Thursday, May 29, 2014

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (అయిదవ భాగం)

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (అయిదవ భాగం)

పాత కాలం నాటి ప్రముఖ రచయితల్ని తిట్టడం చేస్తుంటాడు గదా Osano.కొంతమందిని అలా తిట్టిన తరవాత మీరు "షేక్స్పియర్" ని మర్చిపోయినట్లున్నారు అని గుర్తు చేస్తాడు మెర్లిన్.

"షేక్స్పియర్ నాకెందుకో నచ్చుతాడు.తను రాయదలుచుకున్న దాన్ని రాసిపారేశాడు.అది నిజమా,కాదా ఇతరులకి నచ్చుతుందా లేదా అనేది ఆలోచించకుండా ఒక ఫ్లో లో రాసుకువెళ్ళాడు అందుకనే అతని మాటల్లో ఒక బ్యూటి ఉంటుంది.Love is not love which alters when it alternation finds...ఆహా ఎంతబాగా చెప్పాడో చూశావా.." షేక్స్పియర్ ని మాత్రం తిట్టకుండా వదిలేస్తాడు ఒసానో.

అలా ఒసానో తో మెర్లిన్ స్నేహం బలపడసాగింది.ఎప్పుడైనా గాని డ్రింక్ ని,డిన్నర్ ని ఆఫర్ చేసేవాడు.అమ్మాయిల విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రం ఒసానో వైపు ఒక సీరియస్ లుక్ నిచ్చేవాడు మెర్లిన్.

"ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితం లో నీ భార్య పట్ల ఇంకా నీకు విముఖత కలగలేదా..నువ్వు నిజంగా tenth wonder వే " అనీ నవ్వేవాడు ఒసానో.ఆ విష్యం తనకి పట్టనట్లుగా ఉండి పోవడం తో ఒసానో ఆ ప్రసక్తిని అక్కడితో వదిలిపెట్టేవాడు.

ఆ విధంగా ఒసానో సాన్నిహిత్యం లో పత్రికా ప్రపంచం లోని లోతుపాతులు,జీవితం లోని కొన్ని ఇతర కోణాలు పరిచయమవసాగాయి.ఎన్నో పాత్రలని గొప్పగా చిత్రించే ప్రఖ్యాత రచయితలు నిజ జీవితం లో మాములు మనుషుల్లాగే ఇతర విషయాల్లో ఉంటారని మెర్లిన్ కి అవగతమైంది.

అప్పుడప్పుడు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు...రివ్యూ లలో రాసి జనాల్ని రెచ్చగొట్టడం కూడా ఒసానో కి చాలా ఇష్టం.అతని పేరు ఆ విధంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు.అయితే మళ్ళీ దాన్ని ఎలా ఆర్పాలో అలా ఆర్పేవాడు.ఒకసారి death penalty మీద ఓ వివాదస్పద వ్యాసం రాశాడు.ఒకరిని చంపిన వానిమీద మానవత కారణలతో death punishment విధించకుండా ఉండటం  అర్ధం లేని విషయమని,ఆ విషయం లో గాని రెఫరెండం పెడితే జనాలు నిందితుడికి death punishment సరైనదని తీర్పునిస్తారని రాశాడు.క్రింది,మధ్యతరగతి వర్గాలు ఆ విధంగా కొట్టుకు చస్తుంటే పై వర్గాలకి ఆనందం...ఎలాగు వాళ్ళంతా సేఫ్ జోన్ లోనే ఉంటారుగదా.ఏమైనా ప్రపంచం లో Law abiding people అంటే మాత్రం బ్రిటిష్ వాళ్ళే 'అంటూ తన వ్యాసం లో ఉటంకించాడు.అది ఆ తరువాత పెద్ద చర్చకి దారి తీసింది.అతనికి వ్యతిరేకంగా వివిధ సంఘాల వాళ్ళు ఉత్తరాలు రాయగా మళ్ళీ వాటినన్నిటిని అదే పత్రికలో ప్రచురించుకొని అయాచితంగా పబ్లిసిటీ పొందేవాడు.

Wendy అనే ఆమె ఈ ఒసానో పనిచేసే పబ్లిషింగ్ సంస్థ లోనే సహాయకురాలిగా పనిచేస్తూ ఉంటుంది.ఒసానోకి ఈమె మూడవ భార్య.అయితే ఇద్దరికీ పడక డైవర్స్ కూడా  అయిపోతుంది.ఆమె ప్రస్తుతం వేరే వ్యక్తితో ఉంటున్నది.విచిత్రమేమంటే ఈ Wendy కి అక్కడ జాబ్ వచ్చేలా చేసింది ఈ ఒసానో నే.అతడి మన్స్థత్వం ఒక పట్టాన అర్ధం కాదు.Wendy మంచి సెక్సీ గా ఉంటుంది.క్రమం తప్పకుండా alimony ఇస్తున్నంత కాలం ఏమీ అనదు.కాని ఎప్పుడైనా తప్పినా ...ఆలశ్యమైనా పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది.ఈ ఒసానో కూడా అంతకి తగిన బొంత.

