Friday, June 13, 2014

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (ఎనిమిదవ భాగం)

Mario Puzo నవల Fools die సంక్షిప్తంగా (ఎనిమిదవ భాగం)

Malomar చనిపోయినతర్వాత సినిమాకి కొత్త దర్శకునిగా Simon అనే అతడిని నియమించడం జరుగుతుంది.అతనితో కలిగే కొన్ని సమస్యలు ఉంటాయి.మెర్లిన్ కి వచ్చే సినిమా profit points ని కొన్ని తనకి అదనంగా చేర్చమని కోరుతుంటాడు.సినిమా స్క్రిప్ట్ లో తాను అవసరమైన మార్పులు చేస్తున్నందుకు అవసరమని అతని భావం.

మొత్తానికి Janelle నటించిన ఓ సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తుంది.అంటే సపోర్టింగ్ నటిగా..!ఆ సభ లో తన స్నేహితురాలు Alice కి కృతజ్ఞతలు తెలుపుతుంది.ఇది టి.వి.లో మెర్లిన్ చూసినపుడు తన పేరుని చెప్పనందుకు ఒక రకంగా ఆనందపడతాడు.ఎందుకంటే ఆ టి.వి.కార్యక్రమాన్ని ఇంట్లో చూసేటపుడు భార్య Valerie ప్రక్కనే ఉంటుంది.

సరే....Jannele  ని ఓసారి Osano కి పరిచయం చేస్తాడు.దీనివెనుక మెర్లిన్ కి ఓ సూక్ష్మ పధకం ఉంటుంది.అదేమీ ప్రమాదకరమైనది కాదు. క్రమంగా తాను ఆమెకి దూరంగా జరగాలని నిశ్చయించుకుంటాడు.ఎందుకంటే ఈమె కంటే భార్యాపిల్లల వేపే మొగ్గుచూపుతుంటాడు.

" ఏయ్ మెర్లిన్....నేనిక ఏ వనిత ని పెళ్ళాడదలుచుకోలేదు.. ఇప్పటికే ఆరుగురు మాజీ భార్యలకి Alimony ఇవ్వలేక చిర్రెత్తుకొస్త్తున్నది " అని చిరు కోపం తో ఒసానో అంటాడు.

ఆ తరువాత ఒసానోకి,జానెల్ కి ఓ రాత్రి గడవటం జరిగిపోతుంది.అది ఒక అంకం అలా వెళ్ళిపోతుంది.

ప్రస్తుతం ఒసానో ఈ కొత్త అమ్మాయి Charlie  తో ఉంటున్నాడు.ఆ Xanadu లోనుంచి ఈ అమ్మాయి ఇతనితో వచ్చేస్తుంది.ఈ Charlie పారిపొయినందుకు కల్లీ కొన్ని రోజులు బాగానే బాధపడతాడు. కారణం casino లో కష్టమర్ల తో ఎలా ఉండాలి,ఏ వ్యక్తిని ఎలా రంజింప చేయాలి అనే విషయాలమీద ఈ అమ్మాయికి మంచి తర్ఫీదునిస్తాడు.ఎందుకంటే ఈ అమ్మాయి మంచి అందంగా ఉంటుంది.ఆమె లో ఓ చెప్పనలవి కాని ఓ ఆకర్షణ ఉంటుంది.

Gronvelt మీద ఈ అమ్మాయిని ప్రయోగించి అతడిని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ..తద్వారా ఈ Xanadu సామ్రాజ్యానికి తానే అధిపతిని కావాలని ప్లాన్ రూపొందించుకుంటాడు. ఓ సారి అతనికి వొంట్లో బాగోలేదని చెప్పినప్పుడు "ఏమీ దిగులు వద్దు...ఈ మధ్యనే మన సంస్థ లోకి మంచి అమ్మాయి వచ్చింది.మీకు హెల్ప్ చేయాడానికి పంపిస్తాను" అని చెప్పి ఈ చార్లీని పంపిస్తాడు.

మరుసటి దినం కలిసినపుడు Gronvelt అంటాడు." ప్చ్..మరీ అలాంటి చిన్నవయసులో ఉన్నవాళ్ళతో  నేను ఫ్రీ గా ఉండలేను.నేను డబ్బులిచ్చినా ఆమె తీసుకోలేదు.అది నాకు ఇబ్బందిగా ఉంటుంది"

"ఎందుకని...అలా అనుకుంటున్నారు..ఏదైనా ఇబ్బంది..." అంటూ సందేహంగా అడుగుతాడు కల్లీ.

"అబ్బే అదేమీ లేదు...వయసు పరంగా వచ్చే పరిణితి ఉన్నవాళ్ళతో ..అది వేరే గా ఉంటుంది.చార్లీ కేసినో లో బాగా రాణిస్తుందని" అభినందిస్తాడు Gronvelt.

ఆ సంభాషణ అలా ముగిసినా మొట్టమొదటిసారిగా Gronvelt కి అనుమానం వస్తుంది...కల్లీ లో వెన్నుపోటు పొడవడానికి బీజం పడిందని..!అందుకనే చార్లీ ని తన మీదకి ప్రయోగిస్తున్నాడని.అయితే బయటికి ఏమీ వ్యక్తం చేయడు.ఇద్దరు కలిసి కాసేపు విస్కీ తాగి వెళ్ళీపోతారు.

ఉన్నట్టుండి ఓ రోజు మెర్లిన్ కి ఫోన్ వస్తుంది.అది ఎవరో కాదు...తన సోదరుడు Arti భార్య.ఒక విషాద వార్త తెలుపుతుంది. Arti మరణించాడని.అప్పటికే ఒసారి అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది.రెండవసారికి లోకాన్నే విడిచిపోయాడు.తమ తల్లిని కనిపెట్టటానికి ఎంత తపించాడో..! చివరికి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు.తనకున్న ఏకైక రక్త సంబంధం తెగిపోయింది.అతడి దేహాన్ని బరియల్ చేయించడం...ఆ తరువాత జరిగే ప్రార్ధనలు అన్నీ ముగుస్తాయి.తిరిగి వచ్చేస్తాడు.తల్లిదండ్రులను వదిలి బ్రతకడానికి బయటికివచ్చే ప్రతి వారు orphan లాంటివారే.ప్రపంచం లోని ప్రతివారు ఏదోరకంగా ఆ భావనని అనుభవించవలసిందే...!

ఉన్నట్టుండి కల్లీని తన suite కి రమ్మని Gronvelt పిలుస్తాడు.లోపలికి వెళ్ళగానే అతనితోపాటు ఇంకో వ్యక్తి ఉంటాడు.అతని పేరు santadio ..!న్యూయార్క్ లోని ఓ శక్తిమంతమైన మాఫియా కుటుంబానికి చెందినవాడు. తన పేరు మీద నున్న Xanadu భాగస్వామ్యాన్ని ఈ వ్యక్తి పేరు మీద రాయమని,దానికి గాను బాండ్ పేపర్ మీద సంతకం చేయమని కల్లీ ని Gronvelt కోరుతాడు.చాలా తెలివిగా తనని fix చేస్తున్నాడని కల్లీ ఊహిస్తాడు.తరువాత భాగం లో మిగతాది చూద్దాము.
       --KVVS Murthy

No comments:

Post a Comment

Thanks for your visit and comment.