Tuesday, October 15, 2013

నిన్నటి పాడుతా తీయగా పై నాలుగు ముక్కలు

చినుకులా రాలి...అనే మృదు మధురమైన గీతం తో కార్యక్రమం ఆరంభమైంది. రాజన్ నాగేంద్ర ల ఆ మెలోడి ఎంత విన్నా వినబుద్దవుతుంది.ఎక్కువ రణ  గొణ శబ్దాలు లేకుండా ఆ బెల్స్..వయోలెన్స్ ..చక్కగా వుంటాయి.ఓ నవ్వుచాలు ...అనే సందీప్ పాట హుషారుగా సాగింది.వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా ...ఉదయబిందు చాలా చక్కగా ఆలపించింది.సాహిత్యం బాగుంటుంది దాంట్లో.ఎంతైనా వేటూరి గారి master strokes అవి గమ్మత్తుగా ఉంటాయి.నిన్నే నిన్నే ..అనే పాటని శ్రీకాంత్ బాగానే పాడాడు..కాని ఇంకా గొంతులో పవర్ తో పాడాలి.చక్రి పాడిన ఆ పాటని వింటే మూలనున్న ముసలివ్యక్తి కూడ లేచి డాన్స్ చేస్తాడు..అంత ఊపుతో ఉంటుంది.

దిల్ దీవనా ..పాట ఓ.కె., గోవిందా...గోవిందా అనే పాట మీనన్ బాగానే లాగాడు.ఇక్కడ పిట్స్ బర్గ్ అనే మాట వచ్చినపుడు నాకు గల ఓ నోస్టాల్జియ చెప్పాలనిపించింది. అక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లో పాలుపంచుకున్న మా బాబాయి అమెరికా ప్రయాణం గుర్తుకొచ్చింది.అప్పుడు నేను ఇంటర్మీడిఎట్  చదువుతున్నాను.ఈ సాఫ్ట్వేర్ బూం కూడా మొదలు కాని రోజులవి.

ఇక వల్లంకి పిట్ట ..అనే పాట వంశీప్రియ చక్కగా పాడింది.ఆ అమ్మాయి pensive nose,ముఖకవళికలు చూస్తుంటే సగటు అమెరికన్ లా గా అనిపిస్తున్నది నాకైతే..!  Click here


   ( ఏమిటి..భద్రాద్రి ఎక్స్ ప్రెస్ లో రావలసిన ఈ రివ్యూ ఈబ్లాగులో  వచ్చిందేమిటి అనుకొంటున్నారా..ఇదీ మనదే కానివ్వండి...!) 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.