Wednesday, May 21, 2014

Mario Puzo నవల Fools Die గూర్చి (రెండవ భాగం)

Mario Puzo నవల Fools Die గూర్చి (రెండవ భాగం)

గతం లో ఎక్కడ ఆగాము...Jordan తుపాకితో పేల్చుకొని ఆ Xanadu హోటల్ గదిలో చనిపోతాడుగదా...!దానికి కారణాలు చెప్పాలంటే అంత బలమైనవి కావు.ఆ రాత్రంతా కేసినో లో ఆడి 400 grand సంపాదిస్తాడు.అది చాలా పెద్ద మొత్తమే.మళ్ళీ తన జీవితాన్ని చక్కగా start చేయవచ్చు.20 ఏళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కని అతని భార్య ఇంకొక వ్యక్తిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంది.ఆమె ప్రస్తావన మెర్లిన్ తెచ్చినపుడు కూడా ఆమెని తిట్టడు సరికదా ...ఈ ప్రపంచం లో ఎవరికైనా ఆనందంగా ఉండే హక్కు ఉంది.నేనెందుకు అడ్డుచెప్పాలి అంటాడు.

అయితే జోర్డాన్ పాత్ర మరణించడానికి కారణం అంతర్లీనంగా అతని సన్నిహితులు డయాన్,మెర్లిన్,కల్లీ చూపే సానుభూతి అనిపిస్తుంది.తన మీద సానుభూతి చూపించడం అతనికి గిట్టదు.అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత భార్య వచ్చి రావలసిన డబ్బుని కేసినో వాళ్ళ దగ్గరనుంచి తిసుకొని వళ్ళిపోతుంది.

లాస్ వేగాస్ gambling circle లో చెడు పేరు వస్తుందనే ఉద్దేశ్యం తో జోర్డాన్ మృతిని పెద్దగా పైకి పొక్కకుండా యజమాని Gronevelt చర్యలు తీసుకుంటాడు.లోకల్ గా ఉండే Police deputy  chief సహకారం తో ఈ పని జరిగిపోతుంది.

సరే...నవల లోని మరో ప్రధాన పాత్ర Merlyn .జోర్డన్ మృతి తరవాత మెర్లిన్ తన సొంతనగరం న్యూయార్క్ కి వచ్చేస్తాడు.అతను Bronx లోని ఒక సాధారణమైన అపార్ట్మెంట్ లో ఉంటూ  ఉంటాడు.Merlyn అతని సోదరుడు Artie ...ఇద్దరు ఓ అనాధ అశ్రమం లో పెరుగుతారు.వారి తల్లిదండ్రులెవరో వారికి తెలియదు.ఒక Writers' work shop లో చేరతాడు మెర్లిన్.అక్కడ అదే వర్క్ షాప్ లో చేరుతుంది Valerie అనే అమ్మాయి.మొత్తానికి వీళ్ళ అభిరుచులు కలిసి ప్రేమించుకుంటారు.పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటారు.ఆ పిల్ల మేన మామలు ...ఆస్తిపాస్తులు లేని అనాధని పెళ్ళి చేసుకోవడం ఎందుకు అని వ్యతిరేకిస్తారు.అయినా లక్ష్య పెట్టకుండ హాయిగా పెళ్ళాడి పిల్లల్ని కూడా కని ఆ విధంగా బతుకు బండి లాగిస్తుంటారు.

మెర్లిన్ కి భార్య,పిల్లల పట్ల మంచి అనురక్తి. విపరీతంగా సంపాదించి తన కుటుంబాన్ని సంతోషపెట్టాలని అతని ఆశ.ఎప్పటికైనా నవలా రచయిత గా సక్సెస్ అయి మిలియన్ ల మీద మిలియన్లు సంపాదించాలని....పాపం రాత్రుళ్ళు కూడా మేలుకొని రచన చేస్తూ ఉంటాడు.తీరా పబ్లిషర్లకి చూపితే ఒక్కరూ ముందుకు రారు సరికదా నిరాశపరుస్తారు.ఇంగ్లీష్ పాపులర్ రచయితలకి ముఖ్యంగా అమెరికన్,బ్రిటీష్ లాంటి జాతీయులకు ఉన్న advantage ఏమిటంటే ఒక్క నవల సక్సెస్ అయి ప్రపంచమంతా అమ్ముడైతే జీవితాంతం కూర్చొని హాయిగా తినగలిగే సంపద సమకూరుతుంది.Irving Wallace లాంటి వాళ్ళు సొంతగా ఓడలు,చోపర్లు కలిగిఉండేవారంటే అతిశయోక్తి ఏముంది.

