే...ఎవరి గర్జనలు వారివే.. ఒక్కోసారి వాళ్ళలో ఎవరేం చెబుతున్నారో కూడా అర్ధం కాక తలగోక్కోక తప్పదు.అంతా కలగాపులగంగా ఉంటుంది.

ఒకచోట రిటైర్డ్ ఉద్యోగులు ...కొంచెం ముందుకు వస్తే ఆశారాం బాపు అనుయాయుల హడావిడి...ఆ పక్కనే పంజాబ్ నుంచి వచ్చిన కొన్ని బృందాలు....ఇంకాముదుకు పోతే చేనే కళాకారుల మీటింగ్...ఆ పక్కనే ఓ పబ్లిక్ రంగ సంస్థ వాళ్ళ ఉపన్యాసం..ఇలా పొద్దు ముందుకు పోతున్న కొద్దీ ఓ మినీ భారత్ అక్కడ తమ కోర్కెల సాధన కోసం ఉద్యమిస్తుంటారు.



ఇలా ఆ ప్రాంతమంత హోరెత్తిపోతూ ఉంటుంది."ఆవాజ్ దో..హం ఏక్ హై,కోన్ లడెంగే..హం లడెంగే" ఇలాంటి నినాదాలతో మారుమోగూతూంటుంది.సందట్లో సడేమియా లాగా కోత మంది చిరు వ్యాపారులు తినుబండారాలు,కోట్లు,ఇతర వస్తువులు లాంటివి అక్కడకి తెచ్చి అమ్ముతూ ఆ జనాన్ని సద్వినియోగం చేసుకొంటుంటారు.

కొంతమంది ఫోటోగ్రాఫర్లు వచ్చి ఉపన్యాసాలు వింటున్న జనాల్ని,ప్రసంగిస్తున్న నాయకులని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి ...నిమిషాల వ్యవధి లోనే వాటిల్ని ప్రింట్ వేసి అక్కడే రోడ్డుమీదే ప్రదర్శిస్తుండడం తో  చాలామంది జనాలు కొంటున్నారు.మనం ఎక్కడున్నా ఏదో యాంగిల్ లో తీసిన ఫోటోలో పడితీరుతాం.ఆ తర్వాత ప్రింట్లలో మనల్ని మనం చూసుకుని ఆ టెంప్టేషన్ లో కొనేస్తాం.అదీ వాళ్ళ టెక్నిక్.

ఏమాటకామాట న్యూఢిల్లీ పచ్చదనం తో హాయిగా అందంగా ఉంటుంది. ఆ జంతర్ మంతర్ కి పక్కనే ఉన్న ఒక వీధి పేరు "టాల్స్ టాయ్ స్ట్రీట్". ఒక రష్యన్ రచయిత పేరు మన దేశం లోని ఓ వీధికి పెట్టడం ఆనందమనిపించింది. ఒక వెరైటీ కోసమైన మన తెలుగు ప్రజలు ప్రతి ఊరిలో ఓ రచయిత పేరు పెడితే ఎంతబాగుంటుంది అనిపించింది.

Thursday, March 6, 2014

తాజ్ మహల్ సందర్శన



తాజ్ మహల్ యమునానది ఒడ్డున ఉన్నదని అనేకసార్లు చదవడం,ఆ చిత్రాల్ని చూసి ఆనందించడం తప్ప ప్రత్యక్షంగా చూద్దమని అనిపించినా చాలాసార్లు వాయిదాపడి ఇన్నేళ్ళకి కుదిరింది.తాజ్ సౌందర్యాన్ని ఎవరు ఎన్ని నోళ్ళ పొగిడినా ఇంకా ఏదో మిగిలిపోతూనేఉంటుంది. పశ్చిమ దిక్కునున్న గేట్ నుంచి లోపలకి వెళ్ళగానే వెంటనే ఆ పాలరాతి కట్టడం కనిపించి కనువిందు చేస్తుందేమోనని అనుకుంటాం.కాని లోపలకి ప్రవేశించగానే కోటకి సంబందించిన ఇతర నిర్మాణాలు,ప్రాకారాలు,వీధులు కనిపిస్తాయి.దానిలోనే షాపింగ్ కాంప్లెక్స్లు వగైరా..!

