Sunday, June 15, 2014

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదవభాగం)

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (పదవభాగం)

"చివరిదశకి వచ్చేశాను మెర్లిన్...నేను ఎంతో కాలం బ్రతకను.అలాంటి ఈ అంకం లో చార్లీ తో కలసి శయనించి ప్రాణం వదలాలనేది నా చివరి కోరిక...ఇది కూడా పెద్ద తప్పా..?" అంటాడు ఒసానో.

"ఇది ఆసుపత్రిగదా..ఇలాంటివన్నీ ఇక్కడ ఆమోదించమని వాళ్ళు చెబుతున్నారు" మెర్లిన్ అనునయిస్తాడు.

"వెధవ ఆసుపత్రి...ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను.నన్ను బయటికి తీసుకు వెళ్ళిపో తక్షణం"  అంటూ మెర్లిన్ ని ప్రాధేయపడతాడు.సరేనని...బయటకి వచ్చేసి ఓ హోటల్ లో సూట్ తీసుకుంటారు.

"ఒసానో...మీకు చనిపోయే సమయం వచ్చిందని ఎందుకు అనుకొంటున్నారు.."

"కొన్ని అంతే మెర్లిన్...ఇంకా నేను ఎందుకు వేచి ఉండాలి అని ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ నాకు సమాధానం లేదు."

"ఇంకా ఆరునెలల దాకా ఏమీ ఫర్వాలేదని వైద్యులు చెబుతున్నారు గదా...తొందరపడవద్దు."

"మెర్లిన్...చార్లీకి కొంత ధనం ఏర్పాటుచేశాను.అలాగే నా మాజీ భార్యలకి కూడా కొంత ప్రాపర్టి రూపేణా ఏర్పాటుచేశాను.ఇక సరే...నువ్వు నా literary executor వి.నా పుస్తకాల మీద వాటిమీద నీకు సర్వహక్కులు ఉంటాయి." అంటూ అప్పగింతల్లా చెబుతాడు ఒసానో.

తిరిగి అతనే అంటాడు."Merlyn...the most terrible thing in modern life is that we all die alone in bed,In the hospital with all our family around us,nobody offers get in bed with somebody dying.If you're at home,your wife won't offer to get in bed when you're dying."

ఇలా కొంత మాట్లాడిన తర్వాత చార్లీ ని లోపలకి రమ్మని పిలిచి మెర్లిన్ ని కాసేపు గది బయట ఉండవలసిందిగా కోరతాడు.చాలాసేపు wait చేసినతరువాత చార్లీ ఏడుపు వినబడడంతో లోపలకి వెళ్ళిచూస్తాడు.విపరీతమైన మోతాదులో టాబ్లెట్లు వేసుకొని అతను suicide చేసుకున్నట్లుగా గ్రహిస్తాడు మెర్లిన్.వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు.SUICIDE NOTE  కూడా ఒసానో రాసి టేబుల్ మీద పెడతాడు. కాబట్టి మెర్లిన్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు.

ఒసానో పార్ధివదేహానికి జరగవలసిన అన్ని తుది మర్యాదలు ఘనంగా జరుగుతాయి. అన్ని ప్రముఖ పత్రికలు అంజలి ఘటిస్తూ ప్రత్యేక వార్తల్ని రాస్తాయి.అలా ఒసానో జీవితం పరిసమాప్తం అవుతుంది.

....Cully కి మళ్ళీ జపాన్ వెళ్ళవలసిన పనిపడుతుంది.ఈసారి Gronvelt కోరికమీద..!Fummiro ని కలిసి గతంలో మాదిరిగా డాలర్ల మారకం చేసుకొని రమ్మంటాడు.దీని వెనుక ఏమైనా ఉందా అని కల్లీ అనుమానిస్తాడు.

"Fummiro తో ఇదివరకు ఓసారి బిజినెస్ డీల్ చేశావుగదా..!కొత్తవాళ్ళు ఎవరున్నారని.." అంటాడు Gronvelt. (Mario puzo కొన్ని పాత్రలని చాలా indepth ఉండేలా తీర్చిదిద్దుతాడు.చాలాసార్లు సంఘటన మూలాల్ని డైరక్ట్ గా చెప్పడు. సంభాషణల్లోనూ..ఇతర చిత్రణ లోను గుదిగుచ్చుతాడు.ముఖ్యంగా మానవస్వభావం లోని నమ్మకద్రోహాన్ని హృద్యంగా రక్తికట్టిస్తాడు.నిజం చెప్పాలంటే...మూలం చదువుతుంటే ఆ రసానుభూతిలోకి కూరుకుపోతాము.Fummiro తో మొదటిసారి డీల్ చేసే పరిస్థితులని కూడా ఈ Gronvelt నే సృష్టించాడేమో అని మనకి ఓ చోట అనుమానం కలుగుతుంది.అంటే మొదటిసారి సేఫ్ గా పని అయ్యేలా Play చేసి ,రెండవసారి డీల్ లో జపాన్ కి పంపించి కల్లీ ని అక్కడే చంపించే ఏర్పాటు చేయడం అన్నమాట.ఎక్కడా వివరణలు ఉండవు...కాని నర్మగర్భమైన ఆ సంభాషణల్లో అవి తెలిసిపోతుంటాయి.అది కూడా వారి మర్యాద పూరితమైన మాటలవెనుక నున్న అంతరాన్ని అర్ధం చేసుకోగలిగితేనేసుమా...!)

