Monday, June 9, 2014

Mario Puzoనవల Fools die సంక్షిప్తంగా..(ఏడవ భాగం)

Mario Puzoనవల Fools die సంక్షిప్తంగా..(ఏడవ భాగం)

Xanadu హోటల్ కం కేసినో అధినేత Gronevelt యొక్క ఆదరాభిమానాలు కల్లీ చూరగొంటూ ఆ సంస్థ కి వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడతాడు.అనేక రకాలైన ప్రణాళికలతో సంస్థ ఆదాయం బాగా పెంచుతాడు Cully.అయితే Gronevelt గూర్చి ఒక ముఖ్య విషయం చెప్పాలి.Percentage అనే భావనలో అతనికి పూర్తి నమ్మకం ఉంటుంది.ఏ మనిషినైనా ,ఏ పనికైనా వచ్చేదానిలో పర్సెంటేజ్ కరెక్ట్ గా కేటాయిస్తే చాలు ఏ పని అయినా అవుతుందనేది అతని విశ్వాసం.అవి తేడాలు వచ్చినపుడే మనుషులు కొట్టుకోవడం చంపుకోవడం లాంటివి  జరిగేది.అలాంటి పనులు Fools మాత్రమే చేస్తారు. Fools will die.

జపాన్ భాగ్యవంతుడు Xanadu లో గేంబ్లింగ్ ఆడటానికి వచ్చే Fummiro ఒక ప్రతిపాదనని Cully కి చేస్తాడు.జపనీస్ కరెన్సీని అమెరికన్ డాలర్ ల లోకి పెద్దమొత్తంలో మార్చి పెట్టి సహకరించవలసిందిగా కోరుతాడు.దానికి గాను కొంత సొమ్ము ముట్టజెపుతానంటాడు.అది అంత సులభమైన పనికాదు..ఎటుపోయి ఎటు వచ్చినా... ఆ పెద్దాయన Gronevelt కి చెప్పి అతని సలహా మేరకు చేస్తానంటాడు కల్లీ.

ఈ కల్లీ ని Groanvelt కుమారుని వంటి వాత్సల్యం తో చూస్తుంటాడు.అయితే కల్లీ చాకచక్యం,సమర్ధత అతనికి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడూ ఒక కన్ను వేసేఉంచుతాడు.Who knows...people will change అనేది అతడు అనుభవంలో గ్రహించిన సత్యం.

Fummiro ప్రతిపాదన గూర్చి Gronevelt కి వివరిస్తాడు.జపాన్ కరెన్సీ ని అంత పెద్ద మొత్తంలో ఇక్కడికి తేవడం కష్టం.నువ్వు వచ్చేటప్పుడు హాంగ్ కాంగ్ లో దిగి ఒక బ్యాంక్ లో వాటిని డిపాజిట్ చెయ్యి. అక్కడినుంచి డాలర్లలోకి మార్చి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు...హాంగ్ కాంగ్ చట్టాలు సరళతరంగా ఉంటాయి గనక సమస్య ఉండదు.జపాన్ ప్రజలని తక్కువ అంచనా వేయకు.. That little bastards are very clever అని సలహా ఇస్తాడు Gronevelt.

అయితే జపాన్ కి తను ఒక్కడే ఎందుకు వెళ్ళడం ...మెర్లి ని కూడా తీసుకువెళదాం అనుకొని కల్లీ అతనికి ఫోన్ చేస్తాడు."నేను టోకియో వెళుతున్నా.. సరదాగా నువ్వు కూడా రారాదు..అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా "అంటాడు."ఏమిటి విషయం" అడుగుతాడు మెర్లిన్.

"అది ఫోన్ లో చెప్పేది కాదు...బయలుదేరి వచ్చేయ్"

"సరే" అంటాడు మెర్లిన్.మెర్లిన్ కూడా కల్లీ అడగ్గానే ప్రయాణానికి ఒప్పుకోవడం లో ఒక అంతరార్ధం ఉంది.తాను ఓమారు లంచం కేసులో పట్టుబడి జైలుకి వెళ్ళే పరిస్థితి లో ఉన్నప్పుడు కల్లీ తనకి హెల్ప్ చేసిన సంగతి అతను మర్చిపోలేదు.కాబట్టి I owe him a favour అని తలపోస్తాడు.