అటు ఇటు ఉన్న పచ్చని లాన్ లని చూస్తూ ఉత్తరం వైపునున్న మహాద్వారం వైపు లోనికి ప్రవేశిస్తుండగానే అనుకోని అతిథిలా అల్లంత దూరం నుంచి తాజ్ మహల్ కనిపించి ..ఇంకా దగ్గరవుతున్నకొద్దీ పారవశ్యమనిపిస్తుంది.అసలు ఏ ప్రక్కనుంచి చూసినా తాజ్ యొక్క అందం కొంగ్రొత్తగా కనిపిస్తుంది. అసలు అంత తెల్లని రూపాన్ని ఆ సైజు లో మార్బుల్ లో సృష్టించాలని అనుకోవడమే ఒక గొప్ప ఆలోచన..రసాత్మకత.ఆ వెనుకకి వెళ్ళిచూస్తే యమునా నది కడు వయ్యారంగా వంపులు తిరుగుతూఉంటుంది.ఎడమ,కుడి వైపుల గోడలమీద పాలరాతి లోని డిజైన్లు మంత్రముగ్దుల్ని చేస్తాయి.ఖురాన్ లోని సురాలని అనేకచొట్ల చెక్కారు.

షాజహాన్ ,ముంతాజ్ ల ప్రణయగీతమే ఆ మహల్ లో రూపుకట్టినదేమో అనిపించకమానదు.భారతీయులు,యూరోపియన్ లు,జపానీయులు చాలాదేశాల ప్రాంతాల వారు సందర్శకుల్లో ఉన్నారు.ఉన్నంతసేపు ఏదో ధ్యాన లోకం లో ఉన్నట్లుగా ఉంటుంది.షాజహాన్ తన చివరి రోజుల్లో కుమారుల మధ్య చెలరేగిన వారసత్వ పోరువల్ల ఔరంగజేబు చేత  జైలులో బంధింపబడి అక్కడనే ప్రాణాలు వదలగా ,అతడిని మంతాజ్ సమాధి పక్కనే సమాధి చేశారు.2000 లో ఓ వ్యక్తి సుప్రీంకోర్ట్ లోను,2005 లో మరోవ్యక్తి అలహాబాద్ హైకోర్ట్ లోను తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ చేసినట్టిది కాదని ,పరమార్ రాజులు కట్టిన ఒక ఆలయమని దాన్ని ఆ తరువాత రూపురేఖలు మార్చినారని కేసులు వేయగా వాటిని కొట్టివేయడం జరిగింది.Click Here

   

Monday, March 3, 2014

నా ఫతేపూర్ సిక్రి పర్యటన



ఫతేపూర్ సిక్రీ వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకొంటున్నప్పటికీ ఈ మధ్యనే సాధ్యపడింది.మొగలు ప్రభువులు మనదేశానికి ఇచ్చిన కోటలు,బ్రహ్మాండమైన భవనాలు,ఇంకా ఇతర కట్టడాలు వెలకట్టలేనివి.అవి వారి కళా తృష్ణకి ,వైభవానికి మచ్చుతునకలు.ఇప్పటికీ అవి పర్యాటక ప్రదేశాలుగా ఎంతో ధనాన్ని ఆర్జించిపెడుతున్నాయి.ఆగ్రా కి రమారమి 27 కి.మి. దూరం లో ఈ ఫతేపూర్ సిక్రి ఉన్నది.అక్బర్ దీన్ని మొదట రాజధానిగా చేసుకోవాలని నిర్మించాడు.అయితే దాపులోనే ఉన్న రాజపుత్రుల తాకిడి,నీళ్ళ కరువు లాంటివి అక్కడ ఎక్కువ కాలం ఉంచలేకపోయాయి.ఆ తరువాత లాహోర్ కి రాజధాని ని మార్చడం జరిగిని.క్రీ.శ.1571 నుంచి 1585 దాకా మాత్రమే అక్బర్ ఇక్కడ ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది.



