Saturday, August 31, 2013

బ్రిటీష్ వాళ్ళు ఏదిచేసినా సాధ్యమైనంత ఎక్కువకాలం మన్నేలా ఒక నిర్మాణాన్ని చేస్తారు.



బ్రిటీష్ వాళ్ళు ఏదిచేసినా సాధ్యమైనంత ఎక్కువకాలం మన్నేలా ఒక నిర్మాణాన్ని చేస్తారు.ఈ రోజు భద్రాచలం లోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని మరమ్మత్తులు చేస్తున్న ఒక న్యూస్ చూడగానే అలా అనిపించింది.ఎందుకంటే ఆ భవనం ఎప్పుడో ఓ శతాబ్దం క్రితం బ్రిటీష్ హయాంలో నిర్మించినది.కాలగమనంలో ఏవో చిన్న రిపేర్లు తప్ప పెద్దగా  దెబ్బతిన్నదిలేదు.రాతితో చాలా విశాలంగా ఉంటుంది.మంచి వెలుతురు,ధారళమైన గాలి వచ్చే గదులు ..బయట ప్రజలు నిరీక్షించడానికి స్థలం,అందమైన ఆర్చ్ లు కలిగి వుండి యూరోపియన్ శైలిలో నిర్మించబడి వున్నది.మనం ఏ లక్ష్యం కొరకు ఒక నిర్మాణం చేస్తున్నాము అని యోచించి..దాని అవసరాలకి తగినట్లుగా భవన నిర్మాణం చేయడం వారి లక్షణం.దానిని మఖలో పుట్టి పుబ్బ లో పోయే దానిగా కాకుండా కొన్ని వందల సంవత్సరాలు ఉండేటట్లు నిర్మిస్తారు.ఇక్కడనేకాదు..లండన్ లో కూడా 4 లేదా 5 వందల ఏళ్ళక్రితం నిర్మించిన భవనాలని చక్కగా సమ్రక్షించి వాటిని ఉపయోగించుకుంటుంటారు.

చరిత్ర ని రక్షించుకోవడం వారికి వెన్నతోపెట్టిన విద్య.దురదృష్టవశాత్తు మనదేశంలో చాలామంది చదువుకున్నవారికి కూడా ఆ జ్ఞానం వుండదు.లేకపోతే దుమ్మగూడెం దగ్గరలోని కెయిన్ పేటలోగల కొన్ని అప్పటి భవనాలు...ఇంకా అప్పటి డేటాలని తెలిపే  బ్రిటీష్ వారి సమాధులని నాశనం చేసివుండేవారు కాదు. Click here for more

  

1 comment:

  1. వాళ్ళు ఇప్పటిలా తక్కువ టెండరు పధ్ధతిన దిక్కుమాలిన ఆశపోతు కంట్రాక్టర్లకు ఈ పనులు ఇచ్చేవారుకాదు.

    ReplyDelete

Thanks for your visit and comment.