Wednesday, July 10, 2013

ధ్యాన మందిరం లో రామదాసు కీర్తనలన్నిటిని లోపలి గోడల పైన చెక్కించారు


రంగనాయకుల గుట్ట మీద గల ధ్యాన మందిరం రామాలయానికి చేరువలోనే వుంటుంది.అక్కడున్న ధ్యాన మందిరాన్ని 1962 లో నిర్మించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు దీనికి. ఆంధ్ర ప్రభ సంపాదకులుగా వున్న నీలం రాజు వెంకటశేషయ్య గారి కృషి చాలావున్నది ఈ నిర్మాణం వెనుక.

ధ్యాన మందిరం లో రామదాసు కీర్తనలన్నిటిని లోపలి గోడల పైన చెక్కించారు.ఒకప్పుడు అంటే ఇంచుమించు పాతికేళ్ళ వరకు సంగీతోత్సవాలు దీంట్లోనే జరిగేవి.జగత్ప్రసిద్దివహించిన పండిట్ రవిశంకర్ లాంటి వాళ్ళు సితార్ వాదనల్ని ఇక్కడ వినిపించారు.దక్షిణాది,ఉత్తరాది అనే భేదం లేకుండా ఎంతోమంది లబ్ద ప్రతిష్టులైన సంగీత కారులు ఇక్కడ తమ  విద్యని ప్రదర్శించారు.

ఇప్పటికీ డిసెంబర్ నెలలో ఈ ఆరాధనోత్సవాలు జరుగుతుంటాయి.అయితే ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గర జరుగుతుంటాయి.మంగళంపల్లి,జేసుదాసు,హరిప్రసాద్ చౌరాసియా ఇలాంటి ప్రముఖులు
 ఇప్పుడెందుకనో అప్పటిలా వచ్చి కచేరీలు చేసినట్టుగా లేదు.

ధ్యాన మందిరం మీద సత్రాలు..ఇంకా ఇతర కాటేజీలు వున్నాయి.మంచి చల్లని గాలి వీస్తుంటుంది ఎప్పుడూ..!ఆ పైనుంచి చూస్తే గోదావరి ఒంపులు తిరిగినట్టుగా అందంగా కనబడుతుంది.
   















2 comments:

  1. చిన్నతనం లో భద్రాద్రి ధ్యాన మందిరం లో ఆడుకొనే వాడిని , మా ఇల్లు రాజవీధి లోనే ఉన్నది .భద్రాచలం విశేషాలు తెలుపుతున్నందుకు ధన్యవాదములు

    ReplyDelete
  2. మిమ్మల్ని ఈ బ్లాగు లో కలవడం చాలా సంతోషంగా వుంది కాశ్యప్ గారు..! ధన్యవాదాలు..!

    ReplyDelete

Thanks for your visit and comment.