ఈ సిక్రి కి ముందు తగిలే ఒక హోటల్ లో రెండు రొట్టెలు తిని బయలుదేరాను.రొట్టెలకి 20 రూపాయలు తీసుకోగా దానిలోకి ఇచ్చిన కూరకి మాత్రం 50 రూపాయలు తీసుకున్నాడు ఆ హోటల్ యజమాని. ఆగ్రాకి ఈ సిక్రి కోటకి దూరం బాగానే ఉన్నది.ఆగ్రా లో రోడ్డు మీద ఎవరిష్టం వాళ్ళదే అన్నట్లున్నది ఆ ట్రాఫిక్ చూస్తుంటే.ఎడమ లేదు..కుడి లేదు ఎవరెటు వస్తారో తెలీదు.



సరే..సిక్రి కోటకి వచ్చాము.బయటనుంచే కోటకి సంబందించిన గోడలు అవీ శిధిలమైనవి కనబడుతున్నాయి.దాదాపు 5 మైళ్ళ విస్తీర్ణం లో చుట్టూతా గోడ ఉన్నది.ఎంట్రెన్స్ దగ్గరకి రాగానే మహా రాక్షసుని లా కనబడే గుంబాజ్ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.వళ్ళు ఝల్లుమంటుంది ఆ మహా ఆకారాం చూసి.లోపలకి అడిగుపెడితే ఒక ప్రపంచం లాగానే ఉంటుంది.ఎన్ని గదులు,ఎన్ని నిర్మాణాలు ,ఎన్ని రకాల భవనాలు లెక్కే లేదు.ఎర్రటి రాయి ఎక్కువ ఉపయోగించారు.హిందు,ముస్లిం నిర్మాణశైలులు కలగలసిఉన్నాయి.



అక్బర్ తాను ఎంతో గౌరవించే సూఫి గురువు షేక్ సలీం చిస్తి కి దీనిలో ఒక చలువరాతి భవనాన్ని నిర్మించాడు.దానిలో ఆయన సమాధి ఉన్నది.ఆ భవనం గోడలకి మార్బుల్స్ తో చేసిన రకరకాల డిజైన్ లు చాలా బాగున్నాయి.ఒకదానిలా ఇంకొకటి ఉండదు.



ఇంకా కోటలోని అంతర్నిర్మాణాలు  దేనికదే అద్భుతం.బయట పర్యాటకులకోసం అనేక రకాల వస్తువులు అమ్ముతున్నారు.అయితే ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే మనం లోపల కెళ్ళి చూస్తున్నప్పుడు కూడా లిటరేచర్ ఇంకా ఇతరవస్తువులు అమ్మేవాళ్ళు మనకి ఊపిరి సలపకుండా ఊదరగొడుతుంటారు.దాంట్లో మళ్ళీ అంతా పిల్లలే ఎక్కువ.Click Here

Sunday, September 29, 2013

ఒడిస్సా పర్యటన (Part-5)

భువనేశ్వర్ కి కొద్ది దూరం లో నున్న ధౌలి అనే ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ బౌద్ధ శాసనాలు తవ్వకాల్లో దొరికాయి.బుద్దుని గురించిన విశేషాలని అక్కడ నిర్మించిన పగోడా పై చక్కగా శిల్పించారు.తెల్లగా..చాలా ఎత్తులో ఉన్నది.దీని కింద భాగం లో దయా నది ఉంటుంది.అక్కడే కళింగ యుద్ధం జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.రక్తం వరదలై ప్రవహించిన ప్రాంతం గా చెప్పాలి. ఆ తరవాత అశోకుని లో మార్పు వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించడం మనం చదువుకున్నదే కదా..!



