Thursday, March 6, 2014

తాజ్ మహల్ సందర్శన



తాజ్ మహల్ యమునానది ఒడ్డున ఉన్నదని అనేకసార్లు చదవడం,ఆ చిత్రాల్ని చూసి ఆనందించడం తప్ప ప్రత్యక్షంగా చూద్దమని అనిపించినా చాలాసార్లు వాయిదాపడి ఇన్నేళ్ళకి కుదిరింది.తాజ్ సౌందర్యాన్ని ఎవరు ఎన్ని నోళ్ళ పొగిడినా ఇంకా ఏదో మిగిలిపోతూనేఉంటుంది. పశ్చిమ దిక్కునున్న గేట్ నుంచి లోపలకి వెళ్ళగానే వెంటనే ఆ పాలరాతి కట్టడం కనిపించి కనువిందు చేస్తుందేమోనని అనుకుంటాం.కాని లోపలకి ప్రవేశించగానే కోటకి సంబందించిన ఇతర నిర్మాణాలు,ప్రాకారాలు,వీధులు కనిపిస్తాయి.దానిలోనే షాపింగ్ కాంప్లెక్స్లు వగైరా..!

అటు ఇటు ఉన్న పచ్చని లాన్ లని చూస్తూ ఉత్తరం వైపునున్న మహాద్వారం వైపు లోనికి ప్రవేశిస్తుండగానే అనుకోని అతిథిలా అల్లంత దూరం నుంచి తాజ్ మహల్ కనిపించి ..ఇంకా దగ్గరవుతున్నకొద్దీ పారవశ్యమనిపిస్తుంది.అసలు ఏ ప్రక్కనుంచి చూసినా తాజ్ యొక్క అందం కొంగ్రొత్తగా కనిపిస్తుంది. అసలు అంత తెల్లని రూపాన్ని ఆ సైజు లో మార్బుల్ లో సృష్టించాలని అనుకోవడమే ఒక గొప్ప ఆలోచన..రసాత్మకత.ఆ వెనుకకి వెళ్ళిచూస్తే యమునా నది కడు వయ్యారంగా వంపులు తిరుగుతూఉంటుంది.ఎడమ,కుడి వైపుల గోడలమీద పాలరాతి లోని డిజైన్లు మంత్రముగ్దుల్ని చేస్తాయి.ఖురాన్ లోని సురాలని అనేకచొట్ల చెక్కారు.

షాజహాన్ ,ముంతాజ్ ల ప్రణయగీతమే ఆ మహల్ లో రూపుకట్టినదేమో అనిపించకమానదు.భారతీయులు,యూరోపియన్ లు,జపానీయులు చాలాదేశాల ప్రాంతాల వారు సందర్శకుల్లో ఉన్నారు.ఉన్నంతసేపు ఏదో ధ్యాన లోకం లో ఉన్నట్లుగా ఉంటుంది.షాజహాన్ తన చివరి రోజుల్లో కుమారుల మధ్య చెలరేగిన వారసత్వ పోరువల్ల ఔరంగజేబు చేత  జైలులో బంధింపబడి అక్కడనే ప్రాణాలు వదలగా ,అతడిని మంతాజ్ సమాధి పక్కనే సమాధి చేశారు.2000 లో ఓ వ్యక్తి సుప్రీంకోర్ట్ లోను,2005 లో మరోవ్యక్తి అలహాబాద్ హైకోర్ట్ లోను తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ చేసినట్టిది కాదని ,పరమార్ రాజులు కట్టిన ఒక ఆలయమని దాన్ని ఆ తరువాత రూపురేఖలు మార్చినారని కేసులు వేయగా వాటిని కొట్టివేయడం జరిగింది.Click Here

   

2 comments:

  1. అందమైన జ్ఞాపకం . తాజ్ మహల్ దర్షనం.

    ReplyDelete

Thanks for your visit and comment.