అలా నాలో ఉదయించిన ప్రయాణ ఆసక్తి వలన మొదటిసారి ఒంటరిగా తమిళనాడు వెళ్ళాను.నా మటుకు నాకు ఒంటరిగా తిరగడం లో నే ఒక దివ్య అనుభూతి ఉంటుంది. ప్రతి పొరపాటుకి మనమే బాద్యులం అవుతాము. ఒకళ్ళని నిందించవలసిన పని వుండదు.అలాగే మనకి ఎదురయ్యే రిస్క్ లని ఎలా పరిష్కరించుకోవాలో ఆయా సన్నివేశాలే నేర్పిస్తుంటాయి.రమారమి రెండు దశాబ్దాల క్రితం ఆ నా మొదటి ప్రయాణం లో చెన్నయ్ లో పురసవాక్కం లో గల కాల్క్ కాండు సంపాదకుడు లేనా తమిళ్ వాణన్ ని కలిశాను.ఆయన తను రాసిన ఒక పుస్తకాన్ని స్వహస్తాలతో సంతకం చేసి నాకు బహూక రించారు.అది ఒక self development అంశం పై రాసినది.అప్పటికి మన తెలుగు లో పెద్దగా ఆ ఒరవడి స్టార్ట్ కాలేదు.ఇలాంటి బ్లాగులు రాసే విధానం అప్పుడు వుంటే బాగుండేది.చాలా విషయాలు దాంట్లో నిక్షిప్తం చేసివుండేవాడిని.
అలాగే ఇళందేవన్ అనే ఒక ప్రముఖ తమిళ కవిని కూడా వారి ఇంట్లో (hunter road) కలిశాను.అతను అప్పుడు తమిళనాడు అసెంబ్లీ లో పి.ఆర్.వొ. గా పనిచేస్తుండేవారు.తమిళ సాహిత్యం గురించి చాలా ముచ్చటించారు.ఆ తరవాత చెన్నయ్ లో చూడదగిన ప్రదేశాలు ఇంచుమించు అన్నీ చూశాననే చెప్పాలి.సిటీ బస్ లో ఒక మళయాళీ కలిశాడు.అతని పేరు థామస్ ...ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు అని నాకు కొంత హిత బోధ చేశాడు.
ఆ తరవాత చాలాసార్లు చెన్నయ్ వెళ్ళాను.అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి నాకెప్పుడూ కలగలేదు.మద్రాస్ లో తిరగడం ఈజీ అనిపిస్తుంది నాకు..ఎవరినడిగిన వీధుల వివరాలు గాని..అడ్రెస్ గాని చెబుతారు.ఆ తరవాత కేరళ వెళ్ళాను...కొట్టాయం ఊరి పేరు.అయితే వాళ్ళు మాత్రం కోట్టయం అని పిలుస్తారు.మళయాళమనోరమ వాళ్ళ కార్యాలయం కి దగ్గరలోని ఓ హోటల్ వున్నాను.కేరళ లో పట్టణానికి,గ్రామానికి పెద్దగా తేడా వున్నట్టు కనబడలేదు.
ఎక్కడ చూసినా పచ్చదనమే.ఇళ్ళు చాలామటుకు బంగాళా పెంకుటిల్లు గానే వున్నాయి.కాని శుబ్రత అనేది బాగా వున్నది.తమిళుల మాదిరిగా కలివిడి మనుషులు గా అనిపించలేదు.ఎవరి విషయం వారిదే అన్నట్టుగా వుంటారు.ప్రకృతి శోభ గొప్పగా వుంటుంది.ప్రతి ఊరు పార్కులో ఉన్నట్టుగా అనిపించింది.ఇంకా వీటి గూర్చి మరో సారి వివరంగా రాస్తాను. Click here

No comments:
Post a Comment
Thanks for your visit and comment.