Sunday, May 25, 2014

Mario Puzo నవల Fools Die గూర్చి సంక్షిప్తంగా (నాల్గవ భాగం)

Mario Puzo నవల Fools Die గూర్చి సంక్షిప్తంగా (నాల్గవ భాగం)

మెర్లిన్ కి సాయం చేయడానికి కల్లీ అంగీకరిస్తాడు.అక్కడ లాస్ వేగాస్ లో తన యజమాని Gronevelt కి కుడిభుజంగా మారతాడితను.అతని వ్యాపార లావాదేవీల విషయం లో చురుకుగా సహకరిస్తుంటాడు.Pencil power కూడా పొందుతాడు.అంటే Xanadu కేసినో లో గల అతి సౌకర్యవంతమైన హోటల్ లోని  రూంలను ఏ విజిటర్ కైనా తన ఇష్టానుసారం ఇవ్వగలిగే పవర్ అన్నమాట.ఇది దాని అధిపతి Gronevelt తర్వాత ఇతనికే ఉంటుంది.ఈ Gronevelt 70 ఏళ్ళవాడు.అయితే మంచి ఆరోగ్యంగా ఉంటాడు.Roulette,Black jack,Baccarat,Crapes ఇలాంటి గేంస్ లోని ప్రతి అంశం బాగా ఎరిగినవాడు.ఎవరు ఎక్కడ మోసం చేయాలనుకున్న ఇట్టే కనిపెడతాడు.ఆ ఉద్యోగులని fire చేసి పారేస్తాడు పనిలోనుంచి..!

Las Vegas లోని బిలియనీర్లలో ఒకడైన Gronevelt కి పుస్తక పఠనం కూడా ఓ హాబీగా ఉంటుంది.చికాగో లో జరిగే Rare books auction కి క్రమం తప్పక వెళుతుంటాడు.ఒకసారి Gronevelt తో మాట్లాడుతున్నప్పుడు అతని వెనుక ఉన్న పుస్తకాల అరల్ని చూసి Cully అనుకుంటాడు."ఈ పెద్దమనిషి ఇన్ని పుస్తకాలు సేకరించాడు గాని...అసలు చదివి ఉంటాడా దీంట్లో ఏవైనా .." అని!

అతని మనసు అర్ధం చేసుకున్నాడా అన్నట్లుగా Gronovelt లేచి ఒక పుస్తకాన్ని తీసి Cully కి ఇచ్చి "ఈ పుస్తకాన్ని చదివి నాకు దాని సారాంశం చెప్పు " అంటాడు.అది గేంబ్లింగ్ కి సంబందించినది.ఎందుకైనా మంచిదని కల్లీ మొత్తం చదివేసి ఆ తర్వాత Gronovelt కి దాని గురించి చెబుతాడు.ఎక్కడెక్కడ నచ్చలేదో కూడా సోదాహరణంగా వివరిస్తాడు.దానితో Gronevelt సంతోషిస్తాడు.చాలా బాగా చెప్పావు అని మెచ్చుకుంటాడు.ఎందుకంటే Gronevelt కూడా మంచి పాఠకుడే..! ఆ తరవాత నుంచి కల్లీ కి చాలా వ్యాపార రహస్యాలు చెబుతుంటాడు.ఏ ఏ దేశాల వాళ్ళు ఏ విధంగా గేంబ్లింగ్ చేస్తారు..వారి పోకడలు అన్నీ వివరిస్తుంటాడు.

కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాడు.కల్లీ కి ఉన్న బలహీనత స్త్రీ లోలత్వం.దాని గూర్చి కూడా కొంత బోధ చేస్తాడు.Gronevelt లో ఒక ఏకాంతం ఉంది.అది తన మిత్రత్వం తో పూరించుకుంటున్నట్లుగా కల్లీ కి అర్ధం అవుతుంది.

