కవిగా,నటునిగా,స్వచ్చందసేవకునిగా ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తున్న 'జీవా అసలు పేరు గుమ్మల వెంకటేశ్వరరావు.భద్రాచలం డివిజన్ లోని కూనవరం లో శ్రీ సీతారామయ్య,శేషమ్మ దంపతులకు జన్మించారు.యువకళా నాట్య మండలి,గౌరిదేవిపేట సంస్థ ద్వారా మొద్దబ్బాయి అనే ఏకపాత్రతో రంగస్థలప్రవేశం చేశారు.1986 లో భద్రాచలంలో ప్రభవ కళానాట్యమండలి స్థాపించి అనేక నాటికలు ప్రదర్శించారు.కొత్తగూడెం గోల్డెన్స్టార్ సంస్థ నిర్వహించిన నాటికల పోటీల్లో ఉత్తమ నటుడు,ప్రదర్శన కి గాను బహుమతులు పొందారు.
జిల్లా సాక్షరతా కార్యక్రమాల్లో చురుగ్గా ఫాల్గొని డివిజన్ స్థాయి శిక్షకునిగా పనిచేశారు.అప్పటి ఎం.ఎల్.ఏ. కుంజా బొజ్జి గారిచేత ప్రశంసా పత్రాన్ని పొందారు.1992 లో జిల్లా సాంస్కృతిక సంస్థ ద్వారా శిక్షణాతరగతులలో ఫాల్గొని కొత్తగూడెం ఎం.ఎల్.ఏ. వనమా వెంకటేశ్వర రావు గారిచేత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ప్రియతమా,ప్రేమికుల చట్టం అనే టెలీ ఫిల్మ్ లను నిర్మించారు.భద్రాద్రి భారతి,భారతభారతి అనే సంస్థల్ని స్థాపించి నాటికల,కవితల,డాన్స్ పోటీలను నిర్వహించారు.ఇదంతా ఒక ఎత్తుకాగా వారి తండ్రి పేరుపై స్థాపించిన గుమ్మల సీతారామయ్య మెమోరియల్ సంస్థ తరపున చేపట్టిన కార్యక్రమాలు ఒక ఎత్తు.పేదప్రజలకు,ఇతర కార్యక్రమాలకు ఇతోధిక సహాయం చేశారు.వీరి కవితా సంకలనాలు " పల్లవి,జీవకలం" లను భావతరంగిణి ,మచిలీపట్నం వారు ఆవిష్కరించారు.అ.ర.సం. వారు నిర్వహించిన కవితల పోటీల్లో కన్సోలేషన్ బహుమతిని సాధించారు.
హైదరాబాదు త్యాగరాయ గానసభ లో సీనియర్ సిటిజన్ పత్రిక వారు వీరికి "జీవకవితాజలధి " అనే బిరుదునిచ్చిసత్కరించారు.ఎన్నో అవార్డులు,రివార్డు లతో ముందుకు దూసుకుపోతున్న జీవ గారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. Click here for more
No comments:
Post a Comment
Thanks for your visit and comment.