Mario Puzo నవల Fools die అనువాదం అనాలో సంక్షిప్తంగా అనాలో కాని మొత్తానికి దాన్ని తెలుగులో చెప్పాలి అనే ఓ కోరికతో ఇప్పటికి ఏడు భాగాలు రాశాను.అది ఎంతమందికి ఎలా అనిపించిందో నేను ఖచ్చితంగా ఊహించలేను.కొన్ని ఇంగ్లీష్ క్లాసిక్స్ ని కొంతమంది తెలుగు చేసి ఉండవచ్చు.కాని దానిలోని ఇప్పుడొచ్చే పాపులర్ రచనలని అనువాదం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ...ఏమో నాకు తెలీదు.
నేను ఊహించగలను...దాని లోని సెక్స్ మోతాదు పాళ్ళు ఎక్కువ అయిందని.కాని దానిలో నా ప్రమేయం లేదు.ఆ రచయిత కధనికించపరచకూడదు అనే ఉద్దేశ్యంతో అలాగే ఉంచేశాను.ఏ మాటకి ఆ మాట...మానవ ప్రపంచాన్ని,ముఖ్యంగా సెక్స్ పరమైన విషయాలని చూడటం లో వారికి మనకి మౌలికమైన ఒక తేడా ఉన్నది.
ఒక్కోసారి అది మనల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.ఈ జీవితం ఉన్నది ఒక్కసారికే...దాని లోని రసాన్ని సాధ్యమైనంత పిండుకోవడమే న్యాయం అని వారి ప్రపంచం విశ్వసిస్తుంది.కాని మన దృక్పధం వేరు. జీవితం లోని ప్రతి పార్శ్వం మనకి తెలియకుండానే Spiritual approach తో నిండివుంటుంది.లేదా ఆ ప్రభావిత జీవితం గా మనం పుట్టినప్పటినుంచి నిర్మించబడి ఉంటుంది.ఒక్కోసారి దానిలో మన ప్రమేయం కంటే సమాజం ప్రమేయమే ఎక్కువ.
కాని పాశ్చ్యాత్య ప్రపంచం యొక్క విలువలు కనిపించే భౌతిక ప్రపంచం మీదనే ఆధారపడి ఉంటాయి.ఇది Pragmatic approach అని చెప్పుకోవచ్చు.ఎవరి దాన్ని బట్టి వారికి అది విలువైనదిగా అనిపిస్తుంది. మనం ఒకటి మరవరాదు....ఎప్పుడు భోగ లాలసత ...మద్యపానం..ఇలాంటి అంశాలే వారిని చూసినప్పుడల్లా మనకి గుర్తుకు వస్తాయి. అదే వారి జీవిత సరస్వమైతే కంటికి కనిపించే అన్ని జ్ఞాన ప్రపంచాలలోకి వెళ్ళి ఇన్ని రకాలైనా ఆవిష్కరణలు ఎలా చేయగలిగారు.
ఈనాడు మన సమకాలీన జీవితం లోని ప్రతి సుఖమయ వస్తువుని ఎందుకని వారు మాత్రమే ఆవిష్కరించగలిగారు.మనం వినిమయదారులుగానే ఎందుకు మిగిలిపోయాం. మనం వారి అంత ప్రగతి సాధించాలనుకుంటాం.కాని వారి చోదక శక్తులు ఏమిటో గమనించమందుకనే ఒక సంగర్షన నెలకొంటుంది.ఇక్కడ ఏ బూతద్దాలు వద్దు.ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి.దానికి చాలా ధైర్యం కావాలి.ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు.మానవ జీవిత చక్రం లోని ఒక అనివార్యత అది.
నాకు అవగతమైనంతలో....ఆనందం పొందటం లో ...దాన్ని ఆస్వాదించటం లో ఆడ,మగ కి గల తేడాలని పాశ్చ్యాత్య ప్రపంచం ఎప్పుడో అధిగమించింది.దాన్ని ఇరువురు అంగీకరించే దశకి వారు చేరుకున్నారు.ఏదైనా...మూలం ధనము మాత్రమే...ఎవరి జీవితానికి వారికి భరోసా ఉన్నప్పుడు వ్యక్తి మాత్రమే నిజం..అది వాస్తావం...కాని మనం అంగీకరించం...లోపల తెలుస్తూనే ఉంటుంది.కాని అంగీకరించం...దానికి బాహ్య కారణాలే ఎక్కువ.
ఆ ప్రపంచం నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు.చాలా కాలమైంది.అయితే అక్కడ విలువలు లేవా...బాంధవ్యాలు లేవా...ఉన్నాయి...మనకంటే ఎక్కువగా..! అయితే అక్కడ దేబిరింపు లేదు.అంతే.
I fucked her అని మన దగ్గర పురుషుడు ఎలా అంటాడో I fucked him అని స్త్రీ కూడా అంటుంది.ఏమిటిదీ అని నామీద కోపం రావచ్చు...కాని కొన్ని మానసిక ప్రపంచపు తెరలు దాటి పోవలిసిందే....ఇష్టం ఉన్నా...లేకపోయినా...అది కాల మహిమ.బ్రిటిష్ వాళ్ళు మన దేశం రాకపోయివుంటే ...ఇప్పటికి మనదేశ ప్రగతి ఆఫ్రికా లోని ....ఏ కాంగో లాంటి దేశ కన్నా కన్నా గొప్పగా ఉండేదా అని.దోపిడి చేస్తే చేశారు గాని...దానికి తగిన కొన్ని విశాలమైన కిటికీలని తెరిచివెళ్ళారు...నేను దేశాభిమాని కానా అనిపిస్తున్నదా...అనిపించినా నేనేమీ చేయలేను.ఇంకా చాలా ఉన్నాయి...ముందు రోజుల్లో మాట్లాడుకుందాము.
No comments:
Post a Comment
Thanks for your visit and comment.