Daisy అనే డేన్సర్ ద్వారా Cully ఓ విషయం తెలుసుకుంటాడు.అదేమిటంటే Fummiro అనే ఒక జపాన్ దేశపు బిలియనీర్ అమెరికా కి వస్తున్నట్లుగా గ్రహిస్తాడు.ఈ డైసీ కూడా జపాన్ దేశానికి చెందినదే.అయితే పేరు అలా మార్చుకుంటుంది.Fummiro గూర్చి కొన్ని విషయాలు  అప్పటికే కల్లీ వినివున్నాడు.డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తాడని.జపాన్ లోని ఒక పెద్ద పారిశ్రామికవేత్త కుమారుడని.ఇలా..!

ఎలాగైనా సరే Fummiro ని తమ Xanadu కేసినో కి రప్పించి తీరాలని నిర్ణయించుకుంటాడు కల్లీ.ఆ జపాన్ ధనికుని అభిరుచులు ,అలవాట్లు,జీవిధ విధానం గూర్చి తెలుసుకుంటాడు.Daisy సాయం తీసుకొని ఒక లెటర్ రాసి జపాన్ కి పంపుతాడు.తాము మీ సేవ కోసం వేచి చూస్తున్నామని,మీరు అమెరికా లో దిగేముందు ఒక్క ఫోన్ చేసినట్లయితే మేమే వచ్చి మా బ్రహ్మాండమైన Xanadu casino కి తీసుకువెళతామని మీకు మాదగ్గర దొరకని సౌకర్యం అంటూ ఏది ఉండదని దానిలో వివరిస్తాడు.

Fummiro రాక గూర్చి Gronevelt కి చెబుతాడు కల్లీ.బాగా హేపీ గా ఫీలయి  నా Rolls Royce కార్లని తీసుకొని వెళ్ళు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి...గ్రాండ్ గా ఉంటుంది " అంటాడు.Fummiro తో పాటుగా మరో తొమ్మిది మంది బృందం వస్తుంది.వారందరికి చక్కని బస ఏర్పాటు చేస్తాడు కల్లీ.అందరికంటే Fummiro కి ఇవ్వబడిన suit స్పెషల్ గా ఉంటుంది. దానిలో ఒక పియానో..జపాన్ తరహా దుస్తులు ..ఇలా చాలా ఉంటాయి.తను సూట్ కేసు లో తెచ్చిన డాలర్ల దొంతర్లని ఆ హోటల్ లోనే డిపాజిట్ చేసి అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుంటూ గేంబ్లింగ్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటాడు అతను.మొదటి రోజునుంచే కేసినో లో బాగా డబ్బు పోగొట్టుకుంటుంటాడు ఆటలో .. కల్లీ వారిని బంగారు బాతుల్లా జాగ్రత్తగా మర్యాదగా చూసుకుంటూ ఉంటాడు.ఒక్కసారి తమ కేసినో కి వచ్చినవాడు శాశ్వత కష్టమర్ గా మారిపోవాలనేది అతని పాలసి.Fummiro కి బంగారు వర్ణం శిరోజాలు ఉండి,Long legs ఉండే తెల్ల అమ్మాయిలంటే ఇష్టమని కల్లీ తెలుసుకొని...ఆ ఏర్పాటు ఏమైనా చేయాలా అని అడుగుదామని టెంప్ట్ అవుతాడు. ఇది సమయం కాదులే అని మళ్ళీ  ఊరుకుంటాడు.

Fummiro ఓసారి టీవి చూస్తూ ఫలానా అమ్మాయి బాగుంది కదా అంటాడు ..కల్లీ రెచ్చిపోతాడిక...." మీకెందుకు ఆ అమ్మాయిని మీ కోసం నేను ఇక్కడకి రప్పిస్తాను..ఆ నటి ని Linda parsons అంటారు.మాట్లాడమంటారా అంటాడు.మళ్ళీసారి మీరు ఇక్కడికి రాగానే ఆ అమ్మాయితో మీరు ఉంటారు..సరేనా..!"