వీళ్ళద్దరూ వివాహ బంధం లో ఉన్నప్పుడు కూడా చిన్న గొడవలకి కూడా పోలీస్ లకి కంప్లైంట్ లిచ్చేది.తీరా వాళ్ళు వచ్చి ఆశ్చర్యపడేవాళ్ళు.ఒసానో ఆమె గూర్చిన కొన్ని ఉదంతాలు మెర్లిన్ కి  చెప్పాడొకసారి.

ఆమె కి తన కి ఓసారి గొడవైంది.అంతే..ఇంట్లో ఉన్న అతగాడి షర్టులు,పేంటులు,టై లు అన్ని ముక్కలు ముక్కలుగా కత్తెర తో కట్ చేసి వాటి మీద కూర్చొని Vibrater తో Masturbate చేసుకొని ఆ విధంగా ఆనందించేది. మరోసారి.....తనకి ఏదో సమస్య ఉందని ఓ సైకియట్రిస్ట్ దగ్గరకి వెళ్ళి అతనితో సంబందం పెట్టుకొంటుంది.మళ్ళీ పైగా వాడికి ఫీజు చెల్లించాలట ఒసానో...అలాంటివి ఎన్నో అయినాక విడాకులు తీసుకుంటారు.

సరే..ఒసానో రాసిన ఓ నవలని హాలివుడ్ నిర్మాతలు సినిమా గా తీయడానికి కొంటారు.ఆ విధంగా హాలీవుడ్ లో అడుగుపెడతాడు.అయితే సినిమా మనుషుల ప్రవర్తన ఒసానో కి అసలు నచ్చదు.ప్రపంచం లో ఇన్ని మిలియన్ కాపీలు అమ్ముడైన పాపులర్ రచయితను...బయట అంతా హీరో లా చూస్తారు తనను...ఇక్కడ కో డైరెక్టర్ కి ఇచ్చిన విలువని కూడా ఇవ్వరే వీళ్ళు అని తిట్టుకుంటాడు.ఎవరితో ఎక్కువ అవసరం ఉంటుందో వాళ్ళకే ఇక్కడ విలువ.ఆ రాత్రికి మాటిచ్చిన Katherin అనే అమ్మాయి కూడా ఎవడో కెమెరా మేన్ కలిస్తే వెళ్ళిపోతుంది.

మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు.విమానం లో కూడా ఒకామె తో చిన్న ఘర్షణ జరుగుతుంది.ఈ ఒసానో కాల్చే సిగార్ వాసన తన కుక్క కి పడ్టం లేదని ...ఆపమని చెప్పగా ఇద్దరకీ వివాదం ముదిరి కొట్టుకుంటారు.సిబ్బంది వచ్చి విడదీస్తారు.భవిష్యత్ లో నోబెల్ బహుమతి అందుకోనున్నానని చెప్పుకొనే ఈ వ్యక్తి నిజ జీవితం లో ఇలా ఉంటాడా అనిపిస్తుంది.

ఇదిలా ఉండగా Artie భార్య Pam ఒకరోజు మెర్లిన్ కి ఫోన్ చేస్తుంది.ఒక సమస్య లో ఉన్నానని చెబుతుంది.అదేమిటో ఫోన్ లో చెప్పమని అడగ్గా ..ఇంటికి రావాలసిందిగా కోరుతుంది.తనకి తెలిసినంతలో తన సోదరుడు Artie...అతని భార్య సంతోషకరమైన జీవితమే గడుపుతున్నారు.ఏమి అవాంతరం వచ్చిందబ్బా ...అని ఇంటికి వెళతాడు.Artie,Merlin   లు ఇద్దరూ అన్నదమ్ములు.అనాధలుగా Orphanage లో పెరిగారు.ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం లో ఎప్పుడూ వెనుదీయరు.

విషయాన్ని వివరిస్తుంది Artie భార్య.గతకొన్ని  రోజులుగా తన భర్త వేరే ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం వస్తుందని...ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని ..అతని షర్ట్ పై లిప్ స్టిక్ మరక కూడా కనిపించిందని అంటుంది.మెర్లిన్ కి Artie గూర్చి బాగా తెలుసు.ఎటువంటి సమస్య తనవద్ద దాయడు.నేను అంతా విచారించి నీకు తెలియజేస్తాను...నీ భర్త పట్ల నువ్వు విశ్వాసం కోల్పోవద్దు అని సర్ది చెబుతాడు మెర్లిన్.