లాస్ వెగాస్ లో రాగానే తాము ఏ పనిమీద వెళ్ళేదీ చెప్తాడు కల్లీ.'ఇది ప్రమాదకరమైన విషయం కదా..' అని సందేహం వ్యక్తం చేస్తాడు మెర్లిన్.

'తప్పదు మరి....ఏదో ఒకటి చేయకపోతే పెద్ద మొత్తం లో ఎలా సంపాదించగలం...You have to get rich in the dark'  నవ్వుతూ అంటాడు కల్లీ.

ఇంకో సంగతి కూడా ఉంది.FBI వాళ్ళు ఎయిర్ పోర్ట్స్ లో సర్వేలెన్స్ కెమేరా లు అమర్చి దేశంలోకి వచ్చీ పోయే వాళ్ళమీద నిఘా ఉంచుతారు.నేను జపాన్ వెళ్ళే విష్యం తెలిస్తే ఎందుకు వెళుతున్నాడా అని ఆరా వస్తుంది.మనం తీసుకెళ్ళే డాలర్లు గంగపాలు అవుతాయి.  ఒకవేళ నాకు ఏమైనా అయినా..ఎలా ఆపరేట్ చేయాలనేది నీకు చెబుతాను.సరే...ఏమీ జరగదులే...అన్ని జాగ్రత్తలు తీసుకునే బయలు దేరుతున్నాం" భరోసా ఇస్తాడు కల్లీ.

టోకియో లో దిగగానే Fummiro  ఎయిర్ పోర్ట్ కి వచ్చి ఇద్దరినీ రిసీవ్ చేసుకుంటాడు. ఒక చక్కని హోటల్ లో బస కల్పిస్తాడు.ఆ తెల్లారి గీషా ల ఇళ్ళకి కూడా తీసుకువెళ్ళి ఆ ఇద్దరికి జపానీస్ మర్యాదల్ని కూడా రుచి చూపిస్తాడు.'ఎందుకని...వీధుల్లో ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు అని అడిగితే పొల్యూషన్ రాకుండా ఆ ఏర్పాటు అని వివరిస్తాడు Fummiro.

ఇంట్లో చిన్న స్థలమైనా నీట్ గా ఉండటం,ప్రతి దానికి టేబుళ్ళు ..కుర్చీలు లాంటి ఫర్నీచర్ వాడకుండా చక్కగా చాపలు పరుచుకొని పనులు కానిచ్చుకోవడం లాంటి జపాన్ సాంప్రదాయాలు కల్లీ ని ఆకర్షిస్తాయి.

ఆ సాయంత్రానికి బిజినెస్ పూర్తి కానిస్తారు...వీరి దగ్గర ఉన్న డాలర్ల సూట్ కేసుల్ని వాళ్ళకిచ్చి,వారిచ్చిన జపాన్ కరెన్సీ ని కొన్ని బ్యాగుల్లో సర్దుకొని హాంగ్ కాంగ్ లో కొచ్చేస్తారు.అక్కడ Gronevelt చెప్పిన ఓ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. ఆ విధగా పని ముగుస్తుంది.

