ఈరోజు పొద్దున దాసరి అమరేంద్ర గారి పుస్తకం లో కుష్వంత్ సింగ్ ఇంటర్వ్యూ చదివాను.చదివిన తరువాత అనుకున్నా ఈ పెద్దమనిషి ఇంకా ఆరోగ్యంగా బాగానే ఉన్నాడే..కాకపోతే ఇదివరకటిలా ఎక్కువగా సంచలనం సృష్టించే మాటలేవి అనడంలా..అందుకనే పెద్దగా న్యూస్ ఏమీ రావడం లేదని.అదేమిటో ఈరోజు పొద్దు పోయినతరవాత నెట్ ఓపెన్ చేస్తే ఈయన మరణవార్త.
ఆయనది మొదటినుంచి కూడ పెడసరం దారే..! ఏది అనుకుంటే అది ఎవరిమీద పడితే వాళ్ళమీద కామెంట్ చేసి పారేస్తాడు. ఆయన రచనల్లో The history of Sikhs గ్రంధమొక్కటే కాలపరీక్షకి నిలుస్తుందని అంటాడు.దాన్ని మళ్ళీ సవరించి రాయాలసిన అవసరముందని కూడ గత ఏడాది ఏదో ఇంటర్వ్యూ లో చెప్పినట్లు గుర్తు.
అటు సీరియస్ సాహిత్యం,ఇటు కాలక్షేప రచనలు చేసిన సవ్యసాచి అనిచెప్పాలి.తనకు మహిళలు,మద్యం అంటే ప్రీతి అని బాహాటంగా చెప్పుకోవడం అతనికే చెల్లింది.కుష్వంత్ ని ఎంతమంది ఇష్టపడతారో అంతకంటే ఎక్కుమంది ద్వేషిస్తారు కూడ.
ఒకానొక సమయం లో ఓషో ని కూడ అనుసరించినట్లు గుర్తు.కుష్వంత్ ఇష్టపడే వ్యక్తులలో ఆయన ఒకరు.భారత ప్రభుత్వం తరపున ప్రెస్ విభాగానికి సంబందించి కెనడా లో మొదటిగా పనిచేసిన అతను ఆతరవాత ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కి ఎడిటర్ గా పనిచేశారు.ఇంగ్లీష్ లో జర్నలిస్ట్ గా అదీ కాలమిస్ట్ గా సక్సెస్ అయినవారికి దేశ వ్యాప్తంగా పేరు, డబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.ఎందుకంటే ప్రముఖమైన ప్రాంతీయ భాషల్లోని పత్రికలు వారి ఆంగ్లరాతలని డబ్బింగ్ చేసుకుని ప్రచురించుకుంటాయి.మంచి పారితోషికమూ ఇస్తాయి.విదేశీ పత్రికలు ఇక సరే సరి.అలాంటి కొద్దిమంది అదృష్టవంతుల్లో కుష్వంత్ సింగ్ ఒకరు.
Good post!
ReplyDelete