ఈ బ్రిడ్జి లేకపోతే భద్రాచలానికి గోదావరి లో పడవ దాటి రావలసిందే..! 1958 కి ముందు అందరూ అలా వచ్చినవాళ్ళే..! భద్రాచలాన్ని బయటి ప్రపంచం తో కలిపే వారధి ఇది.పటేల్ అండ్ కో (ముంబాయి) వారు నిర్మించారు.1958 లో గోదావరికి భయంకరమైన వరదలు వచ్చిన సంగతి చాలామందికి తెలుసు.ఆ రోజుల్లో భక్తులు పడవలు లేదా లాంచీ ల మీదనే వచ్చేవారు.ఇంకో ముఖ్యమైన సంగతి ఏమిటంటే అప్పటిదాకా భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలోనే వుండేది.ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపారు.తెలంగాణా,ఆంధ్రా సంస్కృతి ఇక్కడ పడుగు పేకలా కలిసిపోయిందని చెప్పవచ్చు.
అప్పుడు వచ్చిన వరదల మూలంగా అనేకమంది భక్తులు గోదావరిలో మునిగి మృత్యువాతపడ్డారు.దానితో ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి కి అంకురార్పణ చేశారు.దానితో ఆ బ్రిడ్జి అన్నిరకాల వాహనాలు పట్టణం లోనికి రావడానికి కారణభూతమౌతోంది. దానివల్ల ఒడిశా,చత్తిస్ ఘడ్ లాంటి రాష్ట్రాలకి కూడా భద్రాచలం నుండి రాకపోకలు సులువు అయ్యాయి.
ఈ వారధి సుమారు 3 కి.మీ. వుంటుంది.అవతల వైపున సారపాక గ్రామం వుంటుంది.అక్కడనే ITC,Bhadrachalam papaer boards ఫ్యాక్టరీ వున్నది.
సమాచారం బాగుంది. ఈ బ్రిడ్జ్‌కి ఏదైనా పేరుందా మూర్తిగారు?
ReplyDeleteశ్రీరామ సాగర సేతువు వంటి పేరు అయితే వున్నదిగాని అంతా భద్రాచలం బ్రిడ్జి అనే అంటారు వర్మగారు..! ధన్యవాదాలు...!
ReplyDelete