సంతోషంగా ఓ.కె అంటాడు ఆ జపాన్ ధనవంతుడు.Linda Parsons ఇదివరకు ఓ కేసినో లో పనిచేసేది.ఇప్పుడు చిన్నా చితకా సీరియళ్ళలో నటిస్తున్నది.ఆ మధ్యన ఎవరినో పెళ్ళాడినట్లు విన్నాడు.డబ్బుల వ్యవహారం సరిగ్గా కుదరాలే గాని Linda parsons దేనికీ కాదనదు.ఆమె తో మాట్లాడి Deal కుదుర్చుకుంటాడు కల్లీ.రెండవసారి  Fummiro వచ్చేసరికల్లా Linda ని అతనిముందు దింపుతాడు కల్లీ.ఆనందం తో తలమునకలవుతాడు Fummiro. మొత్తానికి వారిరువురు కొన్నిరోజులు శ్సృంగార లహరిలో తేలియాడుతారు.
Fummiro తో అనుభవం ఎలా ఉన్నది అని Linda ని అడుగుతాడు కల్లీ.

" I have been with rich guys before..And I made good money...God...I could live for ten years on what he loses in one day...he's such an interesting guy...I  loved that soup for break fast and piano playing...And he was great in bed,no wonder the Japanese women do everything for their men"  అంటుంది Linda!

'అలాగా..అయితే మీ ఇద్దరిని ఇక మీదట కలవకుండా ప్లాన్ వెయ్యవలసిందే'అనుకుంటాడు కల్లీ మనసులో..!

సరే...ఇదిలా ఉండగా ఆ తర్వాత మెర్లిన్ ని ఆదుకోవడం కోసం న్యూయార్క్ వస్తాడు కల్లీ. Hemsi కుటుంబాన్ని కలిసి నానా బుజ్జగింపులు ఆ తర్వాత mild బెదిరింపులు  చేసి మెర్లిన్ కి వ్యతిరేకంగా ఉన్న కేసు నుండి బయట పడవేస్తాడు.Eli Hemsi తమ్ముడు Xanadu కేసినోలో ఉన్న అప్పుని ప్రస్తావించి దాన్ని లేకుండా చేస్తానని ప్రతిపాదిస్తాడు.అయినా వినడు.ఇక చివరికి అంటాడు" మీ అబ్బాయికి ప్రస్తుతం ఉన్న 6 నెలల ఆర్మీ శిక్షణని 2 సంవత్సరాలు ఉండేలా చేస్తాను.ఆ తర్వాత మీ ఇష్టం,మీరు ఇచ్చిన లంచాల వ్యవహారం కూడా బయటికి వచ్చి ...ఆ పిమ్మట పేపర్ల లో వచ్చి రచ్చ అవుతుంది.మెర్లిన్ కి శిక్ష మాత్రమే కాదు మీరు కొంత నష్టపోతారు..అసలే మీ భార్య అనారోగ్యం తో ఉంది కదా...నేను Gronevelt మనిషిని.అతను ఎలాంటివాడో..అతనికి గల పలుకుబడి ఏమిటో మీ సర్కిల్ లో అడిగి తెలుసుకొండి అంటాడు.చివరికి అంగీకరించి "సరేలే..ఆ సాక్ష్యం ని వెనక్కి తీసుకోమని మా అబ్బాయికి చెబుతాను" అంటాడు Hemsi!

ఆ విధంగా మెర్లిన్ రక్షింపబడి మళ్ళీ ఉద్యోగం లో చేరతాడు.అక్కడ పనిచేసే ఒక మేజర్ మీరు ఉద్యోగం మానివేసి వేరే వృత్తి లోకి వెళ్ళడం మంచిది అని సలహా ఇస్తాడు మెర్లిన్ కి.ఇప్పటికీ FBI మీమీద నిఘా పెట్టివుంది.ఏ మాత్రం ఈ సారి లంచం తీసుకుంటూ దొరికినా జైలుకి వెళ్ళడం ఖాయం...మీరు ఇప్పటికీ మంచి వయసు లో ఉన్నారు..మీ టాలెంట్ కి ఏ రంగం లోకి వెళ్ళినా రాణిస్తారు అంటాడతను.ఒక రాత్రంతా ఆలోచిస్తాడు మెర్లిన్.ఆ డెసిషన్ మంచిదే అనిపిస్తుంది.ఉన్న సెలవులన్నీ వాడేసుకొని ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు.

