Saturday, June 14, 2014

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (తొమ్మిదవ భాగం)

Mario Puzo నవల Fools Die సంక్షిప్తంగా (తొమ్మిదవ భాగం)

గతంలో Gronvelt తనపేరుమీద కేటాయించిన Xanadu షేర్లు లేదా పాయింట్లను ఇప్పుడు Santadio పేరుమీదకి మార్చమని అడగటంలోని అంతరార్ధాన్ని Cully గ్రహిస్తాడు.అంటే Xanadu నుంచి తనని Delink చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట.ఇప్పుడుగాని తాను దీనికి వ్యతిరేకిస్తే santadio mafia family కి వ్యతిరేకిగా పరిగణింపబడతాడు.వాళ్ళతో వైరం తన ప్రాణాలకే ముప్పు.

సరే...అని బాండ్ పేపర్లమీద సంతకాలు చేస్తాడు.అయితే తన అంగీకారాన్ని ప్రభుత్వ శాఖకి (Gaming commission) తెలియబరచి...పేర్లు మార్చి ఇంకా మిగతా తంతులు పూర్తి చేయడానికి 6నెలల గడువుని santadio  ఇస్తాడు.

...మెర్లిన్ హాలీవుడ్లో ఒసానో ని కలుస్తాడు.అతని తో పాటు Charlie కూడాఉంటుంది.తనతో కలిసి లంచ్ చేయవలసిందిగా కోరతాడు ఒసానో.

" మెర్లిన్...నిన్ను నా Literary executor గా నియమిస్తున్నాను." అంటాడు ఒసానో మాటల మధ్యలో ..! ఖంగుతింటాడు మెర్లిన్.అంటే దాని అర్ధం ఒసానో తదనంతరం అతని సాహిత్య సృజనకి... పుస్తకాలకి సంబందించిన అన్ని హక్కులు తనకి వస్తాయి.గతం లో ఒకసారి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తను నిరాకరించాడు.

"నాకు ఎందుకు....మీ మాజీ భార్యల్లో ఎవరికైనా లేదా మీ పిల్లల్లో ఎవరికైనా ఇవ్వవచ్చుగదా " అని అంటాడు మెర్లిన్.

"లేదు...ఇక నేనెవరినీ విశ్వసించను.నీ మీద మాత్రమే నాకు ఆ అభిమానం ఉన్నది" అని బలవంతంగా ఒప్పించి ఆ లీగల్ డాక్యుమెంట్ రాయిస్తాడు.

అన్నట్లు నీ సినిమ ...అది ఎంతదాకా వచ్చింది.."

"అది రిలీజవడము...ఫెయిల్ అవడమూ శరవేగంగా జరిగిపోయాయి.ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది.నా వేరే నవల మీద ఇప్పుడు నేను పనిచేసుకోవచ్చు.." నవ్వుతూ మెర్లిన్ జవాబిస్తాడు.

ముగ్గురూ కలిసి ఓ సమావేశానికి వెళతారు.ఆ  తెల్లవారి ఒసానో ఫోన్ చేస్తాడు." మెర్లిన్..నువ్వు నాకు ఓ చిన్న సాయం చేయాలి.నేను నార్త్ కరోలిన లో ఉన్న డ్యూక్ మెడికల్ సెంటర్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటున్నా.అక్కడిదాకా నాకారుని Drive చేయాలి నువ్వు" అని..!

అంగీకరించిన మీదట బయలుదేరుతారు ...!మెర్లిన్ ఆ కారు ని తోలుతున్నంతసేపు ఒసానో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉన్నాడు." I love this part of the country.I love the way they run the Jesus Christ business down here.It's almost like every small town has it's Jesus Christ stores and they make a good living and a lot of friends.One of the greatest rackets in the world.When I think about my life,I think only it I had been a religious leader instead of a writer.What a better time I would have had" ఇలా సాగిపోతూంది ఒసానో వాగ్ధార ఆ దక్షిణాది రాష్ట్రం లోని ఊళ్ళను పరికిస్తూ..!

ఆ ఆసుపత్రి లో పరీక్షలన్నీ చేయించుకున్నతరువాత కొన్ని రోజులపాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోమని వైద్యులు చెబుతారు.ఒక స్పెషల్ సూట్ ని వీరికి కేటాయిస్తారు.అసలు విషయమేమిటంటే ఒసానో ఆరోగ్యం అవసానదశకి చేరుకుంటుంది.పైగా కొన్ని సమయాల్లో పెన్సిలిన్ ని బాగావాడి సొంత ట్రీట్ మెంట్ లు చేసుకుంటాడు.పైగా కొన్ని సుఖవ్యాధులు కూడా..!  ఇవన్నీ చివరికిక్కడికి వచ్చేలా చేస్తాయి.

ఓ రోజున ఉన్నట్లుండి చార్లీ ఫోన్ చేస్తుంది.ఒసానో పరిస్థితి బాగా లేదని... వెంటనే రమ్మని..! బయలుదేరి వెళతాడు.ఆసుపత్రి వర్గాలు ఒసానో మీద కారాలు,మిరియాలు నూరుతుంటారు.ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో అని  గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళని శాంతపరచి మెర్లిన్ 'అసలు విషయం ఏమిటీ అని ఒసానో ని అడుగుతాడు.మంచం నుంచి కదలలేని స్థితి కాకపోయినా లేచి అడుగులు చాలా ప్రయత్నం తో వేయవలసిన స్థితి లో ఒసానో శరీరం ఉంటుంది.

మిగతాది వచ్చే భాగం లో చూద్దాం..!
              -----KVVS Murthy  




No comments:

Post a Comment

Thanks for your visit and comment.