Saturday, June 29, 2013

ఇంకా విశ్రాంతి ఎరుగని యోధునిగా కృషి చేస్తున్న మాల్యశ్రీ కి అభినందనలు..!

పద్య కవిత,వచన కవిత,కధ,నవల,నాటకం ఇలా బహు ముఖీన ప్రజ్ఞాశీలిగా పేరెన్నికగన్న మాల్యశ్రీ భద్రాచలం ప్రాంతంలో నుంచి వచ్చిన ఆణిముత్యంగా చెప్పవచ్చును.బాల సాహిత్యం లో కూడా ఆయన విశేషమైన కృషి చేశారు.జూన్ 22,1938 నాడు భద్రాచలానికి సుమారు 50 కి.మి. దూరం లోనున్న చర్ల మండలం లోని మొగళ్ళపల్లి లో జన్మించారు.



సామాన్య రైతుకుటుంబం నుండి వచ్చిన ఆయన ఈ ప్రాంత సాహిత్య వాతావరణాన్ని ఎంతో ప్రభావితం చేశారు.ఎంతోమంది కి ప్రేరణగా నిలిచారు.చిన్నతనంలో శ్రీమాన్ జి.వి.రాజగోపాలాచార్యుల మార్గదర్శనంలో పాఠశాల ప్రాయంలోనే విరివిగా రచనలు చేయడం ప్రారంభించారు.ఆయన విద్యాభ్యాసం మొగళ్ళపల్లి,చర్ల,వెంకటాపురం, సామర్లకోటలో సాగింది.

ఆవంత్స సోమసుందర్,రాం షా,మిరియాల రామకృష్ణ గార్ల సాహిత్య గురువులుగా సంభావిస్తారు.ఆ ముగ్గురు తనకు ఎన్నో అమూల్యమైన  విషయాలని బోధించి సాహిత్యపరంగా తీర్చిదిద్దినవారిగా భావిస్తారు.ఊపిరిసలపని గ్రామీణాభివృద్ది అధికారిగా ఓ వైపు వృత్తి ని నిర్వహిస్తూనే మరోవైపు..తన కలానికి ఎప్పుడూ విశ్రాంతినివ్వకుండా రచనలు సాగిస్తూనేవచ్చారు.ఇప్పటికి ఆయన పదవీ విరమణ చేసి ఓ దశాబ్దం అవుతున్నా సమధికోత్సాహంతో సాహిత్య కృషి చేస్తూనే వున్నారు.

ఆయన జనరంజని అనే పద్యసంపుటిపై ఇటీవల పి.శోభాదేవి అనే ఆమె పరిశోధన చేసి M.Phil  డిగ్రీ పొందటం జరిగింది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2012  లో ఇది జరిగింది.మాల్యశ్రీ రచనల్ని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి.వివిధ పత్రికల్లో వచ్చిన బాలగేయాలన్ని కలిపి రత్నమంజూష అనే పుస్తకంగా తేవడం జరిగింది.రామదాసు అనే పద్య కావ్యాన్ని వెలయించారు.ఆయన కధల్లో కొన్నిటిని వెన్నెల మలుపులు-చీకటి వెలుగులు అనే పేరుతో ఓ సంకలనంగా ప్రచురించారు.

ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి సంస్థ లో కీలక పాత్ర పోషించారు.సాహిత్య కార్యక్రమాలని నిర్వహించడంలో మార్గదర్షకంగా నిలిచారు.అనేక జిల్లాల్లో జరిగే నాటక పోటీలకు న్యాయా నిర్ణేతగా వ్యవహరించారు.ఇంకా విశ్రాంతి ఎరుగని యోధునిగా కృషి చేస్తున్న మాల్యశ్రీ కి అభినందనలు..!

                                     Malyasri Mobile No: 9290070043

No comments:

Post a Comment

Thanks for your visit and comment.