Monday, August 12, 2013

పాఠశాలలో తలదాచుకున్న త్రాచుపాము..!



ఈ క్రింద ఒక పాము చితక్కొట్టబడి చచ్చి పడివుంది చూశారా..!ఒకటే పాము..రెండు యాంగిల్స్ లో తీశాము.గోదావరి వరదలు మొన్న ఎంత ఉధృతంగా వచ్చాయో అందరికి తెలిసిందే..!ఆ వరదల్లో భద్రాచలం మండలం లోని నందిగామపాడు హై స్కూల్ కూడా బాగానే మునిగింది.వరదలు తీసినతరవాత పాఠశాలని శుబ్రపరుస్తున్నప్పుడు ఈ త్రాచు చక్కగా ఓమూలన నక్కివుంది.ఫర్నీచర్ కిందనన్నమాట. వరదలు వచ్చిన తరవాత ఇల్లాంటి జీవాలతోనే ..అసలు ముప్పు.అదృష్టం బాగుండి ఎవరిని కరవలేదది.వంశీ,ప్రశాంత్,దివాకర్ ఇంకా మిగతావాళ్ళు తలా ఓ దెబ్బ కర్రతో బాదడంతో ఈ ప్రపంచ యాత్ర చాలించిందది.ఆ తరవాత ఇలా ఫోటో తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. Click here for more



No comments:

Post a Comment

Thanks for your visit and comment.