భువనేశ్వర్ లో కొన్ని రోజులుండి అక్కడి ప్రాచీన ఆలయాలని,చారిత్రక విశేషాలని చూడాలని ఎప్పటినుంచో అనుకొంటుండగా అది మొన్న జూన్ నెలలో కుదిరింది.అంతకు ముందు ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు ఈ భువనేశ్వర్ లో కాసేపు ఆగాను రైలు దిగి!అయితే చూసేందుకు ఏమీ వీలు కాలేదు.
రైలు ప్రయాణం లో సగటు భారతీయుని బాగా గమనించవచ్చు.వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు గాని..కొన్ని బుద్దులు ఒకేలాగా ఉంటాయి అనిపిస్తుంది.టాయ్లెట్ కి వెళతారా..వచ్చేటపుడు దాని తలుపు వేయరు ..బద్దకం..మళ్ళీ చూస్తే చదువుకున్నవాళ్ళే..! అయితే ఒకోసారి కొన్ని సహాయాలు చేస్తుంటారు..ఒకాయనకి సీటు కన్ ఫర్మ్ కాలేదు..నిలబడి వున్నాడు...ఒక వారణాసి వెళుతున్న యువకుడు అతని సీటులో సర్దుకోవలసిందిగా ఆఫర్ చేశాడు.మళ్ళి ఇలాంటి మానవత్వాలూ ఉంటాయి.
Railway station,Bhubaneswar.
అందుకే ఇండియా లోని సంక్లిష్టతల్ని ఎలా అర్ధం చేసుకోవాలో వెంటనే బోధపడదు.బెర్హం పూర్ (బరం పురం) వచ్చేంతదాక తెలుగు ప్రదేశం లాగే ఉంటుంది.ఆ తరవాత నుంచి జిల్లా కేంద్రాలైనా చాలా చిన్న ఊళ్ళలాగానే తోచాయి.రైల్లో రంజన్ ప్రధాన్ అనే ఒడియా వ్యక్తి పరిచయం అయ్యాడు.అతను ముంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నాడట. కొన్ని విషయాలు చర్చించాము.ఎందుకో గాని అక్కడి కొంతమంది ప్రజల్లో తెలుగు వాళ్ళు దోపిడి దారులు అనే అభిప్రాయం వుంది.ఇక్కడ కి ఒడియా కూలీలని ఇటుకబట్టీ ల్లోకి పనిచేయించడానికి తీసుకువచ్చి వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారని..అలాగే ఒడిశా లోని తీర ప్రాంత భూములని కొని తమకి కాకుండా చేస్తున్నారని..ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మనపట్ల వాళ్ళకి. అక్కడి inteligentsia దృష్టిలో మనం అమెరికా లాంటి పెట్టుబడి దారీ తరహాలం.!
Raja rani Temple in Bhubaneswar
భువనేశ్వర్ లో రైలు ఆగగానే అక్కడ స్టేషన్ లో డార్మిటరీ లో వసతి కోసం వాకబు చేయగా అంతా ఫుల్ అయినట్టు తెలిసింది.బయటికి వచ్చి సాయి అమృత్ అనే హోటల్ లో బస చేశాను.రూం,సౌకర్యాలు బాగున్నాయి.భోజనం సరైంది దొరకలేదు.భువనేశ్వర్ రైల్ స్టేషన్ లోపల మటుకు ఒకే ఒక్క హోటల్ వుంది.బాగానే వుంటుంది గాని రేట్లు జాస్తి అనిపించింది.ఆ తెల్లారి స్టేషన్ లో ఉన్న ఒడిష టూరిజం కార్యాలయం లోని వ్యక్తిని సంప్రదిస్తే పెద్దగా రెస్పాండ్ కాలేదు. అంతలోనే అక్కడికి ఒక cab driver వచ్చాడు.అతని పేరు గణేష్ మిశ్రా.నాతో టూర్ పేకేజ్ వివరాలు చెప్పాడు..ఒకే అయినాక అతను ఆ టూరిజం ఉద్యోగికి కొంత డబ్బులు ముట్టజెప్పాడు.అంటే ఇదంతా ముందస్తు ఏర్పాటన్నమాట. Click here

No comments:
Post a Comment
Thanks for your visit and comment.