Tuesday, September 10, 2013

ఒడిస్సా పర్యటన (Part no:1)

నా పర్యటనలు నాకు మంచి గురువులు గా పరిణమించినవి అంటే అతిశయోక్తి కాదు.పుస్తకాలు చదవడం వల్ల కొన్ని ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది.నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒకసారి మా లైబ్రరీ లో సంజీవ్ దేవ్ గారి రస రేఖలు అనే పుస్తకం..అనుకోకుండా చదవడం జరిగింది.ఒక విషయాన్ని చక్కగా వివరించడంలో ఆయన పద్దతి నన్ను కట్టిపడవేసింది.ఆ తరవాత ఆయన రాసిన తెగిన జ్ఞాపకాలు చదివాను.నా పైన అమితంగా ప్రభావం చూపిన పుస్తకాల్లో అది ఒకటి.

వారి వలెనే నేను భారత దేశంలోని ప్రత్యేకతలని,సంస్కృతులని ప్రత్యక్షంగా చూసి రావాలని ఒక కోరిక అప్పుడే జనించింది.ఇప్పటికీ నా ఉద్దేశ్యం లో యూరపు ఖండం లోని మొత్తం దేశాల్లో ఎంత విభిన్నత వున్నదో ఒక్క భారత దేశంలో అంతకన్న ఎక్కువ వైవిధ్యం ఉన్నది అని నా విశ్వాసం.ప్రతి రాష్ట్రానికి ఒక దేశానికి ఉన్నంత తేడా వుంది..అదే సమయంలో ఒక కలిపే అంతస్సూత్రమూ వున్నది.అదే ఇండియా గొప్పదనం..!

భారత దేశం లో అనేక రాష్ట్రాల్లో ఒంటరి గా రైలు ప్రయాణాలు చేశాను.అయితే వాటినన్నిటిని డైరీ గా నేను రాసిపెట్టుకో లేదు.జ్ఞాపకాలు మాత్రం అలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మీతో పంచుకోవడానికి ప్రత్నిస్తాను రేపటినుంచి..!  Click here for more

No comments:

Post a Comment

Thanks for your visit and comment.