Sunday, September 22, 2013

ఒడిస్సా పర్యటన ( Part-4 )

భుభనేశ్వర్ కి దగ్గరలోనే ఉదయగిరి,ఖండగిరి గుహలు ఉన్నాయి.పెద్ద రాతి కొండలని నివాసాలుగా మార్చాలనుకోవడం ,వాటిని ఆవిధంగా మలచడం మానవ సంకల్పబలానికి తిరుగులేని శక్తి ఉన్నదని తోచింది.అవి జైన మునుల కోసం 11 శతాబ్దం లో తొలచబడినవి.అన్ని వందల ఏళ్ళ తరవాత మళ్ళీ వాటిని మనం చూడగలిగేలా నిలిచిఉండటం అద్భుతం.



ఒకరకమైన ఎర్రరాతి కి చెందినవి ఆ కొండలు.కొన్ని వాటిల్లోకి వెళ్ళి చూస్తే ఒక మనిషి హాయిగా కూర్చునేటట్టుగా వున్నాయి...మరికొన్నిట్లో ఒకరిద్దరు మనుషులు తిరిగేటంత ఖాళీ జాగా వుంది.ఒక్కటి మాత్రం చాలాపెద్దగా సమావేశమందిరం లా తొలిచారు.మొత్తం పద్దెనిమిది గుహలు చూశాను.ఇప్పుడే ఊరికి చాలా దూరంగా ఉంది ఆ ప్రాంతం...మరి అప్పుడు ఎలా ఉండేదో..!

మనం టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న గుడి, ద్వారం దగ్గరే కనిపిస్తుంది.బహుశా అది ఇటీవల నిర్మించినదే.ఇంచు మించు భువనేశ్వర్ లోపల ..చుట్టుపక్కల ప్రాచీన ఆలయాలు ,కొత్తవి కలిపి కొన్ని వందల సంఖ్యలోనే ఉంటాయి.అన్నీ కూడా శివ పరివారానికి చెందినవే..నాకు అనిపించింది ఏమిటంటే భువనేశ్వర్ ని శైవ క్షేత్రంగా...పూరి ని వైష్ణవ క్షేత్రంగా ఇక్కడి పూర్వికులు తీర్చి దిద్దారేమో అని..!




కొండముచ్చులు ఆ గుహల ప్రాంతం లో ఇస్టం వచ్చినట్లుగా తిరుగు తుంటాయి.వాటి స్వంత జాగా మాదిరిగా...!మళ్ళీ వాటికి కొన్ని పిల్ల ముచ్చులు..!చూడటానికి వచ్చిన వాళ్ళు ఏవైనా పెడితే తింటుంటాయి..అయితే చేతిలోవి లాక్కోవడం లేదు..అంత వరకు వాటికి ధన్యవాదాలు చెప్పాలిసిందే..! మన పక్కనే కూర్చుని మేమూ మనుషులమే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాయి.ఎవరో పిల్లవాడు ఏదో అంటే మటుకు భయపెట్టినట్టుగా సకిలించి ముందుకు రావడంతో అతను దూరంగా పోయాడు.



గుళ్ళ దగ్గరున్నంతగా ఇక్కడ జనాలు లేరు.కాబట్టి ప్రశాంతం గా ఉంటుంది.ఎంతో మంది జైన మునులు,తపస్సంపన్నులు నడయాడిన ఆ భూమిలో తిరుగాడినందుకు ధన్యత చెందినానిపించింది.ఇక్కడికి వచ్చిన వారికందరికీ అలాగే ఉంటుందేమో..కొన్ని నాళ్ళ క్రితం ఔరంగబాద్ లో చూసిన గుహలకి వీటికి కొంత తేడా ఉన్నది.అయితే దేని విశిష్టత దానిదే..!Click here
     

2 comments:

  1. Murthy garu ... chakkaga vivarinchaaru... baavundi... rachana shaili chakkagaa vundi... very nice ....

    ReplyDelete

Thanks for your visit and comment.