Mario Puzo నవల Fools Die గురించి (మూడవ భాగం)
Merlyn నివాసం ఉండే పరిసరాల గూర్చి గతం లో చెప్పుకున్నాం గదా..న్యూయార్క్ మహానగరం లో పేదవర్గానికి చెందినవాళ్ళు ఎక్కువగా ఉండే ఒక ghetto లోని అపార్ట్ మెంట్ లో అతను తన కుటుంబం తో నివసిస్తుంటాడు.Junkies,Alcoholics, pimps,Small time thieves ఇలాంటివాళ్ళంతా కలగా పులగంగా ఉండే లొకేషన్ అది.ఎక్కువగా నివాసితులంతా Black people అని చెప్పాలి.Whites ఉన్నప్పటికి చాలా తక్కువ ఆ ప్రాంతం లో..!
మెర్లిన్ భార్య Valerie కి కూడా అక్కడ ఉండడం ఇష్టం ఉండదు.తన తండ్రి వద్ద నుంచి కొంత డబ్బు తీసుకొని వేరే చోట ఇల్లు కొందామని అంటుంది.కాని స్వాభిమానం గల మెర్లిన్ దానికి అంగీకరించడు.ఒక సంవత్సరం ఓపిక పడితే చాలు...నేనే ఆ పని చేయగలను అంటాడు.సరే...ఆర్మీ రిజర్వ్ యూనిట్ లో చాకచక్యంగా లంచాలు రాబట్టి బాగానే సంపాదిస్తాడు.ఆ తర్వాత ఇంటి పని కూడా మొదలు పెడతాడు వాళ్ళకి నచ్చిన లొకేషన్ లో.
ఇక్కడ Valerie గూర్చి ఒకటి చెప్పాలి.ఆమెకి తను ప్రస్తుతం ఉంటున్న ఏరియా నచ్చకపోయినా ఆమెకి గల చదువు సంస్కారం వల్లనో...ఇంకేదానివల్లనో నోటితో మటుకు దాన్ని వ్యక్తం చేయదు.కాని ఆమె భావాన్ని మెర్లిన్ అర్ధం చేసుకుంటాడు.
వీళ్ళు ఉంటున్న అపార్ట్ మెంట్ ముందు మరో కుటుంబం ఉంటుంది.ఆమె 40 ఏళ్ళ నల్ల వనిత.ఆమెకి ముగ్గురు పిల్లలు.భర్త నుంచి విడిపోయి ఉంటుంది.సాయంత్రం కాగానే చక్కగా తయారై ఎవరో ఒకరితో డేటింగ్ నిమిత్తం వెళ్ళిపోతుంది.ఇంట్లో ఆ ముగ్గురు పిల్లలే ఉంటారు.దాంట్లో పెద్ద పిల్లకి 10 ఏళ్ళు ఉంటాయి.
ఒకరోజు సాయంత్రం తల్లి బయటికి పోగానే అగ్ని ప్రమాదం జరుగుతుంది.అప్పుడు ఈ Valerie వెళ్ళి ఆ ముగ్గురు పిల్లల్ని సేవ్ చేస్తుంది.అయితే దాంట్లో ఓ అమ్మాయి బాగా గాయపడుతుంది.
అంబులెన్స్ లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆసుపత్రి లో జాయిన్ చేస్తారు.సరే...తెల్లారి Valerie తన తల్లి గారి ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళుతుంది.అప్పుడప్పుడు అలా అరగంట Drive దూరం లో గల వారి ఇంటికి వెళ్ళి ఓరోజు గడిపి రావడం ఈమెకి ఓ అలవాటు.మెర్లిన్ ఇంట్లో ఒక్కడే ఉంటాడు.కాసేపు ప్రశాంత సమయం దొరికింది గదాని ఏదో రాయడానికి ఉద్యుక్తుడవుతుంటాడు .అంతలోనే తలుపు కొట్టినశబ్దం అయితే వెళ్ళి తీస్తాడు.ఆ నల్ల వ్యక్తి కన్నీటి పర్యంతమవుతూ చెబుతాడు తాను ఆసుపత్రిలో చేర్పించబడిన ఆ పాప తండ్రి నని. లోపలికి పిలిచి కూర్చోబెడతాడు మెర్లిన్.ఆ పిల్లల్ని కాపాడినందుకు Valerie కి కృతజ్ఞతలు చెబుతాడు.
