స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం)
గతం లో ఎక్కడాపాను...ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు,,ఓ వైపు తిట్టుకుంటూనే అనికదూ.!భారతదేశం లో మన ఒక్క రాష్ట్రమనే కాదు.....ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారని అనిపిస్తుంది ఆంగ్లం విషయంలో...!నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది.దాన్ని తీసివేయడం అంత సులువు కాదు.ఇంగ్లీష్ వచ్చినవారికి అన్ని విషయాల్లో ఎక్క్వ జ్ఞానం ఉంటుదని,వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారని ఇలా కొన్ని ఆధునిక మూఢభావాలు లోలోపల పేరుకుపోయాయి.అయితే దానికి కారణాలు లేకపోలేదు.
బ్రిటిష్ వారు మనల్ని పాలించడం వల్ల అది పాలకుల భాషగా మనదేశంలో గౌరవం పొందింది.కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగినపుడు కూడా గమనించాను.ఎంతవాళ్ళకి "హిందీ" లో రాజ్య వ్యవహారాలు నడిచినా ..ఇంగ్లీష్ విషయం లో వాళ్ళకి తెలియకుండానే ఒక గౌరవాన్ని ఇస్తారు.దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.
ఓసారి ఉత్తరాఖండ్ లో ఋషికేష్ పక్కన ఒక ఊరికెళ్ళాను.చాలామంది టూరిస్టులు భోజనాలు కానిస్తున్నారు.నా కప్పట్లో వచ్చిన స్పోకెన్ హింది స్వల్పం. సరే...పనులు నడుస్తాయి అది వేరే విషయం.నాకొచ్చిన బ్రోకెన్ హిందీ లోనే ఆర్డర్ ఇచ్చాను.ఎందుకనో దక్షిణాది వాళ్ళంటే ఉత్తరాది వాళ్ళకి కొంత చిన్న చూపే.వాళ్ళ రంగుని చూసో,వేషధారణ చూసో,మనవాళ్ళు కూడ ఇక్కడ దబాయించి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడరు.తెలివిలో గాని,బురిడీ కొట్టించడం లో గాని మన ముందు వాళ్ళు ఎందుకూ పనికిరారు.కొద్ది అనుభవం లో అది తెలిసిపోతుంది.ఇక తమిళ,మళయాళీల గారడీల ముందు చెప్పాలంటే దిగదుడుపే.అయితే ఒకటి వాళ్ళ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఉద్రేకస్వభావులు.
ఆ..వచ్చేద్దాం వెనక్కి...హోటల్ లోకి వెళ్ళి సౌత్ ఇండియన్ తాలీ కి ఆర్డర్ ఇచ్చానుగదా.ఎంతకీ రాదు...ఓసారి ఓనర్ కి కూడా చెప్పిచూశా..!లాభం లేదు.అక్కడ మన తెలుగు నడవదు.మన హిందీ అంతంత మాత్రం.ఏదో బ్రోకెన్ హిందీ లో ఓ పరాయి రాష్ట్రం వ్యక్తి చెప్పాడుకదా అని అతని భావమేమో.నాకు కాలింది.ఇక లాభం లేదనుకొని అనుకున్నది అనుకున్నట్లుగా నా భావావేశాన్ని మొత్తం పది నిమిషాలు పాటు ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచికొట్టాను.మీరు నమ్మరు...ఒక్కసారిగా అతను నిర్ఘాంతపోయినంత స్థాయిలో ఇదైపోయి నా దగ్గరకి వచ్చి మరీ సర్వర్ చేత వడ్డింపజేసి ..మళ్ళి నేను వస్తున్నప్పుడు కూడా "టాటా" చెప్పి మరీ వీడ్కోలు చెప్పాడు. భారతదేశమా... నువ్వు ఇంతే మారవు..ఎక్కడైనా ఒక్కటే " అనిపించింది.
ఈ వెయిటేజీ ఇంగ్లీష్ కి అడుగడుగునా మనకి దేశంలో కనిపిస్తుంది.అలా జీర్ణించుకుపోయిందంతే..!అందుకే ఇంగ్లీష్ గడ గడా మాట్లాడాలని చాలామందికి తాపత్రయం.ఓ రకంగా మంచి వ్యసనమే ఇది.వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఆ రేంజ్ లో passion ఉన్నవారు ఆ భాషని నోటితో ఇట్టే అందిపుచ్చుకుంటారు.
-- తప్పో,ఒప్పో మాట్లాడుతూనే ఉండాలి.దాంతో పాటుగా చదవటం,వినడం శ్రద్దగా చేస్తుండాలి.ఒక నెల ప్రయత్నిస్తే వస్తుందా ..రెండు నెలలు ప్రయత్నిస్తే వస్తుందా అనుకొని caliculation వేసుకునేవాళ్ళకి ఎప్పటికి రాదు.దాని పై ఒక ప్రేమ తో సాధన చేస్తే దానిలోని తీపిదనం తెలుస్తుంది తప్ప లెక్కల మాదిరిగా చేస్తే పని కాదు.