సరే...మెర్లిన్ దగ్గరకొద్దాము. అలా కష్టపడుతూ 5 సంవత్సరాలు ఈ రాతల్లోనే మునిగితేలుతుంటాడు.చివరికి అతని మామ గారు Valerie  తండ్రి అన్న మాట చెబుతాడు." well..It didn't make any money.Five years.Now you concentrate on supporting your family" అని.అప్పుడు జ్ఞానోదయం కలిగి సైన్యం లో చేరతాడు. ఆ తరవాత ఆ మిలిటరీ శాఖలోనే క్లర్క్ గా చేరతాడు.ఉన్నవాళ్ళు గాని,లేని వాళ్ళు గాని యుక్తప్రాయం లో నుండి కాలేజి కంప్లీట్ చేసిన వాళ్ళంత సైన్యం లో చేరి రెండేళ్ళు శిక్షణ పొందాలనే రూల్ ఒకటి ప్రభుత్వం పెడుతుంది.అక్కడ ఫ్రాంక్ అనే మరో ఉద్యోగి మెర్లిన్ కి పరిచయం అవుతాడు.నీ జీతం తో నువ్వు ఎప్పటికి సంపాదిస్తావు...చాలామంది ధనవంతులు తమ పిల్లల్ని ఈ విధులనుంచి తప్పించాలని చూస్తుంటారు.వాళ్ళని గనక పట్టుకుంటే నీకు కావలసినంత సమకూరుతుంది అని బోధ చేస్తాడు.

తను రచయిత గా ఎలాగు ఫెయిల్ అయ్యాడు..దీనిలోనైనా సక్సెస్ గావాలని రాత్రింబవళ్ళు లూప్ హోల్స్ వెదకడానికి ఆ మాన్యువల్స్ అన్ని బాగా స్టడీ చేస్తాడు.మొత్తానికి లంచాలు తీసుకోవడం లో కొత్త పుంతలు తొక్కి బాగా డబ్బు సంపాదిస్తాడు.అయితే ఈ కాడిలాక్ కారు,మంచి ఇల్లు ..వీటికన్నిటికి ఎలా ధనం వస్తోందని అతని భార్య అడుతుంది.కాని నిజం చెప్పడు.ఏవో చెప్పి మభ్యపెడతాడు. సరే ఈ నల్ల డబ్బుని ,తెలుపు చేయాలి ఎలా అని ఆలోచిస్తుండగా అతనికి లాస్ వేగాస్ లోని Cully గుర్తుకొస్తాడు.విష్యాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగానే  that's what friends are for వచ్చేయ్ అంటాడు.

అక్కడ కల్లీ కి కూడా హోదా పెరుగుతుంది ఆ కేసినోలో. ఆ రోజు జోర్డాన్ కి ఎందుకు బాగా ధనం వెళ్ళేలా చేశావ్,అని Gronevelt ఈ కల్లీ ని తన గదిలోకి పిలిచి అడుగుతాడు.

"You have been doing good work,but you  helped that guy Jordan at the baccarat table.You went against me.You take my money and you go up against me"

కల్లీ దానికి అంటాడు." He was a friend of mine.It wasn't a big deal.And I knew he was the kind of guy that would take care of me good if was winners'"

అప్పుడు వర్ణన చాల బాగుంటుంది.ఒక నిమిషం అలానే Gronovelt తదేకంగా భావగర్బితంగా Cully వేపు చూస్తాడు."Everybody makes mistakes.It's not important unless the mistake is fatal"  అని ఇంకా అంటాడు నీకొక నూతన అవకాశం ఇస్తాను.దాన్ని  గనక నెరవేర్చితే ఈ Xanadu కి నాతరవాత నువ్వే బాస్ వి అంటాడు. సరే....అది తర్వాత దానిలో చూద్దాం...!
                          --KVVS MURTHY

   

No comments:

Post a Comment

Thanks for your visit and comment.