హిందీ పండితులు వుద్యోగరీత్యా ఎందరో వుండవచ్చు..కాని హిందీ భాషాసాహిత్యాలని నిండుగా ప్రేమించి దానిలో కృషి చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే వుంటారు.ఆ కోవకి చెందినవారే శ్రీ నాంపల్లి మధుసూదన రావు.ప్రస్తుతం ఆయన భద్రాచలం మండలం లోని నందిగామపాడు హైస్కూల్ లో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.హిందీ పండిట్ శిక్షణ పొందిన తరువాత..దానిలోనే పి.జి. చేశారు.ఆ తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం నుండి హింది సాహిత్యం లోనే కృషి చేసి M.Phil పట్టా పొందారు.వారి గైడ్ అయిన డా.సంజీవ్ గారిని ఈయన ఆదర్శంగా చెబుతుంటారు.
హిందీ సాహిత్యాన్ని విరివిగా ప్రచారం చేయాలనే వుద్దేశంతో 'హిందీ దివశ్ నాడు ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు.ఆయన ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా.రేఖా శర్మ పర్యవేక్షణలో హిందీ కధా సాహిత్యంలో P.hd చేస్తున్నారు.
మధుసూదన రావు భద్రాచలం ప్రక్కనున్న దుమ్మగూడెం మండలంలో నాంపల్లి రాఘవాచారి,సుగుణావతి దంపతులకి జన్మించారు.పదవతరగతి దాకా స్థానిక పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు.ఆ తరువాత కొత్తగూడెం ,వరంగల్ లో వున్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
డిగ్రీ స్థాయిలో సైన్స్ (B.Sc) చదివారు.ఆ తరువాత LL.B చేశారు. పదవతరగతి లో స్కూల్ టాపర్ గా నిలిచి స్కాలర్ షిప్ ని పొందారు.సాంస్కృతిక రంగం లో కూడా బాగా కృషి చేశారు.హిందీ భాష లో అనేక కవితలు,వ్యాసాలు రాశారు.తన వద్ద చదివే విధ్యార్ధులతో కూడా హిందీ లో కవితలు రాయిస్తుంటారు.వారిని భాష పట్ల అనురక్తులుగా తయారుగావిస్తుంటారు.
తాను డిగ్రీ చదివే సమయంలో లెక్చరర్ గా వున్న డా.మధుబాబు గారి ఇన్స్పిరేషన్ తో తాను P.hd చేయాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు.2007 లో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ లో ఫాల్గొనడం తనకు లభించిన గొప్ప అవకాశాల్లో ఒకటిగా చెప్పారు.
రేగొండ (వరంగల్ జిల్లా) లోని భారతి ఆశ్రమ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.ఆ తరువాత 1996 లో జరిగిన D.Sc లో ఓపెన్ కాంప్టిషన్ లో గ్రేడ్ -2 హిందీ పండిట్ గా ఎంపిక అయ్యారు.ఆ తరువాత పదోన్నతిపై హిందీ స్కూల్ అసిస్టెంట్ గా నందిగామ పాడు జిల్లా పరిషత్ వున్నత పాఠశాలకి వచ్చారు.
ఆయన సబ్జెక్ట్ లో విధ్యార్థులు నూటికి నూరు శాతం వుత్తీర్ణత సాధిస్తుంటారు.జాతీయ సమైక్యతని సాధించడం లో హిందీ భాష కీలక పాత్ర వహిస్తుందని కనుక ప్రతి భారతీయుడు హిందీ భాషని నేర్చుకోవాలని వుద్బోదిస్తుంటారు.
Mobile No. of Madhsudan Rao: 9949939859
No comments:
Post a Comment
Thanks for your visit and comment.