Sunday, June 30, 2013

భద్రాచలం క్షేత్రం గూర్చి..!



భారత దేశంలో భద్రాచల క్షేత్ర విశిష్టత తెలియని వారు వుండరు.దక్షిణ అయోధ్యగా దీనికి పేరు.పౌరాణికంగా గానే గాక చారిత్రకంగా ఈ పట్టణానికి తనదైన ముద్ర వున్నది.ఇక్కడి రామాలయం అతి పురాతనమైనది.17 వ శతాబ్దం లో కంచెర్ల గోపన్న(1620-1680)  అనే  ప్రసిద్ది వహించిన ఒక రామభక్తుడు భద్రాద్రి రామునికి ఆలయం కట్టించాడు.ఈయన భక్త రామదాసుగా ఆ తర్వాత ప్రఖ్యాతి చెందాడు.దాశరధి శతకం వీరి విరచితమే..!

ప్రతి రోజు అనేకమంది భక్తులు రామాలయ సందర్శనార్దమై వస్తుంటారు.మన రాష్ట్రం నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడ భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు.సెలవురోజుల్లో ఈ సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక శ్రీరామ నవమి ,ముక్కోటి ఏకాదశి సమయాల్లో చెప్పనే అవసరం లేదు.ఇసకేస్తే రాలనంత జనాలు. సత్రాలు,బయటి లాడ్జిలు,ఇతర ఆవాసాలు కిక్కిరిసిపోతాయి.

(ఇంకావుంది)

4 comments:

  1. బద్రాచలం గురించి మరిన్ని విశేషాలు అందించండి ,


    ధన్యవాదాలు
    techwaves4u.blogspot.in

    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా రెడ్డిగారు..!

      Delete
  2. మూర్తిగారు, మన భద్రాచలం బ్లాగ్ చాలా బాగుంది.

    ReplyDelete
  3. ధన్యవాదాలు వర్మగారు..!

    ReplyDelete

Thanks for your visit and comment.