Showing posts with label Meetings. Show all posts
Showing posts with label Meetings. Show all posts

Saturday, August 3, 2013

శ్రీమతి రాళ్ళబండి ఉమాదేవి గారి పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన

శ్రీమతి రాళ్ళబండి ఉమాదేవి గారి పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన సభ విద్యార్థుల,ఉపాధ్యాయుల,శ్రేయోభిలాషుల నడుమ కోలాహలంగా జరిగింది.రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరక్టర్ మరియు ఉమారాణి గారి సోదరులు అయిన డా.రాళ్ళబండి కవితాప్రసాద్ ముఖ్య అథితిగా ఫాల్గొన్నారు.ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి ఈ సమావేశానికి  అధ్యక్షత వహించారు.శ్రీమతి ఉమాదేవి మరియు వారి భర్త రామకృష్ణం రాజు గారిని వారి శ్రేయోభిలాషులు,మిత్రులు,విధ్యార్థులు ఘనంగా సన్మానించారు.

తెలుగు భాష లో ఉద్ధండులైన ఒక తరం వారు పదవీ విరమణ చేస్తుండగా ..మళ్ళీ ఇప్పుడొస్తున్న తెలుగు పండితులు అంతటి పాండిత్యం వున్నవారా అని ప్రశ్నించుకుంటే నిరాశే మిగులుతోందని శ్రీ కవితాప్రసాద్ అన్నారు.భద్రాచలం తో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.తెలుగు,సంస్కృతం,గ్ర్రీక్ భాషలకు మాత్రమే గల వైశిష్ట్యాన్ని వివరించారు.

డా.జయరామి రెడ్డి,మురళీధర రావు,ఏ.వి.రావు,తులసీ దాస్,గోపి,వాణీదేవి,బాలాజీ రాజు,ఇంకా ఇతరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమం తరువాత విందుభోజనంతో సమావేశం ముగిసింది.   

      





Wednesday, June 26, 2013

మధుర గాయకుడు చలం పాటల సి.డి. ఆవిష్కరణ!



భద్రాచలంలోని రెడ్ క్రాస్ భవనం లో ఇటీవల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు,జగమెరిగిన అభ్యుదయ గాయకుడు శ్రీ చలం యొక్క పాటల సి.డి ని ఆవిష్కరించడం జరిగింది.భద్రాచలం డివిజన్ లోని చర్ల గ్రామానికి చెందిన చలం తన స్వరాలాపన ద్వారా ఎల్లరకు చిరపరిచితులే! మొత్తం ఆరు గీతాలు ఈ సి.డి. లో ఉన్నాయి.వారి కుమారుడు శశాంక్  కూడా దీనిలో ఓ పాటని పాడారు.

శ్రీయుతులు మాగంటి సూర్యం (లిటిల్ ఫ్లవర్స్ సంస్థల అధినేత),సాహితీ స్రవంతి రాష్ట్ర బాద్యులు ఆనందాచారి,ప్రసిద్ద కవి మాల్యశ్రీ,యు.టి.ఎఫ్. జిల్లా బాద్యులు గోపాల కృష్ణ,స్థానిక కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసిం హా రావు, రచయిత వెంట్రపల్లి సత్యనారాయణ ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో ఫాల్గొన్నారు.