మిట్ట మధ్యహ్నాం రెండు గంటలయిందా..పైకి ఎక్కడానికి కాళ్ళు సర్రుమంటున్నాయి.ఆ పగోడ కి చుట్టూరా బుద్ధుని కధలని తెలిపే చిత్రాలు ఉన్నాయి.దీన్ని జపాన్ బౌద్ధ సంఘం వారు, ఇక్కడి స్థానిక సంస్థలతో కలిసి నిర్మించారు.ఇది ఒక గుట్ట మీద ఉన్నది.కూర్చోవడానికి కొన్ని సిమెంట్ బెంచీలు కూడా ఉన్నాయి.జనాలు పలచగా ఉన్నారు...ఒక అయిదుగురు ..తెలుగులో మాట్లాడుకుంటు కనిపించారు.



దీని వెనుకనే ఒక శివాలయం ఉన్నది...ఇక్కడ ఈ భువనేశ్వర్ లో  శివాలయాలు విపరీతం గా ఉంటాయి.అది మరీ పురాతనమైనది కాదు.

కాని లింగరాజ్ ఆలయాన్ని భువనేశ్వర్ లో తప్పక దర్శించవలసిన ప్రాంతం గా చెప్పాలి. మనకి భక్తి ఉందో ..లేదో తరవాత విషయం... కాని ఆ నిర్మాణం యొక్క గొప్పదనానికి జోహార్లు అర్పించవలసిందే,ఒడిషా ఆలయ శిల్పులు దేశం లోని ఏ ఇతర ప్రసిద్ద దేవాలయ నిర్మాణాల్ని కాపీ కొట్టకుండ తమకంటూ ఒక ప్రత్యేక నిర్మాణ శైలిని ఏర్పరుచుకున్నారు.దానికి గాను అభినందనలు తెలుపవలసిందే...లింగరాజ్ ఆలయం యొక్క ప్రధాన గోపుర శిఖరం గుండ్రంగా..వాటి మీద శిల్ప సంపదతో ...ఆకాశాన్ని ముద్దుపెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. ఆ ఆలయ ప్రాంగణం లో చిన్న గుళ్ళు మొత్తం కలిపి ఓ వంద పైనే ఉంటాయి.ఆ విధంగా నేను ఎక్కడా చూడలేదు.చాలామటుకు శిధిలమవుతున్నాయి.మళ్ళీ 11 వ శతాబ్దం లోకి వెళ్ళినట్టనిపించింది లోపల తిరుగుతుంటే..!

Sunday, September 22, 2013

ఒడిస్సా పర్యటన ( Part-4 )

భుభనేశ్వర్ కి దగ్గరలోనే ఉదయగిరి,ఖండగిరి గుహలు ఉన్నాయి.పెద్ద రాతి కొండలని నివాసాలుగా మార్చాలనుకోవడం ,వాటిని ఆవిధంగా మలచడం మానవ సంకల్పబలానికి తిరుగులేని శక్తి ఉన్నదని తోచింది.అవి జైన మునుల కోసం 11 శతాబ్దం లో తొలచబడినవి.అన్ని వందల ఏళ్ళ తరవాత మళ్ళీ వాటిని మనం చూడగలిగేలా నిలిచిఉండటం అద్భుతం.



ఒకరకమైన ఎర్రరాతి కి చెందినవి ఆ కొండలు.కొన్ని వాటిల్లోకి వెళ్ళి చూస్తే ఒక మనిషి హాయిగా కూర్చునేటట్టుగా వున్నాయి...మరికొన్నిట్లో ఒకరిద్దరు మనుషులు తిరిగేటంత ఖాళీ జాగా వుంది.ఒక్కటి మాత్రం చాలాపెద్దగా సమావేశమందిరం లా తొలిచారు.మొత్తం పద్దెనిమిది గుహలు చూశాను.ఇప్పుడే ఊరికి చాలా దూరంగా ఉంది ఆ ప్రాంతం...మరి అప్పుడు ఎలా ఉండేదో..!

మనం టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న గుడి, ద్వారం దగ్గరే కనిపిస్తుంది.బహుశా అది ఇటీవల నిర్మించినదే.ఇంచు మించు భువనేశ్వర్ లోపల ..చుట్టుపక్కల ప్రాచీన ఆలయాలు ,కొత్తవి కలిపి కొన్ని వందల సంఖ్యలోనే ఉంటాయి.అన్నీ కూడా శివ పరివారానికి చెందినవే..నాకు అనిపించింది ఏమిటంటే భువనేశ్వర్ ని శైవ క్షేత్రంగా...పూరి ని వైష్ణవ క్షేత్రంగా ఇక్కడి పూర్వికులు తీర్చి దిద్దారేమో అని..!




