Saturday, February 22, 2014

వీడ్కోలు సమావేశం



నందిగామపాడు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు,ప్రస్తుతం పదవ తరగతి చదువుతూ త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. నిన్న శుక్రవారం(21-2-2014) నాడు ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.



పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని ప్రధానోపాధ్యాయులు శ్రి.వి.కాళేశ్వర రావు అన్నారు.10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేచల్ జాయ్,ఐ.రజిత,ఐ.గాయత్రి,డి.దివ్య,చారి తదితరులు తమ చదువుకి సంబందించిన అనుభవాలు తెలియజేశారు. అదేవిధంగా తొమ్మిదవ తరగతి చదివే సౌమ్య,సంధ్య,సాయి సంకీర్తి తదితరులు మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులంతా మంచి గ్రేడ్లు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.



సాయిసంకీర్తి గీతాలాపన చేసిన పిమ్మట ఉపాధ్యాయ సిబ్బంది శ్రీయుతులు కె.ఆదినారాయణ,ప్రసాద్,శ్రీనివాస్,ఎన్.మధుసూదన్ రావు,జి.లక్ష్మణ్ కె.తులసి,రమాదేవి,సుబ్రమణ్యేశ్వరి తదితరులు శుభాకాంక్షలందించారు.

తొమ్మిదవ తరగతి విద్యార్థులు సరస్వతీ దేవి చిత్రపటాన్ని పాఠశాలకి ఈ సంధర్భంగా బహూకరించారు.అదేవిధంగా సమావేశం లో ఫాల్గొన్న అందరికీ పెన్నులను కూడా బహూకరించారు.మిఠాయిల పంపిణీ తరవాత సౌమ్య వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.