అతని కంటి నుంచి ధారాపాతంగా వర్షిస్తూనే అంటాడు."Oh man,my little girl died this morning....she died in that hospital... ఆసుపత్రికి ఆ పాపని చూద్దామని వెళ్ళానా...ఆ పిల్లకి తండ్రినని నన్ను విలన్ లా చేసి మాట్లాడుతున్నారు జనాలు. నా భార్య,పిల్లల్ని విడిచి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా..కాని నేనేం చేయను...She wants fun..She wants good time...She is too strong and I had to leave.I tried to see my kids more...but she won't let me..! If I give extra money,she spends it on herself and not on the kids." .. అలా అలా మా మధ్య ఎడం పెరిగి ఉండలేని పరిస్థితుల్లో వేరు కావలసివచ్చింది.ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను బ్లేం చేసి మాట్లాడుతున్నారు..నేనిచ్చే డబ్బులతో పిల్లల కొరకు ఒక గవర్నెస్ ని పెట్టుకున్న ఈ దారుణం జరిగి ఉండేది కాదు గదా.." అంటూ నిట్టూర్చుతాడు.
మెర్లిన్ కూడా బాధపడతాడు.ఇంట్లో ఓ జార్ లో ఉన్న rye మద్యాన్ని ఓ గ్లాస్ లో ఒంపి ముందు ఇది తీసుకొని కొద్దిగా స్తిమితపడండి అంటూ ఇస్తాడు.Valerie తన కోసం దాన్ని తయారు చేసి అలా ఓ మూలకి పెడుతుంది...తను తీసుకునేది తక్కువ ...ఆమె తండ్రి వచ్చినపుడే దాన్ని ఎక్కువగా ఖాళీ చేస్తుంటాడు. సరే... ఆరోజు అలా గడిచిపోతుంది.ఆ తర్వాత ఇలాంటిదే కాదు గాని మరో ఉద్రిక్తత ఏర్పడుతుంది.సాధ్యమైనంత త్వరలో ఈ లోకేషన్ ని విడిచివెళ్ళడం మంచిదని మెర్లిన్ కి కూడా తోస్తుంది.
మరి ఎలాతెలుస్తుందో ఏమో గాని FBI వాళ్ళకి మెర్లిన్ యొక్క లంచాలు తీసుకొనే యవ్వారం తెలుస్తుంది.మొదటిగా అతని సహోద్యోగి ఫ్రాంక్ ని పట్టుకుంటారు.ఆ తరవాత హఠాత్తుగా మెర్లిన్ ఆఫీస్ లోకి వస్తారు.ID కార్డులు చూపించిన పిమ్మట ఒక FBI అధికారి అంటాడు." Do you have any idea...why we're here" అని."నో" అంటాడు మెర్లిన్.అయితే అతనికి సూచాయగా తెలుసు ఓ మిత్ర్ని వల్ల...కాని చెప్పడు.మర్యాదగానే చాలా ప్రశ్నలు వేస్తారు.అన్నిటికి నో అనే ఆన్సర్ నే చెబుతాడు.
Grand Jury ముందు హాజరు కావడానికి సిద్దంగా ఉండమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు.ఆ తరువాత లీగల్ నోటిస్ లు రావడం ...జ్యూరీ ముందు హాజరై సమాధానాలు చెప్పడం చేస్తాడు.జ్యూరీ తననే కాకుండా తను రిక్రూట్ చేసిన కుర్రాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది.Paul Hemsi అనే ఒక కుర్రాడు మాత్రం నిజాన్ని చెప్పేస్తాడు.అసలే ఓ వైపు కొత్త ఇల్లు Long Island లో పూర్తి కావడానికి దగ్గరలో ఉంది...ఈ టైం లో ఈ తంటాలేంట్రా బాబూ అని మెర్లిన్ బాధపడతాడు.ఏం చేయాలా అని ఆలోచించి Las Vegas లో ఉన్న Cully కి ఫోన్ చేస్తాడు.
ఈ Paul Hemsi తండ్రి బాగా ధనవంతుడు.గార్మెంట్ వ్యాపారంలో బాగా సంపాదించినవాడు.ఎవరి మాట అంత త్వరగా వినడు.కాబట్టి Cully సాయం కోరతాడు.పాల్ ని తన సాక్ష్యం ని మార్చుకొనేలా చేయడానికి..! సరే తరువాత దాన్ని నాల్గవ భాగం లో చెప్పుకుందాం.
---KVVS MURTHY

No comments:
Post a Comment
Thanks for your visit and comment.