అలా రిజైన్ చేసిన తర్వాత Eddie Lancer అనే ఎడిటర్ ని కలుస్తాడు.అతను పాత  మిత్రుడు.Reviews,Interviews చిన్న చిన్న human interesting stories రాయమని ప్రోత్సహిస్తాడు.పారితోషికం కూడా బాగానే ఇస్తుంటాడు.ఆ విధంగా జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది.

క్రమేణా పాత ఇంటికి టాటా చెప్పి మంచి ఏరియాలో comfortable గా కట్టుకున్న కొత్త ఇంట్లోకి వచ్చేస్తాడు.ఇక్కడ పిల్లలకి,తమకి తలా ఒక గది ఉంది.తను రాసుకోవడానికి ప్రత్యేకంగా ఒక Den ఉంది.మంచి పరిసరాలు...హాయిగా సాగిపోతుంటుంది జీవితం.మనిషి నిరంతరం సుఖంగా ఉన్నా  దాన్ని భరించలేడు... ఇప్పటి మెర్లిన్ స్థితి అదే. ఏదో ఒక అవాంతరాన్ని ఎదుర్కోవాలి..దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి ...ఏమిటి ఈ నిమ్మకు నీరెత్తినట్లు ఈ జీవితం ..చాలా బోర్ గా ఉంది అనిపిస్తుంది మెర్లిన్ కి.

ఉన్నట్లుండి Eddie Lancer ఓ సారి Chinese restaurent లో డిన్నర్ ఉంది రాకూడదూ అంటాడు.ఎంతసేపు Valerie ఇంట్లో వండిపెట్టిన దానితోనే సంతృప్తి పడుతుంటాడు తప్ప మెర్లిన్ సాధారణంగా ఎక్కడ బయట తిండి తినడు.అదే అంటాడు Eddie తో..!

" మనిషి జీవితం లో పైకి రావాలంటే బయటి లోకం లో కూడా కొన్ని పరిచయాలు ఉండాలి...There will be some good booze...good talk...and some nice looking broads too!And your stuff may read better to some publisher if he's met you at a party and he thinks you're a nice guy"  అని అంటాడు ఎడ్డీ.

ఆ డిన్నర్ తర్వాత జరిగిన పార్టీ లో Osano అనే ఒక పాపులర్ రచయిత పరిచయం అవుతాడు.అప్పటికే అతని అనేక నవలలు ప్రపంచం మొత్తం మీద కొన్ని మిలియన్ లు అమ్ముడయి అతగాడికి పేరుని,డబ్బుని బాగా తెచ్చిపెట్టాయి.నిజానికి చాలా ఏళ్ళ కిందట ఒసానో ని మెర్లిన్ ఇంటర్వ్యూ చేస్తాడు.అయితే ఇద్దరూ ఆ విషయాన్ని  మరిచిపోయినట్లే ప్రవర్తిస్తారు.

ఈ Osano మంచి జల్సా పురుషుడు కూడా..!అప్పటికే 5 గురు భార్యలకి విడకులిచ్చి ఉంటాడు.బయట వ్యవహారాలు సరేసరి.అయితే ఎలాంటి వారినైన బుట్టలో వేసుకొనే తెలివితేటలు,మాటకారితనం అతని సొంతం.సరిగ్గ ఇలాంటి లక్షణాల వల్లనే అతనికి రాకూడనంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయేమో ననిపిస్తుంది మెర్లిన్ కి.తాను ఒక గొప్ప క్లాసిక్ రాయబోతున్నాని,ఎత్తి రాయడానికి, పైకి చదవడానికి ఇలాంటి వాటికి ఒక అసిస్టెంట్ కావాలని ఆ విషయం లో తనకి సహకరించవలసిందిగా మెర్లిన్ ని కోరతాడు.దానికి గాను కొంత పేమెంట్ కూడా చేస్తానంటాడు.