కొండముచ్చులు ఆ గుహల ప్రాంతం లో ఇస్టం వచ్చినట్లుగా తిరుగు తుంటాయి.వాటి స్వంత జాగా మాదిరిగా...!మళ్ళీ వాటికి కొన్ని పిల్ల ముచ్చులు..!చూడటానికి వచ్చిన వాళ్ళు ఏవైనా పెడితే తింటుంటాయి..అయితే చేతిలోవి లాక్కోవడం లేదు..అంత వరకు వాటికి ధన్యవాదాలు చెప్పాలిసిందే..! మన పక్కనే కూర్చుని మేమూ మనుషులమే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాయి.ఎవరో పిల్లవాడు ఏదో అంటే మటుకు భయపెట్టినట్టుగా సకిలించి ముందుకు రావడంతో అతను దూరంగా పోయాడు.



గుళ్ళ దగ్గరున్నంతగా ఇక్కడ జనాలు లేరు.కాబట్టి ప్రశాంతం గా ఉంటుంది.ఎంతో మంది జైన మునులు,తపస్సంపన్నులు నడయాడిన ఆ భూమిలో తిరుగాడినందుకు ధన్యత చెందినానిపించింది.ఇక్కడికి వచ్చిన వారికందరికీ అలాగే ఉంటుందేమో..కొన్ని నాళ్ళ క్రితం ఔరంగబాద్ లో చూసిన గుహలకి వీటికి కొంత తేడా ఉన్నది.అయితే దేని విశిష్టత దానిదే..!Click here
     

Monday, September 16, 2013

ఒడిస్సా పర్యటన (Part no: 3)

భువనేశ్వర్ లో కొన్ని రోజులుండి అక్కడి ప్రాచీన ఆలయాలని,చారిత్రక విశేషాలని చూడాలని ఎప్పటినుంచో అనుకొంటుండగా అది మొన్న జూన్ నెలలో కుదిరింది.అంతకు ముందు ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు ఈ భువనేశ్వర్ లో కాసేపు ఆగాను రైలు దిగి!అయితే చూసేందుకు ఏమీ వీలు కాలేదు.
రైలు ప్రయాణం లో సగటు భారతీయుని బాగా గమనించవచ్చు.వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు గాని..కొన్ని బుద్దులు ఒకేలాగా ఉంటాయి అనిపిస్తుంది.టాయ్లెట్ కి వెళతారా..వచ్చేటపుడు దాని తలుపు వేయరు ..బద్దకం..మళ్ళీ చూస్తే చదువుకున్నవాళ్ళే..! అయితే ఒకోసారి కొన్ని సహాయాలు చేస్తుంటారు..ఒకాయనకి సీటు కన్ ఫర్మ్ కాలేదు..నిలబడి వున్నాడు...ఒక వారణాసి వెళుతున్న యువకుడు అతని సీటులో సర్దుకోవలసిందిగా ఆఫర్ చేశాడు.మళ్ళి ఇలాంటి మానవత్వాలూ ఉంటాయి.

Railway station,Bhubaneswar.

