వాసిరెడ్డి రాజేంద్రప్రసాద్ గారు డ్రాయింగ్ మాస్టారుగా చాలా కాలంగా తెలుసు.పిల్లలని సృజనాత్మక చిత్రకారులుగా తీర్చి దిద్దటంలో వారి నైపుణ్యాన్ని ఇటీవలనే గమనించాను.J.N.T.U. హైదరాబాదు లో చిత్రకళలో డిప్లొమా పొందినతరవాత దుమ్మగూడెం జడ్.పి.హైస్కూల్ లో చిత్రకళోపాధ్యాయులుగా నియమింపబడ్డారు.ఆ తరువాత ఇప్పుడు నన్నపనేని జడ్.పి.హైస్కూల్ లో పనిచేస్తున్నారు.ఇటీవల ఆ పాఠశాల లో కి వెళ్ళినప్పుడు పిల్లలు వేసిన వివిధ చిత్రాలను చూపించారు.కలర్ పెయింటింగ్స్,పెన్సిల్స్ తో వేసినవి, పెన్స్ తో వేసినవి,తైల వర్ణ చిత్రాలు ఇంకా అనేక చిత్రాల్ని చూపించారు వారి రూములో..!
విధ్యార్దిని విధ్యార్ధుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు నింపుతున్న ఉత్సాహాన్ని ,ప్రేరణ కలిగిస్తున్న వైనాన్ని ప్రశంసించ లేకుండా వుండలేకపోయాను. మన బ్లాగు ద్వారా ఆ విషయాలని తెలియజేయాలని ఈ పోస్ట్ పెడుతున్నాను. మిగతా సబ్జక్ట్ లు చదివి అలసట చెందినపుడు డ్రాయింగ్ అనేది పిల్లలకి స్వాంతన చేకూర్చుతుందన తెలిపారు.గత ఏడాది ఈనాడు వారు హాయ్ బుజ్జీ పేరిట నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో 11 బహుమతులకు గాను 10 బహుమతులు తమ విధ్యార్ధులు పొందినట్లు చెప్పారు.అలాగే భద్రాచలం పేపర్ బోర్డ్స్ వారు 2012 లో ప్రజ్ఞా పేరిట నిర్వహించిన కాంపిటీషన్ లో జి.మాధవి అనే తమ విధ్యార్దిని ప్రత్యేక బహుమతి పొందినట్లు తెలియజేశారు.అదేవిధంగా సాక్షి వారు వై.ఎస్.ఆర్. స్మారకార్ధం నిర్వహించిన పోటీలో మండల స్థాయిలో సోయం లక్ష్మి అనే విధ్యార్దిని ప్రధమ బహుమతి పొంది జిల్లా స్థాయికి కూడా వెళ్ళినట్లు చెప్పారు.
వోటర్స్ డే సందర్భంగా ఇంకా అనేక ప్రత్యేక సందర్భాల్లోనూ తమ పాఠశాలలోని పిల్లలు రాణించిన విషయాన్ని తెలిపారు.జి.మాధవి,సి.హెచ్.మానస ,ఎం.దుర్గ,నవీన,షబాన,ఎస్.లక్ష్మి,ఎల్.రాకేష్,దుర్గాప్రశాంత్,సాయితేజ మొదలైనవారు బాగా రాణిస్తున్నట్లు తెలిపారు.
తన అచీవ్మెంట్స్ గురించి చెప్పమనగా కొన్ని ఉదంతాలని తెలిపారు.3 సార్లు హెవీ వాటర్ ప్లాంట్స్ ,మణుగూరు వారు నిర్వహించిన అఖిల భారత స్థాయి డ్రాయింగ్ పోటీలకి జడ్జి గా వ్యవహరించారు.కేంద్ర జలవనరుల సంఘం నుంచి నీటి ఆవశ్యకతపై వేసిన చిత్రానికి గాను ఆ మంత్రిత్వ శాఖ నుంచి సర్టిఫికేట్ పొందినట్లు తెలిపారు.
మరిచిపోలేని ఒక సంఘటన గురించి చెబుతూ 2012 లో D.A.V. సంస్థల వారు ఆల్ ఇండియా లెవల్ లో ఒక డ్రాయింగ్ పోటిని నిర్వహించినపుడు తనని జడ్జి గా పిలిచినపుడు ఎదురైన ఓ సన్నివేశం గూర్చి తెలిపారు.దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేంద్ర అణుశక్తి కమీషన్ చైర్మన్ భట్నాగర్ గారు తన ను ప్రత్యేకంగా అభినందించడం మరిచిపోలేని అంశంగా చెప్పారు.నన్నపనేని మోహన్ మరియు పాకాలపాటి చంద్రశేఖర్ గార్లు తనకు మంచి పోత్సహాన్ని ఇస్తున్నట్లుగా చెప్పారు.
Click here for more

బాగుంది. మీకూ, రాజేంద్రప్రసాద్ గారికీ అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలు వర్మగారు!
ReplyDeletevery good
ReplyDeletePratap Kumar
Zaheerabad
Medak Dist.
thank you sir
ReplyDeleteits very nice