కల్లీ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతాడు.ఆ రాత్రి తనకి బాగా ఇష్టమైన ఇద్దరు Casino girls ని రమ్మంటాడు.దీంట్లో ఒకామె కల్లీ దగ్గర చిప్స్ రూపంలో ధనాన్ని దాచిపెడుతుంది...తన ఇంట్లో తెలియకుండా..!ఆమె కి ఆ చిప్స్ ని తిరిగి ఇచ్చేస్తాడు.రేపు అనేది లేదన్నట్లుగా ఆ రాత్రి ఆ ముగ్గురూ క్రీడిస్తారు.తెల్లవారిన తర్వాత ఇంకో ఆమెకి కూడా కొంత ధనాన్ని ఇస్తాడు.కల్లీ జపాన్ వెళుతున్న సంధర్భంగా ఆ ఇద్దరూ వీడ్కోలు చెబుతారు.

మెర్లిన్ కి ఫోన్ చేసి తాను న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కి వస్తున్నానని ఇద్దరం కలుసుకుందామని అంటాడు.తీరా ఆ టైం కి వెళ్ళి చూస్తే అక్కడ కల్లీ ఉండడు.అసలు ఎప్పుడూ కల్లీ అతనితో ఆ విధంగా ప్రవర్తించడం ఉండదు.అంటే పఠిత ఇక్కడ అర్ధం చేసుకోవాలి.జపాన్ వెళ్ళి తాను సేఫ్ గా తిరిగిరావడానికి ఎంత చాన్స్ ఉందో...అదే విధంగా తాను హత్య గావింపబడడానికి కూడా అంతే చాన్స్ ఉంది.కాబట్టే ఆ రాత్రి వారితో రేపులేదన్నట్లుగా క్రీడించడం...వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చివేయడం చేస్తాడు.అదేవిధంగా మెర్లిన్ కి ఫోన్ చేయడం లోని ఉద్దేశ్యమేమిటంటే తాను ఒక వేళ తిరిగి రాకపోయినట్టయితే అతడు తనవద్ద దాచిన డబ్బుని Gronvelt ని అడగమని.అదేవిధంగా మెర్లిన్ ని ఈసారి జపాన్ ప్రయాణం లో తోడు రమ్మని ఎందుకు అడగడంటే ..ఈసారి తాను ఏదో ఓ చోట చంపబడటానికే ఎక్కువ అవకాశం ఉంది.కనక మెర్లిన్ ని ఆ ఆపదలోకి ఇరికించకూడదని కల్లీ దూరపు చూపు అన్నమాట.ఆ విధంగా ఓ మిత్రధర్మాన్ని పాటిస్తాడు.

చివరకి కల్లీ తన అంతర్ సీమల్లో ఊహించుకున్న మాదిరిగానే జరుగుతుంది.టోకియో లో బిజినెస్ అంతా అయిపోయి రేపు బయలుదేరుతాను అనగా ఇద్దరు ముసుగు మనుషులు కల్లీ ఉన్న గది లోకి ప్రవేశిస్తారు.ఆ గదిలోనే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుంది.

మెర్లి లాస్ వెగాస్ కి వచ్చి Gronvelt ని అడుగుతాడు.కల్లీ తనకి ఫోన్ చేయడం...ఆ తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడం...ఈ విషయాలన్నీ..' .

"ఏమో నాకు కూడా తెలీదు..బహుశా బ్రెజిల్ గాని..జపాన్ గాని వెళ్ళాడేమో...సరే,ఎలాగు వచ్చావుగదా..లంచ్ చేసి వెళ్ళు " అంటాడు.

మెర్లిన్ బయలుదేర్తుండగా Gronvelt ఓ కవర్ ని అతని చేతికి అందిస్తాడు.కల్లీ గదిలో వెదికినపుడు ఇది దొరికింది.....నీకిమ్మని కూడా ఓ నోట్ పెట్టినట్లున్నది 'అంటాడు.

ఎందుకనో...కారణం ఇదీ అని చెప్పలేడుగాని కల్లీ మాయం అవడానికి వెనుక Gronvelt హస్తం ఉంది అని తోస్తుందతనికి. మిగతాది వచ్చే భాగంలో..!
       --KVVS Murthy  


         


No comments:

Post a Comment

Thanks for your visit and comment.