అందుకే ఇండియా లోని సంక్లిష్టతల్ని ఎలా అర్ధం చేసుకోవాలో వెంటనే బోధపడదు.బెర్హం పూర్ (బరం పురం) వచ్చేంతదాక తెలుగు ప్రదేశం లాగే ఉంటుంది.ఆ తరవాత నుంచి జిల్లా కేంద్రాలైనా చాలా చిన్న ఊళ్ళలాగానే తోచాయి.రైల్లో రంజన్ ప్రధాన్ అనే ఒడియా వ్యక్తి పరిచయం అయ్యాడు.అతను ముంబాయిలో ఒక ప్రైవేట్  కంపెనీ లో పనిచేస్తున్నాడట. కొన్ని విషయాలు చర్చించాము.ఎందుకో గాని అక్కడి కొంతమంది ప్రజల్లో తెలుగు వాళ్ళు దోపిడి దారులు అనే అభిప్రాయం వుంది.ఇక్కడ కి ఒడియా కూలీలని ఇటుకబట్టీ ల్లోకి పనిచేయించడానికి తీసుకువచ్చి వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారని..అలాగే ఒడిశా లోని తీర ప్రాంత భూములని కొని తమకి కాకుండా చేస్తున్నారని..ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మనపట్ల వాళ్ళకి. అక్కడి inteligentsia  దృష్టిలో మనం  అమెరికా లాంటి పెట్టుబడి దారీ తరహాలం.!

Raja rani Temple in Bhubaneswar

భువనేశ్వర్ లో రైలు ఆగగానే అక్కడ స్టేషన్ లో డార్మిటరీ లో వసతి కోసం వాకబు చేయగా అంతా ఫుల్ అయినట్టు తెలిసింది.బయటికి వచ్చి సాయి అమృత్ అనే హోటల్ లో బస చేశాను.రూం,సౌకర్యాలు బాగున్నాయి.భోజనం సరైంది దొరకలేదు.భువనేశ్వర్ రైల్ స్టేషన్ లోపల మటుకు ఒకే ఒక్క హోటల్ వుంది.బాగానే వుంటుంది గాని రేట్లు జాస్తి అనిపించింది.ఆ తెల్లారి స్టేషన్ లో ఉన్న ఒడిష టూరిజం కార్యాలయం లోని వ్యక్తిని సంప్రదిస్తే పెద్దగా రెస్పాండ్ కాలేదు. అంతలోనే అక్కడికి ఒక cab driver వచ్చాడు.అతని పేరు గణేష్ మిశ్రా.నాతో టూర్ పేకేజ్ వివరాలు చెప్పాడు..ఒకే అయినాక అతను ఆ టూరిజం ఉద్యోగికి కొంత డబ్బులు ముట్టజెప్పాడు.అంటే ఇదంతా ముందస్తు ఏర్పాటన్నమాట. Click here 

Thursday, September 12, 2013

ఒడిస్సా పర్యటన (Part no: 2)

అలా నాలో ఉదయించిన ప్రయాణ ఆసక్తి వలన మొదటిసారి ఒంటరిగా తమిళనాడు వెళ్ళాను.నా మటుకు నాకు ఒంటరిగా తిరగడం లో నే ఒక దివ్య అనుభూతి ఉంటుంది. ప్రతి పొరపాటుకి మనమే బాద్యులం అవుతాము. ఒకళ్ళని నిందించవలసిన పని వుండదు.అలాగే మనకి ఎదురయ్యే రిస్క్ లని ఎలా పరిష్కరించుకోవాలో ఆయా సన్నివేశాలే నేర్పిస్తుంటాయి.రమారమి రెండు దశాబ్దాల క్రితం ఆ నా మొదటి ప్రయాణం లో చెన్నయ్ లో పురసవాక్కం లో గల కాల్క్ కాండు సంపాదకుడు లేనా తమిళ్ వాణన్ ని కలిశాను.ఆయన తను రాసిన ఒక పుస్తకాన్ని స్వహస్తాలతో సంతకం చేసి నాకు బహూక రించారు.అది ఒక self development  అంశం పై రాసినది.అప్పటికి మన తెలుగు లో పెద్దగా ఆ ఒరవడి స్టార్ట్ కాలేదు.ఇలాంటి బ్లాగులు రాసే విధానం అప్పుడు వుంటే బాగుండేది.చాలా విషయాలు దాంట్లో నిక్షిప్తం చేసివుండేవాడిని.



