భద్రాచలం లో రామాలయం చూసిన తర్వాత మీకు వీలుంటే ఆ ప్రక్కనే కొద్ది దూరం లో ఉన్న కుసుమ హరనాధ బాబా మందిరానికి కూడా వెళ్ళవచ్చు.అక్కడ జనసందోహం అంతగా వుండదు.మందిరం కూడా చాలా నాళ్ళ క్రితం నిర్మించినది.కాని గొప్ప ప్రశాంతంగా వుంటుంది.చల్లగానూ వుంటుంది బాగా ఎత్తులో వుండటం వల్ల..! అక్కడినుంచి రామాలయం..ఇంకా పట్టణం మంచిగా కనిపిస్తుంది.
హరనాధ బాబా పశ్చిమ బెంగాల్ లో జన్మించిన సాధుపుంగవులు.ప్రపంచం లో వుంటూనే ప్రపంచాతీతంగా మనిషి ఎదగవచ్చుననేది వారు బోధించారు.ఆయన 1865 జూలై 1 న బంకూరా జిల్లాలో జన్మించారు.స్వయంగా గృహస్తుగా వుంటూనే రుషిసత్తమునిగా పేరుపొందారు.ఆయన జీవిత కాలం లో ఒక విన్నుత్న పద్దతిని ఎన్నుకున్నారు.ప్రతి రోజూ 15 నుంచి 20 వుత్తరాలు రాసేవారు.అలా కొన్ని వేల వుత్తరాలు రాసి ప్రజల్లో ని అనేక సందేహాలు తీర్చుతూ ...దైవాన్వేషణలో తన సలహాలనిస్తుండేవారు.
గొప్ప సిద్దపురుషుడు..కృష్ణభక్తుడు...అయిన ఆయన ఒకేసారి 5 గురు వ్యక్తులుగా దర్శనమిచ్చేవారట. ఇలా వారి గురించ్చి చెప్పాలంటే చాలా వున్నది. ఆ మందిరం పరిసరాలు పచ్చగా వుండి ఆహ్లాదకరంగా వుంటుంది వాతావరణమంతా ...!వాటికి సంబందించిన కొన్ని చిత్రాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Thanks a lot for your appreciation Varma garu....!
ReplyDelete