ఆ తరవాత రైల్వే స్టేషన్ వద్ద Artie కలుస్తాడు.ఇంట్లో అతని భార్య పడే ఆందోళన ని తెలిపి అసలు విషయం ఏమిటో చెప్పు అంటాడు మెర్లిన్.తన సోదరుడు తెలిపిన వివరాలు విని హతాశుడవుతాడు.

"గత కొన్ని సంవత్సరాలుగా నేను మన తల్లి కోసం అన్వేషణ చేస్తూనేఉన్నాను.అనుకోకుండా ఆమె ఉనికి తెలిసింది.వెళ్ళాను.ప్రస్తుతం ప్రపంచం లో ఒంటరి ఆమె.బాగా త్రాగుడి కి బానిస అయింది.చూడటానికి అందంగా...లిప్ స్టిక్ తో ఉన్నది.నిన్ను చూడాలని అన్నది" అని చెప్తాడు Artie.

మెర్లిన్ కి కన్నీళ్ళు వస్తాయి.కాని తమాయించుకొని అంటాడు." లేదు...ఇన్నాళ్ళపాటు ఒంటరిగానే ప్రపంచం లో జీవించాం.మనమెవరో మనకి తెలియదు.అలాగే ఉండనీ..నాలో ఉన్నదో ఎవరి రక్తమో నాకు తెలియదు...ఒక నల్ల మనిషి రక్తమో,జ్యూయిష్ రక్తమో,ప్రొటెస్టెంట్ రక్తమో ఇప్పుడు తెలుసుకొనే ఆసక్తి కూడా నాకు లేదు.ఏదో నాకున్న ఊహలోనే నన్ను జీవించనీ" అని..!

ఆ తర్వాత ఇదే విషయాన్ని Artie భార్య కూడ తెలుసుకొని బాధ పడుతుంది తన అనుమాన ప్రవర్తన గురించి.మెర్లిన్ కూడా తన భార్య Valerie కి తన తల్లి విషయం చెబుతాడు."ఎంతైనా తల్లి గదా...ఆమె తో కనీసం ఒక మాట మాట్లాడి రాలేకపోయావా.."అంటుందామె.

అప్పుడు మెర్లిన్ లోని ఆవేదన బ్రద్దలవుతుంది."Do you know ...what the word "orphan" means..?Have you looked it up in the dictionary..?It means a child who has lost both parents through death.Or a young animal that has been deserted or has lost its mother.Which one do you want..?"

అతని యొక్క ఆవేదనకి ఆమె విభ్రాంతి చెందుతుంది.

సరే...Eddie Lancer ని యాజమాన్యం తో కలిగిన స్పర్దల వల్ల ఎడిటర్ పోస్ట్ నుంచి తొలగిస్తారు. అతనితో బాటే మెర్లిన్ ని కూడా తొలగిస్తారు.ఒసానో తో పనిచేయడం వల్ల అలా వెళ్ళిపోతున్నది కాలం.Hollywood లో డీల్ కుదిరి ఒసానో కి డబ్బులు బాగానే ముడతాయి.ఆ సంధర్భంగా పార్టీ ఇస్తున్నా రమ్మని మెర్లిన్ ని పిలుస్తాడు.

పిలవని అథితి లా ఆ పార్టీకి WENDY  కూడా వస్తుంది.మంచి సమయం చూసి ఆ పార్టీని అభాసు చేయాలని ప్రయత్నిస్తుంది. ఆ పెనుగులాటలో wendy ని కిటికీ లోనుంచి బయటికి విసిరేస్తాడు ఒసానో.ఆమె కి ఎముక ఫ్రాక్చర్ అవుతుంది.ఆసుపత్రి లో చేర్చుతారు.

"Merlin..she is a witch, చూశావా ఈ పార్టీ ని రసాభాస చేసి నాకు నోబెల్ ప్రైజ్ రాకుండా చేయాలని దీని ప్లాన్ " అంటూ ఆవేశం లో కంపించుతుంటాడు ఒసానో.

ఒసానో లాయర్ ని అడిగితే ఒక రెండు వారాల పాటు కనిపించకుండా వెళ్ళి పొమ్మని చెబుతాడు.ఈ లోపులో ఇక్కడ ఫార్మాలిటీస్ ని పూర్తిచేస్తానని చెబుతాడు.మెర్లిన్ Cully కి ఫోన్ చేసి ఒసానో ని పంపుతున్నట్లు సమాచారమిస్తాడు. మిగతాది వచ్చే భాగం లో చెప్పుకుందాం.
          --KVVS MURTHY 

1 comment:

  1. waiting for the next part sir. Your narrative style is impressing.

    ReplyDelete

Thanks for your visit and comment.