--ఒక్కొక్క word ని కాకుండా word-cluster ల లో మాట్లాడటాడానికి నోటికి శిక్షణ నివ్వాలి అని చెప్పుకున్నాం గదా గతంలో..! ఉదా: నిన్న temple ని visit చేశారా..? అని కాకుండా Have you visited temple yesterday అని ఒకే stroke లో వచ్చేలా ప్రాక్టీస్ చేయండి.ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి మీరు ఎన్నైనా సేకరించుకొని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుండాలి.ఇలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి మాకు అని మీరు అడగవచ్చు.ఆ..అక్కడికే వస్తున్నా..ఇది అర్ధం అర్ధం చేస్కుంటే మీకు చాలా అవగతమైనట్లే..!
మీరు మొదట్లో క్లిష్టమైన classics ని చదవటానికి ప్రయత్నించవద్దు.అంటే షేక్స్ పియర్ లాంటి ఉద్ధండుల రచనల్ని చదవవద్దు.
-- సంభాషణలు ఉండే ఇంగ్లీష్ ఫిక్షన్ ని చదివితే చాలా మంచిది.News paper ని చదవవద్దని చెప్పను గాని దాని లక్ష్యం వేరు.మీరు composition రాయడానికో ఇంకా ఏదైనా written work చేయడానికో అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇంగ్లీష్ దైనందిన చర్య లో భాగంగా ఎలా మాట్లాడాలో నేర్పదు.ఎంత natural గా effort less గా మాట్లాడితే అంత fluency పెరుగుతున్నట్లు లెక్క.
--నా మటుకు నన్ను చెప్పమంటే Sidney sheldon రాసిన ఫిక్షన్ చదవమని చెప్తాను.దాని వల్ల కధా విషయం తెలియడం ఓ ఎత్తైతే మరో వైపు ఆ నవల ల్లోని పాత్రలు మాట్లాడే సంభాషణలు ..వర్ణనలు మీ మెదడు లో అప్రయత్నంగా రిజిస్టెర్ అవుతాయి.ఉదాహరణకి Sidney sheldon రాసిన MORNING,NOON& NIGHT అనే నవల్లో 293 వ పేజిలో గల కొన్ని సంభాషణలు మీ కోసం ఇక్కడ ఇస్తాను.ఓ స్త్రీ,ఓ పురుషుని మధ్య జరిగే సన్నివేశమిది.
"Wait a minute...!We really have to talk.."
"My bus is leaving"
" There will be anoher bus "
" My suitcase is on it"
Steve turned to a porter."This woman is about to have a baby.Get her suitcase out of there ..!quick..!"
Julia puzzled.
"Do you know what you're doing"
"No" Steve said.
ఎంత సింపుల్ గా,హాయిగా,భావయుక్తంగా,ఉన్నయో చూడండి ఈ సంభాషణలు.దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది..మీకు already ఇంగ్లీష్ వచ్చు.కాని fluency కోసమే గదా మీప్రయత్నం.బాగా గమనించండి...ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు మాట్లాడే భాషని మీరు బాగా గమనించండి...చాలా కృతకంగా...dry గా ఉంటుంది వారి శైలి.అది రాయడానికి బావుంటుంది..మాట్లాడం లో ఏదో ఆత్మ మిస్ అయినట్లుగ ఉంటుంది.
నేను నా అనుభవం లోనుంచి చెప్పే ఏకైక తిరుగులేని పట్టు ఏమిటంటే ఇంగ్లీష్ ఫిక్షన్ మాత్రమే దీనికి సహకరిస్తుంది.మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు...ప్రయిత్నించండి..మీకు నేను చెప్పని చాలా ఇతర విషయాలు కూడా పట్టుబడతాయి.ఇప్పుడు ఎందుకు చెప్పానో అప్పుడుగాని అర్ధం అవదు.
ఎవరైనా మీతో జోక్ చేస్తేనో ..ఇంకోటి చేస్తేనో ఇప్పుడైతే మీరేమంటారు. Don't be jovial అనో ఇంకోకటో ఒక stock లో ఉన్నవి మాత్రమే అంటున్నారా..Hey..stop fooling around here అనో stop kidding అనో ఇట్లా దైనందిన చర్యల్లో వాడుకలో ఉండే పదగుచ్చాలు అలవోకగా వచ్చేస్తాయి.ఏదైనా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది..?మీరు ఇప్పటిదాకా ఎన్నో విధాలా ప్రయిత్నించిఉండవచ్చు... చివరిగా నా ఈ విధానాన్ని చూసి,పనికిరాకపోతే చెప్పండి.
---K V V S Murthy

English speaking విషయంలో మీరు చెప్పే nuances చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. మంచి వ్యాసం. ధన్యవాదాలు.
ReplyDelete