*        *        *

Jannele ఇంకా మెర్లిన్ యొక్క affair ఆ హాలీవుడ్ లో అలా కొనసాగుతూ ఉంటుంది.ఆమె సినిమాల్లో ని పాత్రలతో పాటు థీయేటర్ లో డ్రామాల్లో కూడా ఫాల్గొంటూ ఉంటుంది.కొంతమంది ఇతర ప్రొడ్యూసెర్ల తోనూ..దర్షకులతోనూ...ఆమెకి గల సంబంధాలు మెర్లిన్ కి తెలుసు.ఒకసారి మాటవరసగా మెర్లిన్ ప్రస్తావించగా...మీ పురుషులు ఇంట్లో భార్యా పిల్లల్ని పెట్టుకొని బయట వ్యవహారాలు నడిపితే తప్పుగాదుకాని అదే ఒక స్త్రీ అలా చేస్తే మటుకు మీకు తప్పుగా ఉంటుంది కదూ...అంటూ విమెన్స్ లిబ్ కార్యకర్త మాదిరిగా క్లాస్ తీసుకొంటుంది.ఇక అప్పటినుంచి వాటిని ప్రస్తావించడు.అయినా...రేపో మాపో ఈ హాలీవుడ్ లో తన పని పూర్తి అయిన వెంటనే Safe den లాంటి తన కుటుంబం తో కలిసి ఉండ టానికిచెక్కేస్తాడు. అలాంటప్పుడు ఇవన్నీ తనకసరమా అనుకుంటాడు.

Jannelle తో పాటు ఆమె ఫ్లాట్ లోనే Alice అనే ఓ కాస్ట్యూం డిజైనర్ ఉంటుంది.ఆ ఇద్దరు ముందు ఎవరికి వారు INDIVIDUAL గానే ఉన్నప్పటికి ఆ తరువాత వీరికి సాన్నిహిత్యం బాగా పెరిగి లెస్బియన్స్ గా మారతారు.అలా అనడం కంటే బై సెక్సువల్ అంటే బాగుంటుందేమో.Jannele కి ఉన్న ఉన్న కొడుకుని కూడా ఈమె వాత్సల్యం తో చూస్తూ ఉంటుంది.వీరిరువురి మధ్య బంధం బలపడటానికి అది కూడా ఓ కారణం.ఒకరికి ఒకరు చేదోడుగా ఉంటూ బయట కూడా వేరే పురుషులతో సంబంధాలు కలిగిఉంటారు.వాళ్ళ మధ్య ఈ విషయం లో ఎలాంటి అసూయ ఉన్నట్లు కనపడదు.మెర్లిన్ కి కూడా ఈ సంగతి తెలుసు.వారు ఇరువురు మధ్యగల Understanding కి ఆశ్చర్యపోతాడు.మెర్లిన్ వచ్చినప్పుడు ఈమె చక్కగా రిసీవ్ చేసుకుంటుంది.

Jannelle వీరిద్దరిలో male partner పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తుంది మెర్లిన్ కి..!కిచెన్ లో Alice ఉన్నప్పుడు వెనకనుంచి వెళ్ళి చరవడము,పట్టుకోవడమూ లాంటివి చేస్తూ ఉంటుంది.సినిమా వర్క్ కూడా పూర్తి కావొస్తుంది.రేపు తాను న్యూయార్క్ వెళ్ళిపోతున్నానని చెపుతాడు.షాంపేన్ తో ముగ్గురు పార్టీ చేసుకుంటారు ఆ సాయంత్రం.ఎన్నో చర్చలు...వాగ్వివాదాలు...ప్రణయ సల్లాపాలు ఈ ఉన్నన్ని రోజుల్లో మెర్లిన్ కి జానెల్ కి మధ్య నడుస్తవి.దానివల్ల వారిరువురి మధ్య బంధం వృద్ది చెందుతుంది.అది ఏదో ఒకరోజు విడిపోయేదే తప్ప...శాశ్వతమైనది కాదని ఇద్దరికీ తెలుసు.

ఎప్పుడైనా పొరబాటునా I love you అని మెర్లిన్ చెప్పినా జానెల్ దానికి వ్యతిరేకిస్తుంది...వివాహం అయినా పురుషుడు తన భార్యని వదిలివేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట చెప్పాలని ఖండిస్తుంది.ఎక్కువ వాదించడు అలాంటి సమయాల్లో....ఎందుకంటే తనకి తెలుసు తాను ఒక Safe and Soft hustler నని,గేంబ్లింగ్ భాషలో చెప్పాలంటే...!

సరే మిగాతాది వచ్చే భాగం లో చూద్దాం...!

                       ----KVVS MURTHY


No comments:

Post a Comment

Thanks for your visit and comment.