అలాగే ఇళందేవన్ అనే ఒక ప్రముఖ తమిళ కవిని కూడా వారి ఇంట్లో (hunter road) కలిశాను.అతను అప్పుడు తమిళనాడు అసెంబ్లీ లో పి.ఆర్.వొ. గా పనిచేస్తుండేవారు.తమిళ సాహిత్యం గురించి చాలా ముచ్చటించారు.ఆ తరవాత చెన్నయ్ లో చూడదగిన ప్రదేశాలు ఇంచుమించు అన్నీ చూశాననే చెప్పాలి.సిటీ బస్ లో ఒక మళయాళీ కలిశాడు.అతని పేరు థామస్ ...ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు అని నాకు కొంత హిత బోధ చేశాడు.

ఆ తరవాత చాలాసార్లు చెన్నయ్ వెళ్ళాను.అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి నాకెప్పుడూ కలగలేదు.మద్రాస్ లో తిరగడం ఈజీ అనిపిస్తుంది నాకు..ఎవరినడిగిన వీధుల వివరాలు గాని..అడ్రెస్ గాని చెబుతారు.ఆ తరవాత కేరళ వెళ్ళాను...కొట్టాయం  ఊరి పేరు.అయితే వాళ్ళు మాత్రం కోట్టయం  అని పిలుస్తారు.మళయాళమనోరమ వాళ్ళ కార్యాలయం కి దగ్గరలోని ఓ హోటల్ వున్నాను.కేరళ లో పట్టణానికి,గ్రామానికి పెద్దగా తేడా వున్నట్టు కనబడలేదు.

ఎక్కడ చూసినా పచ్చదనమే.ఇళ్ళు చాలామటుకు బంగాళా పెంకుటిల్లు గానే వున్నాయి.కాని శుబ్రత అనేది బాగా వున్నది.తమిళుల మాదిరిగా కలివిడి మనుషులు గా అనిపించలేదు.ఎవరి విషయం వారిదే అన్నట్టుగా వుంటారు.ప్రకృతి శోభ గొప్పగా వుంటుంది.ప్రతి ఊరు పార్కులో ఉన్నట్టుగా అనిపించింది.ఇంకా వీటి గూర్చి మరో సారి వివరంగా రాస్తాను.     Click here 

Tuesday, September 10, 2013

ఒడిస్సా పర్యటన (Part no:1)

నా పర్యటనలు నాకు మంచి గురువులు గా పరిణమించినవి అంటే అతిశయోక్తి కాదు.పుస్తకాలు చదవడం వల్ల కొన్ని ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది.నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒకసారి మా లైబ్రరీ లో సంజీవ్ దేవ్ గారి రస రేఖలు అనే పుస్తకం..అనుకోకుండా చదవడం జరిగింది.ఒక విషయాన్ని చక్కగా వివరించడంలో ఆయన పద్దతి నన్ను కట్టిపడవేసింది.ఆ తరవాత ఆయన రాసిన తెగిన జ్ఞాపకాలు చదివాను.నా పైన అమితంగా ప్రభావం చూపిన పుస్తకాల్లో అది ఒకటి.

వారి వలెనే నేను భారత దేశంలోని ప్రత్యేకతలని,సంస్కృతులని ప్రత్యక్షంగా చూసి రావాలని ఒక కోరిక అప్పుడే జనించింది.ఇప్పటికీ నా ఉద్దేశ్యం లో యూరపు ఖండం లోని మొత్తం దేశాల్లో ఎంత విభిన్నత వున్నదో ఒక్క భారత దేశంలో అంతకన్న ఎక్కువ వైవిధ్యం ఉన్నది అని నా విశ్వాసం.ప్రతి రాష్ట్రానికి ఒక దేశానికి ఉన్నంత తేడా వుంది..అదే సమయంలో ఒక కలిపే అంతస్సూత్రమూ వున్నది.అదే ఇండియా గొప్పదనం..!

భారత దేశం లో అనేక రాష్ట్రాల్లో ఒంటరి గా రైలు ప్రయాణాలు చేశాను.అయితే వాటినన్నిటిని డైరీ గా నేను రాసిపెట్టుకో లేదు.జ్ఞాపకాలు మాత్రం అలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మీతో పంచుకోవడానికి ప్రత్నిస్తాను రేపటినుంచి..!  Click here for more