Thursday, June 27, 2013

అట్లా మన విలువైన చరిత్రకి సంబందించిన కట్టడాలు ఎన్నో నాశనమయ్యాయి.



మనం చరిత్ర లో రాక్షస గుళ్ళు లేదా megalithic burials గురించి ఎంతో చదువుకొని వుంటాము.ఇవి ఇంచు మించు కొన్ని వేల ఏళ్ళ క్రితం అప్పటి మనిషి కట్టుకున్న నిర్మాణాలుగా చెప్పవచ్చు.అంటే ఆ కాలంలో  మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళకి సంబందించిన వస్తువులు..ఇంకా కొన్ని పనిముట్లు..సమాధుల్లో పెట్టి చుట్టూరా పెద్ద బరువైన రాళ్ళని పేర్చి..దాని పైన కప్పు లాగా ఒక పెద్ద రాతిని వుంచేవారు.ఇవి రాతివి కనక ఎన్నో సంవత్సరాలు అలా మన గలిగాయి.మనవాళ్ళకి చారిత్రక స్పృహ తక్కువ గనుక దాంట్లో ఏవో వుంటాయని వాటన్నిటిని తవ్వి అలా వదిలి పారేశారు.




అట్లా మన విలువైన చరిత్రకి సంబందించిన కట్టడాలు ఎన్నో నాశనమయ్యాయి.

మన భద్రాచలం డివిజన్ లో గల వెంకటాపురం మండలం లోని సూరవీడు సమీపం లో గల కాముని చెరువు గుట్టల పైన ఎన్నో రాక్షస గుళ్ళు వున్నాయి.చర్లకి చెందిన మా మితృడు  నరేంద్ర బాబు ఈ విషయం నాతో చెప్పగా ఒకసారి వెళ్ళాము.సుబ్రహ్మణ్యం,నరేంద్ర వాళ్ళ బాబు..మోహన్ కూడా వచ్చారు.



కాముని చెరువుకు చాలా మంది పిక్నిక్ కి వస్తుంటారు.ఎందుకంటే ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ..చెరువు..ఎత్తైన గుట్టలు ..చాలా మనోహరంగా వుంటాయి.అయితే రాక్షస గూళ్ళు గుట్టల పైకి వున్నాయి.బహుశా ఒక 400 మీటర్లు ఎత్తు వుండవచ్చును.



 నేను ఎక్కడానికి కొద్దిగా ప్రయాస పడ్డాననే చెప్పాలి.పైకి ఎక్కిన తరవాత మతి పోయింది.ఒకటో రెండో వుంటాయి అనుకున్నాము గాని దాదాపుగా ఒక వంద పైనే రాక్షస గూళ్ళు వున్నాయి.జానపదులు వీటిని పాండవులు వున్న ఇళ్ళు అని భావిస్తారు.



ఎంత చరిత్ర వున్నది ఇక్కడ అనిపించింది.ఆ నిర్మాణాలు కొన్ని చాలా పెద్దగా వున్నాయి.గూళ్ళ పైన ఒకటే రాయి చాలా విశాలమైనది పరిచారు..కొన్ని వేల యేళ్ళ  కిందట....అంత బరువైన ఈ రాళ్ళని  గుట్ట మీదకి చేర్చడం ఒక ఎత్తైతే..వాటిని చక్కగా పైకి అమర్చడం ఒక ఎత్తు. మరి ఎలా చేశారో అని ఆశ్చర్యం కలిగింది.

వీటిని పురావస్తు శాఖ పరిరక్షించి ప్రాచుర్యం కల్పించినట్లయితే ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ చారిత్రక విశేషాలని పరికిస్తారు.     

No comments:

Post a Comment

Thanks for your visit and comment.