Monday, November 25, 2013

ఈ వరుసలో ముందు చెప్పదగినవారు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు.

కొన్నాళ్ళక్రితం అనిపించింది తెలుగు లో వచ్చే రకరకాల ప్రచురణల ను గూర్చి ఇంగ్లీష్ లో రివ్యూ చేస్తే ఎలా ఉంటుంది అని..!ముఖ్యంగా తెలుగు మాతృభాష కానివారికి మన దగ్గర నుంచి వచ్చే వివిధ రచనల గూర్చి అలా ఎంతో కొంత తెలుస్తుంది.అలాగే బోరు కొట్టే లా కాకుండా Brief గా .మూల పదార్ధాల్ని కొంచెం లో చూపేవిధంగా ఆ రివ్యూలుండాలి.అలా ఏదైనా చేస్తే బాగుంటుందనిపించి "THE BOOKS" అనే ఓ బులెటిన్ ని ప్రారంభించాను.దాంట్లో బ్రీఫ్ రివ్యూ లకే అధిక ప్రాధాన్యత నివ్వడం జరిగింది.



ఆ ఇంగ్లీష్ బులెటిన్ ని వివిధ రాష్ట్రాలలోని స్నేహితులకి,గ్రంధాలయాలకి,పత్రికలకి పంపేవాడిని.ఆ విధంగా ఎంతో కొంత సంతృప్తి పొందేవాడిని.దాని వెల కూడా చాలా స్వల్పం.ఒక విధంగా చెప్పాలంటే negligible and non profitable అని కూడా చెప్పాలి.అయితే దానికయ్యే డి.టి.పి. ఖర్చులు,పోస్టల్ ఖర్చులు తడిసి మోపెడయ్యేవి.ఒక రకంగా చెప్పాలంటే financially not viable.



అది నాకు అనుభవం మీద తెలిసివచ్చింది.గొప్ప లాభాలు దీంట్లో పండించాలని కాదుగాని దాని ఖర్చుల మాత్రమైనా వస్తాయేమోనని అనుకున్నాను.అలా జరగలేదు.అయితే అందుకు నేను పశ్చాతాపం చెందటం లేదు.ఎందుకంటే ఎన్నో మంచి తెలుగు కవితా సంకలనాలని,ఇతర పుస్తకాలని నాకు చేతనైనంత మేరలో తెలుగేతరులకు ,తెలుగులకు తెలియబరిచే ప్రయత్నం చేశాను.ఆ తృప్తి మాత్రం కలిగింది.

రమారమి మూడుసంవత్సరాలు (2005-2008) నేనే సైనికుడిని..నేనే పాలకుడిని  ఆ చిన్ని పత్రికకి..! కాలం గడుస్తున్నకొద్దీ కొంతమంది మంచి రసజ్ఞుల పరిచయభాగ్యం ఆ బులెటిన్ నాకు కలిగించింది.నా తపనని అర్ధం చేసుకున్న సాహితీ మితృలు నేను అడగకుండానే నాకు సంవత్సర చందా( రూ.50/-) ని పంపించారు.

ఈ వరుసలో ముందు చెప్పదగినవారు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు.మొట్టమొదటిగా ఈ పత్రికకి చందా పంపినది వారే..!ఆ తరువాత శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దేవకి గారు,ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు సాంవత్సరిక చందాలు పంపారు. అలా మొత్తం మీద ఓ ఆరుగురు పంపించారు.సంఖ్య స్వల్పమే అయినా నేను ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తులలో ఒకరిగా వారంతా మిగిలిపోఅయారు.వారందరకీ మనహ్ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

అలాగే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఉద్యోగించి రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ వేణుగోపాల రాజు గారు ఈ బులిటెన్ ని ఎంతగానో అభినందించి పలు విలువైన సలహాలనిచ్చారు.వీరందరూ నాకు ఈ ప్రయత్నం లో ప్రోత్సాహాన్ని ఇచ్చిన రసపిపాసులు.ఎంతోమంది కవులు,రచయితలు తమ పుస్తకాలని సమీక్ష కోసం పంపేవారు.కొంపెల్ల కామేశ్వర రావు గారు,శ్రీరామకవచం సాగర్ గారు,తోటకూర వెంకటనారాయణ గారు,నేతల ప్రతాప్ కుమార్ గారు,మాకినీడి సూర్య భాస్కర్ గారు ఆదూరి సీతారామ మూర్తి గారు,ఇంకా ఇలా ఎంతోమంది కవి మితృలు తమ ప్రచురణలని పంపేవారు. అందరికీ ధన్యవాదాలు.

ఈ బులెటిన్ నడిపే క్రమం లో ఒడిశా లోని భువనేశ్వర్ కి చెందిన బిజొయ్ కుమార్ మండల్ గారి తో పరిచయమైనది.ఈయన రెండు డజన్ లకి పైగా పుస్తకాలని ఇంగ్లీష్ లో రాసినవి పంపించారు.ఆయన పబ్లిషర్ కూడా...చాలా ఇతర రాష్ట్రాలకి చెందిన వారి రచనల్ని సైతం ప్రచురించి విశ్వవ్యాపితం గా మార్కెట్ చేసేవారు.ద్రోణం రాజు పద్మలత (విశాఖ) గారి ఓ కవితా సంకలనాన్ని ఈయన ప్రచురించి సమీక్షార్ధం పంపించారు.అంతవరకు ఈ ఇండో ఆంగ్లికన్ కవయిత్రి గూర్చి నాకు తెలియదు.

డి.టి.పి. చేయించడం,కాపీలు దిద్దడం,రివ్యూలు పోస్ట్ చేయడం ఈ పనులన్నీ ఒంటరిగా చేసే ప్రయత్నం లో కొంత అలిసిపోయి ఈ బులెటిన్ ని ప్రస్తుతం ఆపుజేశాను.ఇక్కడ ఆ తీపి గుర్తులు కొన్నిటిని ఫోటోల రూపం లో ఇచ్చాను చూడండి.


అప్పుడప్పుడు కొంతమంది మితృలు అడుగుతుంటారు ..THE BOOKS గూర్చి..! వీలైనంత త్వరలో మళ్ళీ పునరుద్ధరిస్తానని చెబుతుంటాగాని..ఏమో అది జరుగుతుందో లేదో చెప్పలేను.ఇప్పుడు ఎలాగు బ్లాగుల సౌకర్యం ఉంది గదా..ఒక బ్లాగు దీని కొరకు తెరవవచ్చునేమో చూద్దాం..!Click Here

        

No comments:

Post a Comment

Thanks for your visit and comment.