సరేనని సాయంత్రం వేళల్లో Osano ఇంటికి వెళుతుంటాడు.విస్కీ సేవిస్తూ Osano చాలా విశేషాలు చెబుతుంటాడు.ఇష్టం లేని రచయితలని బండ బూతులు తిడుతుంటాడు.తాను ప్రస్తుతం Nobel prize వేటలో ఉన్నానని తనకున్న కనెక్షన్స్ తో ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడొకసారి.

ఇక ఒకరోజు సాయంత్రం గత కాలపు రచయితల్ని తిట్టే ఓ కార్యక్రమం పెడతాడు."Hardy కావచ్చు,Tolstoy కావచ్చు,Galsworthy కావచ్చు.. అసలు ఏమిటి వాళ్ళు రాసినదంత చెత్త..అప్పట్లో ఏ వినోద సాధనాలు లేక వాళ్ళు రాసిన వందల పేజీల చెత్తని జనాలు చదివారు.కీర్తించారు.ఏది ఇప్పుడు రాసి మెప్పించమను చూద్దాం..ఏ పబ్లిషరూ వేసుకోడు...ఒక వేళ వేసినా ఇప్పటి విమర్శకుల ధాటికి తట్టుకోలేరు."

చేసేది ఏమి లేక అలా వింటూ ఉంటాడు మెర్లిన్.

"Anna Kerenina ని ఓ...పెద్ద మాస్టర్ పీస్ అని తెగ పొగుడుతుంటారు.it's a full-of-shit book ..Russia లో ఒక farm నిర్వహించే పద్దతి గురించి 300 పేజీలు రాసి పారేస్తాడా దాంట్లో .. ఇక ఇంగ్లీష్ వాళ్ళు తక్కువ తిన్నారా..Dickens,Trollope అయిదు వందల పేజీలంటే వాళ్ళకొక లెక్క కాదు..చిన్న దానిమీద అలా ఊదిపారేస్తారంతే.They wrote when they had time off from tending their garden.The French kept it short at least...but how about that fucking Balzac..? ఇలా చెలరేగిపోతుంటాడు ఒసానో.

"My boy... మన కాలం లో నివసిస్తున్నవాళ్ళు ఇంకా ముందుకు పోయి ఆలోచించాలి.నువ్వు ఏ చెత్త రాసినా పబ్లిషర్ దాన్ని ప్రచురించే స్థాయికి ఎదగాలి.టి.వి.లకి రాయి..సినిమాలకి రాయి..ఇతర రచనలు చేయి..దుమ్ము రేపాలి..ఈ పాత తరం రచయితలందరిమీద మనం కక్ష తీర్చుకోవాలంటే వాళ్ళ Idea లని తెలివిగా కాపీ చేయాలి.వాటికి సమకాలీన అంశాలని అద్ది మిక్స్ చేసిపారెయ్యాలి.అప్పుడు నూతనత్వం చచ్చినట్లు అదే వస్తుంది"

ఆ విధంగా అంటూ కొంతమంది మీద కక్ష తీర్చుకునే క్రమం లో ఒక లిస్ట్ ని ఇద్దరూ కలిసి తయారించుతారు.Silas Marner,Anna Kerenina,Young werther,Domby and son,the scarlet letter ఇట్లాంటి వాటిని ఎన్నుకుంటారు.

"నీకు అసలు నచ్చని ఓ క్లాసిక్ చెప్పు" అంటాడు ఒసానో.

" Silas marner" చెబ్తాడు మెర్లిన్.

"Old dykey George Eliot .. !Tolstoy is better than Eliot.But the school teachers love her,the profs will come out screaming when I hit Tolstoy" అంటూ సణుగుతాడు ఒసానో.వచ్చేది మళ్ళ ఇంకో భాగం లో చెప్పుకుందాం.

 --KVVS MURTHY  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.