Thursday, January 16, 2014

వైబోయిన సత్యనారాయణ గారికి భద్రాద్రి సాహితీ సంఘాల చరిత్రలో ఒక ప్రత్యేకత ఉన్నది.



భద్రాచలంలో నిన్న "సాహితీస్రవంతి" కార్యాలయం ప్ర్రారంభించంచబడింది.సాహిత్యపరమైన కృషి సలిపే సంఘాలకి ఒక ప్రత్యేక మైన కార్యాలయం ఏర్పడడం భద్రాద్రి లో నాకు తెలిసీ ఇదే మొదటసారి.దాని కొరకు దాతలు జి.శంకర్ రావు గారు ముందుకురావడం ముదావహం.సాహితీస్రవంతి  నూతన కార్యవర్గం తీసుకున్న మంచి నిర్ణయంగా దీన్ని పరిగణించాలి.అద్యక్షులు వీధుల రాంబాబు గారు వారి బృందం సర్వదా అభినందనీయులు.

సాహితీవేత్తలు శ్రీయుతులు ప్రభాకర్,కృష్ణ,తిరుపతి రావు,క్లాసిక్ షరీఫ్,బాబురావు ఇంకా అనేకమంది దీనిలో ఫాల్గొన్నారు.సీనియర్ సాహితీవేత్త మాల్యశ్రీ మాట్లాడుతూ సాహిత్య వాతావరణాన్ని విస్తరించడంలో ఈ కార్యాలయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు.నూతన కార్యవర్గం లో భాగమైన శ్రీయుతులు దాసు (కార్యదర్శి),తాతోలు దుర్గాచారి (ఉపాధ్యక్షులు),రామరాజు(ప్రచారకార్యదర్శి) లను పలువురు అభినందించారు.చివరిగా కవితా గోష్ఠి జరిగింది.



భద్రాచలం లో సాహితీ పరమైన సంఘాల గురించి చెప్పవలసి వస్తే వైబోయిన సత్యనారాయణ గారి కృషిని తప్పక స్మరించవలసినదే.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఎలాంటి సాహితీ కార్యకర్తలు దొరకని ఆ సమయం లో అన్ని బాధ్యతలు తనపై వేసుకొని సాహితీ గౌతమి అనే సాహితీ సంఘాన్ని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేశారు.ఆవంత్స సోమసుందర్,యండమూరి వీరేంద్రనాద్ లాంటి భిన్న దృవాలైన సాహితీకారులను ఇక్కడకి ఆహ్వానించి చక్కని సాహితీవాతావరణాన్ని సృష్టించారు.ఆ విధంగా టెలీఫోన్ సత్యనారాయణ గారిగా అందరికి గుర్తుండిపోయారు. Click here         

1 comment:

  1. 1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీకు సాహిత్యం గురించి మక్కువ కనుక ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.

    http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html

    ReplyDelete

Thanks for your visit and comment.