Saturday, January 11, 2014

కన్నులవిందుగా జరిగిన తెప్పోత్సవం



నిన్న  సాయంత్రం నుండి రాత్రి ఎనిమిది గంటలవరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది.భద్రాద్రి అంతా కోలాహలం గా ఉన్నది.అధికారులు,అనధికారులు,భక్తులు,పర్యాటకులు అంతా వెరసి తెప్పోత్సవం మరో మరపు రాని ఉత్సవంగా ముగిసింది.గోదావరి లో అలా హంసవాహనం పై పెరుమాళ్ళు విహరించడం ..ఆ చల్లని ఆహ్లాదకరవాతావరణం లో మనమంతా కూర్చొని చూడడం హాయిగా ఉంటుంది.నదిలో వాహనం రౌండ్స్ వేస్తుండగానే ఇరువైపుల నున్న తీరాల నుంచి పెద్దపెట్టున బాణాసంచా కాలుస్తుంటారు.అది చూడటం ఆనందంగా ఉంటుంది.

చిన్నప్పుడు మిస్ కాకుండా వెళ్ళేవాడిని...ఈమధ్యన కొన్ని సార్లు మిస్ అయినాను.ఎంతోమంది జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఈ ఉత్సవానికి వస్తుంటారు.నేనేమిటి...ఒక్కోసారి వెళ్ళలేకపోతున్నాను అనిపిస్తుంది...ఈ రోజు ఉత్తర ద్వారదర్శనం కూడా ...ఉదయం గుడి దగ్గర చాలా రద్దీగా ఉంటుంది.ఈ ద్వారం గుండా వచ్చే స్వామిని ఈరోజు  చూసినట్లయితే మరుజన్మ ఉండదని అంటారు.Click here


No comments:

Post a Comment

Thanks for your visit and comment.