ఎందుకని తెలుగువాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ భాషని చాలా జటిలంగా,కఠినంగా రాయాలని ప్రయత్నిస్తుంటారు..?
ఎందుకని తెలుగువాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ భాషని చాలా జటిలంగా,కఠినంగా రాయాలని ప్రయత్నిస్తుంటారు..?తాము రాసే ఇంగ్లీష్ రాతల్లో అవసరం కాకున్నా ఆడంబరమైన words ని phrases ని వాడి...ఇదిగో చూశావా నా తడాఖా అన్నట్టు ..ప్రవర్తిస్తుంటారు. తెలుగులు రాసే ఆంగ్ల వ్యాసాలు గాని,నడిపే ఆంగ్ల పత్రికలు గాని (న్యూస్ వెబ్ పోర్టల్స్ తో సహా) ,ఇంకా ఇతరత్రా ప్రక్రియల్లో గాని ఇంగ్లీష్ రాసే ఒరవడిలో తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం ,ఒక మూసదనం తో కూడిన ధోరణి కనిపిస్తుంది.
చాలామటుకు ఎదుటివాడు వెంటనే అర్ధం చేసుకోకుండా కొంత confusion ని మెయింటైన్ చేయాలని తమ ఆంగ్ల రాతల్లో ప్రయత్నిస్తుంటారు.ఎంత వారికైనా native flavour ని మిళితం చేయకుండా ఇంగ్లీష్ రాయలేరు.నిజం చెప్పాలంటే అది కొంత అందాన్నిస్తుంది. మన భారతీయ ఆంగ్ల రచయితలు R.K.Narayan లాంటివారు west లో కూడా బాగా పాపులర్ అవడానికి అదే కారణం.
సాదాసీదా మాటలతో చక్కటి శైలి లో ఎంతో అందంగా ఇంగ్లీష్ లో రాయవచ్చును.ఇప్పుడంతా అమెరికన్ల యుగమే కదా నడుస్తున్నది..ఇంటర్నెట్ లో కూడా ఎక్కువగా అమెరికన్ తరహా పదప్రయోగాలనే అన్నిటా ఉపయోగిస్తున్నారు.తెచ్చిపెట్టుకున్న పటాటోపాలు లేకుండా సూటిగా సాధ్యమైనంత భావవ్యక్తీకరణ యే లక్ష్యంగా సాగే అమెరికన్ తరహా ఆంగ్లమే ఈ రోజు మనకి అవసరం అని నా అభిప్రాయం.అలాగని ఇంగ్లీష్ మూల సూత్రాలు దెబ్బతీసేవిధంగా ఏమీవుండదు.
మనకి తెలియకుండానే అనేక విధాలయిన మీడియా ప్రభావాల వల్ల అమెరికన్ తరహా ఇంగ్లీష్ నే ఎక్కువగా వాడుతున్నాము,కాని రాయడం దగ్గరకి వచ్చేసరికి కొంతమంది తెలుగు కవులు అర్ధం కాని సంస్కృత పదబంధాలని మద్యలో ఇరికించడానికి ఎలా తాపత్రయపడుతుంటారో అలా ఏ మిల్టనో,బైరనో,కీట్సో ఎక్కడో సందర్భానుసారంగా వాడిన జటిలపదాలని ఇరికించడానికి చూస్తుంటారు.
నేను భారతదేశం లో ని ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడల్లా అక్కడి పట్టణాల్లో ఇలాంటి విషయాలని పరిశీలిస్తుంటాను. ఎంతో వెనుకబడిందని చెప్పుకునే ఒడిషా లాంటి రాష్ట్రం లో కూడా మామూలు గ్రాడ్యుయేట్లకి కూడ చాలామందిలో మంచి ఇంగ్లీష్ భాషా సృజనాత్మకత ఉన్నదని గమనించాను. ఒరియాలో రాసిన విధం గానే ఆంగ్లం లో కూడా రాయడం కనిపించింది. బాలంగీర్,పూరి ,కటక్,తిగిరియా ,భుబనేశ్వర్ లో నాకు ఇలాంటివారు కొంతమంది వ్యక్తిగతం గా తెలుసు.ఒక సీతాకాంత్ మహాపాత్ర,ఒక మనోజ్ దాస్ లాంటి ఇండో ఆంగ్లికన్ రచయితలు అక్కడి నుంచి వచ్చారు అంటే అటువంటి అభినివేశమే కదా...!
కేవలం చదువులోనో ఇంటర్వ్యూ లోనో పాస్ మార్కులు పొందడానికి ఒక frame work లో నేర్చుకున్న ఆంగ్లం సరిపోతుంది.అయితే సృజనాత్మక రచనలు చేయడానికి అంతకు భిన్నమైనది ఇంకొకటి కూడా కావాలి.Mainstream లో వస్తోన్న భాషాస్వరూపాన్ని పట్టుకోవాలి.అది కేవలం విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నంతమాత్రాన రాదు.దానికి నిరంతరం విస్తృతమైన సమకాలీన ఫిక్షన్ లేదా నాన్ ఫిక్షన్ ని చదువుతుండాలి.
ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు వారంతా ..పల్లెనుంచి పట్టణం దాకా ఇంకా మహా నగరం దాకా అంతా ఇంగ్లీష్ మీడియం లోనే కదా చదువుతున్నారు.కాని ఎందుకని ఇంగ్లీష్ భాషలో క్రియేటివ్ రైటర్స్ ని ..ఒక చేతన్ భగత్ నో ...లేదా పాతతరం లో అయితే ఆర్కె నారాయణ్ లాంటి వారినో మనం సృష్టించుకోలేక పోయాము..?
నోటికి ఇంకా రాతకి పట్టుబడే సహజమైన ఇంగ్లీష్ structures కోసం అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా గా ఇంగ్లీష్ నేర్చుకునే విధానం కంటే సీరియెస్ గా ఒక సిడ్నీ షెల్డన్ నవల తీసుకొని చదవడం ప్రారంభించమని నేను సలహా ఇస్తుంటాను.ఆ తరవాత షేక్స్పియర్ ని నెమ్మదిగా చదవండి.
ఒక వేపు కధ,ఇంకో వేపు భాషా స్వరూపం అలావోకగా ఆడుతూ పాడుతూ తెలుస్తుంది.
పడికట్టు..మూస విధానం లో కాకుండా ఎంత చక్కగా...అందంగా ఇంగ్లీష్ లో వ్యక్తీకరణ చేయవచ్చునో pulp fiction ని చదివిన తర్వాతనే నాకు తెలిసింది. ఆ తరవాత బేకన్ లాంటి వాళ్ళని చదువుకున్నాను. Mario Puzo నాకైతే ఆరాధ్యప్రాయుడు.ముందు ఆయన God Father చదివాను.హీరో ఇటాలియన్ నేపధ్యాన్ని అతను అమెరికా కి వలస వెళ్ళిన తరువాత కూడా ..చివరికి అతను మరణించేవరకు కూడా...ఎలా అతని యొక్క కేరక్టర్ ని తీర్చిదిద్దుతాడంటే ..ఆ సినిమా కంటే కూడా అద్భుతం గా వుంటుంది.డాన్(Don clericuzio) ని చివరకి మనవాళ్ళు ఒక వీధి రౌడి గా చేశారు.
ఆ తర్వాత అతను రాసిన Fortunate Piligrim,Family,Fools Die లాంటివి వరసబెట్టి చదివాను.ఆ దాహార్తి ఇంకా తీరక అలా పెరిగిపోతూనే ఉంది.సిడ్నీ షెల్డన్,సుసాన్ ఇసాక్స్,హెరాల్డ్ రాబిన్స్,జాన్ గ్రీషం ఇలా వరసబెట్టి ఒక రెండు వందలపైనే చదివుంటాను.నేను కధా కోసమో..ఇంకోదాని కోసమో చదివా గాని నాకు వాటికి మించిన విషయాలనే అవి నాకు అందించాయి. బాగా పాపులర్ అయిన ఓ ఇంగ్లీష్ ఫోటో బ్లాగు(Click here for my English Blog) కూడ ఈరోజున నేను రాస్తున్నానంటే అదంతా ఇలాంటి పుస్తకాల పఠనం వల్ల కలిగిన తెలివిడేతప్ప నా కాలేజీ ఇంగ్లీష్ చదువుల వల్ల కాదని మనవిజేసుకొంటున్నాను.ఇంకోటి...నాలోని ఏకాంత పర్యాటకుడిని రెచ్చగొట్టి దేశమంత తిప్పించినది కూడా ఈ వ్యసనమే..! Click here for more
--Written by KVVS Murthy

చాలాబాగుంది. మీనుంచి ఇలాంటి మరిన్ని మంచి టపాలు రావాలని కోరుకొంటున్నాను.
ReplyDeleteతప్పకుండా వర్మగారు...మీ సూచనకి ధన్యవాదాలు!
Deleteనమస్కారం మూర్తిగారూ!
ReplyDeleteమీ పోస్ట్ బాగుంది. నేను తెలుగు జర్నలిస్ట్‌ను. ఇంగ్లీష్ vocabularyలో ఓ మాదిరి పట్టు ఉంది. ఇంగ్లీష్ కంటెంట్ రైటర్స్‌కు బాగా డిమాండ్ ఉండటంతో ఇంగ్లీష్‌లో రాయటంకోసం ప్రయత్నిస్తున్నాను. ఆ మధ్య ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్(తెలుగువారికోసం ఉద్దేశించినది)కు కొన్నిరోజులు డైలీ అప్‌డేట్స్ వార్తలు రాశాను. కానీ ఇంకా మెరుగుపరుచుకోవాలని ఉంది. ఏమైనా సలహా ఇవ్వగలరు. నా ఇంగ్లీష్ బ్లాగ్(tejaswi11.blogspot.in) చూసి వీలైతే మీ అభిప్రాయం తెలపగలరు.
నమస్కారం తేజస్వి గారు...మీ బ్లాగు చూశాను.చాలా బాగుంది.అదే దారిలో ముందుకు వెళ్ళండి.ధన్యవాదాలతో...!
Delete