నాకు ఎన్ని రోజులనుండో ఒక ప్రశ్న అడుగుదామని ఒకటే ఆతురత గా ఉండేది.అయితే అటువంటివి సాధనా మార్గం లో ఉన్నవారికి..అదీ ఎంతో గానో ఆధ్యాత్మిక లోతులను తరచి చూసిన వారికి గాని బోధపడవని నా నమ్మకం. సరైన వారు నాకు తారసక పడక అలానే నాలోనే ఉంచుకున్నాను దాన్ని.కట్టా కృష్ణారావు గారని చెప్పి ఆయన వలన నేను యోగ మార్గం లోకి ప్రవేశించబడ్డాను.నిజం చెప్పాలంటే నేను skeptic ని ఇలాంటి విషయాల్లో.ఆయన ప్రవర్తన,మాట ,ఇతర తీరులు నన్ను ఎందుకనో ఆకర్షించేవి.కేవలం ఆయన పై గల ప్రేరణా పూర్వకమైన అభిమానం వల్లనే కుండలినీ సాధన లోకి ప్రవేశించాను.కాలం గడుస్తున్న కొద్దీ ఎదురయ్యే విచిత్ర అనుభవాలు చాలా ఆశ్చర్యకరం గా అనిపించేవి.అవి చెప్పడానికి నాకు భాష సరిపోదు.కాలం సరిపోదు.అందుకనే మనదేశం లో ఇలాంటి అనుభవాలని బయటకి వెల్లడించడానికి గురువులు అనుమతించలేదేమో అనిపించింది.ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్పగలను.భారత దేశం యొక్క నిజమైన లోతులు ఏమిటో ఎవరూ ఎప్పటికి కనుక్కోలేరు.సాధన లో అంచులు దాకా వెళ్ళిన మహానుభావులుతప్ప ..! అందుకే ఓషో అన్నాడేమో.." ఒక అయిన్ స్టీన్ ఎక్కడైనా పుట్టవచ్చు..కాని ఒక ఋషి మాత్రం ఇండియా లోనే పుడతాడు" అని.
సరే..ఎక్కడకో వెళ్ళిపోతున్నా...అసలు విషయం లోకి వస్తాను...ఒకానొక రాత్రి ,ధ్యానం చేసి పడుకున్నాక,మధ్య రాత్రి వేళ ...ఉన్నటుండి తెలివి వచ్చింది ..ఎందుకో లోపల నరాల్లోంచి ఏదో తెలియని ఒక వైబ్రేషన్...ఉన్నట్లుండి నా మెదడు లోకి ..ఎవరో ప్రశాంతంగా ,నెమ్మదైన వాయిస్ తో మాట్లాడినట్లుగా అవుతున్నది.ఆ స్వరం ఇలా అన్నది" నేను యయాతిని...పురాణాల్లోని వి అన్నీ కట్టుకధలు కావు.నేను ఇంకా సజీవంగా నే ఉన్నాను."
నాకు ఎప్పుడూ అలాంటి అనుభవం కాలేదు.అసలు యయాతి గురించి కూడా నాకు తెలియదు.వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేశాను.ఆయన కధని ..వృతాంతాన్ని తెలుసుకున్నాను.అయితే సాధానా మార్గం లో పురోగమించిన వారే ఇలాంటివి ఇంకా వివరించి చెప్పగలరు.బయటికి ఎవరికి చెప్పినా నవ్వుతారు గనక అది నాలో అలానే దాచుకున్నాను.
గత కొంతకాలంగా ఆలోచనాతరంగాలు బ్లాగు చదువుతున్నప్పుడు దానిని నిర్వహిస్తున్న సత్యనారాయణ శర్మ గారిని ఈ ప్రశ్న అడగాలనిపించి అడిగాను.వారు వెంటనే నాకు సమాధానమిచ్చారు.వారిలో గొప్ప సాధకుని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించడం వల్లనే నేను అడిగాను. ఆ సమాధానాన్ని క్రింద ఇస్తున్నాను.నిజానికి ఇలాంటివి అన్నీ చాలా పర్సనల్ గా వర్తిస్తాయి.అయితే ఏ ఒక్కరికైనా ఏ విధంగా నైనా మంచికి ఉపయోగపడుతుందేమోని ఇక్కడ రాస్తున్నాను అంతకు మించి ఏమీ లేదు.శర్మ గారికి నా ఈ బ్లాగు ద్వారా మరోసారి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment
Thanks for your visit and comment.